31, ఆగస్టు 2011, బుధవారం

ఇందూరు(నిజామాబాద్)నందు విశాలాంధ్ర ఏర్పాటునకు తొలి ప్రకటన

ఇది వరకే భారతదేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మార్చ్ 5, 1956 న నిజామాబాద్ బహిరంగ సభనందు చేసిన ప్రసంగం ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఈనాటి లోక్ సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మస్వరాజ్ నెహ్రూకు ఆపాదించిన వ్యాఖ్యలు నిజం కావు అనికూడా చెప్పడం జరిగింది.

ఈ వాదనను మరింత బల పరిచేందుకు నెహ్రూ నిజామాబాద్ పర్యటన విశేషాలు కలిగిన ఆనాటి "Indian Express" వార్తాపత్రిక కాపీ ఈ బ్లాగులో పోస్ట్ చేస్తున్నాము. భారత ప్రధానమంత్రి హోదా లో విశాలాంధ్ర ఏర్పాటును నెహ్రూ ఆనాడే మొదటి సారి ప్రకటించారు. మరి నెహ్రూకు ఆపాదించే 'విడాకుల' వ్యాఖ్యలు ఎక్కడనుండి సంపాదించారో వేర్పాటువాదులు చెప్పాలి.

ANDHRA AND TELENGANA TO MERGE

Nehru Announces Decision To Form Visalandhra

ADEQUATE SAFEGUARDS: REGIONAL COUNCILS FOR ECONOMIC DEVELOPMENT
(From our Correspondent)
Nizamabad, Mar,5

Prime Minister Nehru today announced the Government of India’s decision to form Visalandhra by the merger of Telangana with Andhra.

Speaking at a public meeting here Mr. Nehru said adequate safeguards would be provided to protect the interests of the people of the two regions.

Regional councils would be established for the unimpeded development of Telengana as well as Andhra. They would also provide safeguards in the matter of government jobs, he said.

Mr. Nehru hoped the people of telengana would gracefully accept this decision taken by the leaders after protracted discussions with the parties concerned. After explaining the decisions, Mr. Nehru said in the present context of bilingual states there was no place for small states like telengana.

The Prime Minister said the States Reorganisation Commission had recommended a time lag of five years for Telengana before a decision on its merger with Andhra could be taken.

Considering the ugly and shameful incidents that happened in Bombay and Orissa, Mr. Nehru said, it would be ruinous to allow this issue to hang in balance for five years because people’s feelings would become bitter and the national perspective would be lost by that time.

Willing acceptance of the considered decisions constituted a sign of the high sense of character of the people, Mr. Nehru said.

The Prime Minister said, he had formerly opposed the breakup of the Hyderabad State but he acquiesced with the SRC report which was based on the wishes of the people. He thought everyone should, in the interest of the country do the same.
Besides Mr. Nehru said a new era of bigger bilingual states was sweeping the country. He thought this was a very healthy development after the recent holocaust “over this patch or that”.

S.R.C Decision

According to the SRC report on Hyderabad the Prime Minister said that Marathi-speaking areas had to merge into Maharashtra and Canarese-speaking areas to join the adjoining Karnataka region. The question was about Telengana. The commission had stated that Telengana should merge with Andhra after five years. Some wanted the formation of Visalandhra while others preferred the formation of a Separate Telengana State. The protagonists of a separate Telengana state stated that if Visalandhra was formed, then Andhra people would come acquire lands here. Being educationally forward they would also have advantage over the local people.

The whole problem was considered carefully. Again and again the problem was thought over, because the arguments advanced by both were weighty. Some stated that a period of five years’ suspense was bad.

Since the decision had been taken and efforts were being made to implement the same, he hoped the people would accept the decision. He told the people that they should take advantage of this merger.

The primary aim of the congress and the Government of India was to end poverty, to provide employment and level down economic inequalities, Mr Nehru emphasised.

In this connection the Prime Minister spoke of the two Five Year plans and the great efforts at increasing production through work and said when people worked together they would not quarrel over matters like whether there should be big Pradeshes or small Pradeshes in this country.

India Belongs to All

He said “From Himalayas to the south, there are a number of Pradeshes with people following different languages and professing different faiths. Each individual is part of India and India belongs to all. It is wrong to state that Delhi belongs to me and Nizamabad belongs to you. I have equal rights with others over Nizamabad as you have over Delhi. People who say that particular part of the country belongs to their Pradesh and another part belongs to another Pradesh are wrong, because it means that for a handful of earth, persons, who speak in this way, forget the oneness of India”.

Mr. Nehru stated that all people in this country belonged to one family and there was nothing like a particular thing being good for some people and bad for others. Either it was good for all or bad for all. Swaraj had come for the whole of the country and not for this or that Pradesh. Under Gandhiji’s guidance the country had become independent but questions like poverty had to be solved. Hence big plans were drawn up and implemented under the first Five-Year plan. The second Five-year Plan was also drawn up to solve the problems of the people.

30, ఆగస్టు 2011, మంగళవారం

తెలుగు - తెలుగు భాషా వైభవం

మారిషస్ లొ జరిగిన తెలుగు భాషా బ్రహ్మోత్సవాల సందర్భముగా నేను రాసి, పంపిన వ్యాసము.

ఎందఱో మహానుభావులు అందరికీ మారిషస్ దీవి లో జరుగుతున్నా తెలుగు భాషా బ్రహ్మోత్సవములకు విచ్చేసిన వారందరికీ వందనములు.

ఈ రోజు అనగా ఖర నామ సంవత్సరం శ్రావణ మాసం కృష్ణ పక్షం చతుర్దశి తిథి నాడు అనగా 28 వ తారీఖు ఆగష్టు 2011 న తెలుగు బ్రహ్మోత్సవములు మారిషస్ దీవిలో జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమైన విషయం. ఈ సందర్భముగా మారిషస్ ద్వీపానికి విచ్చేసిన విశేష అతిథి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారికి మరియూ వేదిక నలంకరించిన పెద్దలు అందరికీ నా నమస్సుమాంజలులు.

1. తెలుగు భాష యొక్క ఔన్నత్యము

తేనే కన్నా తీయనైన, పంచదారకన్నా మిన్ననైన, పనస తొనల వలె తీయదనము కలిగిన తెలుగు భాష యొక్క ఔన్నత్యము గురించి ఎంత చెప్పిన తక్కువే. ప్రపంచ భాషలలో తెలుగు భాష 14 వ స్థానములోను,భారత దేశములో 4 వ స్థానము లోను ఉంది. ప్రపంచం మొత్తం మీద కనీసము 10.0 కోట్ల ప్రజలు తెలుగులో మాట్లాడగలరు. భారత దేశములోని ఒక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోనే 8.50 కోట్ల ప్రజలు తెలుగు మాట్లాడుతారు. ఇదీ తెలుగు భాష యొక్క గొప్పదనం. తెలుగు భాష గురించి కృషి చేసిన వారు ఎందఱో మహానుభావులు. తెలుగు భాషలో మొత్తం 52 అక్షరములు/శబ్దములు ఉన్నాయి.అందులో 16 అచ్చులు, 36 హల్లులు. ఈ 52 అక్షరాల వలన తెలుగు భాష పరిపూర్ణమైన భాషగా వర్ధిల్లుతోంది. ఇంత చక్కటి భాషని మాట్లాడే వారుగా పుట్టడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. దక్షిణ భారత దేశములోని ద్రావిడ భాషలలో ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు భాష.

తెలుగు భాష లో మాట్లాడితే ఆ భాష ఒక పాటలాగా సాగిపోతూ ఉంటుంది. ఒక తెలుగు పద్యాన్ని చదివితే అందులోని విరుపులు,సొగసులూ చెప్పనలవి కాదు. అందుచేతనే దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణ దేవరాయల చే పొగడబడి ఆ భాష లోనే తన కావ్యం ఆముక్తమాల్యద రాసారు.

2. తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలు:

ఒక ప్రాంతపు కట్టు బొట్టు, ఆహారపు అలవాట్లు,పుట్టినప్పటి నుండి మరణించే వరకూ చేసే సంస్కారాలు, అక్కడి పండుగలు,ఆచార వ్యవహారాలూ మొదలైనవి అన్నీ సంస్కృతీ సాంప్రదాయాల కిందికే వస్తాయి.తెలుగు వారిలో అనేక మతాల వారు ఉన్నారు. వారి వారి మత ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి. కానీ ఎక్కువమంది హిందువులు అగుట చేత ముఖ్యంగా తెలుగు హిందువుల గురించి చెప్పుకొందాము.
ఒక తెలుగువాడిని లేదా ఒక తెలుగు స్త్రీ ని పోల్చుకోవడం ఎలా? వారి కట్టు బొట్టూ ఏమిటి ఇవన్నీ చెప్పేదే సాంప్రదాయము.మగవారు పంచ లేదా ధోవతి కట్టుకొని, జుబ్బా వేసుకొని భుజం పై కండువా లేదా అంగవస్త్రం వేసుకొంటారు. స్త్రీలు ముఖ్యముగా చీర (saree) తో పాటుగా రవిక లేదా జాకెట్టు వేసుకొంటారు. స్త్రీ పురుషులు ఇరువురూ ముఖమున కుంకుమ పెట్టుకొంటారు. బాలికలు లంగా, ఓణి, దాని పై రవిక వేసుకొంటారు. బాలలకు వేరే విధమైన కట్టు లేదు కానీ పెద్దవారిలాగే ధోవతి లేదా పంచ, పైన చొక్కా లేదా జుబ్బా తొడుగుతారు.

ఇంక తెలుగువారి ఆహారపు అలవాట్ల లో వారు వందే పిండివంటలు మొదలైనవి చూస్తే వాటిలో బొబ్బట్లు, బూరెలు, పరవాన్నం,పులిహోర, గారెలు, ఆవడలు (curd vada), అట్టు, సంకటి, పేలాలు, ఊరగాయ పచ్చళ్లు ఇంక ఎన్నో ఎన్నెన్నో పదార్థాలు తెలుగువారి సొత్తు. ఈ విషయం బయటి ప్రాంతాల వారికి చాలా మందికి తెలియదు. కానీ పులిహోర బొబ్బట్లు చేసేరు అంటే, వాళ్లు తెలుగువారై ఉంటారని ఘంటాపధంగా చెప్పగలను. పచ్చళ్లు పెట్టడంలో ఆంధ్రా వారికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందులోనూ ఆవకాయ పచ్చడి. ఇది జాతి, కుల, మత భేదం లేకుండా అన్ని ప్రాంతాల వారు పెడతారు.

పుట్టినప్పటి నుండి రకరకాల సంస్కారాలు తెలుగు వారిలో ఉన్నాయి. మిగిలిన భాషల వారి తో ఈ సంస్కారాలే తెలుగు వారిని వేరు చేస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా నామకరణం, డోలా రోహణం లేదా ఉయ్యాలలో వేయడం, అన్నప్రాసన, కేశ ఖండన లేదా పుట్టు వెంట్రుకలు తీయించుట,అక్షరాభ్యాసము లేదా విద్యాభ్యాసము చేయించుట, ఉపనయనము, వివాహ ప్రక్రియలో తెలుగు వారిది వేరైనా శైలి, మరణించిన తరువాత కర్మ కాండలు తదుపరి మాసికములు తో పాటుగా సంవత్సరీకము ఆ తదుపరి ప్రతి స్సంవత్సరమూ శ్రాద్ధము లేదా తద్దినము పెట్టుట మొదలైనవి. ఇందులో వివాహ మరణ సమయాలలో పాటించే సాంప్రదాయాలు వేరు వేరు కులాల వారికి వేరు విధంగా ఉంటాయి. అది వారి వారి కుటుంబ సాంప్రదాయాలు, కుల కట్టుబాట్లతో మారుతుంది కానీ మంగళ సూత్రధారణ, జీలకర్ర బెల్లం నెత్తిమీద పెట్టుట, తలంబ్రాలు పోయుట (తలంబ్రాలు తెలుగు వారి సొంతం) మాత్రం మారవు.

ఇంక తెలుగు వారి పండుగల లో ముఖ్యమైనవి ఉగాది అంటే ఇది నూతన సంవత్సర ప్రారంభ దినము. ఆ రోజున ఉగాది పచ్చడి అనగా ఆరు రుచులు (షడ్రుచులు) అందులో వేప పూవు, మామిడి పిందె ముక్కలు, బెల్లము, చెరకుగడ,ఉప్పు, కారము, చింతపండు వేస్తారు. వీటివలన ఆరు రుచులు అనగా తీపి, కారము, చేదు,వగరు, పులుపు కలిసి ఆ సంవత్సరమంతయూ ఈ షడ్రుచులతో సాగాలని కాంక్షిస్తారు. మిగిలిన పండుగలలో బతుకమ్మ,బోనాలు, రాఖీ పూర్ణిమ, హోలీ (తెలంగాణా ప్రాంతములో జరుపుతారు), దసరా,సంక్రాంతి, జన్మాష్టమి, వినాయక చతుర్ధి, దీపావళి ఇంకా అనేక రకాలైన ప్రాంతీయ పండుగలు జరుపుకొంటారు.

ఈ పైన చెప్పిన వాటిలో చాలా వరకూ సమయాభావము వలన మరియూ వీలు కానీ పరిస్థితి వలన కుదించుట జరిగినది.

3. తెలుగు సాహిత్యం:

తెలుగు సాహితి ప్రపంచములో సేద్యము చేసిన వారు,చేస్తున్నవారు చాలా మందే ఉన్నారు. తెలుగు సాహిత్యములో పద్య సాహిత్యము మారియో గద్య సాహిత్యములు కలగలిసి ఉన్నాయి. 11 వ శతాబ్దము నాటి నన్నయ్య నుండి నేటి వరకూ ఎందఱో కవులు పద్య కవిత్వానికి ప్రాణము పోసి నడిపిస్తున్నారు. పద్య కవిత్వములో మహాభారతాన్ని తెనిగించిన కవిత్రయము నన్నయ, తిక్కన, మరియూ ఎఱ్ఱన. వీరి మువ్వురులో నన్నయ ను ఆదికవిగా అభివర్ణించారు. భాగవతమును బమ్మెర పోతన తెనిగించారు. పద్య కవిత్వములో శ్రీనాథుడు రచించిన శృంగార నైషధము చాలా ముఖ్యమైనది. వీరే కాక పద కవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య, భక్త రామదాసు, భక్తీ తో శ్రీ రామచంద్రుని పై అనేక కీర్తనలు రచించిన త్యాగయ్య, వేములవాడ భీమ కవి మొదలైన వారి తో పాటుగా అష్ట దిగ్గజముల పేరుతొ అల్లసాని పెద్దన మొదలైన ఎనిమిదిమంది మహా కవులు శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానములో ఉండేవారు.తదనంతర కాలములో ఏనుగు లక్ష్మణ కవి, వేమన 14 వ శతాబ్ది లోను, బద్దెన 13 వ శతాబ్దములోను రాసిన వేమన శతకము, సుమతీ శతకము ఈ నాటికి ప్రజల నోళ్ళలో నానుతూనే ఉన్నాయి. వీరితో పాటు ఎందఱో శతకకర్తలు తెలుగు భూమిలో పుట్టి సేవ చేసిన వారే. వీరితో పాటు పరవస్తు చిన్నయ సూరి రాసిన బాల వ్యాకరణము ఒక ప్రామాణిక వ్యాకరణ శాస్త్రం. దానితో పాటే ఆయన రాసిన మిత్ర లాభము, మిత్ర భేదము అనే పంచతంత్ర కథలు జన బాహుళ్యంలో చొచ్చుకొని పోయి వారి జీవితాలలో కావలసిన విజ్ఞానాన్ని అందిస్తున్నాయి. తరువాత శ్రీ గురజాడ వెంకట అప్పారావు, విశ్వనాథ సత్యనారాయణ, సురవరం ప్రతాప రెడ్డి, గుఱ్ఱం జాషువ, దాశరథి రంగాచార్య, C.నారాయణ రెడ్డి, శ్రీరంగం శ్రీనివాసరావు, దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి, శత శతావధాన ద్వయం తిరుపతి వెంకట కవులు,కొప్పరపు కవులు, కోట సుందర కవులు, స్వర్గీయ ప్రధాన మంత్రి పాములపర్తి వేంకట నరసింహారావు, బోయి భీమన్న వీరందరూ తెలుగు సాహిత్యానికి ఆణిముత్యాల వంటి వారు.

వీరితో పాటుగా ఆధునిక సాహితీ ప్రపంచములో సహస్రావధానులు శ్రీ గరికపాటి నరసింహారావు (మహా సహస్రావధాని), శ్రీ మేడసాని మోహన్, శ్రీ మాడుగుల నాగ ఫణి శర్మ వీరితో పాటుగా శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, చాగంటి కోటేశ్వర రావు, రాళ్లబండి కవితా ప్రసాద్, ద్వానా శాస్త్రి, నాకు తెలిసిన చాలామందిని ఇక్కడ ఉటంకించాలేక పోవుచున్నాను వీరంతా సాహితి సేద్యాన్ని చేస్తున్నారు. తెలుగులో నానీలు మాజీ ఉపకులపతి శ్రీ గోపి, తెలుగు సామెతలను ప్రాచుర్యం లోకి తెచ్చిన ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి, సినీ గేయకర్తలుగా పేరు తెచ్చుకొన్న వేటూరి, వీటూరి, జాలాది, కొసరాజు,ఆరుద్ర, సిరివెన్నెల సీతా రామశాస్త్రి,గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ వీరితో పాటుగా పేరు పేరున చెప్పలేకపోయిన ఎందఱో మహానుభావులు సాహిత్యానికి తమ వంతు సాయం చేస్తున్నవారే.

పురుషులతో పాటుగా కవయిత్రులు కుమ్మరి మొల్ల, ముద్దు పళని, వెంగమాంబల పాత్ర ఎన్నదగినది. వీరితో పాటుగా నేటి కవయిత్రులు మరియూ నవలా రచయిత్రులు ముప్పాళ్ళ రంగనాయకమ్మ, లత, శ్రీమతి లక్ష్మీ పార్వతి, యద్దనపూడి సులోచనారాణి తెలుగు సాహిత్యంలో పేరు తెచ్చుకోన్నవారే. వీరే కాక ఎంతోమంది కవయిత్రులు తమ రచనలతో తెలుగు వారిని మెప్పిస్తున్నారు.

4. తెలుగు యొక్క విశిష్టత:

తెలుగు భాష యొక్క విశిష్టత గురించి చెప్పేటప్పుడు తెలుగులోని సాహితీ ప్రక్రియల గురించి తెలుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అందులో పద్యం, గద్యం, కథలు, నాటికలు, నాటకములు,అవధానములు, నానీలు, గేయ కవితలు, భక్తి పాటలు, నవలలు మొదలైనవి.

ఇందులో విశిష్టముగా పేర్కొనవలసినది అవధానము గురించి. ఈ అవధాన ప్రక్రియ ప్రపంచములో ఏ భాషలోను లేదు. ఇందులో మూడు రకములు ఉన్నాయి. అవి:

1. అష్టావధానము
2. శతావధానము
3. సహస్రావధానము.

ఈ మూడు ప్రక్రియల లోనూ అవధానము చేసే వారిని అవధాని అంటారు. ఆ అవధానిని అష్టావధానములో ఎనమండుగురు పృచ్చకులు అంటే ప్రశ్నలు సంధించేవారు ఉంటారు. అవధాని ఈ ఎనమండుగురూ వేసిన ప్రశ్నలకు ఏకకాలములో సమాధానము చెప్పి మెప్పిస్తారు. ఆఖరున ఆ ఎనమండుగురి కీ చెప్పిన సమాధానాలు తిరిగి వాళ్లు అడిగిన క్రమం లోనే చెప్తారు.

ఈ విధముగా కొద్ది మార్పులతో శతావధానం మరియూ సహస్రావధానము చేసి ఆఖరులో ప్రుచ్చకులందరికి వారి వారి పద్యాలనూ మొదలైనవి తిరిగి ఒప్ప చెప్తారు. ఇది మన తెలుగు వారు గర్వంగా చెప్పుకొనే విశిష్ట ప్రక్రియ.

ఈ అవధాన ప్రక్రియలో పేరుమోసిన వారిలో తిరుపతి వేంకట కవులు, కొప్పరపు కవులు, కోట సుందర కవులు, వేంకట పార్వతీశ కవులు చేసేవారు. ప్రస్తుతం మన సమకాలీనులు అయిన వారు శ్రీ మేడసాని మోహన్, శ్రీ గరికపాటి నరసింహారావు, శ్రీ మాడుగుల నాగ ఫణి శర్మ,రాళ్ళబండి కవితా ప్రసాద్, వద్దిపర్తి పద్మాకర్ మొదలైనవారు మనతో ఉన్నందుకు తెలుగు వానిగా గర్వ పడుతున్నాను.

5. తెలుగు ప్రపంచ వ్యాప్తము:

భారత పుణ్య భూమి నుండి తెలుగు వారు అనేక మంది విదేశాలలో స్థిరపడి తెలుగు భాష వ్యాప్తి కి ఎంతో కృషి చేస్తున్నారు.చాలామంది తెలుగు వారు అమెరికా, యూరోప్, ఆసియా, ఆఫ్రికా, అన్ని ఖండాలలోనూ స్థిరపడ్డారు. కానీ వాళ్లు తమ తెలుగుదనాన్ని మరిచిపోకుండా తమ వ్యక్తిత్వాన్ని, తమ సంస్కృతి సంప్రదాయాలని గౌరవిస్తూ, పాటిస్తూ ఉన్నారు. కొన్ని తరాల క్రిందట వెళ్లి స్థిరపడ్డ వారి తరువాతి తరముల వారు కూడా ఆ సంప్రదాయాలని పాటిస్తూ తమదైన శైలి లో తెలుగు సంస్కృతికి,తెలుగు భాషకు సేవ చేస్తున్నారు.

6. మారిషస్ లో తెలుగు వారి కృషి:

తరాల క్రిందట మారిషస్ తరలిపోయినవారు చాలా మంది మారిషస్ లో ఉన్నారు. వారు తమ ప్రత్యేకతను సాంప్రదాయములు, కవిత గోష్టులు, కవులు, పండితులు, కళాకారులని పిలిచి సన్మానించడము మొదలైన కార్యక్రమాలు చేస్తూ మారిషస్ లో ఒక ఆకాశవాణి కేంద్రాన్ని, ఒక దూరదర్శన కేంద్రాన్ని నడుప్తున్నారు.

మారిషస్ లో ఉన్న తెలుగువారికి తెలుగు భాష ఒక విషయం గా స్నాతక, స్నాతకోత్తర, డిప్లొమాలని అక్కడి విశ్వవిద్యాలయములో ప్రవేశ పెట్టడానికి చాలా కృషి చేసారు. అంతే కాకుండా సాహితీ మరియూ ఆధ్యాత్మిక సంస్థలను స్థాపించి వాటి ద్వారా తెలుగు కార్యక్రమములు ఏర్పాటు చేస్తూ తెలుగు భాషకు ఇతోధికం గా పాటుపడుతున్నారు. అక్కడి వారిలో శ్రీ సంజీవ నరసింహ అప్పుడూ గారి లాంటి వారు తెలుగు బ్రహ్మోత్సవములను నిర్వహిస్తూ తెలుగు భాషా అభివృద్ధికి పాటుపడుతున్నారు. అక్కడి వారు రంగవల్లులు, భజనలు, త్యాగరాజ, అన్నమయ్య కీర్తనలు వ్యాప్తి చేస్తున్నారు. తెలుగు భాషా అభివృద్ది కి వారు చేస్తున్న సేవను మనం వేనోళ్ళ కీర్తిద్దాము.

22, ఆగస్టు 2011, సోమవారం

సకల వికల సమ్మె


ఆగష్టు ౧౭ (17) తర్వాత ఏమవుతుందీ రాష్ట్రానికి అనే ఒక గొప్ప ప్రశ్న రాష్ట్ర ప్రచారమాధ్యమాలకి ఉదయించింది మన తెలంగాణవాదుల (ఉరఫ్ తెలబాన్) హడావుడి చూసి. ఇక కొత్తబిచ్చగాడు పొద్దెరగడన్న రీతిలో ఊకదంపుడు, వాటి ఆస్థాన విద్వాంసుల చొప్పదండు విశ్లేషణలతో సామాన్య జనాన్ని హడలగొట్టి మూడుచెరువుల నీళ్ళు తాగించేసినంత పనిచేశాయి. పాపం నీళ్ళు దొరకని హైదరాబాదువారి పరిస్థితి మరీ దారుణం. మురికి మూసీనీళ్ళు, గబ్బులేచిపోయిన హుస్సేన్ సాగరునీళ్ళూ తాగవలసిన అగత్యంపట్టబోతోందా అని మరీ హడలి చచ్చారు. అప్పుడెప్పుడో మన గవర్నరు గారిని ఏదో అలవాటుగా అడిగేశారు కడుపుబ్బరం ఆగలేక డిశెంబరు ౩౧ (31) తర్వాత ఏమవుతుందీ అని. ఆయనేమో పరమ భక్తుడు వీళ్ళకి బెదురుతాడా! తాపీగా ఆఁ! ఏముంది జనవరి ౧ (1) వస్తుంది అన్నాడు. జనవరి ౧ (1) ఏమి కర్మ ఏకంగా ఆగష్టే వచ్చేసింది.

సరిగ్గా ఇప్పుడు కూడా మనం ఈ ఆగష్టు ౧౭ (17) తర్వాత ఏమవుతుందీ అనే ప్రశ్నకు హడలి జడుపుజ్వరాలూ అవి తెచ్చుకోకుండా నిమ్మళంగా జరిగేది జరక్కమానదని కర్మసిద్ధాంతాన్ని నమ్ముక్కూచుందాం. నేనామధ్య హైదరాబాదులో ఉండే నా పరిచయస్తుడొకరికి ఇలాగే ఙ్ఞానబోధ చెయ్యబోయాను. అయినా వింటేనా?!! నేను హైదరాబాదులో ఉద్యోగం వెలగబెట్టే రోజుల్లో మా హాస్టలు యజమాని ఆయన. కరీంనగర్ జిల్లా నుంచి పొట్టకూటికోసం హైదరాబాదొచ్చి ఇలా హాస్టలు పెట్టుకుని కుటుంబాన్ని నడుపుకుంటున్నాడు. వయసురీత్యా నాకూ ఆయనకీ పదేళ్ళు తేడా. నేనూ ఆఫీసునుంచీ రాగానే పనీపాటా ఏమీలేవు కనుక పిచ్చాపాటీ మాట్లాడుకునేవాళ్ళం. నాకోసం ప్రత్యేకంగా కాకపోయినా కరీంనగర్ వంటకం గుంటపొంగనాలు (రుచికి దిబ్బరొట్టెలాగా, ఆకారానికి పునుగుల్లాఉంటాయి) ఎక్కువగా తయారవుతూండేవి అక్కడ. అవి తింటూ వాళ్ళ మూడేళ్ళ చంటిదానితో ఆడుకుంటూ లోకవ్యవహారాలను మా సూక్ష్మబుద్ధితో విచారించి తీర్పులిచ్చేయటం మాకు అలవాటు. మీ తీర్పులు ఎవడు వినొచ్చాడు అనడక్కండి. ఏదో మా కాలక్షేపం మాది.

మా హాస్టలుకెదురుగా ఓ ముసలి మొగుడూ పెళ్ళాల కుటుంబం ఉండేది. కూతురు, అల్లుడూ పిల్లాడికన్నా వాళ్ళ ఉద్యోగాలనే ఎక్కువ ముద్దుచేస్తుంటారని పాపం ముసలాయన ఫిర్యాదు. ఆప్పుడప్పుడూ ఆయనా చేరేవాడు మాతోటి. ఆయనది విజయవాడ. నాది రాత్రివేళ ఉద్యోగం కనుకా, పగలు నా ఇతర స్నేహితుల ఉద్యోగాలవల్లా మా ముగ్గురికీ ఇలా స్నేహం కుదిరిపోయింది. నేను ఇంగ్లాండు వచ్చినా అప్పుడప్పుడూ ఫోనుచేసుకునేవాళ్ళం. ఈ మధ్య ఇద్దరూ కొన్నిరోజుల వ్యవధిలో హైదరాబాదు విడిచి స్వంత ఊళ్ళకు వెళ్ళిపోదామని నిశ్చయించామని కబురందించారు. అదన్నమాట నేను కాస్త చనువుకొద్దీ ఙ్ఞానబోధ చెయ్యబూనిన సందర్భం.

ద్వాపర యుగాంతం సమయములో యదుకుల నాశనం సంభవించిన సంగతి మనకి తెలిసిందే కదా! అందులో పొడుచుకున్నవారు ఇరువురూ యాదవులే చనిపోయినవారూ యాదవులే ఎవరినని తప్పుపడతాం? అలాగే ఇక్కడా కచరా అనే ముసలం పుట్టి దినదినం దాని ప్రభ మద్యందిన మార్తాండునివలే ఎదిగిపోతూ ఆంధ్రా ద్వేషం అనే సోపానపథం తోడుగా అధికారమనే అందలాన్ని ఎక్కాలని తెగ ఉబలాటపడిపోతుంది. ఇందులో మాత్రం కచ్చితంగా తప్పు ఎవరిదో ఒకరిది కనబడాలన్నట్లు వేరుజాతుల సిద్ధాంతాన్నొకటి కనిపెట్టి జనమ్మీదకి వదిలారు. అది దొరికిన నలభైయేళ్ళ వయసున్న ఉస్మానియా నూత్నయౌవ్వన విద్యార్థులు (నలభయ్యేళ్ళే అని నీకెలా తెలుసురా భడవా అంటే నేను మాత్రం చూశానా పెట్టానా ఏదో ప్రాస బాగుందని వాడేశాను. అయినా అదీ నిజమే అని విశ్వసనీయవర్గాల భోగట్టా!) చెలరేగిపోతున్నారు. దక్షునిశాపం అప్రతిహతం అని జనం అప్పట్లో జడిసి చచ్చినట్లు ఇప్పుడూ ఉస్మానియా అంటే చాలు హైదరాబాదీ గుండె గుభేలుమనటానికి. దిక్కుమాలిన తనానికి స్థానికత ముసుగేసుకునేసి సొంతల్లుడికే (చంద్రుడు) క్షయవ్యాధితో చావమని శాపమిచ్చిన దక్షుడిలా మన ఉస్మానియా కలియుగ దక్షుళ్ళు వీరంగమేస్తూంటే అబ్బ హైదరాబాదు నగరం అంటే చాలు చూసే జనాలకి వెగటుపుట్టి పారిపోవటానికి.

ఉస్మానియాలో చదివిన విద్యార్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేయనవసరమేలేదు అనే గొప్ప పేరు పడటానికి అల్లరిమూకల ఆస్థాన,కుల గురువుల్లా వ్యవహరించే మన పనిచేయని పంతుళ్ళూ ఇతోధికంగా సాయపడిన సంగతి మనమెరిగిందే. ఇప్పుడివన్నీ ఎందుకురా అనే కదా మీ సందేహం అక్కడికే వస్తున్నా. శవరాజకీయాలు, ఆంధ్రా ద్వేషం, వసూళ్ళమత్తు ఇవన్నీ కొంచెం బోరనిపించిందో ఏమో ఈసారి కాస్త వెరైటీగా ఉంటుందని సకల జనుల సమ్మె అని మన తెలంగాణవాద కపిగణం (త్రేత్రాయుగ కపిగణం నన్ను క్షమించుగాక) ముచ్చటపడింది.

ఇప్పుడు మళ్ళీ నా స్నేహితుల దగ్గరికొద్దాం ఇద్దరూ జడిసింది ఈ సమ్మె దెబ్బకే. పాపం ముసలాయన మనవడి చదువు గురించి బెంగపడితే, హాస్టలు యజమాని ఈ గొడవల పుణ్యమాని ఈ మధ్య విద్యార్థులనే (వీళ్ళు నిజమైనవాళ్ళేలెండి) కొన్ని ప్రాణాలు హైదరాబాదు చుట్టుపక్కల చూడకపోవటంవల్ల ఇంకా హైదరాబాదులో ఈగలు తోలుకోవటం ఎందుకులే అని ఈయన కరీంనగరుకు తెలంగాణ ఆయన బెజవాడకి జన్మభూమి ఎక్కేసేరు. ఈ దెబ్బకి భయపడే ఆంధ్రాలో సాధారణంకన్నా రమారమి ౩౦-౪౦ శాతం అధికంగా విద్యార్థుల ప్రవేశాలు జరిగితే తెలంగాణలో గతేడాది ఉన్న ప్రవేశాలకే దిక్కూదివాణం లేదని వినికిడి. వీళ్ళకంటే వెళ్ళినా వాళ్ళవాళ్ళ ఊళ్ళల్లో బతగ్గలమనే ధైర్యం ఉంది వెళ్ళిపోయారు కానీ సొంతూళ్ళకు వెళ్ళనూ లేక ఇక్కడ పనులూ దొరక్క అల్లాడుతున్న జనం ఎంతమందో?

కర్ణుడి చావుకు కారణాలు వంద అన్నట్టు అసలా సమ్మె చేసిందీ పెట్టిందీ ఏమీ లేకపోయినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నాకు తెలిసి హైదరాబాదు వదిలింది ఇద్దరే కానీ తెలియకుండా చాలా ఎక్కువే అని లెక్కలు నొక్కి చెబుతున్నాయి. ఇదికాదూ కూచున్న కొమ్మని నరుక్కున్న కోతి వాలకం అంటే! ఆ సమ్మేదో జరక్కుండానే హైదరాబాదు ఇంత నష్టం చూడాల్సివస్తే ఇక జరిగుంటే ఎంచక్కా హైదరాబాదు రోడ్ల విస్తరణా కార్యక్రమం వాయిదా వేసుకునేదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం!  ఇంకా దేవుడు తెలుగుజాతి పక్షాన ఉండబట్టి సకలాన్ని వికలం చేసే ఈ సమ్మెను వాయిదానో మాన్పించటమో చేశాడు. అయినా మొన్నామధ్య ఇంకేముంది రెండువారాల్లో తెలంగాణ అని ఏ ఢిల్లీ చిలుకో చెప్పిందన్న కచరా మాత్రం  యధావిధిగా తన కార్యక్రమాల్లో తానుండగా ఇతర భజనపరులు విశ్రాంతి తీసుకుంటున్నారు. మొత్తమ్మీద బతుకు భారమయింది మాత్రం సగటు హైదరాబాదీది.


మూలం: కృష్ణవేణీతీరం

17, ఆగస్టు 2011, బుధవారం

గ్రామాల అభివృద్ధి స్వంతంగా చేసుకోలేరా?

స్వంతంగా అభివృద్ది చెందడం అనే దానికి ఉదాహరణగా గోదావరి జిల్లాలోని ఒక గ్రామాన్ని చెప్తాను. ఆ గ్రామం పేరు కంచు స్తంభాలపాలెం. ఆ ఊరు దొడ్డిపట్లమండలం లో ఉంది. ఆ ఊరికి వెళ్ళడానికి ఇప్పటికీ చాలా కష్ట పడాలి. కానీ ఒక్కసారి గ్రామంలో అడుగుపెడితే ఇంక మీకు అక్కడ కనిపించేది కాంక్రీటు రోడ్లు. అనేక రకాలుగా అభివృద్ధి కనిపిస్తుంది. ఆ రోడ్లు ఇంతకుముందే ఎనభయ్యవ దశకంలోనే ఉన్నాయి ఆ గ్రామానికి. ఆ గ్రామానికి ఆ ప్రాంత రాజకీయనాయకులు ఏమీ చేయలేదు కానీ గ్రామస్తులే పూనుకొని తమ గ్రామాన్ని అభివృద్ది పరచుకొన్నారు.

అట్లాంటి ఊళ్లు మీకు కృష్ణ, గోదావరి జిల్లాలలో చాలా ఉన్నాయి. వాటి అభివృద్ది ఏ ప్రభుత్వమూ చేయలేదు. ఆ గ్రామాల వాళ్లు ఒక గ్రామాన్ని చూసీ మరియొక గ్రామం అలా అభివృద్ధి చేసుకొన్నారు. అలాగే భీమవరం దగ్గరలో ఉన్న చిన్న చిన్న పల్లెటూళ్లని లేదా విజయవాడ వద్ద గల కంకిపాడు, పామర్రు, ఉయ్యూరు ఇంక లోపలి గ్రామాలని చూస్తే విషయం అర్థమవుతుంది. వాళ్ళెవరూ ప్రభుత్వ సహాయం కోసం దేబిరించ లేదు. వాళ్లకు చేతనయినంత వరకూ ప్రతి గృహస్తూ తన వంతు సహాయం చేసారు. ఈ రోజు ఆ గ్రామాలు మన సినిమాలలో చూపినట్లుగా అభివృద్ది కనిపిస్తూ ఉంటుంది.

వాళ్లు తమ వ్యవసాయం ఇకముందు లాభసాటిగా చేయడం కష్టమవుతుందని భావించిన తరుణంలో తమ పిల్లలని అటునుండి విద్య వ్యాపారాల వైపు మళ్ళించారు. ఇది మన తెలంగాణా సోదరులకు అర్థం కావడం లేదు. స్వర్గీయ ప్రధాన మంత్రి శ్రీ పీ వీ నరసింహారావుగారు తన ఆర్ధిక శాఖా మంత్రి ప్రణబ్ ముఖర్జీ గారి సహాయము తో నూతన ఆర్ధిక సంస్కరణలు చేపట్టిన తరువాత కోస్తా, రాయలసీమలలోని ప్రజలు మేలుకొని ఇక ముందు రాబోయే ప్రభుత్వాలు పెట్టుబడిదారీ విధానంగానే ఉంటాయి మన మార్కెట్లను ప్రపంచ మార్కెట్ల కోసం తెరిస్తే తాము రేసులో వెనుకబడతామని తెలుసుకొని తమ పిల్లలను మిగిలిన రంగాలకు మరలచారు. తెలంగాణా సోదరులు కాలం తో పరుగెత్తడం మాని ఇంకా ఎదుటివారు మోసం చేసారనే నిజాం నాటి భావనలోనే ఉన్నారు. వారి నాయకులు వారిని ఆ భావన లోనే ఉంచారు కూడా. ఆ విధమైన భావన నుండి బయటకు వచ్చిన తెలంగాణా సోదరులు మిగిలినవారిలా కాకుండా వారు బయటకు ఉపాధి కోసం మరియూ ఇతర మార్గాలు వెతుక్కొంటూ ఇతర ప్రాంతాలకు వెళ్ళారు. ఇంక ఇక్కడ ఉన్న వారిలో చాలామందికి ఆ విధమైన స్పృహ లేదు. అందుకే అస్తమాను తమ కష్టాలకు ఎదుటివారు కారణం అని తిడుతూ ఉంటారు. పోనీ ఆ విధంగా బయటకు వెళ్ళిన వారైనా ఇక్కడివారిలో చైతన్యాన్ని కలుగచేసారా అంటే అదీ శూన్యమే. పైగా వీరిని రెచ్చగొట్టే విధంగా ఉంది వారి ప్రవర్తన. ఇంకొక విషయం మన తెలంగాణా సోదరులు ఒక లగడపాటిని, ఒక కావూరి ని తిడుతూ కూర్చోన్టారే తప్ప వాళ్లు ఆ స్థాయిలోకి రావడానికి వాళ్లు చేసిన కృషి ని మాత్రం గుర్తించరు. ఎవరో ఒకరో ఇద్దరో తప్పుడు పనులు చేసే వారు ఉంటారు కానీ అందరూ చేయరుగా. ఇంకొక విషయం కృషి తో నాస్తి దుర్భిక్షం అన్న విషయాన్ని ఎప్పుడు గుర్తిస్తారో ఈ ప్రజలు.

14, ఆగస్టు 2011, ఆదివారం

బెజవాడలో తెలుగు వెలుగు - సి.నారాయణరెడ్డిచే తెలుగుతల్లి విగ్రహావిష్కరణ

సమకాలీన రచయితలు, సాహితీ విమర్శకులు, కవి పుంగవులు, మరెందరో కలం వీరులు! వీరందరినీ ప్రపంచ రెండో తెలుగు మహాసభలు ఒక్క చోటికి చేర్చాయి. తెలుగు సాహితీ సౌరభాలు గుబాళించాయి. మూడురోజులపాటు జరిగే ఈ మహా సభలు శనివారం విజయవాడలో... తుమ్మలపల్లి కళాక్షేత్రం బయట తెలుగు తల్లి విగ్రహావిష్కరణతో వైభవంగా ప్రారంభమయ్యాయి.

ఈ విగ్రహాన్ని ప్రఖ్యాత రచయిత సి.నారాయణ రెడ్డి ఆవిష్కరించారు. ఆహూతులకు అచ్చ తెలుగు సంప్రదాయం మేళవించిన సన్నాయి మేళం స్వాగతం పలికింది. రాష్ట్రం నలుమూలల నుంచేకాక దేశ, విదేశాల నుంచి సుమారు 1500 మంది సాహితీ ప్రియులు, రచయితలు ఈ సభలలో పాల్గొంటున్నారు. ఉదయం జరిగిన ప్రారంభ సభకు హాజరైన ప్రముఖులు తెలుగు భాషకు పట్టిన దుస్థితి గురించి, భాషాభివృద్ధికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఎన్నో పోరాటాల అనంతరం సాధించుకున్న ప్రాచీన భాష హోదాను నిలుపుకోవడానికి శ్రమించాల్సి ఉందన్నారు.

మధ్యాహ్నం బెంజి సర్కిల్ దగ్గరలోని ఎస్‌వీఎస్ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన 'సురవరం ప్రతాపరెడ్డి వేదిక'పై తెలుగు ప్రజల చరిత్ర - సంస్కృతి అనే అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు. తెలుగు భాష చరిత్రకు సంబంధించి సమగ్ర గ్రం«థాన్ని వెలువరించాల్సిన అవసరంపై రెండున్నర గంటలపాటు ఆసక్తికరమైన చర్చ జరిగింది.

ఆ తర్వాత మండలి వెంకట కృష్ణారావు వేదికపై 'రాష్ట్రేతరుల తెలుగు భాషా సమస్యలు' అనే అంశంపై చర్చ జరిగింది. ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలుగు ప్రజల భాషా సంస్కృతుల అణచివేతను అడ్డుకోవటానికి ఇక్కడి ప్రభుత్వం, సాహిత్య సంస్థలు సహకరించాలని వక్తలు అభిప్రాయపడ్డారు. అనంతరం కవి సమ్మేళనం నిర్వహించారు. ఎస్‌వీఎస్ కల్యాణ మండపంలో జరిగిన చర్చా గోష్టులు, కవి సమ్మేళనానికి వెయ్యి మందికి పైగా కవులు హాజరు కావడం విశేషం.

తెలుగు తల్లి ని హుస్సేన్ సాగర్ లో పడవేయాలని కేచరా గారు, 'మా తెలుగు తల్లి' గేయం ఉన్న పేజీలను చింపివేయాలని ఆయన మేనల్లుడు  'కారు' కూతలు కూసి వారం గడవక ముందే రాష్ట్రం లో తెలుగువెలుగులు విరజిమ్మాయి. డా సి.నారాయణ రెడ్డిచే తెలుగుతల్లి విగ్రహావిష్కరణ వేర్పాటువాద నాయకులకు చెంపపెట్టు లాంటిది. వారు తెలంగాణా తల్లినైతే కనుగొన్నారు గాని తెలుగు భాషకు  ప్రత్యామ్న్యాయం  చూపించగలరా?ఆ పని వారు  చేయగలిగితే వారిది అనేది ఏమైనావుంటే వారికి తప్పకుండా ఇచ్చేయవచ్చు

13, ఆగస్టు 2011, శనివారం

విద్వేషాలతో ఒక తరం నష్ట పోకూడదు

Kommineni.info: ముందుగా ఒక మాట చెప్పుకోవాలి. చాలామంది తెలంగాణ పై మీ వైఖరి ఏమిటని అడుగుతున్నారు. అనే క వ్యాసాలలో నా వైఖరి తెలిపాను.తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆంధ్ర ప్రాంతానికి అది మేలు కలిగిస్తుందన్నది నా అభిప్రాయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రం ప్రకటించినప్పుడు వ్యతిరేకించడం ద్వారా ఆంధ్ర నేతలు చారిత్రక తప్పిదం చేశారని కూడా పేర్కొన్నాను.కారణాలు ఏమైనప్పటికీ ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి. అయినా కూడా ఎప్పుడూ ఇలా విద్వేషాలతో ఉండే కన్నా మళ్లీ ఆంధ్రులు కష్టపడి మరో రాజధానిని నిర్మించుకుని, ఆ ప్రాంతంలో అభివృద్దికి అవసరమైన ప్రాజెక్టులు చేపట్టుకుంటే అది పురోగతికి దారి తీస్తుందన్నది నా అభిప్రాయం . ఇది చెప్పినంత మాత్రాన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరేవారి వ్యూహాలు, ఉద్యమాలపై విశ్లేషణలు రాయకూడదని ఎవరైనా అనుకుంటే అది వారి అవగాహనారాహిత్యంగా భావిస్తాను. అలాగే సమైక్య వాద ఉద్యమ కారుల చర్యలపై కూడా నిర్మొహమాటంగా అభిప్రాయాలు రాస్తే నే ఆ వ్యాసాలకు విలువ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు కొద్ద రోజుల క్రితం తెలంగాణ వైద్యుల దీక్ష శిబిరంలో మాట్లాడుతూ కొన్ని వివరాలు చెప్పారు. హైదరాబాదులో ఆంధ్ర వైద్యులు ఎంత మంది ఉన్నది, తెలంగాణ డాక్టర్లు ఎంత తక్కువ ఉన్నది ఆయన తెలియచెప్పారు. బాగుంది. ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి. రాజకీయంగా తెలంగాణా కాజ్ కోసం పనిచేస్తున్నానని చెప్పే కెసిఆర్ ఎప్పుడైనా దీనిపై సమీక్షించుకున్నారా అని?ఆయన 1985 నుంచి శాసనసభ్యుడిగా ఉన్నారు. మూడేళ్లు మంత్రిగా కూడా ఉన్నారు. ఆ సమయంలో ఎప్పుడైనా ఎందుకు తెలంగాణకు చెందిన వారు డాక్టర్లుగా తక్కువగా ఉంటున్నారని ఆలోచించారా? నిజంగానే డాక్టర్లు తెలంగాణకు చెందినవారు ఉన్నప్పట్టికీ అవకాశాలు రాలేదా? లేక అసలు తెలంగాణకు చెందిన వారు డాక్టర్లుగా ఎంపిక కాలేదా?ఎంపిక కాకపోతే ఎందుకు కాలేదన్నదానిపై ఎన్నడైనా కెసిఆర్ కాని, తెలంగాణ ఉద్యమ నేతలు కాని దృష్టి పెట్టారా అన్నది సందేహమే. వైద్య వృత్తిలోకి రావడానికి నిర్దిష్ట పరీక్షలు ఉంటాయి. వాటిలో పాస్ అయితేనే వైద్య కోర్సులోకి రాగలుగుతారు. ఆ విషయాన్ని పట్టించుకోకుండా కెసిఆర్ ఎంతసేపు విద్వేషం రెచ్చగొట్టడానికే ప్రాధాన్యం ఇచ్చారు తప్ప,తెలంగాణ ప్రాంతంలో ఆయా రంగాలలో వృత్తి నిపుణులు పెరుగుదలకు ఎన్నడైనా ఆలోచన చేశారా అన్నది సందేహమే. తెలంగాణ లో విద్యార్ధులను ఉద్యమాలకు వాడుకున్నట్లుగా , ఉద్యోగాలకు,మంచి చదువులకోసం వినియోగించడానికి ఈ నేతలు ఎందుకు శ్రధ్ద చూపలేదన్నది తెలంగాణ ప్రజలు ప్రశ్నించాలి. ఎంతసేపు తన్నండి,దంచండి, ఆంద్రోళ్లు మేము మూడో కన్ను తెరిస్తే బతుకుతారా అంటూ ప్రజలను రెచ్చగొట్టి నందువల్ల రాజకీయ నేతలుగా వారి పబ్బం గడవవచ్చు. కాని వారి మాటలు నమ్మి రెచ్చిపోతే ప్రజలకు ఎంత నష్టం కలుగుతుందో ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నప్పట్టికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. అందువల్ల రాజకీయ నాయకులు ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతోంది.1969 లో తెలంగాణ ఉద్యమంలో కొంత హింస ప్రజ్వరిల్లిన మాట నిజం. అప్పుడు ఎక్కువగా బౌతిక హింస అయితే, ఇప్పుడు జరుగుతున్నది మానసిక హింస. తెలంగాణ నేతలు రెచ్చిపోతున్నారని, ఆంధ్ర నేతలు రెచ్చిపోవడం, ఇరుప్రాంతాల రాజకీయ నేతలు కలసి ప్రజలను ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు.ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. తెలంగాణ రాష్ట్రం విషయంలో ఆంధ్రనేతలే ఎప్పడూ తప్పు చేశారని చెప్పకతప్పదు. అది చంద్రబాబు కావచ్చు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి కావచ్చు. రోశయ్య కావచ్చు. లేదా మరొకరు కావచ్చు. వీరంతా తెలంగాణ వచ్చేదా, పోయేదా అంటూ తెలంగాణకు వ్యతిరేకం కాదు అంటూ రాజకీయ ప్రకటనలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించారు.తెలంగాణ నేతలు మాత్రం తెలంగాణ రాష్ట్రం కావాలన్న డిమాండుకు ఎక్కువగా కట్టుబడి ఉన్నారని చెప్పక తప్పదు.ఇది వేరే విషయం.కాని తెలంగాణ కోరుతున్న తెలంగాణ నేతలు కూడా ఈ రాజకీయ క్రీడలో తమ వంతు పాత్ర పోషించారో లేదో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి.1969లో ఉద్యమానికి ప్రధాన నాయకుడిగా ఉన్న డాక్టర్ చెన్నారెడ్డి ఆ తర్వాత తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్ లో విలీనం చేశారు.తదుపరి ఆయన తనను వేర్పాటువాది అనవద్దని శాసనసభలోనే కోరారు. 1969లో ఉద్యమం కారణంగా తెలంగాణలో ఒక తరం విద్యార్ధులు ఎంత దెబ్బతిన్నారో నష్టపోయినవారికి తెలుస్తుంది. ఆందోళనకు నాయకత్వం వహించిన మదన్ మోహన్, మల్లి ఖార్జున్ వంటి కొద్దిమందికి పదవులు వచ్చి ఉండవచ్చు. కాని విశాల బాహుళ్యం గా ఉన్న విద్యార్ధులు మాత్రం అమూల్యమైన విద్యాకాలాన్నినష్టపోయారు. అంతకన్నా ఫలానా యూనివర్శిటీలో చదువుకున్న ఫలానా బాచ్ వారు ఉద్యోగాలకు దరఖాస్తు చేయనవసరం లేదని స్పష్టంగా తెలిపేవారట.అప్పుడు ఒక తరం విద్యార్ధులు నష్టపోతే, వారి ఆందోళనల పునాదిమీద తమ భవిష్యత్తు నిర్మించుకున్నరాజకీయ నేతలు కొద్దిమంది మాత్రం బాగానే వెలిగిపోయారు. తదుపరి చాలాకాలం తెలంగాణ రాష్ట్రం పెద్దగా ఇష్యూ కాలేదు. అలాగే ఈ తెలంగాణ వాద నేతలు అప్పట్లో సమైక్య వాద నేతలుగా కూడా చాలామంది కొనసాగారు. స్వయంగా కెసిఆర్, నాగం జనార్ధనరెడ్డి వంటి వారు శాసనసభలో చేసిన ప్రకటనలు ఉదాహరణగా నిలుస్తాయి. నాగం ఇప్పుడు వీర ఉపన్యాసాలు ఇస్తున్నారు కాని, రెండువేల నాలుగులో వై.ఎస్. రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ తో కలిసి అధికారంలోకి వచ్చినప్పుడు ఏమన్నారో గుర్తు చేసుకోండి.ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ వస్తే, హైదరాబాదులో చాలా మందికి పనులు లేకుండా పోతాయని, ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని హామీ ఇప్పించండని డిమాండు చేశారు. ఇప్పుడు అరవై ఏళ్ల దోపిడీ గురించి ఘంటాపదంగా ఆయన చెప్పవచ్చు.కెసిఆర్ జోనల్ వ్యవస్థ ఉనికినే ప్రశ్నించారు. ఫర్వాలేదు. ఆ తర్వాత ఆయన అభిప్రాయాలలో స్పష్టత తెచ్చుకుని రాజకీయంగా కూడా ఆలోచించుకుని తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి తెలంగాణ ప్రజల వాణిని బలంగా వినిపించారు. ఆయన తనకు ఆ శక్తి ఉందని రుజువు చేసుకున్నారు. మంచి భాష, ఉపన్యాస శక్తి, ఎదుటివారిని ఆకట్టుకోగల చాతుర్యం వంటివాటితో పాటు తన పదునైన వ్యూహాలతో కాంగ్రెస్, టిడిపి లను తన దారిలోకి తెచ్చుకున్నారు. కొమ్ములు తిరిగిన జానారెడ్డి వంటి నేతలు తను ఏమి చెబితే అది చేసేలా చేయగలిగిన మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు కొన్నిసార్లు వ్యూహరీత్యా ఎదురుదెబ్బలు తిన్నప్పట్టికీ, ఆయన ఆకస్మిక మరణం తర్వాత అంతా తానై కెసిఆర్ విజృంభించి రాష్ట్ర నాయకులందరిని ఒక ఆట ఆడించారు. వీటన్నిటికి ఆయనకే క్రెడిట్ ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం వస్తే ఎవరు ఔనన్నా, కాదన్నా ఆయనదే క్రెడిట్. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నవారంతా ఆయనను తెలంగాణ పితగా గుర్తించవలసిందే.అదంతా బాగానే ఉంది.తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకోవడం తప్పుకాదు. అందుకోసం వాదనలను తయారు చేసుకోవడం తప్పు కాదు. కాని విద్యార్ధుల జీవితాలతో కెసిఆర్ కాని, మరే నాయకుడుగాని చెలగాటమాటడం మాత్రం బాగున్నట్లు అనిపించదు. తెలంగాణ విద్యార్ధులంతా అసలు చదువులే అక్కర్లేదనుకుంటున్నట్లు బంద్ లకు పదే, పదే పిలుపు ఇస్తున్నారు. విద్యాసంస్థలకు కొంతమంది ఉద్యమకారుల పేరుతో వెళ్లి డబ్బులు వసూలు చేయడం నిత్య కృత్యం అయిందన్న విమర్శలు వస్తున్నాయి. డబ్బులుపోతే పోయాయి, పిల్లల చదువులు అన్నా సాగనిస్తున్నారా అంటే అదీ లేదు. తెలంగాణకు చెందిన పలు జిల్లాల పిల్లలు కోస్తాజిల్లాలకు వెళ్లి చదువుకుంటున్నారంటే ఎందుకోసం హృదయమున్న ప్రతి ఒక్కరు అర్ధం చేసుకోవాలి.ఈ మధ్య ఎమ్సెట్ , ఇతర ముఖ్యమైన పరీక్షలలో ర్యాంకులు ఎక్కువ తెలంగాణేతర ప్రాంతాల విద్యార్ధులకు వచ్చాయి. ఇక్కడి పిల్లలు కొందరికి కూడా ర్యాంకులు వచ్చినా , వారు హైదరాబాదులో కాకుండా విజయవాడ, గుంటూరు వంటి చోట్ల చదివిన వారికి వచ్చాయని తేలింది. వైద్య రంగంలో తెలంగాణ డాక్టర్లు తక్కువ మంది ఉన్నారని ఆవేదన చెందే కెసిఆర్ నిజంగా డాక్టర్ల సంఖ్య పెరగాలంటే కచ్చితంగా అందుకు తగిన విధంగా ఎప్పుడో పరిశీలన చేసి మరింత మంది వైద్య వృత్తి అభ్యసించేలా చేసి ఉండవలసింది.అందుకు అవసరమైన సీట్ల సంఖ్య పెరిగేలా చూడడం, అందులో తెలంగాణ పిల్లలు ఎక్కువమంది ఉండేలా చూసుకోవడం వంటివి చేయకుండా, ఇప్పుడు బాధపడితే ఏమి ప్రయోజనం. ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ఇలాంటివి చెబితే చప్పట్లు కొట్టడానికి బాగానే పనికి వస్తాయి.కాని అంతటితో ఆగిపోతాయి. కాని ఇక్కడ పిల్లలు బాగా చదువుకునే ఏర్పాట్లు ఏమిటో చూడకుండా నిత్యం బంద్ లని, ఉద్యమాలని ఏళ్ల తరబడి చదువులను నాశనం చేస్తుంటే తెలంగాణ కు న్యాయం జరుగుతుందా? ఉద్యమం రాజకీయ నాయకులు చేయండి. మొత్తం శాసనసభను బహిష్కరించండి. లేదా రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టించండి. లేదా సమైక్య ఆంధ్రప్రదేశ్ కోరుతున్నవారితో చర్చలు జరిపి వారిని ఒప్పించే ప్రక్రియ చేపట్టండి. అంతేకాని ప్రత్యర్ధులను రెచ్చగొట్టి, వారు రెచ్చిపోయేలా చేసి, తద్వారా రాజకీయంగా లబ్ది జరిగేలా వ్యూహాలను అమలు చేయడం వల్ల ప్రజలకు ఎంతవరకు మేలు జరుగుతుందో కాని నాయకుల వరకు బాగానే గిట్టుబాటు అవుతుంది. ఎన్నికల వరకు ఇలాగే సాగదీస్తే ఇంకా రాజకీయ ప్రయోజనం ఉండవచ్చు. కాని ప్రస్తుత తరం విద్యార్ధులకు మాత్రం ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. ఉస్మానియా నిత్యం అశాంతి నిలయంగా చేయడం వల్ల ఎంతమదికి లాభం చేకూరుతుంది?ఓయు జెఎసి, ఇంకో జెఎసి అంటే అంతా భయపడుతున్నారని ఇప్పుడు అనుకోవచ్చు. కాని అది ఆ విద్యార్ధులకే నష్టం కలిగిస్తుంది. ఇది ఒక ఆవేదన మాత్రమే ఎప్పుడైనా నిరసన చెప్పడం వేరే. తెలంగాణ ఆకాంక్షను వ్యక్తం చేయడం వేరు .కాని నెలలతరబడి, ఏళ్ల తరబడి ఉద్యమాలు చేయడం వల్ల మరో తరం విద్యార్ధులు నష్టపోతారు. అప్పుడు తెలంగాణ సాధించినా ఈ నేతలెవ్వరూ మీకు సాయం చేయరు. చేయలేరు. మీకు ఉద్యమాలు మిగులుతాయి. వారికి ఉద్యోగాలు వస్తాయి.అలాకాదు. మీ ఉద్యమాలు మీ భవిష్యత్తుకు మెట్లుగా ఉండాలి. మీ జీవితాలను మరింత వెలుగుబాటలోకి తీసుకువెళ్లాలి. వీరు ఉద్యోగాలకు పనికి వస్తారు. ఉద్యమాలకు స్పూర్తిగా నిలుస్తారన్నట్లు గా ఉండాలి .ఏ ప్రాంతం యువత అయినా జాతికి, దేశానికి అత్యంత ముఖ్యమైనది.నేటి బాలలే,రేపటి యువత, నేటి యువతే, రేపటి భవిత.మీ భవిష్యత్తును అసూయా,ద్వేషాగ్నిలతో నింపుకోవద్దని మాత్రం చెప్పకతప్పదు. కెసిఆర్ అయినా,మరొకరైనా తెలంగాణ బిడ్డల భవిష్యత్తును ఆకాంక్షించేవారెవరైనా ఒక తరం విద్యార్ధులు దెబ్బతినకుండా చూడాలి. అప్పుడే వారు నిజమైన తెలంగాణవాదులుగా గుర్తింపు పొందుతారు

12, ఆగస్టు 2011, శుక్రవారం

10, ఆగస్టు 2011, బుధవారం

సీమాంధ్రుల పరిశ్రమలు ఉన్నట్టా?లేనట్లా

kommineni.info : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక్కొక్క వర్గాన్ని కలుపుకుంటున్న క్రమంలో భాగంగా పారిశ్రామిక వర్గాలను కూడా ఆకట్టుకోవడానికి ప్రయత్నం జరిగింది. ప్రత్యేక తెలంగాణతోనే పారిశ్రామికాభివృద్ది జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలతో సహా పలువురు తెలంగాణ నేతలు అభిప్రాయపడ్డారు.ఇంతవరకు బాగానే ఉంది. కాని కొన్ని విషయాలు చెప్పిన తీరు వారిలోని వైరుధ్యాలు బయటపెట్టేవిగా ఉన్నాయి. కొంతకాలం క్రితం కాంగ్రెస్ తెలంగాణ ఎమ్.పిలు కేంద్ర మంత్రి , రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ గులాం నబీ అజాద్ కు ఒక నివేదిక ఇస్తూ తెలిపిన అంశాలకు, ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యక్తం చేసిన అంశాలకు కాస్త తేడా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.గులాం నబీ కి ఇచ్చిన రిపోర్టులో హైదరాబాదు నగరంలో సీమాంద్రులు ఐదు లక్షల మంది మాత్రమే ఉన్నారని, ఇక్కడ స్థాపించిన పరిశ్రమలు వారివి తక్కువేనని, హోటళ్లు వంటివి మాత్రమే వారు స్థాపించారని తెలిపారు.అయితే ఈ రౌండ్ టేబుల్ లో మాత్రం హైదరాబాద్ చుట్టు ఉన్న పరిశ్రమలలో ఎనభై శాతం సీమాంధ్రుల చేతులలో ఉన్నాయని, పది శాతం గుజరాతిలవని, కేవలం రెండు నుంచి మూడు శాతం తెలంగాణవారివని పేర్కొన్నారు.జెఎసి ఛైర్మన్ కోదండరామ్ మాట్లాడుతూ ఉత్తరాఖండ్ లో మాదిరి పరిశ్రమలలో స్థానికులకు ఎనభై శాతం మందికి ఉపాధి కల్పించాలని డిమాండు చేశారు.గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రులు ఐడిపిఎల్ ను మూసివేసి రెడ్డి ల్యాబ్స్, అరవిందో, హెటిరో వంటి పరిశ్రమలు స్థాపించారని వీటిలో తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వకుండా వివక్ష చూపారని ఆరోపించారు.సంఖ్యాపరంగా మైనారిటీగా ఉండబట్టే ఎమ్.పి,లు,ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో రాజీనామాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. ఇవన్ని బాగానే ఉన్నా హైదరాబాద్ చుట్టూరా సీమాంధ్రులకే పరిశ్రమలు ఉన్నాయని ఒకసారి, మరో ఇక్కడ అసలు వారికేమీ లేవని పరస్పర విరుద్దంగా చెప్పడం వల్ల వారి వాదనకు నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.

9, ఆగస్టు 2011, మంగళవారం

The Lies Sushma and the Separatists Speak

Visalandhra.org : We have allowed the Separatists for too long to spread blatant lies on every possible aspect of the present debate on Telangana-Andhra. So much so that a large section of gullible people of Telangana, and a few in Andhra and Rayalaseema, take these tissues of lies for granted. Even the educated and the aware in the Telangana region have been browbeaten into believing these canards to be the gospel truth.

One such example is the concocted comments supposedly uttered by the then Prime Minister Jawaharlal Nehru during his visit to Nizamabad in 1956. Every separatist and his brother quote what Nehru was supposed to have prophetically said about Andhra-Telangana merger. BJP’s Sushma Swaraj also thought it wise to jump at the opportunity in Lok Sabha recently when she quoted these infamous words.

Jawaharlal Nehru, she said, had compared the merger of Andhra and Telangana to a matrimonial alliance having ‘provisions for divorce’ if the partners in the alliance cannot get on well in future.” According to a Times of India report, she quoted Jawaharlal Nehru’s 1956 statement,where he had described the merger of Telangana in Andhra as the marriage of an innocent girl with a mischievous man a description that not just drew fierce opposition from the Congress,but also found resonance throughout the calling attention motion,almost turning into an emotional debate

Sarvey Satyanarayana immediately latched on to the quote as is wont with the Separatists. “As rightly mentioned by Sushmaji, Panditji said that Telangana is like an innocent baby being married to a mischievous boy, an Andhrite. They should live together for long. If this baby demands divorce, it should be granted. … (Interruptions) ” he is reported to have said.


But are these comments attributed to Nehru true? Where and how did the Separatists get this quote?
We are reproducing the entire speech of Nehru in Nizamabad in 1956, which is his first and last visit to the place. Nowhere does the then Prime Minister say the words that he was repeatedly and misleadingly quoted as saying. In fact, throughout the speech, Nehru mentions the need for Andhra and Telagnana to live together, to forget petty issues and focus on building the country.


Here a few extracts:


Hyderabad does not belong only to Telangana
“India does not belong only to you or me but to all of us. Bharat Mata does not belong only to the people of Hyderabad of Uttar Pradesh alone. All of us are parts of India and the whole country belongs to all of you form the Himalayas down to Kannyakumari. You cannot tell me Hyderabad and Nizamabad to you. And Allahabad and Delhi to me.. I too have a right in Hyderabad just as you have claim to the Himalayas, Delhi and other places.”


Don’t Quarrel over Petty Issues

We often quarrel over petty issues, about our provinces, language, etc. If you thing like that, you will be giving up this great handful of earth. So you must always bear in mind that the whole of India is like one huge family to which all of us belong. Whether we live in the north or south, irrespective of the religion and caste that we belong to, all of us are part of big family. We stand of fall together.”


Intimidation No Solution
“I mentioned the riots and loot and arson in Bombay, Orissa and other States in which many people were killed. As a result the atmosphere was vitiated by hatred but it had no impact on the decision regarding Bombay or Orissa because you must understand quite clearly that the problems of a great nation are not solved in such manner. Otherwise, the country will be ruined.


Greater Andhra for Greater Good
“In these circumstances, it seemed improper to have two separate states of Andhra Pradesh and Telangana. The new outlook pointed to a greater Andhra.”


“The people of Andhra and Telangana have to lead their lives and progress as parts of the larger entity, India. Therefore petty arguments and tensions will lead nowhere.  I hope all of you will accept this new proposal whole heartedly and put it into practice. I want that you should become a part of greater Andhra and benefit by it.”


National Interest is Paramount


“However, Why Should the Question of Madras, Bombay, Maharashtra, Telangana, Andhra or Punjab loom so large before us? The important thing is India.”


While this is the truth, while Nehru actually advocated merger of Andhra and Telangana, while he passionately advocated against parochial tendencies, the Separatists have been indulging in travesty of truth. They have been spreading disinformation and resorting to perjury. This falsehood is now found everywhere, in every piece written by various journals on Telangana issue, as if it were the received word.


The other statement that is frequently quoted is about the “tint of expansionist imperialism” in merging Telangana with Andhra. Which Sushma faithfully repeated in her Lok Sabha speech. She said a statement by the then Prime Minister Late Pt Nehru appeared in the Indian Express issue of the year 1956, “he was skeptical of merging Telangana with Andhra State, fearing a “tint of expansionist imperialism” in it.

The truth is different. While Nehru used the words “tint of expansionist imperialism”, he did not specifically use them in the context of Andhra-Telangana. He was most likely talking about the Samyukta Maharashtra movement, about which he spoke even in the speech quoted above.


Here is the entire speech of Jawahar Lal Nehru in Nizamabad in 1956: http://tinyurl.com/Nehru-Nizam​abadSpeech

ముల్కీవాదం మేలు చేసేనా?

ఆంధ్రజ్యోతిలో చలసాని శ్రీనివాస్   
ఈ 14 ఎఫ్‌ని అడ్డం పెట్టుకుని ఇతర ఉద్యోగాలలోకి వస్తారని అవాస్తవాలు చెపుతూ ప్రస్తుతం వందకుపైగా ఉన్న అతికొద్ది యస్ఐ పోస్టులపై విద్వేషం రగిలించే కంటే అందువల్ల పోయే వేలాది ఇతర ఉద్యోగాలు కొందరు నేతలకు కనపడవా? పైగా కొన్ని యస్ఐ ఉద్యోగాల కోసం ఆగమాగం చేస్తున్న కొందరు నాయకులు, ఉద్యోగనేతలు తెలంగాణలో 1.2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే అది భర్తీ చేయమనటం కోసం పోరాటం సల్పి నిరుద్యోగులకి న్యాయం చేయటానికి చూడాలి. అంతేకాని ఈ వందకి పైబడిన యస్ఐ ఉద్యోగాలకి ఇంతటి ఉద్వేగాలని సృష్టించడం సరైనదేనా అని ఒక్కసారి ఆలోచించుకోవాలి.

మేము సైతం వేర్పాటువాదులతో........

 ప్రతి సంవత్సరం ఆగష్టు పదిహేనుకు ముందు కాశ్మీర్ లేదా అస్సాంలోని  వేర్పాటువాదులో, మావోయిస్టులో ఇచ్చే 'స్వాతంత్రదినోత్సవాన్ని బహిష్కరించండి' అనే పిలుపులకు మనం అలవాటు పడిపోయాము. కాని ఈ సంవత్సరం వీరితో జతకట్టేందుకు 'మేము సైతం' అంటూ మన రాష్ట్రంలోని కొందరు మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు ముందుకు రాబోతున్నారా?

 "For the first time in the history of Andhra Pradesh, district collectors are set to take the salute in the Telangana districts on the independence day  in view of the ministers from the region deciding to stay away from all the official events on August 15 including the ceremonial parade, in protest against the delay in the creation of Telangana. Sources told TOI that the general administration department (GAD) has been asked to sound the collectors of 10 Telangana districts to be on stand-by to hoist the tricolour and take the salute on the Independence Day. Chief minister N Kiran Kumar Reddy will take the salute at Parade Grounds in Secunderabad as part of the statewide celebrations. In fact, in view of the threats by the Telangana supporters led by the TRS to disrupt the official functions on the day, several Congress MLAs, too, have decided to stay away from the ceremonial parade at the various district headquarters in the Telangana districts"

ఇలా వేర్పాటువాదులకు, అసాంఘిక శక్తులకు, వసూల్గాళ్ళకు మంత్రులే భయపడి స్వాతంత్రదినోత్సవం నాడు జెండావందన కార్యక్రమాలను రద్దుచేసుకొంటే వారికి అడ్డు అదుపూ ఉంటుందా?

విద్యాలయాలలో అసాంఘిక శక్తులు





  తెరాస నమ్మిన తొత్తు, పని చేయకుండానే ప్రజాధనాన్ని అప్పనంగా బొక్కుతున్న ఆచార్యుడు ఇప్పుడు ‘ఇక సచ్చుడు లేదు.. సంపుడే’ అంటూ తన పాఠాలు వల్లిస్తున్నాడా?


6, ఆగస్టు 2011, శనివారం

14 ఎఫ్. పై ఇంత రగడ అవసరమా?

Kommineni(Honorary Chief Editor, NTV) :ఏదో ఒక సమస్య సృష్టించుకోవడం, దాని చుట్టూ పరిభ్రమించడం, ఆ వలయంలో అంతా చిక్కుకుని విలవిలలాడడం- ఇదే మన రాష్ట్ర పరిస్థితి. తెలంగాణ కావాలని డిమాండు చేసే తెలంగాణ నేతలు 14 ఎఫ్ కోసం తీవ్రంగా ఆందోళన చేస్తారు.దాంతోనే మొత్తం తెలంగాణ సమస్య పరిష్కారం అయిపోయినంతగా హడావుడి చేస్తున్నారు. నిజంగానే దీనితోనే మొత్తం సమస్య పరిష్కారం అయిపోతే అసలు గొడవేలేదు. ఆ తర్వాత మళ్లీ తెలంగాణ సమస్య ఉండనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కాని, రాష్ట్ర ప్రభుత్వం కాని దీనిపై ఎందుకు ఇంత గందరగోళం సృష్టిస్తున్నాయో అసలు అర్దమే కాదు.రాజకీయ నేతల ఓట్ల మాయాజాలంలో నిరుద్యోగులైన అభ్యర్ధులు మలమలమాడిపోతున్నారు. మూడేళ్లుగా ఎస్.ఐ.పరీక్షల వ్యవహారం నానుతూ ఉంటే అసలు ఈ ప్రభుత్వాలు ఎందుకు మనల్ని పాలించాలి? ఎందుకు ఈ రాజకీయ నాయకులు మనకు ప్రతినిధులుగా ఉండాలి? ఎక్కడో ఒక చోట వీటికి చెక్ పెట్టే పరిస్థితి లేకపోతే మున్ముందు ఈ నేతలు తమ ఇష్టం వచ్చిన అంశాలపై తమ ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించి ఇదే రైటని చెప్పి జనాన్ని నమ్మించి పబ్బం గడుపుకుంటారు.చివరికి నష్టపోవలసింది ప్రజలే.ఇప్పుడు తెలంగాణ ఉద్యమం చూడండి. లేదా సమైక్య ఉద్యమం చూడండి. ఒక్క రాజకీయ నాయకుడైనా వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతున్నారా? వారి వ్యవహారాలేమైనా ఆగుతున్నాయా?కాని వారు బంద్ లకు పిలుపు ఇస్తే, రాస్తారకోలకు పిలుపు ఇస్తే, మరో ఆందోళనకు పిలుపు ఇస్తే నష్టపోయేది రెక్కాడితేకాని డొక్కాడని బడుగు జీవులే.అసలు 14 ఎఫ్ కు ఇంత పట్టుపట్టవలసిన అవసరం ఉందా?అది ఉన్నంతమాత్రాన పరీక్షలు రాస్తే కొంపలు మునిగిపోతాయా?అదే విధంగా కేంద్రం కూడా ఒక్కసారి శాసనసభ దీనిని రద్దు చేయాలని తీర్మానం చేశాక తన అభ్యంతరాలేమిటో చెప్పకుండా మరోసారి తీర్మానం చేయాలని కోరడం ఏమిటి? అంటే వీరంతా ఎవరికి వారు దొంగాట అడుతున్నారు. 14 ఎఫ్ ఎందుకు వచ్చింది. 1973లో ప్రత్యేకాంధ్ర ఉవ్వెత్తున లేచినప్పుడు దానిని సద్దుమణచడానికి గాను ఆరుసూత్రాల పధకం వచ్చింది. దానితోపాటు అందరికి రాజధాని అయిన హైదరాబాదులో ప్రత్యేకించి భద్రత విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కాంపోజిట్ బలగాలు ఉండాలని ఆంధ్ర నేతలు కోరారు. దానికి తెలంగాణ నేతలు అంగీకరించారు. అంటే అన్ని ప్రాంతాల వ్యక్తులు మెరిట్ ప్రకారం ఇక్కడ పోలీసు శాఖలో ఎస్.ఐ, ఆ కింది పోస్టులలో ఉద్యోగాలు చేసే అవకాశం కల్పించారన్నమాట. ఇది ఎందుకంటే ఇతర ప్రాంతాల ప్రజలకు భద్రత భావం కలగాలంటే పోలీసు శాఖలో ఒకే ప్రాంతం వారు ఉంటే వారు ఏకపక్షంగా వ్యవహరిస్తే మిగిలిన ప్రాంతాలవారికి ఇబ్బంది వస్తుంది అనే ఉద్దేశంతో ఇది పెట్టారు. మంచో,చెడో ఇది చాలాకాలం నడిచింది.దీనిపై కొన్నిసార్లు న్యాయస్థానాల వరకు వెళ్లింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సరైన తీరులో వ్యవహరించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఒకసారి అనుకూలంగా,మరోసారి వ్యతిరేకంగా వాదించిన ఆరోపణలు ఉన్నాయి.చివరిగా ఇది రాజ్యాంగ సవరణ కాబట్టి , దీనిని అమలు చేయాల్సిందేనని సుప్రింకోర్టు తీర్పు చెప్పినప్పడు , దానిపై సహజంగానే తెలంగాణ ఉద్యమం నడుపుతున్నవారు అవకాశంగా తీసుకున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వం ఏమి చేయాలి?వాస్తవాస్తవాలు చెప్పి ముందుగా సొంత పార్టీ నేతలను కన్విన్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రజలకు ఇందులో ఉన్న మంచి, చెడు విశ్లేషించాలి. ఆనాటి రోశయ్య ప్రభుత్వం ఇవేవి చేయలేదు.పైగా కోరిందే తడవుగా 14 ఎఫ్ రద్దు చేయడానికి తీర్మానం చేసింది. దానికి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తో సహా అంతా ఒప్పేసుకున్నారు.అయితే హైదరాబాదులో ఇప్పుడు చాలా మార్పులు వచ్చినందున , అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ చాలాకాలంగా స్థిరపడినందున దీనిని రద్దుచేసినందువల్ల పెద్దగా నష్టం ఉండకపోవచ్చు.కాని అసలు చర్చ లేకుండా కేవలం తమ పబ్బం గడుపుకోవడం కోసం ప్రభుత్వ,ప్రతిపక్ష నేతలు వ్యవహరించారని మాత్రం చెప్పుకోవాలి. పోని ఆ తర్వాత ఎందుకు కేంద్రంతో దానిని ఎందుకు రద్దు చేయించలేకపోయారో కూడా ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, ఆ పార్టీ నాయకత్వంలో శాసనసభ తీర్మానం చేశాక, దానికి వ్యతిరేకంగా అదే పార్టీకి చెందిన విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ ఎందుకు కేంద్రానికి లేఖ రాశారన్నది కూడా కాంగ్రెస్ వివరణ ఇవ్వాలి. అసలు కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం అంటూ ఉండాలి కదా. రోశయ్య, చంద్రబాబులు, ఆ తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా కోస్తా,రాయలసీమ వారే కదా. అలాంటప్పుడు ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా వారు వ్యవహరించకపోయారని చెప్పడం లగడపాటి ఉద్దేశ్యమా?ఇక్కడ 14 ఎఫ్ రద్దు చేయడం వల్ల తెలంగాణలోని కరీంనగర్ , వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల ఉద్యోగార్ధులకు కూడా నష్టమే. అయినా అక్కడి వారు కూడా ఎందుకు రద్దు చేయాలని అడుగుతున్నారు.ఎర్రబెల్లి దయాకరరావుకాని, ఈటెల రాజేందర్ కాని లేదా మరే ఉత్తర తెలంగాణ నాయకులంతా కూడా తెలిసి అడుగుతున్నారా? తెలియక అడుగుతున్నారా? లేదా తమ ప్రాంత పిల్లలకు వ్యతిరేకంగా వారే ఉద్యమం చేస్తున్నారా? కెసిఆర్ లో ఒక గొప్పదనం ఉంది. ఆయన తన వాదన పటిమతో తిమ్మిని బొమ్మిని చేయగల సమర్ధులు.ఇప్పటికి తెలంగాణ ఉద్యమంలోకి కాంగ్రెస్ , తెలుగుదేశం హేమాహేమీలందరిని తన దారిలోకి తెచ్చుకున్న ఘనాపాటి.విచిత్రంగా ఆయన కరీంనగర్ జిల్లాకు వ్యతిరేకంగా ఉండే 14 ఎఫ్ రద్దు ప్రతిపాదనపై ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి సిద్దిపేట బయల్దేరింది కూడా కరీంనగర్ నుంచే. అప్పట్లో ఆయన అక్కడ ఎమ్.పిగా ఉండి ఆ జిల్లా ఎస్.ఐ ఉద్యోగార్ధులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టినా ఆయన వారి మద్దతు కూడగట్టుకోలుగుతున్నారనుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో ప్రాంతాలకు అతీతంగా తమకు నష్టమైనా సరే ఆ క్లాజును రద్దు చేయాలని ఆ ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.అంటే ఇది ఒక పట్టుదల అంశంగా మారిందన్నమాట.అక్కడికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాదు సిటీ లో నియామకాలు నిలిపివేసి మిగిలిన జోన్ లన్నిటీని, అలాగే ఆరోజోన్ లో హైదరాబాద్ ను వదలిపెట్టి మిగిలిన నల్లగొండ, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల అభ్యర్ధులకు ఎస్.ఐ. పరీక్షలు పెడతామంటే కూడా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలే ఒప్పుకోవడం లేదు.వారు ప్రధానిని కలిసి వెంటనే దీనిని తొలగించాలని కోరుతున్నారు. అసలు తెలంగాణనే సాధిస్తున్నామని వీరు చెబుతున్నప్పుడు 14 ఎఫ్ గురించి ఎందుకు పట్టుబడుతున్నారంటే దానికి ఏమి సమాధానం ఉండదు. దేనికదే ముఖ్యమని అంటారు.వీరి పట్టుదలల వల్ల సుమారు ఇరవై వేల మంది నిరుద్యోగులు మూడేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే ఈ నేతలకు వారిపై కనికరం లేకపోతోంది.కొంతమంది తమకు అనుకూలమైన విద్యార్ధులతోనో, ఉద్యోగార్ధులతోనో ఈ 14 ఎఫ్ రద్దు కాకుండా పరీక్షలు పెట్టడానికి వీలు లేదని డిమాండు చేయిస్తుంటారు. ఇక్కడ 14 ఎఫ్ కు అనుకూలమా?కాదా అన్నది చర్చ కాదు. దానిని రద్దు చేసుకోండి . లేదా ఉంచుకోండి . కాని నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడే హక్కు కెసిఆర్ కు,లగడపాటికి , అలాగే టిడిపి, కాంగ్రెస్ నేతలకు లేదు.ప్రభుత్వాల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని వీరంతా ఇలా చేస్తున్నారు.నిజంగానే చేతకాని ప్రభుత్వాలు ఉంటే ఇలాగే జరుగుతుంది. ఇలాంటి ప్రభుత్వాలను, ఇలాంటి నేతలను ఎందుకు ఎన్నుకున్నామా అని ప్రజలు బాధపడేలా వీరు పరిస్థితిని తీసుకు రాకూడదు.ఏదైనా సమస్య వచ్చినప్పుడు అంతా కూర్చుని వేలాదిమంది నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా తమ లక్ష్య సాధనకు అనుగుణంగా ఏమి చేయాలో ఆలోచించాలి కాని తాము పట్టిన కుందేటికి మూడుకాళ్లన్నట్లు చేస్తే ఇటు సీమాంధ్ర నిరుద్యోగులతోపాటు తెలంగాణ నిరుద్యోగులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే ఒక నాయకుడు ఒక మాట అన్నారు. 14 ఎఫ్. తీసేస్తే తెలంగాణ వచ్చినట్లేనని అభిప్రాయపడుతున్నారు. నిజంగా అది జరిగి వారి లక్ష్యం నెరవేరుతుందనుకుంటే కచ్చితంగా దానిని సాధించడానికి కృషి చేయవచ్చు. కాని అందులో హేతుబద్దత కనిపించదు. 14 ఎఫ్ రద్దు చేశాం కదా ఇప్పుడు తెలంగాణ అంశం గురించి కొంతకాలం అడగకండి అని కేంద్రం అంటే అప్పుడేమి చేయాలి. ఇక్కడ కేవలం రెండు వందలు లేదా మూడు వందల ఎస్.ఐ పోస్టుల వ్యవహరానికి సంబంధించి ఇంత రాద్దాంతం చేయవలసిన అవసరం ఉందని అనుకుందాం. అసలు ప్రభుత్వం హైదరాబాదుకు సంబంధించి నియామకాలే చేపట్టడం లేదని అంటున్నప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు కాని, మంత్రులు కాని ఎందుకు పరీక్షల నిర్వహణకు అడ్డుపడుతున్నారు. ఈ మాట స్వయంగా హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డే చెప్పారు.బహుశా ఇప్పుడు ఆమె కూడా 14 ఎఫ్ రద్దుచేసే పరీక్షలు పెట్టమంటారేమో తెలియదు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ మాట మార్చుతారో తెలియని రోజులివి. ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే ఈ రగడలో తనవంతు పాత్ర పోషించడానికా అన్నట్లు మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి అప్పట్లో అన్నదమ్ముల్లా ఉన్నాం కాబట్టి ఆ రోజు ఆ క్లాజు రద్దుచేయడానికి ఒప్పుకున్నాం, ఇప్పుడు న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. మరి సభలో తీర్మానం చేసిన రోజున ఈయన గుర్రుపెట్టి నిద్రపోతున్నారని అనుకోవాలా?ఇక మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిది ప్రేక్షక పాత్ర గా మారింది. ఒక్క తెలంగాణ నాయకుడితోకాని, చివరికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహతోకాని, దానం నాగేందర్, ముకేష్ లతో కాని దీనిపై అనుకూలంగా ప్రకటన చేయించలేకపోయారు. హైదరాబాదు లో నియామకాలు చేపట్టడం లేదు కనుక ఇప్పుడు 14 ఎఫ్ తో సంబంధం లేకుండా పరీక్షలు నిర్వహించవచ్చని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పినా ఆయన పార్టీవారే పట్టించుకోవడం లేదు.ఈమధ్య తెలంగాణకు చెందిన కొందరు అభ్యర్ధులు ముఖ్యమంత్రిని కలిసి ఎస్.ఐ.పరీక్షలు నిర్వహించవలసిందిగా కోరారు. ఆ వెంటనే మరికొందరితో వద్దని ఆందోళనకారులు ప్రకటన చేయిస్తుంటారు అది వేరే విషయం.ఈ పరిస్థితిలో నిరుద్యోగులు తమ ఖర్మ అని సరిపెట్టుకోవాలి. రాజకీయ నాయకులు కనీసం ఒక పని చేస్తే బాగుండు. తెలంగాణకు చెందిన ఎస్.ఐ పరీక్షలు రాసే అభ్యర్ధులందరి నుంచి దీనిపై అభిప్రాయ సేకరణ చేసి వారిలో మెజార్టీ కనుక తాము 14 ఎఫ్ రద్దు అయ్యేవరకు పరీక్షలకు హాజరుకాబోమని చెబితే అప్పుడు ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఆ పరీక్షలను వాయిదా వేసి మిగిలిన చోట్ల పరీక్షలు నిర్వహించడమో , లేక అక్కడ కూడా వాయిదా వేసి 14 ఎఫ్ ను రద్దు చేయించుకోవడమో చేయాలి.అంతేకాని ప్రభుత్వం చేష్టలుడిగినట్లు వ్యవహరించడం మంచిది కాదు.నిరుద్యోగం ఎంత బాధకరమో అనుభవించేవాడికి తెలుస్తుంది.

5, ఆగస్టు 2011, శుక్రవారం

అసహజ వాక్కులు

ఆంధ్ర జ్యోతి : చాలా కాలం తర్వాత ఇటీవల ఒక ఛానెల్‌లో రాజకీయేతరమైన చర్చకు వెళ్లాను. ఆత్మహత్యలను నివారించడానికి సంబంధించిన ఆ చర్చలో నాతో పాటు మానసిక వైద్య నిపుణులు కూడా పాల్గొన్నారు. రాజకీయేతరమనుకుంటున్నా పదే పదే ఉద్యమాలలో ఆత్మహత్యల గురించిన ప్రస్తావనలకు దారితీస్తూ వుంటే నియంత్రించడానికి చాలా ప్రయత్నించాల్సి వచ్చింది. బహుశా. వీటినే టిఆర్ఎస్ నాయకులు అసహజ పరిణామాలు అంటుంటారు. ఆ నాయకులతో సహా మనుషులకూ వారి ప్రాణాలకూ విలువనిచ్చే వారెవరైనా ఈ అసహజ పరిణామాలను కోరుకోరు.

అయితే మా చర్చ ప్రసారమైన రోజునే టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఏ కారణం వల్లనైనా తెలంగాణ రాకపోతే తాను విషం తాగుతానని ప్రకటించారు. ఈ మాట్లాడిన సందర్భాలేమిటో సవరణలు ఏమైనా వున్నాయో లేదో ఖచ్చితంగా తెలియదు గాని మరోసారి ఆత్మహత్యల గురించి అం దరూ మాట్లాడటానికి ఆ వ్యాఖ్యలు కారణమైనాయి. రాజకీయ నా యకులందరూ అన్నట్టు ఇలాటి మాటలు బొత్తిగా అవాంఛనీయమైనవి.

మరుసటి రోజున కావచ్చు జేఏసీ కన్వీనర్ కోదండరామ్ ఆత్మహత్య చేసుకున్న యువకుడిని భగత్‌సింగ్‌తో పోల్చి మాట్లాడినట్టు ప్రతికల్లో వచ్చింది... ఆత్మహత్యలకు పాల్పడటం ఎప్పుడైనా విషాద మే. అసహాయస్థితిలో అలా అంతమై పోయిన వారు ఎంతైనా సానుభూతి పాత్రులు. వారి కుటుంబాలకు సహాయం చేయడం అందరి బాధ్యత కూడా. అయితే ఏ పరిస్థితులలోనైనా ఆత్మహత్యలను ఆదర్శీకరించడం లేదా ఆ ధోరణులను ప్రోత్సహించేలా మాట్లాడ్డం, వ్యవహరించడం బాధ్యతగల వారెవరూ చేయరాని పని. అసహజ అనిశ్చిత ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి ఇది.

కెసిఆర్ రాజకీయాల పట్ల ఎవరి అభిప్రాయాలు ఏమైనా ఆయన వాగ్ధాటి గురించి వ్యూహ చతురుత గురించి భిన్నాభిప్రాయాలుండవు. అలాటి వ్యక్తి నోట విషం తాగడం లాంటి మాటలు వస్తాయని వూహించడం కష్టం. ఒక విధంగా ఇది నిరూత్సాహ ఫలితం కావచ్చు. ఎందుకంటే రెండు వారాల్లో తెలంగాణ ప్రకటన రాబోతున్నట్టు తనకు సంకేతాలు అందాయని కాంగ్రెస్ వాదుల సభలో వారికే తెలియని రహస్యం ప్రకటించి అప్పటికి రెండు వారాలు దాటి రెండు రోజులైంది.

ఇలాటి గడువులు ఆయన ఎన్నెన్నో ప్రకటిస్తూనే వస్తున్నారు గనక ఈ మాత్రానికే అంత మాట అనివుంటారనుకోలేము. ప్రధానంగా విద్యార్థులు యువజనులు వున్న సభలో ఆయన ఈ మాట అనడం ప్రత్యేకించి గమనించదగ్గది. ఈ మాటలు అమాయకులైన వారు ప్రాణం తీసుకోవడానికి ప్రేరణ కావచ్చని ఆయన గుర్తించలేకపోయారా? గతంలో ఆయన నిరాహారదీక్ష ప్రారంభించిన రోజున నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్‌లో అల్లం నారాయణ, హరగోపాల్‌లతో కలిసి మాట్లాడుతున్నాను.

ఆయన అరెస్టును ఖండించడంలో అందరం గొంతు కలుపుతుంటే ఆ పార్టీ శాసనసభ్యుడు మీద పెట్రోలు పోసుకోవడం దిగ్భ్రాంతి కలిగించింది. నాటి నుంచి నడుస్తున్న ఈ కాలమంతటా వివిధ చర్చల్లో అనివార్యంగా ఆత్మహత్యల ప్రస్తావన బలిదానాలు త్యాగాల పేరిట వాటిని అభివర్ణించే ప్రయత్నం జరుగుతూనే వుంది. కెసిఆర్ మాటలతో ఆ ధోరణి పరాకాష్టకు చేరిందనుకోవాలి. తెలంగాణ ప్రజలు ముఖ్యం గా యువజనుల భవిష్యత్తు బాగుండాలని కోరేవారెవరూ దీన్ని హర్షించరు. ప్రాంతం కలిసున్నా విడిపోయినా కేవలం దాన్నిబట్టే ప్రజల పరిస్థితి స్వర్గతుల్యమైపోతుందని చరిత్ర తెలిసిన వారెవరూ చెప్పరు గనుక అందుకోసం విలువైన ప్రాణాలు బలికావడాన్ని కూడా భరించలేరు.

కెసిఆర్ సంగతి అటుంచి వామపక్ష చైతన్యం గల కోదండరాం కూడా ఆత్మహత్య చేసుకున్న వారిని భగత్‌సింగ్‌తో పోల్చడం అసంబద్ధం. ప్రపంచ చరిత్రలో ఎన్నో మహత్తర పోరాటాలు విప్లవాలు జరిగాయి. ఈ తెలంగాణాలోనే వీరోచిత రైతాంగ సాయుధ పోరాటం సాగింది. ఏ పోరాటంలోనూ ఈ విధంగా ఆత్మహత్యలు జరగలేదు.

ఎక్కడి సంగతో ఎందుకు కోదండరాం చెప్పిన భగత్‌సింగ్ కూడా సుఖదేవ్‌కు ఉత్తరం రాస్తూ ఆత్మహత్య చేసుకోవడం పొరబాటని గట్టిగా మందలించాడు. "నీకు ఇప్పటికీ జ్ఞాపకముండొచ్చు. ఒక రోజు నేను ఆత్మహత్య గురించి నీతో చర్చించాను. కొన్ని పరిస్థితుల్లో ఆత్మహత్య సమర్థనీయం కావచ్చు అన్నాను.

ఆనాడు నువ్వు నా అభిప్రాయంతో విభేదించావు. చర్చ స్థలం సమయం కూడా నాకు గుర్తున్నాయి. సాహం షామి కుటీరంలో ఒక సాయంకాలం పూట ఆ చర్చ జరిగింది. అలాటి పిరికి పని ఏ పరిస్థితులలో కూడా సమర్థనీయం కాదని నీవన్నావు. అది అసహ్యకరమైన భయంకరమైన పని అని కూడా నీవన్నావు. ఆ విషయంలో ఇప్పుడు నీ అభిప్రాయం పూర్తిగా తలకిందులైంది. కొన్ని పరిస్థితులలో ఈ పని సరైందని మాత్రమే గాక తప్పని సరని కూడా భావిస్తున్నాను. నా విషయానికి వస్తే మొదట్లో నీకున్న అభిప్రాయమే ఇప్పుడు నా అభిప్రాయం. ఆత్మహత్య ఒక అసహ్యకరమైన నేరం. పూర్తిగా పిరికి వాడు చేయవలసిన పని. విప్లవ కారుల సంగతి పక్కన పెట్టి మామూలు మనిషి ఎవరైనా దీన్ని సమర్థించరు.''

"......నా వంటి భావాలు గల వ్యక్తి నిష్కారణంగా చావాలనుకోడని నేను బదులిచ్చాను. మా జీవితాల విలు వ సాధ్యమైనం త ఎక్కువ పెం చుకోవాలనే మేము చూస్తాము. వీలయినంత ఎక్కువ మానవాళికి సేవలు చేయాలని చూస్తాము. మా జీవితాల నుంచి వీలైనంత ఎక్కువ మూల్యం పొందాలని చూస్తాము. ప్రత్యేకించి ఏనాడూ ఎలాటి దిగులూ నిరుత్సాహం దరిచేరని నా వంటి వాడు ఆత్మహత్య చేసుకోవడం కాదు గదా దాని గురించిన ఆలోచనైనా దరికి రానివ్వడన్నాను. అదే మాట నీకూ చెబుతున్నాను.'' (జైలు నోట్సు, లేఖల నుంచి) భగత్ సింగ్ మాటలను మన యువత తప్పక గమనంలోకి తీసుకుంటుందని ఆశించాలి.

వారిని ఇలాటి పరిస్థితికి గురిచేస్తున్న కేంద్రం బాధ్యతా రాహిత్యం, దానికి ఆజ్యం పోస్తున్న ప్రాంతీయుల వీరంగాలూ ఏ మాత్రం ఆమోదించరానివి. నిరంతరం ఏకాభిప్రాయం జపం చేసే చిదంబరాదులు ఇప్పటికే రాజ్యాంగ బద్ధంగా శాసనసభ వేదికపై ఏకగ్రీవంగా తీర్మానం చేసిన 14(ఎఫ్) రద్దుకు ఎందుకు అడ్డు పెడుతున్నారు? అనేక అవరోధాల మధ్య అయిందనిపించిన తతంగాన్ని తిరగదోడాలని ఎందుకు పరీక్ష పెడుతున్నారు? ఏదో విధంగా ఈ రాష్ట్ర రాజకీయాలు ప్రజలు అనిశ్చిత వూబిలో కూరుకుని వుండాలని కాదా? గులాం నబీ ఆజాద్ తమతో జరిపిన చర్చలు రాజకీయ డ్రామా అని ఆ పార్టీ సీనియర్ నాయకుడు కేశవరావే ప్రకటిస్తుంటే దానిపైన కొండంత భ్రమలు కలిగించే వారు కూడా ఇందుకు బాధ్యత పంచుకోనవసరం లేదా? ఆజాద్‌ది డ్రామా అయితే అందులో పాత్రధారులుగా తామంతా వున్నామని కెకె ఒప్పుకుంటారా? సూత్రధారి స్థానం అధిష్టానానికి ఇస్తారా? ఈ డ్రామాలో ప్రాంతాలను బట్టి విలన్లు హీరోలు తారుమారవుతుంటారా? ఇవన్నీ కళ్లముందు కనిపిస్తున్నవే గనక పెద్దగా తర్కించనవసరం లేదు.

రెండు చోట్ల రెండు రకాలుగా మాట్లాడే ఈ ద్వంద్వ రాజకీయాలలో తెలుగుదేశం నేతలు ఏమాత్రం తీసిపోవడం లేదు. అటు నుంచి పయ్యావుల కేశవ్, ఇటు నుంచి రేవంత్ రెడ్డి మాట్లాడితే వారి అధ్యక్షుడైన చంద్రబాబే మందలించవలసి వచ్చింది. ఆ మాటకొస్తే హోం మంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కుదరదని తమ సభ్యుడైన నరేంద్రకే లేఖ రాసిన అద్వానీ ఇప్పుడు ప్రతినిధివర్గాలను కలుసుకుని కబుర్లు చెబితే సరిపోతుందా? సమైక్యత గురించి రోజూ చెప్పే టిజి వెంకటేశ్ తాము ఆంధ్ర వారి మోచేతి నీళ్లు తాగడానికి సిద్ధంగా లేమని ప్రకటించడం ప్రహసనం కాదా? ఇదే చివరి రాష్ట్రమంటే తమకు అభ్యంతరం లేదని లగడపాటి ఏ హోదాలో ప్రకటిస్తున్నారు? ప్రధాన పార్టీలు ఇన్ని విన్యాసాలు చేస్తుంటే ప్రాణాలు తీసుకోవడం గురించి మాట్లాడ్డం ఎంత అనుచితం?

కెసిఆర్ మాత్రమే గాక రాష్ట్రంలో ప్రధాన పార్టీల నాయకులందరూ ఆచితూచి మాట్లాడకపోతే అగమ్య ఆంధ్రప్రదేశ్ వాసులకు మరింత అన్యాయమే జరుగుతుంది. కేంద్రం ఎత్తుగడలు స్పష్టమైనాక కూడా కీలకం ఎక్కడుందో తెలియనట్టే ప్రాంతాల మధ్య పంతాలు పెంచుకోవడం అర్థ రహితం. రాజ్యాంగ రీత్యా రాజకీయంగా రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయమయ్యేలా చూడాలి గాని ఈ సమస్యను వారాలు రోజుల గడువుతో ముడిపెట్టినందువల్ల ఫలితం లేదు.

అలాగే కేంద్ర కాంగ్రెస్ వాణిని మరెవరో వినిపించవలసిన అవసరమూ లేదు. జైపాల్‌రెడ్డి, ఆజాద్, చిదంబరం, ప్రణబ్‌ముఖర్జీ ఆఖరుకు ప్రధాని కూడా కుండబద్దలు కొట్టి చెబుతుంటే ఇక్కడ వ్యూహాగానాలు చేయనవసరం లేదు. వాస్తవిక దృక్పథంతో తమ లక్ష్యాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలో ఎవరైనా ఆలోచించుకోవచ్చు గాని అఘాయిత్యపు మాటల వల్ల కలిగేది మాత్రం అనర్థమే.

- - తెలకపల్లి రవి

4, ఆగస్టు 2011, గురువారం

సోదరులారా ఒక్కసారి ఆలోచించండి!

ఏ ఉద్యమమైనా ప్రజల నుంచి ప్రారంభమై తదుపరి కాలంలో నాయకత్వం చేతిలో స్థిరత్వం పొంది తన లక్ష్యాలను సాధిస్తుంది. కానీ తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని పరిశీలించినట్లయితే ఆ ఉద్యమం ఎప్పుడూ మొదటగా రాజకీయ నాయకత్వంలో నే ప్రారంభమౌతూ ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళల్లో ఒక విధమైన భావోద్వేగాల్ని రెచ్చగొడుతూ వస్తోంది. ఈ రాజకీయ నాయకత్వం తమ కు పదవులున్నన్ని నాళ్ళు తమ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామని చెబుతుంది. పదవులు పోగానే తెలంగాణకి అన్యాయం జరిగినట్లు గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టి, ఆంధ్రప్రదేశ్‌లో తమ ప్రాంతాన్ని అభివృద్ధిచేసే అవకాశం రాలేదని గగ్గోలు పెడుతున్నది.

ప్రజలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నారని, వారి ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా వుందని, ఆనాడు జరుగుతున్న సంస్కరణలకు మద్దతుగా 1996 జూలై 16న శాసనసభలో (పదవిలో ఉండగా) కె.చంద్రశేఖర్‌రావు మాట్లాడిన మాటలు అసెంబ్లీ రికార్డుల్లోనే కాకుండా రాజకీయాల గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలలో పదిలంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి దిగజారడానికి ప్రధాన కారణం ఎస్టాబ్లిష్‌మెంట్ చార్జెస్ విపరీతంగా పెరగడమనే వాదనను కేసీఆర్ సాక్షాత్తు శాసనసభ వేదికగానే చేశారు.

మరి ఆయనే ఇప్పుడు చిన్న రాష్ట్రాలైతే మేలు అంటున్నారు. చిన్న రాష్ట్రాలైతే ఎస్టాబ్లిష్‌మెంట్ చార్జెస్ ఎక్కువగా ఉంటాయని అందరూ భయం వ్యక్తం చేస్తున్న విషయం గమనార్హం. వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్తు చార్జీల పెంపుపై మాట్లాడుతూ 'సేద్యానికి ఇచ్చే విద్యుత్తు చార్జీలను పెంచితే రైతులు వ్యతిరేకంగా లేరు. తమకు కావలసిందల్లా తమ పంట పొలాలు ఎండిపోకుండా కరెంటు సరఫరా కావడమేనని వారు కోరుతున్నారు. గతంలో ఉన్న అధ్వాన్న పరిస్థితులు లేవు. కాస్తో కూస్తో వారి దిగుబడికి గిట్టుబాటు ధర లభిస్తున్నది... ఈ విషయాన్ని పరిశీలించి కాస్తో కూస్తో టారిఫ్‌ను పెంచి ఎలక్ట్రిసిటీ బోర్డు ఆర్థిక పరిస్థితిని పరిరక్షించవలసిన అవసరం ఉంద'ని కేసీఆర్ అన్నారు.

రెండు రూపాయలకు కిలో బియ్యం పథకంపై మాట్లాడుతూ ప్రజల కొనుగోలు శక్తి పెరిగినందున తదనుగుణంగా ధర నిర్ణయించాలని ఆనాటి ముఖ్యమంత్రిని కోరారు. ప్రస్తుతమేమో ప్రజలు 'ఆంధ్రోల్ల' పాలనలో నానా బాధలు పడుతున్నారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇక ఉద్యోగులకు సంబంధించి, జోనల్ వ్యవస్థ గురించి కేసీఆర్ మాటలు వింటే, ఆయన, ఆయన బృందం చేస్తున్న ప్రచారం ఏ విధంగా విషపూరితమో బట్ట బయలౌతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ 'ఉద్యోగులకు సంబంధించి ఆరు సూత్రాల పథకం, జోనల్ సిస్టం వంటివి దెబ్బతీస్తున్నాయి.

సర్ప్లస్ స్టాఫ్‌ను రాష్ట్రంలో ఏ మూలనైనా వాడుకునేలా వీలుండాలి. కానీ ఆ విధానం లేదు. మనకు మనం విధించుకున్న ఆటంకం ఆరు సూత్రాల జోనల్ విధానం. సిబ్బందిని వినియోగించుకోలేక, పని లేకపోయినా కోట్ల, లక్షల రూపాయలు నిరర్థకంగా పెట్టుకుని ఖర్చు చేస్తూ వృ«ధా చేస్తున్నాం. ఈ విధానంలో మార్పులు చేయాలి. డైనమిక్‌గా మూవ్ కావాలి. ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులతోను, ఉద్యోగసంఘాలతోను సంప్రదింపులు జరిపి జోనల్ విధానాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయాలి'.

ఇప్పుడు ఆయన మాట్లాడే మాటల్ని పైన చెప్పిన ఆనాటి తన ప్రసంగంతో పోల్చి వాస్తవాలు గ్రహించవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము. గ్రూప్-4 ఉద్యోగాలు మొదలుకొని రాష్ట్రంలో దిగువ స్థాయి కేడర్ పోస్టులన్నీ కూడా జిల్లాను యూనిట్‌గా పరిగణించేవే. వీటికి ఏ జిల్లాకు ఆ జిల్లానే స్థానికం. ఆ పై పోస్టులన్నీ కూడా ఎపిపిఎస్సీ ద్వారా జోనల్ పద్ధతిలోనే నింపుతున్నారు. 1995 నుంచీ ఇప్పటిదాకా రాష్ట్రంలో నియమించబడిన లక్షా ఇరవై వేల మంది టీచర్లు, 70 వేల మంది పోలీసులు కూడా జిల్లాను యూనిట్‌గా తీసుకొని చేసినవే. ఇవి రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి నిర్వహించిన నియామకాలే. 610 జీవో అమలుచేయడంలో భాగంగా దాదాపుగా 90 శాతం మందిని 2000 సంవత్సరం నుంచే దశల వారీగా వారి సొంత జిల్లాలకు పంపేశారు. ఆ ఖాళీలలో తెలంగాణ ప్రాంతం నిరుద్యోగులే తప్ప వేరొకరు నియమించబడలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ భాషని, యాసని కించపరుస్తూ సినిమాలు తీస్తున్నారని, తెలంగాణ, ఆంధ్ర సంస్కృతులు వేరు వేరని, జాతులు కూడా వేరువేరని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా సినిమా నిర్మాణం కొందరు పెట్టుబడిదారులు లాభార్జన ధ్యేయంగా చేసే ఫక్తు వ్యాపారం. అలాంటి సినిమాల్లో ఒక్క తెలంగాణ భాష, యాసనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతీయ మాండలికాల్ని, యాసల్ని అవమానపరుస్తూ సినిమాలు తీస్తున్నారు. ఉదాహరణకు రాయలసీమ మాండలికాన్ని, నెల్లూరు మాండలికాన్ని, ఉత్తరాంధ్ర మాండలికాన్ని, వెనుకబడిన తరగతుల వారి వృత్తుల్ని కించపరుస్తున్నారు.

మరీ ఘోరంగా వెనుకబడిన తరగతుల వారి వృత్తుల్లోని ఆడవారిని వాంపు క్యారెక్టర్లుగా చిత్రించడం మనం చూస్తూనే వున్నాం. వీటన్నిటి మీద విస్తృత స్థాయిలో ఉద్యమాన్ని నిర్మించకుండా, కేవలం ప్రాంతీయ స్థాయికి దీనిని దిగజార్చి కేవలం తెలంగాణ వారికే అవమానం జరిగినట్లు ప్రచారం చేయడం శోచనీయం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే గానీ ఈ ప్రాంతానికి విముక్తి లేదన్నట్లుగా తెలంగాణవాదులు మాటల గారడీ చేసి ప్ర జల్ని భ్రమల్లో ముంచుతున్నారు. తమ లక్ష్య సాధనకు ప్రజలందర్ని బలిపశువుల్ని చేస్తూ అంతర్యుద్ధాల గురించి మాట్లాడుతున్నారు. దళిత, బహుజన, మైనారిటీ వర్గాల ప్రజలు వీరి మాటలు నమ్మి, వీరి లక్ష్యసాధనకు మె ట్లుగా ఉపయోగపడుతున్నారే కానీ, నాయకత్వంలో భాగస్వాములు కాలేక పోతున్నారు.

అది చేస్తాం, ఇది చే స్తాం అని ప్రజలకు కల్పించే ఆశలు విజ్ఞులైన తెలంగాణవాదులకు కూడా అర్థం కావడం లేదు. ఉదాహరణకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఆంధ్రప్రాంతం వాళ్ళ భూముల్ని లాక్కొని తెలంగాణలో పేద ప్రజలకు పంచుతామంటున్నారు. భారత పౌరులుగా, తమ కష్టార్జితంతో రాజ్యాంగబద్ధంగా ఈ ప్రాంతంలో కొద్దో గొప్పో భూములు కొనుగోలు చేసిన ఆంధ్ర ప్రాంత ప్రజలకు చెం దిన భూములను స్వాధీనం చేసుకుని పంచు తామంటు న్నారేకానీ, తెలంగాణ పేదలను తరతరాలుగా దోపిడీ చేస్తూ, వారి రక్తమాం సాలను పీల్చి పిప్పిచేస్తున్న తెలంగాణ భూస్వాముల భూముల గూర్చి మాత్రం మాట వరసకైనా మాట్లాడటం లేదు. దీన్ని బట్టి వారి చిత్తశుద్ధిని, వర్గస్వభావాన్ని అంచనా వేయవలసినదిగా తెలంగాణ దళిత, బహుజన, మైనారిటీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము.

జలవనరుల గురించి చర్చిస్తే నీళ్ళను ఆంధ్రోళ్ళు దోపిడీ చేస్తున్నారనడం కూడా ఈ విషప్రచారంలో భాగమే. పై నుంచి వచ్చేనీటిని ఆంధ్ర ప్రాంతం వారు ఎలా దోపిడీ చేస్తారు? తెలంగాణలో జరిగిన మొత్త ం అభివృద్ధికి నిజాం నవాబు కారణమని చెబుతున్న వీరు, ఆ నిజాం ప్రభువు పై నుంచి వచ్చే నీటిని ఎందుకు ఆపలేకపోయారో చెప్పడం లేదు. వాస్తవంగా తెలంగాణ ప్రాంతం సముద్ర మట్టానికి వెయ్యి, రెండు వేల అడుగుల ఎత్తులో ఉంది.

రాజకీయ దురంధరులు, పాలనాదక్షులు అయిన జలగం వెంగళరావు, పి.వి.నరసింహారావు, డాక్టర్ చెన్నారెడ్డి కూడా తెలంగాణ ప్రాంతంలో నీటి ప్రాజెక్టులు కట్టలేక పోయారనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ ప్రాంత భౌగోళిక స్వరూపం ఆ విధంగా ఉంది. ఎత్తి పోతల పథకాల ద్వారా తెలంగాణకు నీరందించ వచ్చనే ఆలోచన ఇటీవలి కాలంలో వచ్చింది. కాబట్టి ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని అందిచేందుకు చిత్తశుద్ధితో కృషి మొదలైంది.

తెలంగాణ వాదులు చేస్తున్న ముఖ్యమైన వాగ్దానమేమంటే తెలంగాణ ఏర్పడిన వెంటనే ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు ఖాళీచేసి వెళ్ళే ఉద్యోగాల్లో మూడు లక్షల మంది తెలంగాణ నిరుద్యోగుల్ని నియమిస్తామని. ఇది సాధ్యమేనా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనుకుందాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని రెండు రాష్ట్రాలకు కేటాయించే బాధ్యత కేంద్ర ప్రభుత్వంలోని సిబ్బంది, శిక్షణ శాఖ క్రింద వుండే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ (ఎస్ ఆర్) విభాగంకు ఉంటుంది. సాధారణంగా గ్రామస్థాయి నుంచి, జిల్లా, డివిజన్, ప్రాంతీయ స్థాయి వరకు ఉన్న ఉద్యోగులు ఎస్ఆర్ పథకంలోకి రారు. ఎక్కడున్న వారు అక్కడే ఉద్యోగంలో ఉంటారు.

కేవలం శాఖాధిపతుల కార్యాలయాలు, సచివాలయం, శాసనసభ, శాసనమండలి సచివాలయాలు ఈ పథకం కిందకు వస్తాయి. ఈ కార్యాలయాలలో ఉన్న సిబ్బంది సంఖ్య ఎంత? అందులో విభజన జరిగితే ఒక్కో రాష్ట్రానికి కేటాయించగలిగిన వారి సంఖ్య ఎంత? అందులో ఆప్షన్ ప్రకారం పాతవారిని కొనసాగించగా మిగిలే ఖాళీలెన్ని? అనేవి గుర్తించకుండా లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామనడం కేవలం వంచన మాత్రమే. మొదటగా కేంద్రం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయికి తక్కువకాని విశ్రాంత అధికారి అధ్యక్షతన రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు సభ్యులుగా రాష్ట్ర సలహా సంఘం (ఎస్ఎసి)ని ఏర్పాటు చేస్తుంది.

తదుపరి ఉమ్మడి రాష్ట్రంలోని మొత్తం ఉద్యోగుల సంఖ్యను ఖచ్చితమైన నిష్పత్తి ప్రకారం రెండు రాష్ట్రాలకు కేటాయిస్తుంది. ఆ కేటాయించిన నిష్పత్తి ప్రకారం సర్వీసులో ఉన్న ఉద్యోగులను నూతన రాష్ట్రానికి కేటాయిస్తుంది. రాష్ట్ర సర్వీసులకు చెందిన ఉద్యోగుల్ని రెండు రాష్ట్రాలకు కేటాయించే విధానంలో అనుసరించే విస్తృత సూత్రమేమంటే మొదటగా వారిDomicile (Home District) ఆధారంగా వారిని Option అడుగుతారు. తదుపరి వారి Reverse Seniority ఆధారంగా అత్యంత జూనియర్ ఉద్యోగుల్ని గుర్తించి వారి వారి ఆప్షన్ ఆధారంగా రెండు రాష్ట్రాలకు కేటాయిస్తారు. ఒక వేళ కేటాయించిన ఉద్యోగాల సంఖ్య కంటే ఆప్షన్స్ ఇచ్చిన ఉద్యోగుల సంఖ్య అధికంగా వుంటే, అత్యంత జూనియర్ ఉద్యోగుల్ని మొదటగా వారి Domicile ఆధారంగా వారి స్వరాష్ట్రానికి కేటాయిస్తారు. ఇందులోను ఈ క్రిందివారికి మినహాయింపులు యిస్తూ వారి ఆప్షన్ ఆధారంగా వారు కోరుకున్న రాష్ట్రానికి వారిని కేటాయిస్తారు. వారు : మహిళా ఉద్యోగులు, నాల్గవ తరగతి ఉద్యోగులు, వికలాంగ ఉద్యోగులు, Spouce Policy, Medical Hardship ఉద్యోగులు, కేన్సర్‌తో బాధపడే ఉద్యోగులు, బధిర ఉద్యోగులు, బైపాస్ సర్జరీ అయిన ఉద్యోగులు.

మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్-ఉత్తరాఖండ్, బీహార్-జార్ఖండ్ రాష్ట్రాల విషయంలో పై సూత్రాల ప్రకారమే ఉద్యోగుల్ని రెండు రాష్ట్రాలకు కేటాయించారు. ఇక్కడ పన్నెండు సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీసుగల వారినందరినీ వారి ఈౌఝజీఛిజీజ్ఛూ ఆధారంగా కాక, వారి సర్వీసు ఆధారంగా ఆప్షన్ అడిగి వారు కోరుకున్న రాష్ట్రంలో వుంచడం జరిగింది. ఇక లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి తెస్తారో ఏలినవారు (కేసీఆర్) సెలవిస్తే అందరూ సంతోషిస్తారు.

- డాక్టర్ సాకే శైలజానాథ్

Response to the Responses : పరకాల ప్రభాకర్

There has been a lot of interest in the pieces that I posted, especially ‘In Praise of T Agitation’, and ‘Q&A With Parakala Prabhakar’ in Business Standard. When the responses started coming in, I thought that it would be better to write a general response at one go by bunching together the various issues raised, rather than respond to them one by one as they come in.


I would like to thank everyone who took time to read the posts and to all those who spared their valuable time to compose their responses. There were both bouquets and brickbats. It is quite pleasing that many eminent people thought it fit to write. Some wrote as comments in my site itself, some chose to respond by mail, and some others wrote their posts in facebook as well as twitter. Some friends called me up to let me know what they thought of the posts.


I am beholden to all of them.


Some of the responses were vehemently critical. Some of them were full of praise. Some of them were sarcastic. Some chose to be very caustic. Some others tried to run me down rather than engaging with my arguments. Some attacked me personally. A few of them tried to attribute motives to me.


It was quite nice reading all of them. Well, what do you expect to get when you write on something which is agitating the minds of many people and the atmosphere is so very charged. But I must tell you, I am quite used to this kind of situation; quite used to all the three – dooshana bhooshana tiraskaram. I would have been surprised if my views did not evoke strong and adverse responses. That would have meant that they did not have any value.  But I would have been disturbed if they did not evoke any favourable responses. Fortunately, there were many favourable responses too.


After reading and rereading all the comments, my commitment to the cause of Visalandhra is more vigorous today. Interestingly, it is not the favourable ones than strengthened my conviction that my argument for a united Andhra Pradesh is unassailable. It is the bunch of adverse comments that did the job. The adverse comments are so shallow and full of insinuations and devoid of logic that they failed to challenge even one element of the string of arguments that I put forward in favour of a united state. When I found well-meaning people indulging in personalised and intemperate comments, I quickly realised that they had no case and their plot was lost. Otherwise why will fairly educated and respectable adults talk about a serious matter in a sarcastic and derogatory fashion and repeat the same old allegations and falsehoods that were completely shot down elsewhere as well as in my writings?


After reading all these comments, today I am more convinced than ever that there is little to say in a serious way in favour of the division of the state.  I did not come across even a single fact or an argument that made me review or rethink any of the arguments I had advanced. There is no case to divide the state if you look at the evidence on Telengana’s economic performance; there is no case if you look at the language angle; and there is no case if you examine the so called cultural argument; and absolutely no room for argument if you look at the history of Telugu people. After all these arguments are exposed to be spurious, it finally boiled down to ‘I want it because I have been saying I want it.’ Well-meaning people are saying that they wanted division because they wanted division. Who can argue with them?  They say that anybody who wants the state to stay united is saying so because they want to exploit Telangana!!!


This is an old trick. When you don’t have a rational argument to deal with an argument, you start insinuation. You cast aspersions on the person who presents the argument. You question the bona fides of the person. You don’t engage with the argument. You try to engage with the person. Isn’t that a sure sign of a lost argument?


Now let me say something about some of the comments that were made on my posts.


First of all, I would like to make it clear that I do not want this debate to be a personalised one. I am not interested in debating about individuals, their personalities, and their worthiness or otherwise. My idea of a debate is simple: I prefer to respond to the issue raised by a person. Not respond to the individual. I do not like a debate which falls back on ‘Who are you to say?’ ‘Who is he to say?’  ‘What are you?’  ‘Where are you from?’ ‘What were you doing till yesterday?’ You are familiar with the drift I am talking about. I would like to keep the individual aside and deal with the argument. With the idea. With the proposition. And with the formulation. In other words, my concern is with issues. Only issues.


I have to say this because some of the respondents wanted to take this to personal level. Some chose to point out the fact that while I was working for the unity of Andhra Pradesh, my wife supported the demand for Telangana state. The glee in the tone of their comment is too obvious to go unnoticed. They evidently felt that they had scored a point against me.


These people obviously feel that husbands should be able to force their wives to toe their line and assert their masculine authority over them. Their point is if I can’t force my own wife to fall in line, what right have I got to tell others about the merits of my position. I don’t want to go into the details of what this means (‘What a wimp you are if you can’t shut your wife up in the kitchen and make her say yes to whatever you say?’ is just one implication of this); nor do I want to speculate on what it tells about the people who make such comments. Evidently these people are alien to the idea of two individuals having a relationship of mutual respect notwithstanding their disagreement on a particular issue. We can leave comments from this class of people alone and let them have their small thrills in life.


But I can’t resist telling you something that shocked me recently. When I was in Delhi for the Visalandhra Mahasabha’s Media Workshop and Exhibition, a girl who was with a group of people that stood outside the hall to register its protest shouted at me:  ‘first make sure your wife agrees with you’. I was shocked to learn that she was a student from Jawaharlal Nehru University.  A girl student from JNU wanted a husband to make sure that his wife toed his line! Either something is wrong with the girl student or with the University. Much more interesting is that this group of protesters was led by a ‘revolutionary’ lady with ‘akka’ as a suffix to her name.


Since I referred to Delhi Workshop, I must mention one more incident. On the second day of the workshop and while I was still in Delhi, some persons calling themselves Advocates JAC attacked my house in Hyderabad. They shouted slogans and threw stones. My mother who is eighty year old and my daughter were at home. They were bold and they did not panic.


Who attacks houses and throws stones? Only those who have no argument. Who are intolerant. Who do not want anybody to say anything that they don’t like. And above all those who are afraid that the structure of their argument is so fragile that a it will fall apart and smashed to pieces even if a single voice contests it; even if one individual questions it; even if one organization challenges it.


That day I realised that behind the insinuations, allegations, shrill voices, attacks and stone-throwing, and filthy abuse that we see around these days, there is a weak argument. The argument becomes louder and shrill because it is weak. It has violence as its companion and aide-de-camp because it is not confident about it strength and merit. It does not tolerate any other opinion because it feels threatened. It does not face facts because it fears a collapse.


This incident also strengthened my conviction that my argument was potent enough to make its adversaries panic. It made me confident that they were incapable of challenging it with a counter argument. It became clear to me that if I have to change my position it will not be because of a convincing counter argument, but because of threats of physical and verbal assault.


Some people questioned the authenticity of the data that was the basis of my argument. It was argued that the data were cooked up by the Coastal and Rayalaseema people who were exploiting Telangana. Well, I see no argument here worth a comment. Data don’t become ‘cooked up’ simply because one does not like them. If they really felt so, such people should have come up with an entire body of alternative data. Mere allegations, chest-beating, and insinuations don’t wash. One other person cited some categorization by the Planning Commission in an effort to lend some sanctity to the argument about backwardness of Telangana. I can only say that the person needs some training and help in understanding and interpreting economic data. Any student of economics can tell you that the Planning Commission’s categorization that was cited was in a completely different context and the ‘backwardness argument’ on the basis of that categorization does not stand up to even a rudimentary scrutiny.


Another comment was regarding the position taken by the now wound-up Praja Rajyam Party on Telangana agitation and my stand those days. Everybody in PRP and outside knew my strong views in favour of an integrated Andhra Pradesh. I along with many in the PRP continuously and strongly argued for adopting an integrationist stand. The leadership’s already confused position on the issue became even more confused. And the outcome was the vague ‘Samajika Telangana’ which was neither here nor there. My position then was for integration; and it is for integration today.


One person took the pains to bring out a hyperlink to a report in The Hindu newspaper which quoted me on the issue. I want that person to go back to the report and read it once again. He will find that everywhere I was quoted as saying “we” (meaning the Party) and not “I” (meaning Parakala Prabhakar). As a spokesperson of the party it was my duty to summarize and faithfully state the deliberations and decisions of the Party forums. I am not familiar with the practice of a spokesperson or a functionary saying, “My party’s stand is this but my personal stand is this.” But within the Party forums my position was absolutely clear to everyone. I was never ambivalent on this issue. The person was clever to dig the report out. I only wish that he could have used the same wisdom to read it carefully and understand it. Had he done so the nuance would not have escaped his scholarly attention.


In response to the electoral performance of Telangana Rashtra Samiti and other parties I referred to in my interview to Business Standard, somebody asked me if had deliberately overlooked the performance of Telangana Praja Samithi. No, I did not. I chose to refer only to the recent past. If one wants to bring in TPS saga also into the discourse, one has to explain why there was nothing between the TPS merger with Congress and till the latest spurt of the agitation. And how the leaders of the erstwhile TPS served in important positions in the united Andhra Pradesh also needs to be explained. The same person perhaps felt that BJP’s performance after ‘one vote – two states’ slogan was spectacular, while I described it as ‘pathetic’. I still feel that it was pathetic. If it had swept the polls or even came anywhere near to it in the region, perhaps I would have given some weight to the comment. For this commentator, when Devender Goud and Indra Reddy floundered, it was their credibility deficit and not the weakness of the cause. And when somebody wins handsomely or even scrapes through, it was the strength of the aspiration, but not as a result of the quirk of electoral fortunes. He is obviously used to only peculiar rules of engagement in an argument: Heads I win, Tails you lose!


Some tried to strip me of a title which I never possessed. They said that I was not an intellectual. Well, I never laid claim to the coveted title of ‘intellectual’. I am a normal citizen, a simple Telugu person, born into a politically and socially conscious family. I am fortunate to have gone to some reasonably good schools, colleges and universities. That’s all. No more. I do not suffer from the delusions that I am an intellectual.


But I speak my mind out. Candidly. Fearlessly. I take positions after a careful sifting of evidence. But I am also constantly on the lookout for any fact or insight that would call for a rethink or a review of my position. On this issue, I must tell you, I have not come across even a shred of evidence to support the demand for dividing the state. I must tell you that I do not consider anyone who disagrees with me as my enemy or a traitor or an unworthy person or a person with ulterior motives. I don’t level charges or attribute mala fide intentions to anybody who takes a position at variance with the position that I take.


I am open for a debate. Anywhere. Anytime. I am not the kind of person who can be cowed down by sarcasm. Nobody can browbeat me. None can intimidate me. Let nobody labour under the illusion that they can pass some caustic remarks and make some cheap personal comments to prevent me from championing the Visalandhra cause and from challenging the falsehoods propagated by the separatists. I am aware that only those who have no argument resort to this kind of innuendo. Innuendo makes a lot of noise. But it cannot be a substitute for an argument.


Therefore, if somebody is prepared to leave this clutter behind and ready for a genuine and honest debate, I am ready. And Visalanddhra Mahasabha is ready.


Let me add this here: I don’t buy the argument that ‘those who demand separate Telangana state are the only ones who are the well-wishers of Telangana.’ I have seen this trick. I don’t fall into the trap. I believe that all those who support the separate Telangana state are not necessarily the well-wishers of Telangana. And all those who are in favour of Visalandhra are not against the interests of Telangana. In fact those who are championing the cause of Visalandhra are the real well-wishers of Telangana. And Coastal region. And Rayalaseema. They are the well-wishers of all Telugu people.


Lakhs and lakhs of people from all the regions of Andhra Pradesh, all the districts of Andhra Pradesh, and all the villages of Andhra Pradesh want the State to stay united.


I have seen through the cynical efforts to portray the current situation as a conflict between ‘Telangana people’ on the one side and the rest of the State on the other.


I will lay bare the trickery of this diabolical game and expose the cynical sleight of hand behind it.


Watch this space.