17, ఆగస్టు 2011, బుధవారం

గ్రామాల అభివృద్ధి స్వంతంగా చేసుకోలేరా?

స్వంతంగా అభివృద్ది చెందడం అనే దానికి ఉదాహరణగా గోదావరి జిల్లాలోని ఒక గ్రామాన్ని చెప్తాను. ఆ గ్రామం పేరు కంచు స్తంభాలపాలెం. ఆ ఊరు దొడ్డిపట్లమండలం లో ఉంది. ఆ ఊరికి వెళ్ళడానికి ఇప్పటికీ చాలా కష్ట పడాలి. కానీ ఒక్కసారి గ్రామంలో అడుగుపెడితే ఇంక మీకు అక్కడ కనిపించేది కాంక్రీటు రోడ్లు. అనేక రకాలుగా అభివృద్ధి కనిపిస్తుంది. ఆ రోడ్లు ఇంతకుముందే ఎనభయ్యవ దశకంలోనే ఉన్నాయి ఆ గ్రామానికి. ఆ గ్రామానికి ఆ ప్రాంత రాజకీయనాయకులు ఏమీ చేయలేదు కానీ గ్రామస్తులే పూనుకొని తమ గ్రామాన్ని అభివృద్ది పరచుకొన్నారు.

అట్లాంటి ఊళ్లు మీకు కృష్ణ, గోదావరి జిల్లాలలో చాలా ఉన్నాయి. వాటి అభివృద్ది ఏ ప్రభుత్వమూ చేయలేదు. ఆ గ్రామాల వాళ్లు ఒక గ్రామాన్ని చూసీ మరియొక గ్రామం అలా అభివృద్ధి చేసుకొన్నారు. అలాగే భీమవరం దగ్గరలో ఉన్న చిన్న చిన్న పల్లెటూళ్లని లేదా విజయవాడ వద్ద గల కంకిపాడు, పామర్రు, ఉయ్యూరు ఇంక లోపలి గ్రామాలని చూస్తే విషయం అర్థమవుతుంది. వాళ్ళెవరూ ప్రభుత్వ సహాయం కోసం దేబిరించ లేదు. వాళ్లకు చేతనయినంత వరకూ ప్రతి గృహస్తూ తన వంతు సహాయం చేసారు. ఈ రోజు ఆ గ్రామాలు మన సినిమాలలో చూపినట్లుగా అభివృద్ది కనిపిస్తూ ఉంటుంది.

వాళ్లు తమ వ్యవసాయం ఇకముందు లాభసాటిగా చేయడం కష్టమవుతుందని భావించిన తరుణంలో తమ పిల్లలని అటునుండి విద్య వ్యాపారాల వైపు మళ్ళించారు. ఇది మన తెలంగాణా సోదరులకు అర్థం కావడం లేదు. స్వర్గీయ ప్రధాన మంత్రి శ్రీ పీ వీ నరసింహారావుగారు తన ఆర్ధిక శాఖా మంత్రి ప్రణబ్ ముఖర్జీ గారి సహాయము తో నూతన ఆర్ధిక సంస్కరణలు చేపట్టిన తరువాత కోస్తా, రాయలసీమలలోని ప్రజలు మేలుకొని ఇక ముందు రాబోయే ప్రభుత్వాలు పెట్టుబడిదారీ విధానంగానే ఉంటాయి మన మార్కెట్లను ప్రపంచ మార్కెట్ల కోసం తెరిస్తే తాము రేసులో వెనుకబడతామని తెలుసుకొని తమ పిల్లలను మిగిలిన రంగాలకు మరలచారు. తెలంగాణా సోదరులు కాలం తో పరుగెత్తడం మాని ఇంకా ఎదుటివారు మోసం చేసారనే నిజాం నాటి భావనలోనే ఉన్నారు. వారి నాయకులు వారిని ఆ భావన లోనే ఉంచారు కూడా. ఆ విధమైన భావన నుండి బయటకు వచ్చిన తెలంగాణా సోదరులు మిగిలినవారిలా కాకుండా వారు బయటకు ఉపాధి కోసం మరియూ ఇతర మార్గాలు వెతుక్కొంటూ ఇతర ప్రాంతాలకు వెళ్ళారు. ఇంక ఇక్కడ ఉన్న వారిలో చాలామందికి ఆ విధమైన స్పృహ లేదు. అందుకే అస్తమాను తమ కష్టాలకు ఎదుటివారు కారణం అని తిడుతూ ఉంటారు. పోనీ ఆ విధంగా బయటకు వెళ్ళిన వారైనా ఇక్కడివారిలో చైతన్యాన్ని కలుగచేసారా అంటే అదీ శూన్యమే. పైగా వీరిని రెచ్చగొట్టే విధంగా ఉంది వారి ప్రవర్తన. ఇంకొక విషయం మన తెలంగాణా సోదరులు ఒక లగడపాటిని, ఒక కావూరి ని తిడుతూ కూర్చోన్టారే తప్ప వాళ్లు ఆ స్థాయిలోకి రావడానికి వాళ్లు చేసిన కృషి ని మాత్రం గుర్తించరు. ఎవరో ఒకరో ఇద్దరో తప్పుడు పనులు చేసే వారు ఉంటారు కానీ అందరూ చేయరుగా. ఇంకొక విషయం కృషి తో నాస్తి దుర్భిక్షం అన్న విషయాన్ని ఎప్పుడు గుర్తిస్తారో ఈ ప్రజలు.

14 కామెంట్‌లు:

  1. మునిసిపాలిటీవాళ్ళు వీధుల్లో రోడ్లు వెయ్యడం ఎందుకు? ఎవరి వీధిలో వాళ్ళే రోడ్లు వేసుకోవాలి కదా. రోడ్లు వేసుకోవడానికి డబ్బులు లేనివాళ్ళు ఎలాగూ బాగుపడరు. సర్వైవల్ ఆఫ్ థి ఫిట్టెస్ట్ సూత్రం అంటే ఇదే. ఇలాగే ఉంది మీ వాదం.

    రిప్లయితొలగించండి
  2. ప్రవీణ్ శర్మ గారు చాల బాగా చెప్పారు ,

    ఎవరి అభివృద్ది వారు చూసుకోవడానికి (చేసుకోవడానికి) ప్రభుత్వానికి పన్నులేందుకు కట్టడం , ఇవన్ని పర్యవేక్షించడానికి ఒక యంత్రాంగం ఎందుకు ?
    చైతన్య గారిని ప్రతి గ్రామంలో ఒక కమిటి వేసి పర్యవేక్షించమనండి

    రిప్లయితొలగించండి
  3. గ్రామాలని అభివృద్ధి చేస్తామని చెప్పి విరాళాలు వసూలు చేసి తమ సొంత అకౌంట్‌లలో వేసుకునే స్వచ్ఛంధ సంస్థలు గ్రామాల్లో ఉన్నాయి. అన్ని పనులూ గ్రామ స్థాయిలోనే అక్కడి గ్రామస్తులే చేసుకుంటే ప్రభుత్వం ఎందుకు?

    రిప్లయితొలగించండి
  4. ప్రభుత్వంతో పని లేదని వాదించేవాళ్ళు USAలోనూ ఉన్నారు. వాళ్ళని అక్కడ anarchists/libertarians అంటారు.

    రిప్లయితొలగించండి
  5. Praveen Sharma, you may be from Telangana. Hence, you are arguing like a maoist without responsibility. In the village, what would be the revenue of a Panchayat? If at all there is revenue, it will not be sufficient to do all other developmental works. Don't you know? I mentioned about villages in coastal area. No village will prosper without the help of its villagers. If you seek government aid for everything, you can not develop in your life time. Most of the colleges and institutes are founded by private management long ago in coastal area. For example, DNR college, Bhimavaram, CRR college Eluru, YN college Narsapur, Hindu college of institutions, Machilipatnam, Ranaga Raya Medical College, Kakinada, AP Sugar Mills Tanuku, KCP Uyyooru, and VT College, Rajahmundry, PT College, Kakinada and many more institutions in krishna, Guntur, Godavari districts are founded by the private management associations long ago. All these are founded with the local peoples' contribution. You would better stop your sarcastic statements like is it possbile without government help etc. The lazy people seek for government or somebody's but help not self oriented public. The people of coastal area have got the awareness some 50 years ago. Hence, they work hard and get the results.

    రిప్లయితొలగించండి
  6. I am not from Telangana. My parents from Orissa and I was born in Srikakulam district. We lived just 8 years in Karminagar and Warangal. ఉన్న ఎనిమిదేళ్ళ అనుబంధం నన్ను గొప్ప తెలంగాణావాదిని చెయ్యదు కానీ నేను తెలంగాణాకే సపోర్ట్ ఇస్తున్నాను. ప్రభుత్వానికి గనులు, అడవుల నుంచి కూడా రెవెన్యూ వస్తుంది. గనులు, అడవులపై అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది కానీ గ్రామ పంచాయితీలకి ఉండదు. గనులు, అడవుల నుంచి వచ్చే రెవెన్యూ అంతా రాష్ట్ర ప్రభుత్వానికే వెళ్తుంది. ఇంటి పన్ను, ఆస్తి పన్ను లాంటివి వసూలు చేసే అధికారం మాత్రం పంచాయితీలు & మునిసిపాలిటీలకి ఉంటుంది. ఎంత గ్రామ స్వరాజ్యం ఉన్నా గ్రామాలు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మీదే అధికంగా ఆధారపడాలి.

    రిప్లయితొలగించండి
  7. You did not see the coastal districts viz., Godavari, Krishna and Guntur in AP except passing by train. They are rich in agri products and agro-based industries. The villagers of those districts invested on land. They again invested the excess income from agriculture on industries and business. The farmers in Godavari and Krishan basins are developed like that. No government instutution you find in those 4 districts. Whatever development has been made is by the villages and its villagers themselves. You did not follow my comment about the revenue of a village. It is so meagre which is not helpful for all round development. Even the government can not develop without public help. The coastal area did and are enjoying the fruits.

    రిప్లయితొలగించండి
  8. Capitalists setup industries where resources are available and they can gain profits. A syndicate consisting some telugu people owned a sugar factory in Rayagada town of Orissa and that factory was located behind railway station. Though Rayagada town had rail transport facility for sugar exports, the sugar factory was closed and shifted to Chagallu in West Godavari district. It's because farmers of Rayagada district started growing other crops like cotton instead of Sugarcane. Jute mills in Andhra Pradesh are mostly seen in Srikakulam, Vizianagaram and Visakhapatnam districts and few of the jute mills are seen near Eluru and Guntur. It's because jute crop is grown only in Srikakulam, Vizianagaram and Visakhapatnam districts in our state. Some times, industries use resources imported from other regions. Vijayawada Thermal Power Station used coal imported from Singareni and Paravada Thermal Power Station used coal imported from Orissa. Both of the thermal power stations are owned by government. Though transportation of resources makes cost, government runs those industries for public service. Even I did study sociology in university and I am aware about factors of industrialisation.

    రిప్లయితొలగించండి
  9. I think local self-governance has to be promoted and more funds to be diverted to Panchayats and Zilla Parishads, etc. Corruption will of course be there also but still oversight by common people will be easier and surer there. And at village level it will be difficult for sarpanches etc to openly indulge in corruption and at any rate at least more percentage of funds will be invested for development and welfare. But all this has to be, as rightly remarked in this article, supplemented by people's own collective cooperation. There ARE villages in Telangana also which developed by their own self-help and mutual cooperation. Even a good TV program was shown about one such village in Nizamabad district.

    రిప్లయితొలగించండి
  10. Corruption is even seen in coastal Andhra's villages. Corruption is one of the factors of backwardness but not the sole factor. In past, village munsif and karanam used to do corruption and the same thing is now done by sarpanchs.

    రిప్లయితొలగించండి
  11. P Sarma seems to have missed the point entirely. People in coastal villages worked hard to realize their aspirations. It is indeed the job of the government to provide equitable opportunities to all sections (and regions!), they have failed miserably. However, the coastal spirit has been one of tenacity to make it good in life, which made a difference to their lives, among other factors. The problem with T opinion makers is they are so heavily dependent on government for everything and refuse to recognize individual spirit.

    రిప్లయితొలగించండి
  12. Coastal Andhra is not so developed as you say. I lived 4 years in Konaseema (economically most developed in Andhra but infrastructurally backward). Majority of the coastal Andhraites still depend on agriculture. How many major industries are present in coastal Andhra except in few areas like Pydi BhimavaraM (Srikakulam district), Gajuwaka (Visakhapatnam) and Kakinada?

    రిప్లయితొలగించండి
  13. A lot can be said on both sides.1.It is the duty of the G overnment to provide all civic facilities.2.At the same time villagers also can improve by co-operation.3.Ihave travelled throughall districts of A.P.BUT there is no gross difference between them .4.A.P.is comparatively better developed than many other states.

    రిప్లయితొలగించండి
  14. By geographical and demographical reasons only AP looks better developed compared to other states. Jharkhand, Orissa, Chattisgarh and Madhya Pradesh have high percentage of tribal population compared to other states. So, they are backward. Uttar Pradesh and Bihar are very densely populated and people who follow family planning are less in those states. So, those states are also backward. But the case of Telangana is different. Telangana is plateau region. It is neither completely hilly nor completely plain. MSL in Telangana varied from 300 to 1300. Telangana is not densely populated like UP or Bihar or Punjab or Haryana. But Punjab and Haryana are much better developed than whole AP. Every village in Punjab and Haryana are connected with metaled roads and electricity. Development depends on several facts. It cannot just depend on village self-governance.

    రిప్లయితొలగించండి