సమకాలీన రచయితలు, సాహితీ విమర్శకులు, కవి పుంగవులు, మరెందరో కలం వీరులు! వీరందరినీ ప్రపంచ రెండో తెలుగు మహాసభలు ఒక్క చోటికి చేర్చాయి. తెలుగు సాహితీ సౌరభాలు గుబాళించాయి. మూడురోజులపాటు జరిగే ఈ మహా సభలు శనివారం విజయవాడలో... తుమ్మలపల్లి కళాక్షేత్రం బయట తెలుగు తల్లి విగ్రహావిష్కరణతో వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ విగ్రహాన్ని ప్రఖ్యాత రచయిత సి.నారాయణ రెడ్డి ఆవిష్కరించారు. ఆహూతులకు అచ్చ తెలుగు సంప్రదాయం మేళవించిన సన్నాయి మేళం స్వాగతం పలికింది. రాష్ట్రం నలుమూలల నుంచేకాక దేశ, విదేశాల నుంచి సుమారు 1500 మంది సాహితీ ప్రియులు, రచయితలు ఈ సభలలో పాల్గొంటున్నారు. ఉదయం జరిగిన ప్రారంభ సభకు హాజరైన ప్రముఖులు తెలుగు భాషకు పట్టిన దుస్థితి గురించి, భాషాభివృద్ధికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఎన్నో పోరాటాల అనంతరం సాధించుకున్న ప్రాచీన భాష హోదాను నిలుపుకోవడానికి శ్రమించాల్సి ఉందన్నారు.
మధ్యాహ్నం బెంజి సర్కిల్ దగ్గరలోని ఎస్‌వీఎస్ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన 'సురవరం ప్రతాపరెడ్డి వేదిక'పై తెలుగు ప్రజల చరిత్ర - సంస్కృతి అనే అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు. తెలుగు భాష చరిత్రకు సంబంధించి సమగ్ర గ్రం«థాన్ని వెలువరించాల్సిన అవసరంపై రెండున్నర గంటలపాటు ఆసక్తికరమైన చర్చ జరిగింది.
ఆ తర్వాత మండలి వెంకట కృష్ణారావు వేదికపై 'రాష్ట్రేతరుల తెలుగు భాషా సమస్యలు' అనే అంశంపై చర్చ జరిగింది. ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలుగు ప్రజల భాషా సంస్కృతుల అణచివేతను అడ్డుకోవటానికి ఇక్కడి ప్రభుత్వం, సాహిత్య సంస్థలు సహకరించాలని వక్తలు అభిప్రాయపడ్డారు. అనంతరం కవి సమ్మేళనం నిర్వహించారు. ఎస్‌వీఎస్ కల్యాణ మండపంలో జరిగిన చర్చా గోష్టులు, కవి సమ్మేళనానికి వెయ్యి మందికి పైగా కవులు హాజరు కావడం విశేషం.
14, ఆగస్టు 2011, ఆదివారం
బెజవాడలో తెలుగు వెలుగు - సి.నారాయణరెడ్డిచే తెలుగుతల్లి విగ్రహావిష్కరణ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
పాపం సి. నారాయణ రెడ్డి! ఇక ఆయన భరతం పట్టకమానరు మన వీర వేరుతెలంగాణావాదులు. ఇదివరకు 'తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది' అని పాట ఎందుకు రాసావని నిలదీస్తే నీళ్లునములుతూ ఏదో commercial job గా రాసానంతే అని సంజాయిషీ చెప్పుకుని బయట పడ్డాడు ఆ మహానుభావుడు. మరి ఇప్పుడు ఎలా నెగులుకొస్తాడో! It will be really interesting to watch.
రిప్లయితొలగించండిఇతర రాష్ట్రాలలో ఉన్న తెలుగు ప్రజల భాషా సంస్కృతుల అణచివేతను అడ్డుకోవటానికి ఇక్కడి ప్రభుత్వం, సాహిత్య సంస్థలు సహకరించాలని వక్తలు అభిప్రాయపడ్డారు.
రిప్లయితొలగించండిIt's laughable. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగిరిందట! We and our government could not do anything while the language and culture is vandalized with in the state and capital repeatedly by our own people within the state.The onslaught of English and Hindi is raging with in the state. First let's focus with in the state. Right now we do not have enough morale to cater outside the state. On the contrary we need to borrow some morale from our brothers outside the state.
చైతన్య గారు బాగున్నారా .........!
రిప్లయితొలగించండిప్రో సామ్యుల్ మొన్న ఆంధ్ర యునివర్సిటీ లో
సమైక్యాంధ్ర కోసం ప్రాణత్యాగాలు కుడా అవసరం రావొచ్చు అని స్టేట్ మెంట్ ఇవ్వడం , అమాయక విద్యార్థులను రేచ్చాకోట్టడం కాదా ! అసలు సమైక్యాంధ అనే నినాదం తో ఎలాంటి ఆత్మా బలిదానాలు జరగటం లేదు {అల జరగటం ఏ పేరుతొ జరిగినా ఆపితిరాల్సినవే } కాని ప్రో సామ్యుల్ అవి జరగాలని కోరుకుంటున్నారా ! ఇది లేని ఆలోచనను కలిగించడం కాదా ? ఇలాంటి పని కోదండరాం చేసినా సామ్యుల్ చేసిన ఒక్కటే కాని మీకు ప్రో సామ్యుల్ చేసినవి గుర్తుండవు !
ఇక పొతే
విశాలాంధ్రకు పెరిగిన మద్దతు -CNN-IBN & CNBC-TV18 ‘State of the Nation Poll’ లో వెల్లడి
చాలా సంతోషం పోల్ లో
ఎంత మంది అభిప్రాయాలు అడిగారు ?
వారిలో ఎన్ని సామాజిక వర్గాల వారు ఉన్నారు ?
వారిలో ఎన్ని ఆర్ధిక వర్గాల వారు ఉన్నారు ?
పోల్ లో పాల్గొన్న కొందరి అభిప్రాయాలను ఆయా వర్గాల సంపూర్ణ అభిప్రాయంగా తెలుపడం మీకే చెల్లింది>>. ఇది నిజాన్ని పసిపుసి మారేడుకాయ చేయడం కాదా !
పోల్స్ కి విశ్వసనీయత ఉన్నపుడు ఎన్నికలలో ఎన్ని ఎగ్జిట్ పోల్స్ బొక్క బోర్ల పడలేదు ,
కలిసుండడానికి మనసుకు కలవాలి , మనషులు కలవాలి , కాని విడిపోవడానికి కాదు