10, ఏప్రిల్ 2011, ఆదివారం

"అన్నా హజారే" ఉద్యమాన్ని హాస్యాస్పదం చేసిన అపర కుబేరులు,అవినీతి సామ్రాట్టులు :---

"అన్నా హజారే" ఉద్యమాన్ని హాస్యాస్పదం చేసిన అపర కుబేరులు,అవినీతి సామ్రాట్టులు :---

శ్రీ అన్నా హజారే సామాన్య ప్రజానీకం కోసం, సమాజం లో,ప్రభుత్వయంత్రామ్గంలోను అడ్డగోలుగా వేళ్ళూనుకుపోయిన అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమ పోరాటం మీడియా సహకారంతో సామాన్యుడినిసైతం ఆలోచిమ్పచేసి అందరిని ఉద్యమభాగాస్వాములు చేసింది.ఇది మరో స్వాతంత్ర్య పోరాటం లాగా ఉవ్వేతున రగిలిన ప్రజానిరసన . కాని ఇందులో మనం కొద్దిగా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే.....అనినీతిలో భాగస్వాములు,అవినీతిని ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ప్రోచాహించిన వ్యక్తులు,శక్తులు కూడా ఈ ఉద్యమ ముసుగులో చేరిపోయి నీతులు వల్లించడం చూస్తే... నవ్వాలో.. ఏడవాలో తెలియని పరిస్థితి దాపురించింది. ప్రభుత్వానికి దొంగలెక్కలతో పన్నులు ఎగ్గొట్టే పారిశ్రామికవేతలు,అపర కుబెరులైనటువంటి రాజకీయ నాయకులు,సినీ తారలు,సిని ప్రముఖులు,రియల్ ఎస్టేట్ వ్యాపారులు,న్యాయవాదులు,డాక్టర్లు,రాజకీయ దళారీలు మరియు ఎలేక్షన్లలో నల్లధనాన్నినీళ్ళు లాగ ఖర్చుపెట్టే రాజకీయ పార్టీలు, అధినేతలు ,రాజకీయ నాయకులు అందరు కూడా అవినీతి సామ్రాట్టులే. దొంగే ....దొంగా..దొంగా...అని అరచినట్టు, పైన పేర్కొన్న వివిధ రంగాల్లోని వ్యక్తులు,శక్తులు ఈ ఉద్యమ ముసుగులో చేరిపోయి అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడటం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. ఈ రోజు మనం కొద్దిగా ఆలోచిస్తే ,నేటి ఈ ఉద్యమంలో పాల్గొన్న వారిలో,ఉపన్యాసాలు ఇచ్చినవారిలో ఎంతమందికి అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడే అర్హత ఉందొ తెలుస్తుంది .వీళ్ళు ఎవరైనా గుండెలమీద చేయ్యవేసుకొని ఆత్మసాక్షిగా అవినీతికి,చట్టవ్యతిరేకతకు పాల్పడలేదని ప్రమాణం చెయ్యగలరా.......? చట్టాన్ని వ్యతిరేకించటం,చట్టాన్ని ఉల్లంఘించటం,బంధుప్రీతి,దొంగలెక్కలతో ప్రభుత్వాన్ని మోసం చెయ్యటం,పన్నులు ఎగ్గొట్టటం,ఎన్నికలలో ధనము,మధ్యము ఖర్చుపెట్టటం...ఇవి అన్ని కూడా అవినీతిలో భాగాలే. అలనాటి స్వాతంత్ర్య పోరాటంలో కూడా ఇటువంటి కొన్ని శక్తులు చేరిపోయి ,ఆ తరువాత అధికారాన్ని చేచిక్కున్చుకోవటం మూలానే ఈ రోజు అవినీతి విలయతాండవం చేస్తోంది అనేది నిర్వివాదాంశం.ఇప్పటికైనా నేటి ఈ ఉద్యమంలో ముందుండి నడిపించిన,నడిపిస్తున్న మేధావులు,సంఘ సంస్కర్తలు జాగరూకులై ఉండవలసినదిగా కోరుచున్నాం,లేకపోతే దీని ద్వారా ప్రజలకు,సమాజానికి,దేశానికి మంచికంటే హాని ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది.ఈ చట్టం రూపొందిచే సమయంలో దూరదృష్టితో,జాగూరూకతతో వ్యవహరించకపోతే దొంగలే దొరల్లాగా,ప్రభువుల్లాగా మరలా చెలామణి అయ్యే పరిస్థితి దాపురిస్తింది.కాబట్టి శ్రీ అన్నా హజారే ద్వారా వచ్చిన ఈ ఉద్యమ స్పూర్తి ఫలాలను సామాన్యులకు,సమాజానికి,దేశానికి అందే విధంగా ఆలోచిద్దాం....అడుగు ముందుకువేద్దాం.

జయహో భారత్
జైహింద్
ఇట్లు
భవదీయుడు
వేంకటేశ్వర్. సుంకర

1 కామెంట్‌:

  1. మీరు చెప్పింది చాలా యదార్థం. అమృతం హాలాహలంగా మారే ప్రమాదముంది అట్టి దౌర్భాగ్యుల కలయిక వలన. సత్యమేవ జయతే.

    రిప్లయితొలగించండి