16, ఏప్రిల్ 2011, శనివారం

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గోరేటి వెంకన్నకి తెలిసొచ్చేట్టు

అవును రాష్ట్రం విడిపోతే,
ఒక ముక్క దొర గారి జాగీరౌతుంది!
సాటి తెలుగోళ్ళు కాందిసీకులౌతారు!
ఆంధ్రుడి గుండె ముక్కలౌతుంది!

లక్నో నుంచొచ్చిన వాళ్ళు, రాజస్థాన్ నుంచొచ్చిన వాళ్ళు వుండొచ్చు!
పక్క జిల్లా వాడు పరాయి వాడా? సాటి తెలుగోడు శతృవా?
ఎవడురా "సెటిలర్లు"?
కలవ లేదని ఏడుస్తావు, "610" అని అడ్డు పడతావ్?

ఎప్పుడురా తెలంగాణా చరిత్రలో విడిగావుంది?
ఆంధ్ర శబ్దం నీకు చేదెందుకైంది?
శాతవహనుల రాజధాని ఏదిరా? వారి మరో పేరు తెలుసా?
నిజంపై పోరాడిన సంస్థ పేరులో ఆంధ్ర శబ్ద మెందుకుంది?

రామదాసుకు తెలుగు జాతి ఏవత్తు మనస్పుర్తిగా మ్రొక్కుతూనే వున్నాం!
సి.నా.రే కూర్చున్న పల్లకీ ఆనందంగా మోస్తూనే ఉన్నాం!!
రుద్రమదేవి ని తలుచుకు ఉప్పొంగిపోతూనే ఉన్నాం!!!
కాళోజికి విద్వేషం కక్కినందుకు నమస్కరించాలా?

చరిత్ర తెలియని వాడివి నీకు చుట్తరికం గురించేమి తెలుస్తుంది!
పదవుల కోసం పాకులాడే జయశంకర్ నీకు గురువా?
నిన్నే అమ్మేసిన చెన్నారెడ్డి నీకు బంధువా?
నిన్ను హింసించిన నిజాంని నెత్తినెక్కుంచుకునే దొర నీకు నాయకుడా?

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా...జాతి విద్రోహులు వణికిపోయేట్టు
చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా...వేర్పాటు వాదుల గుండెలదిరేట్టు
జై సమైక్యాంధ్ర, జై తెలుగు తల్లి
జై విశాలంధ్ర, జై తెలుగు తల్లి

-పోలాప్రగడ ఫణి
Posted by Phani Polapragada - ఫణి పోలాప్రగడ at 8:28 PM

6 కామెంట్‌లు:

  1. ఇప్పుడు కడప రాజావారి, చంద్రగిరి మహారాజులవారి జాగీరులో ఉండగాలేనిది, ముక్కుదొరగారి జాగీరవుతుందని మీరు అపోహలు సృష్టిస్తే ఎవరు నమ్ముతారు? ముక్కుదొరగారి ముక్కు పగిలేలా మేం చూసుకోగలం, మొన్ననే సాంపిల్ కూడా ఇచ్చాం. మీరాజుకు గులాంగిరీ మీరు ఆపరు కనుకే ఈ విడిపోయే ప్రయత్నం. 610 అని అడ్డుపడతావ్ అంటున్నరు ఏం అడగొద్దా?

    రిప్లయితొలగించండి
  2. వాస్తవాలను గాలికి ఒదిలేసి అపోహలను నమ్మమంటే ఎవ్వరూ నమ్మరు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం కొందరి జాగీరయింది, మేంఉ మాప్రాంతాన్ని విడిపించుకునే ప్రయత్న చేస్తున్నాం, మీప్రాంతాన్ని విరి విడిపించుకోండి.

    మీరు విశాలాంధ్ర మహాసభ పెట్టి రాసేది మొత్తం అంధ్రప్రదేశ్ వాసులకోసమా లేక సీమాంధ్రులకోసమా? సీమాంధ్రులకోసమే అయితే విశాలాంధ్ర అనే పేరు తీసి సీమాంధ్ర మహాసభ అని పెట్టుకోండి. అందరికోసమే అయితే తెలంగాణా ప్రజల నమ్మకాన్ని గెలుచుకోండి, ఇలాంటి కవితలు రాస్తే తెలంగాణా ప్రజలు ఇంకాస్త మీకుదూరం అవుతారు కానీ దగ్గర కారు. 610జీవోనే వెక్కిరిస్తూ చరిత్ర తెలియనివాడివని తిడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా? ఎవరికోసం మీరాతలు?

    రిప్లయితొలగించండి
  3. అయ్యా విశ్వరూప్ గారు, మీ నాయకుని మికనుగుణంగా మార్చుకోలేక ఎదుటివారిని మారమనడం ఎంతవరకు సబబు. ఈ ప్రపంచంలో కొన్ని ఏడుపుగొట్టు ముఖాలు ఉంటాయి. అందులో ఆద్యుడు శ్రీ కే సి ఆర్. మొదట చంద్ర బాబు నాయుడు పాలనలో పదవి రాలేదని ఏడ్చి కొత్త పార్టీ పెట్టి తర్వాత తెలంగాణా కావాలని చిన్న అల్లరి పిల్లవాడిలా మారాం చేసి, తనలాగే మరికొందరిని తాయారు చేసిన ఘనత శ్రీ కే సి ఆర్ గారికే దక్కుతుంది. మీరు అంటున్న వాస్తవాలు అంటే మేము వెనుక పడ్డాం, మేము అన్యాయం ఐ పోయాం, మమ్మల్ని ఎవరో దోచుకున్నారు, నేను తప్ప అందరూ దొంగలే అని గోబెల్స్ ప్రచారాన్ని చేస్తున్న నాయకులకు బుద్ధి చెప్పాల్సింది పోయ్ ఎదుటి వారిని తప్పు పట్టవద్దు. ముందు తెలంగాణా నాయకుల మేడలు వంచి, వారిని మృగాల నుండి మనుషులుగా మార్చే ప్రయత్నం చేయండి. ఈ తెలంగాణా నాయకులు నోరు విప్పితే బూతులు లేదా ఎదరినో ఒకరిని కొట్టడం (అది మీ తెలంగాణా ప్రజలనే కావచు) వారికి నిత్య కృత్యం అయిపోయింది. మొన్నటికి మొన్న శ్రీ సంకర రావు గారి వీరంగం ఇంతకు ముందు శ్రీ మండా జగన్నాధం గారి వీర కృత్యం చూస్తేనే తెలుస్తుంది. ఆ నాయకులును మార్చకుండా తెలంగాణా సాధించి ఏమి ఉపయోగం లేదు. ఇప్పటికే రాష్ట్రమలో నక్సల్స్ యొక్క ప్రాబల్యం అటు ఉత్తరాంధ్రా లోను ఇటు తెలంగాణా లోను ఎక్కువగా ఉంది. రాష్ట్రం రెండు ముక్కలైతే నక్సలిజం పెరుగుతుంది. అప్పుడు దానిని కంట్రోల్ చేయడానికి వాటి శక్తి అసలు చాలదు. మీకు తెలంగాణాలో నక్సల్కి ఎర్ర తివాచి పరుస్తారేమో తెలియదు కాని ఆంధ్రాలో వారిని భరించే శక్తి లేదు ఎదిరించడానికి శక్తి చాలదు.

    రిప్లయితొలగించండి
  4. విశాలాంధ్ర మహాసభ అని పేరు పెట్టుకుని ఏదో కలిసుండడానికి నాలుగు మంచిమాటలేమయినా చెబుతారేమోనంటే ఏమిటి, మీనాయకులు అంటూ దెప్పుడు కార్యక్రమాలు పెడుతున్నారు? మీనాయకులు గొప్ప వినాయకులు, వారి అక్రుత్యాలు కబోదాలు మీకు కనపడవేమో అందుకే ఫాక్షన్ నేతలు, కబ్జారాజులు, లక్షల కోట్లకు ఎసరు పెట్టేవారు, నెత్తురు తాగేవారు అందరూ మీకు దేవుల్లే. ఏదో తిడతారు అంటున్నారు, తిట్టింది దోపిడీ దారులను, మీరూ దోపిడీలో భాగమేమో ఉలికిపడుతున్నారు. కనీసం మావోల్లకు నెత్తురుతాగే జబ్బులేదు.

    అయినా మానాయకులను, నక్సలైట్లను భరించమని మీకెవరూ చెప్పట్లేదే, విడిపోతే మాభాదలు మేం పడతాం, మావోల్లను ఎలా దారికి తెచ్చుకోవాలో మేం జూసుకుంటాం. మీ వినాయకులు తీరిగ్గా మరో యాభై సంవత్సరాలు మిమ్మల్ని వోదార్చే కార్యక్రమం చెయ్యొచ్చు.

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి