తాజా వార్త : "పని చేయకపోతే జీతం చెల్లించేది లేదంటూ ప్రభుత్వం బుధవారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకనుంచి ప్రభుత్వ కార్యాలయాలలో పని ఎగగొట్టి ఉద్యమాలు చేస్తామంటే కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలా జరిగితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం పేర్కొన్నది. కొంతమంది ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి సంతకాలుచేసి బయటకు వెళ్లిపోతున్నారని, అటువంటివారికి పని చేయకపోతే జీతాలు చెల్లించడం కుదరదని ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఎవరైనా ప్రభుత్వానికి సహాయ నిరాకరణ అంటే ఊరుకునేది లేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది"
దీనికి మామాఅల్లుళ్ళ (కేసీఆర్, హరీష్ రావు ల) అభ్యంతరం ఏమిటి చెప్మా? ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జారి చేసిన జీవో రాష్ట్రమంతటికి వర్తిస్తుంది. ఏ ఒక్క ప్రాంతానికో కాదు. వారుగాని ప్రభుత్వోద్యోగులు ప్రజలకోసం పని చేయకూడదని భావిస్తున్నారా?ప్రభుత్వోద్యోగులు నిర్లజ్జగా పని చేయకుండా (అదే ప్రజలకు సహాయం చేయకుండా) కూడా అప్పనంగా ప్రజలు చెమటోడ్చి సంపాదించి కట్టిన పన్నుల నుండి జీతాలు తీసుకోమని సంకేతమిస్తున్నారా? ప్రభుత్వోద్యోగులు అంత అధములుగా కనిపిస్తున్నారా? ఎంత అవమానం?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి