19, ఏప్రిల్ 2011, మంగళవారం

గోదావరి నదీ జలాలపై వేర్పాటువాదుల మోసపూరితమైన వాదన

స్వప్రకటిత తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర పోరాటయోధులెవరిని కదిపినా, వారి నోటి ముందు మైకు పెట్టినా ఏదో 'జాతీయ జలసంఘం' నుండి డెప్యుటేషన్ పై వచ్చి రోడ్డున పడిన వారిలా "మా నీళ్ళు...అరె అరె మా నీళ్ళు మాకిమ్మని " అని బ్యాక్ గ్రౌండ్ పాటొకటి వేసుకొని జనాలను అదరగొడతారు.వారి వాదనను విని బాగా చదువుకొన్న వారే మోసపోగాలేనిది సామాన్య ప్రజలు ఏపాటివారు?  అటువంటివారు ఎప్పుడు చూసిన మా నీళ్ళు దొంగిలించారు, మాకన్యాయం చేశారు, 70 % పైగా క్యాచ్ మెంట్ ( పరివాహక ప్రాంతం) ఉన్నాకూడా కేటాయింపులలో మా ప్రాంతానికి అన్యాయం  చేశారు అని ప్రజలను ఎమార్చుతారే తప్ప నిజాలను మాట్లాడరు. మరి లేకపోతే భావోద్రేకాలను సులువుగా ఎలా రెచ్చకొట్టడం?

అసలు కేటాయింపులు రాష్ట్రాలవారీగా, రాష్ట్రాలలో ప్రాజెక్ట్ల వారీగా జరుగుతాయి కానీ ప్రాంతాలవారీగా కాదు. సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారెవరికైనా తెలుసు క్యాచ్మెంట్ ఏరియా ఆధారంగా నదీజలాల  కేటాయింపులు ఎక్కడా జరపరని.లేకపోతే గోదావరి, కృష్ణ  ట్రిబ్యునల్ల కేటాయింపులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  మహారాష్ట్ర, కర్ణాటక కన్నా ఎక్కువ వాటా వచ్చేదే  కాదు.

క్యాచ్ మెంట్  ఏరియా గురించి మాట్లాడే వారు నదీప్రవాహ లెక్కల్ని సునాయాసంగా మర్చిపోతారు. అసలు నదిలోని నీళ్ళు కదా మనకు ముఖ్యం? నదీప్రవాహం వార్షిక వర్షపాతం, భూనేలల స్వభావం, ఆ ప్రాంతపు సహజ అడవులు తదీతర అంశాలపై ఆధారపడి వుంటుంది.గోదావరికున్న విశిష్టమేమిటంటే ఆ నదిలో నీటి ప్రవాహం ఎగువ ప్రాంతాలలో చాలా తక్కువుగా ఉంటుంది, దిగువున మాత్రం ఎన్నో రెట్లు పెరుగుతుంది. "గోదావరి నీటి మొత్తంలో దాని ఉపనదులు మంజీరా, ప్రాణహిత, ఇంద్రావతి మరియు శబరిలు వరుసగా  6%,40%,20%,10% నీటిని సమకుర్చుతాయి"(sakti.in). ప్రాణహిత, ఇందావతి, శబరి నదుల క్యాచ్ మెంట్ ఏరియా ఆంధ్ర ప్రదేశ్ లో ఎంత మాత్రం ఉంది? మంజీరా నది క్యాచ్ మెంట్ మాత్రమే కొద్దో గొప్పో ఆంధ్ర ప్రదేశ్ లో ఉండగా మిగతాది కర్ణాటక, మహారాష్ర లలో ఉంది. మరి మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ , ఒరిస్సా  రాష్ట్రాలు మన ప్రత్యేకవాదులు కనిపెట్టిన వాదనను కాపీ కొట్టేసి, మన రాష్ట్రం చేస్తున్న నీటి దోపిడీని ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెబుదాం?ఆలోచిందండి.

 ప్రపంచవ్యాప్తంగా డెల్టా ప్రాంతాలు సహజ సిద్దంగా దిగువకి పారే నీళ్ళను, వాటితో కొట్టుకువచ్చే ఒండ్రు మట్టిని  వనరులుగా కలిగి ఉన్నాయి. గోదావరి డెల్టానో లేక కృష్ణ డెల్టానో  అందుకు మినహాయింపు కాదు. మనదేశం విషయానే తీసుకుంటే కావేరి, మహానది నీళ్ళను ఎగువ ప్రాంతాల నుండి దిగువ ప్రాంతాల వారు దొంగిలించడం లేదు? ఎక్కడైనా మానవమాత్రులు ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళలేరు. వినేవారు వుంటే 'సన్నాసి' ఊతపదంగా కలవారు  ఎన్ని సన్నాసి  కబుర్లయినా చెప్పి వినేవారిని నిజమైన సన్నాసులను చేస్తారు.

గోదావరి నది లోయలో ప్రవహిస్తుంది. అంతేగాక ఆ లోయ కొన్ని లక్షల సంవత్సరాలుగా ఇరువైపులా విస్తరిస్తూ నేటి స్థితి కి చేరుకుంది. పోలవరం వద్ద గోదావరి ఇరుకైన పాపి కొండల మధ్య ప్రవహిస్తుంది. గోదావరి పై గ్రావిటీ డ్యాం కట్టడానికి  అది అత్యంత అనుకూలమైన ప్రదేశం. పోలవరం ప్రాజెక్టు మొదట 1946 లో ప్రతిపాదించబడింది. ప్రత్యేకవాదులెవరైనా అటువంటి అనువైన స్థలాన్ని శ్రీరాంసాగర్, పోలవరం మధ్య చూపించగలరా?సాగునీరు ఉచితంగా వచ్చేది కాదు. సముద్రమట్టానికి దగ్గరిగా, కాలువలు తవ్వడానికి అనువుగా వుండే డెల్టా ప్రాంతాలలో సాగునీటి సరఫరాకి అయ్యే ఖర్చు తక్కువ. డెల్టా ప్రాంతాలు సారవంత మైన భూమిని కూడా అదనంగా కలిగివుంటాయి. నదీలోయ నుండి నీటిని  తోడి ఎత్తైన ప్రాంతాలకు సాగు నీటి సరఫరా చేయాలంటే అది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. చాలాసార్లు  అటువంటి లిఫ్ట్ ప్రాజెక్ట్లలో ఖర్చులు లాభాలను ఎన్నో రెట్లు మించిపోతాయి. కొత్తగా ప్రతిపాదించిన ప్రాణహిత-చేవెళ్ల లిఫ్ట్ ప్రాజెక్ట్ కొరకు పోలవరం డ్యాం మొత్తానికి అయ్యే ఖర్చు కన్నా దాదాపు 2.5 రెట్లు ఎక్కువ అవుతంది అని ఒక అంచనా. అంతేకాక నీటిని తోడదానికి 3,500 మెగావాట్ల విద్యుత్తూ అవసరమవుతుంది. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం దానికి  కార్య రూపం ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. ఎందుకంటే గోదావరి లో మనం ఉపయోగించుకుంటున్న దానికంటే అధిక జలాలు నిరూపయోగంగా పారుతున్నాయి.

గోదావరి జలాలను  పూర్తి స్థాయిలో ఉపయోగించదానికి  అడ్డోస్తున్న సాంకేతిక,భౌగోళిక మరియు ఆర్థిక సవాళ్ళను  వేర్పాటువాదులు ప్రజలను ఏమార్చే సాధనాలుగా వాడుకోరాదు. ఇటీవలే తెలంగాణా వెనుకబాటు విషయాన్ని కనుగొన్న నాయకులు, తమకు సంబంధం లేని లేక తెలియని దానిగురించి అడ్డంగా వాదించే కుహన ప్రొఫెసర్ లు , మేతావులు , పనిలేక గుర్తింపు కోసం లేక రెండు నిమిషాల కీర్తి కోసం తహతహ లాడే  పలురకాల జేఏసి సభ్యులకు ఇదంతా చెప్పినా వృధానే. కాని సామాన్య ప్రజానీకానికి  నిజాలు తెలియపరచాల్సిన  అవసరం ఎంతైనా వుంది. 

డెల్టా ప్రాంతాలలో సాగునీటి సదుపాయాలు రాష్ట్రం ఏర్పడే నాటికే వున్నాయి. ఉభయగోదావరి, కృష్ణ జిల్లాలలోని ఎగువ ప్రాంతాలు కూడా కాలువల ద్వారా సాగునీటి సదుపాయం కలిగి లేవు. ఒక అంచనా ప్రకారం ఏటా ౩౦౦౦ TMC ల   గోదావరి నీరు వృధాగా సముద్రంలో కలుస్తుంది. మరి ఎవరి నీళ్ళను ఎవరు దొంగిలిస్తున్నారు? మరి శ్రీరాంసాగర్ తెలంగాణా ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర సరిహద్దు దగ్గర వుంది కాబట్టి అందులో నిల్వ చేసిన నీళ్ళు మహారాష్ట్ర నుండి దొంగిలించినవి అని అనడం సమంజసమా?

Suggested Reading:

“When it comes to irrigation, there are many concerns and apprehensions in all regions of Andhra Pradesh. In terms of old projects in the coastal belt, ayacut was developed and  river waters in Godavari and Krishna were harnessed during British time. The topography, low altitude, flat terrain, annual flooding of major rivers and drains, the ease of harnessing river water in deltas a relatively low cost per acre and the higher water duty
(area irrigated by one cusec of water) on account of long-standing, settled irrigated cultivation in alluvial soils have all given significant advantage to the four coastal districts which form the delta areas of the mighty Godavari and Krishna rivers. The globally accepted ‘prior-use’ principle in allocation of water also gave the coastal delta regions an advantage. Of the two major rivers in Andhra Pradesh, Godavari flows mostly in a valley. The altitude of much of Telangana is between 300 to 2100 feet above the mean sea level (MSL), and Godavari at Pochampad is at 299.3 m (bed level) elevation; where the Pranahita tributary meets Godavari the elevation is only 95 m above MSL. While in most years up to 3000 TMC of flood water flows into sea in Godavari river, it cannot be easily exploited except in the delta region. Krishna River which can be harnessed better on account of topography is fully exploited by the riparian states. Out of  the 890 TMC of water allocated to Andhra Pradesh, Telangana gets 266.83 TMC share. In terms of the run off into Krishna River from the catchment area, the flows from Telangana into the river are estimated 263 TMC. Bachawat tribunal allocated up to 280 TMC of the waters in Krishna River to the projects irrigating in Telangana area. The delta
region is allotted 300 TMC from Prakasam Barrage and the Right Canal of Nagarjunasagar Project.This allocation is based on topography and prior use. Thus, while the delta is benefiting disproportionate to its area of Catchment, Telangana has been allocated its due share by the Tribunal and projects are being developed to harness that water. One of the keys to harnessing the river waters in the parched Rayalaseema and Telangana region lies in inter-basin river transfers.

Godavari flood river water should be transferred to Krishna basin to the extent feasible . Unfortunately, most inflows into Godavari are from Kaleswaram in Karimnagar district where Pranahita joins Godavari, and in the downstream areas. But the confluence of Pranahita and Godavari, the river flows at 95 meters above MSL (bed level) whereas most of the Telangana is significantly above this elevation. This makes inter-basin transfer in upper reaches of Godavari exceedingly difficult and costly, and therefore not feasible or viable. Such feasibility exists in the delta area, where Godavari water, in addition to fulfilling the ayacut needs in Godavari delta, can be transferred by gravity to Krishna basin. If that is accomplished successfully,all water upstream of Nagarjunasagar project can be impounded at Srisailam and Nagarjunasagar and utilized for Rayalaseema
and Telangana fully. Such innovative ideas are needed to ensure a more equitable, costeffective distribution of river water. However, there is no real evidence of any deliberate discrimination in distribution of river waters or denial of due share to any region in A.P., except on grounds of topography and prior use.”

Source: http://www.loksatta.org/cms/documents/skc.pdf ( Report presented to Justice Sri
Krishna Committee by Lok satta party )

9 కామెంట్‌లు:

  1. గవన్నీ మాకు తెల్వద్, గిచ్చుడో సచ్చుడో .. గియ్యున్రి.
    మా గుండె సప్పుడు వినబడట్లేదా?
    విగ్రహాలు కూల్చినం, ఐనా ఇస్తలేరా?
    విమలక్క, గద్దరోడు మస్తుగ పాడిన్రు, ఐనా ఇస్తలేరా?
    మా యాస వేరు, మాగోస వేరు, ఇస్తలేరా?
    :P :))

    రిప్లయితొలగించండి
  2. తెలంగాణా ప్రజలను వేర్పాటు వాదులు అనడం లోనే మీ శాడిజం కనిపిస్తోంది.
    >>>> అసలు కేటాయింపులు రాష్ట్రాలవారీగా, రాష్ట్రాలలో ప్రాజెక్ట్ల వారీగా జరుగుతాయి కానీ ప్రాంతాలవారీగా కాదు. <<<<
    అందుకే కదా తెలంగాణా ఆంధ్ర కబంధ హస్తాల్లో ఒక ప్రాంతం గా కాకుండా స్వతంత్ర రాష్ట్రం గా వుండాలని కోరుకుంటోంది.
    శ్రీ రాం సాగార ప్రాజెక్ట్ దాని నత్త నడక ఒక్కటి చాలదా వివక్ష ఎంత దారుణంగా వుందో గ్రహించడానికి.
    వెక్కిరింతలు, వెటకారాలు, వక్రీకరణలు, అహంభావం ... ఇదేనా సమైక్య వాదం.

    రిప్లయితొలగించండి
  3. ఇదొకటి బాగా అలవాటు అయ్యింది. తప్పుడు వాదన ఎత్తి చూపితే దానిని సరిగా స్వీకరించడం కూడా చేత కాదు. వేర్పాటు కోరే వాళ్ళను వేర్పాటువాడులనే అంటారు. పాపం తెలంగాణా ప్రజలను ఎందుకు లాగుతారు మధ్యలోకి? అందుకే గా అన్నాను "గోదావరి జలాలను పూర్తి స్థాయిలో ఉపయోగించదానికి అడ్డోస్తున్న సాంకేతిక,భౌగోళిక మరియు ఆర్థిక సవాళ్ళను వేర్పాటువాదులు ప్రజలను ఏమార్చే సాధనాలుగా వాడుకోరాదు. ఇటీవలే తెలంగాణా వెనుకబాటు విషయాన్ని కనుగొన్న నాయకులు, తమకు సంబంధం లేని లేక తెలియని దానిగురించి అడ్డంగా వాదించే కుహన ప్రొఫెసర్ లు , మేతావులు , పనిలేక గుర్తింపు కోసం లేక రెండు నిమిషాల కీర్తి కోసం తహతహ లాడే పలురకాల జేఏసి సభ్యులకు ఇదంతా చెప్పినా వృధానే. కాని సామాన్య ప్రజానీకానికి నిజాలు తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా వుంది. " అని. ఎన్నాళ్ళు మోసం చేస్తారు ప్రజలను? ఎవరికీ తోడ్పడాలని?ఉద్యమం పేరుతో అరాచకాలను సృష్టిస్తూ కలెక్షన్లు చేసుకొనే వాళ్ళకు తోడ్పాటు అందించాలనా?

    దేశంలో, రాష్ట్రం లో అధిక శాతం ప్రాజెక్ట్ లు నత్తనడకనే నడుస్తున్నాయి. అది తెలంగాణాకే పరిమితం అని బుకాయించి కూడా ప్రజలను మోసం చేయవచ్చు. ఎటువంటి నేల పైన అయినా కాలువలు సునాయాసంగా తవ్వవచ్చుఅని నమ్మబలకొచ్చు.శ్రీ రామ్ సాగర్ స్టేజులు సరే ఇప్పటికే దాని కింద సాగు అవుతున్న భూమి మాటేమిటి? రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతే కదా అది సాగు లోకి వచ్చింది? పోలవరం విషయం 60 ఏళ్ల పైగా నాన్చుతూనే వున్నారు. శ్రీ రామసాగర్ విషయం లో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకొని మహారాష్ట్రలో ముంపుకు గురయ్యిన భూములపై ఒప్పందం చేసుకొన్నది. దానినే వివక్ష అంటారా?

    ముందు తెలంగాణా ప్రజలను ఇక్కడి రాజకీయ, ఒకనాటి భూస్వాముల కుటుంబాల కబంధహస్తాల నుండి విముక్తి చేయడం గురించి ఆలోచించండి. ఏ ప్రాంతంలోని లేని అసమానతలు ఇక్కడ ఉన్నాయి. ఇన్నాళ్లైనా భూమి కొన్ని కుటుంబాల చేతుల్లోనే కేంద్రీకతమైఉంది

    రిప్లయితొలగించండి
  4. ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర కూడా ఉద్యమం వేర్పాటువాదమేనా? పొట్టి శ్రీరాములు వేర్పాటువాదా? అసలు పోలవరంకు ఇప్పటికైనా అనుమతులున్నాయా, ఎప్పటికైనా వస్తాయా? అనుమతులు లేని ప్రాజెక్టులపై ఇప్పటికే కోట్లు గుమ్మరించి అన్ని అనుమతులున్న ప్రాజెక్టులను అటకెక్కించడం మంచిదంటారా?

    రిప్లయితొలగించండి
  5. 1972లో జరిగిన జైఆంధ్ర ఉద్యమం ఖచ్చితంగా వేర్పాటువాద ఉద్యమమే. పొట్టి శ్రీరాములు తెలుగువారికి వేర్పాటువాది ఎలా అవుతాడు? మీరు మద్రాస్ ప్రేసిడెన్సికి చెందినవారా?పరాయి దేశస్తులు తాము యుద్ధాలు చేసి గెలిచిన ప్రాంతాలను,నిజాము నుండి పొందిన ప్రాంతాలను ఒకగాటిన కట్టివేసి వాళ్ళ సౌలభ్యం కోసం ఏర్పరుచుకున్న ప్రాంతాన్ని స్వాతంత్రానంతరం భారత ప్రభుత్వం భాష ప్రాతిపదికన విడదీసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరిచింది.ఎన్నో శతాబ్దాలు ఒకే గొడుగు కింద ఒకే భాషను,సంస్కృతిని పంచుకున్న తెలుగు ప్రజలు తిరిగి ఆంధ్రప్రదేశ్ అవతరణతో ఒకటైన తర్వాత వారిని,వారి రాష్ట్రాన్ని విభజించి వేరుపడాలనుకొన్న వారు వేర్పాటువాదులు కాక ఏమవుతారు? పోనీ ప్రత్యేకవాదులు అని అనమంటారా?అబద్ధాలతో, మోసపు వాదనలతో ప్రజల మధ్య విద్వేషాలను రగులుస్తున్న వారిని వేర్పాటువాదులు అన్నదానికే అంత బాధ పడిపోతున్నారు.వారు ప్రతి దినం మాట్లాడే బూతులు,వేసే అభాండాలు,చేసే అరాచకాలు మీకు కనిపించవా లేక వినిపించవా?

    పోలవరం అనుమతులు గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడు గట్టిగా కృషి చేసింది?? అన్నిటిని వక్ర దృష్టితో చూడక సక్రమంగా చదవండి.ఇక్కడి విషయం పోలవరం Vs శ్రీ రామ్ సాగర్ Vs ప్రాణహిత- చేవెళ్ల కాదు. ఉద్యమాల పేరుతో పబ్బం గడుపుకుని ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్న వారి తప్పుడు వాదనలకు ఉన్న పరిధులకు లోబడి సమాధానం ఇచ్చి నిజాలను చెప్పలన్నదే ఇక్కడి విషయం.రాష్ట్రం విడిపోతే ప్రాణహిత- చేవెళ్ల లాంటి భారీఖర్చు,సాంకేతిక సవాళ్లతో కూడుకున్న ప్రాజెక్ట్ స్వప్నంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.సాగునీటి విషయంలో తెలంగాణా వివక్షకు గురైనదన్నది అవాస్తవం. ప్రాంతాలకు సహజ సిద్ధంగా కూడిన అనుకూలతలు, ప్రతికూలతలు అంటూ వుంటాయి. వాటిని రాజకీయం చేయడం,ప్రజలను తప్పుదోవ పట్టించడం,ఇతరులను దొంగలు అని అనడం నీచం. భారీ,మధ్య తరహా,చిన్ననీటిపారుదుల ప్రాజెక్ట్ లు( కాలువ, చెరువు,ట్యూబ్ వెల్) అన్నిటినీ లెక్క లోకి తీసుకుంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత 'ఇరిగేషన్ పోటెన్షియల్' తెలంగాణాలో 713% పెరగగా, రాయలసీమలో 390 % , కోస్తాలో 101 % మాత్రమే పెరిగింది. ఉచిత/సబ్సిడీ విద్యుత్తు ఏ ప్రాంతానికి ఎక్కువ మేలు చేస్తున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోస్తాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేనాటికే 11 లక్షల హెక్టర్లకు కాలువల ద్వారా సాగు నీటి సరఫరా ఉండేదన్న మాట ప్రత్యేకరాష్ట్రవాదుల నోటి నుండి బయటకు రాదెందుకు?

    రిప్లయితొలగించండి
  6. ఓహో! ట్యూబ్ వెల్స్‌ను కూడా కలుపుతున్నారన్నమాట, బాగుంది. ఒక ట్యూబ్ వెల్లో నీల్లు పడక మరొకటి వేస్తే అప్పుడు రెండు లెక్కిస్తారా లేక ఒక్కటేనా? మా పోరగాళ్ళు మూత్రం పోసేది ఇరిగేషన్ లెక్కల్లో కలిపితే ఇంకొచెం ఎక్కువ గ్రోత్ చూపించొచ్చు ట్రై చెయ్యండి. ఈ వేర్పాటువాదానికి నిర్వచనం మీరు చెప్పిందా లేక మీకింకవరయినా జెప్పారా?

    రిప్లయితొలగించండి
  7. ఓహొ తమకి సాగునీటి విషయాలు గురించి చాలా బాగానే తెలుసు. ట్యూబ్ వెల్స్‌ తో సాగునీరా అని ఆశ్చర్యపోయే వారు ఉండబట్టే కదా ప్రత్యేకవాదుల తలా తోక లేని వాదనలు చలామణి అవుతున్నాయి. తెలంగాణా లో 14 లక్షల హెక్టర్ లు భూగర్భ జలాపైనే ఆధారపడి ఉన్నాయి. ఇంత తెలిసున్న మీరు కూడా లిఫ్ట్ ప్రాజెక్ట్ ల గురించి మాట్లాడుతారు. అన్ని భారీ ప్రాజెక్ట్ లు వినియోగానికి వచ్చినా భౌగోళిక పరిస్థితుల వల్ల తెలంగాణా, రాయలసీమ, కోస్తాలోని డెల్టాల బయట మెట్ట ప్రాంతాలు భూగర్భ జలాల పైనే ఎక్కువగా ఆధారపడాలి

    రిప్లయితొలగించండి