15, ఏప్రిల్ 2011, శుక్రవారం

ఒక స్నేహితుడి మనోవేదన : ఇప్పుడు సమాధులు మాట్లాడుతున్నై...!,

ఇప్పుడు సమాధులు మాట్లాడుతున్నై...!,

రాత్రికిరాత్రి తెలంగాణ నిద్రలేచి
కాళ్ళ కింద గతాన్ని తోవ్వు కుంటాండి,
సాయుధ పోరాట గమనాన్నీ గుర్తుకు తెచ్చు కున్తన్ది !
ఒక "బద్మాశ్ గాడి మాట" మృతవీరుల
ఆత్మని తూట్లు తూట్లు జేస్తన్నది..!

ఇప్పుడు నేను చరిత్ర తెలియనోని నాల్కను గొసకపొయి
కామ్రెడ్ "రావి నారాయణ రెడ్డి" సమాధి ముందు బెట్టాల..

బానిసల్ని జేసినోని బూజానెక్కి "ఓటు" కోసం
నీతిమాలిన మాటలో డి కంట్లో వరంగల్లు కారం జల్లాల..!

ఈ గద్ద ముక్కొడికి
గెరిల్లా యోధుల గుండె మంటలేం దెల్సు?

అరె.. గుండెలు మండిపోతున్నైరా.. ఎలా తట్టుకునేదీ మాటలు

ముఖ్దూంసాబ్, బద్దం ఎల్లా రెడ్డి, చాకలి అయిలమ్మ, తమ్మారపు గోవిందు
మళ్లీ చంప బడ్డార్రా.... బిడ్డ
వాడిని క్షమించొద్దు..!

నీ "బాన్చనన్నా" బతుకులు కూల్చబడ్డది,
నీ "కాల్మోక్థ" అన్నా చెరచబడ్డ ఆడది
వాడికేం తెల్సు????

పోరాటం కోసం బతుకుని బుల్లెట్లకు దారాబోసినోళ్ళు,
ఆజాదీ కోసం గుండెల్లో గుళ్ల వర్షం కురిపిచ్చుకున్నొళ్ళు,
మాతాత పక్కతెముకలు కుప్ప చేసిన బూట్లదెబ్బలు,
గిరిప్రసాద్ రొమ్ము చీల్చిన బుల్లెట్ సంగతి,
చిట్యాలలో నర మేధం..
వాడికేం తెల్సు???

వోరేయ్ శవ సంభోగి......
నీ మాటలు విన్నాక కాటికి కాల్జాపిన మా జేజి "కాంద్రించి ఉమ్మింది",
పక్షవాతంలోనూ మాతాత "పళ్ళు గొరికిందు" ,
"నిజాం (నిరంకుశత్వాన్ని) ని వెయ్యిసార్లు పోగుడ్థా" అన్న నీ ఫోటో ఉన్న పేపర్ మీద
మా పిలగాడు "ఉచ్చ బోస్తన్నాడు"

ఉద్యమ నేత ముసుగ్గప్పుకున్న తాగుబోతొన్ని, బుధ్ధిహీనున్ని,
మా గుండెల మీద తీవ్రంగా ఎగిరే "ఎర్ర జెండాని" ఒక నిమిషం చూసే ధైర్యం లెనొన్ని

ఇంతకన్నా ఎం శిక్షించగలం ??????

"క్రాంతి" ("నీ")


( మహొజ్వలిత తెలంగాణ సాయుధ పోరాట చరిత్రని ఇంటి చరిత్రగా భావించే మా కుటుంబం, ఉద్యం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మా కుటుంబం లో పుట్టి.. ఒక నర హంతకుడైన "నిజామ్ని" తెలంగాణ నిర్మాత, గొప్పోదు, వెయ్యిసార్లు కీర్తిస్తా అన్న కేసీయార్ మాటలు.. విని రక్తం మరిగి పోయినప్పుడు..)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి