27, ఏప్రిల్ 2011, బుధవారం

చారిత్రక పటములు చెప్పే నిజాలు

ఆధునిక భారతదేశ చరిత్రలో తెలంగాణా, సీమాంధ్రలు కలిసి ఎన్నడూ లేవు అని తరచుగా ప్రత్యేక తెలంగాణావాదులు వాదిస్తుంటారు.తెలుగువాళ్ళు విడదీయబడ్డారు కాని విడిపడి ఎన్నడూ లేరు. దానికి ఈ చారిత్రక పటములే నిదర్శనం



ఔరంగజేబ్ 1687 లో గోల్కొండపై దాడి చేసి కుతుబ్ షాహీల  పాలనను అంతమొందించిన సమయానికి వారి రాజ్యస్వరూపం ఇలా ఉండేది

కుతుబ్ షాహీల తర్వాత అసఫ్ జాహీ(నిజాం)ల పరిపాలన మొదలైయ్యే వరకు మొఘలుల రాజ్యం లో హైదరాబాద్ సుబహ యొక్క చిత్రం (నెంబర్ 6 ) ఇలా వుండేది 
ఆ తర్వాత నిజాముల పరిపాలన క్రమములో అనేక ప్రాంతాలు బ్రిటిష్ వారికి అప్పగించబడ్డాయి.  ఆ విధంగా తెలంగాణా, సీడెడ్(రాయలసీమ), సర్కార్(కోస్తాంధ్ర) వేర్వేరు ప్రాంతాలన్న వాడుక మొదలైంది 
1948 లో  హైదరాబాద్ రాష్ట్ర విముక్తి సమయానికి దాని స్వరూపము 

13 కామెంట్‌లు:

  1. భలే భలే!! తెలుగు జాతి అంతా ఏల్లతరబడి కలిసున్నారని చెబితే ఎప్పుడో అనుకున్నాను, ముస్లిం రాజుల పాలనలో, తెలుగు చలామనీ కానీ సమయంలో అన్నమాట. ఇక ఓ తెలుగు భాష, తెలుగుజాతి అంటూ జబ్బలు చరుచుకోవడం ఎందుకు? పోనీ అదికూడా పూర్తిగా కలిసి ఉందా అంటే ఒక మ్యాపులో కోస్తా అంతా లేదు, మిగతా వాటిల్లో ప్రస్తుత రాష్ట్రం ఒక భాగం మాత్రమే. మొత్తం నార్థ్ ఇండియా మొఘల్ వెయ్యేల్లుగా ముఘల్ సమ్రాజ్యంలోనే ఉంది, మరి అక్కడ అంతా ఒకే తాష్ట్రం చేద్దామా? ఏం నిరూపించారు వీటిద్వారా?

    రిప్లయితొలగించండి
  2. మీకు బాగా తెలిసిన వారు ఎవరో ఈ వ్యాఖ్య చేసారు " ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటువరకూ గత వెయ్యెఏల్లలో ఇప్పటి అన్ని జిల్లాలప్రాంతాలూ మొత్తంగా ఒక ప్రాంతంగా ఎప్పుడూ కలిసి లేవు. ఉన్నాయని మీరనుకుంటే ఎప్పుడు శ్రీకాకులం నుంచి చిత్తూరు వరకూ, ఆదిలాబాద్ వరకూ ఎప్పుడు కలిసున్నాయో మ్యాపుతో సహా వివరించగలరు"

    అందుకే వీటిని పోస్ట్ చేసాను. ఏదో కొత్తగా నిరూపిద్దాం అని కాదు.తాష్ట్రం సంగతి నాకు తెలీదండి.మొఘలులకు వారి సుబాలు ఉండేవి.అసలు సమస్యంతా ఆధునిక కాలంనుంచే కదండీ? మరి కాకతీయుల కాలానికి వెళదామా? వలస పాలకులు రాక ముందు నైజాము,సీడెడ్,సర్కారు లేక తెలంగాణా, రాయలసీమ, కోస్తా అని వాడుక ఉండేదా?ఇంకా చరిత్రకందని పురాతన కాలానికి వెళ్తే మనకు 'ఆంధ్ర' అన్న శబ్దమే అన్ని ప్రాంతంవారందరికీ వర్తించేలా వినిపిస్తుంది. అది మహాభారతం లో కానివ్వండి ఉపనిషత్తులలో కానివ్వండి. అది మీకు నచ్చక పోవచ్చు.

    రిప్లయితొలగించండి
  3. చైతన్య గారు!
    మీ వయసెంతో నాకు తెలియదు కాని, మీకు ఆవేశం ఎక్కువ.. అధ్యయనం తక్కువ అని తెలుస్తోంది.
    మహాభారత కాలంలో కూడా మన రాష్ట్రం నాలుగు దేశాలుగా విడిపోయి ఉంది. ఒకసారి చరిత్ర గ్రంథాలు తిరిగేయండి
    ఉత్తరాంధ్ర - కళింగ దేశం
    తెలంగాణ - తెలింగ దేశం
    కోస్తా - అంధక దేశం
    రాయల సీమ - ద్రావిడ దేశం
    పైగా మహాభారత యుద్ధంలో అంధక దేశీయులు కౌరవుల పక్షాన, తెలింగ దేశీయులు పాండవుల పక్షాన పోరాడినట్టు ఆ గ్రంథాలు ఘోషిస్తున్నాయి.
    మీరు నిజంగా నిష్పక్షపాతిగా నిలవాలంటే, ఇంకా ఏవో మొండి వాదనలకు పోకుండా, అప్పటిలా కాకుండా, కనీసం ఇప్పుడైనా ధర్మం పక్షాన పోరాడండి.

    రిప్లయితొలగించండి
  4. ష్యాయి గారు, ఆ ఘోష ఏ గ్రంధం లోనిదో కొంచెం వివరాలు తెలియచేయండి. అసలు త్రిలింగ దేశం అని దేనిని పిలుస్తారో తెలుసా తమరికి? తెలంగాణ ప్రత్యేక దేశమా? ఏ వంశీయులు పరిపాలించారు ప్రత్యేక తెలింగ దేశాన్ని? మీరు చెప్పే మహభారతం టీఆర్ఎస్ ఆఫీసులో దొరుకుతుందా? కొదండరాం వ్రాసాడా?

    రిప్లయితొలగించండి
  5. బాగా అడిగారు సత్య గారు.
    శాయిగారు, అవునండి నేను చరిత్ర కందని పురాతన కాలానికి చెందిన పురాణాలను అధ్యయనం చేయలేదు. మీరు ఎవరు రాసిన మహాభారతం నుండి ఈ విషయాలు సంగ్రహించారు? ఒక సారి చెప్తే నేను కూడా సరి చూసుకుంటాను

    రిప్లయితొలగించండి
  6. అసలు ఒక రాష్ట్ర ఏర్పాటుకు అన్ని ఏళ్ళ చరిత్ర అవసరం లేదు, మనకు స్వాతంత్రం రాకముందు భారతదేశం ఒక దేశంగా ఎప్పుడూ లేదు. కుషానులకాలంలో అఫ్ఘనిస్తాన్ కూడా మనతో కలిసుందని ఇప్పుడుండదు గదా? ఇలాంటివన్నీ ఏదో తెలుగుజాతిని విడదీస్తున్నారంటూ గగ్గోలు పెట్టే జనాలకు చెప్పాల్సి వస్తుంది గానీ నిజానికి అవసరంలేదు.

    మనస్వాతంత్రం వచ్చినతరువాత రాజ్యాం ఏర్పడ్డతరువాతి విషయాలే ఇక్కడ అవసరం. రాజ్యాంగబద్దంగా కొన్ని ఒప్పందాలతో కలిసినపుడు విడిపోయే హక్కు కూడా వస్తుంది. ఇక ఒక రాష్ట్ర ఏర్పాటు కోరడాన్ని పెద్ద మహాపాపం, వేర్పాటువాదం, నేరం, ఘోరం అంటూ గొంతు చించుకోవడం కంటే మూర్హత్వం ఇంకోటి ఉండదేమో. రాజ్యాంగబద్దమైన ప్రక్రియను వెర్పాటువాదమనేవాల్లను జైల్లో పెట్టొచ్చు.

    రిప్లయితొలగించండి
  7. aavesham ekkuva - adhyayanam takkuva
    ukrosham ekkuva - samskaaram takkuva
    TELINGA ante TRILINGA antaru. kallaku kooda chevudu mari.
    meeru bhomchesi mee panulu meeru chesukoni tongondi. memu meeku maa panulu vadulukoni granthaalu vediki andajestam.
    siggu lekapote sari! tamaru jeevitamlo librarieski vellina sandarbhaalunnaaya?

    meeku anta scene ledu gaani GOOGLE IMAGES lo EPIC INDIA ani kotti choodandi.

    రిప్లయితొలగించండి
  8. శాయి గారు, మంచి ఇంఫర్మేషన్ ఇచ్చారు. ఈ అంధకులు అప్పుడు కౌరవుల పక్షం ఉన్నప్పుడు వారిదగ్గర బాగానే నేర్చుకున్నట్లున్నారు, అందుకే ఇప్పుడు తెలంగాణాను దృతరాష్ట్ర కౌగిలిలో బంధించి గుడ్డి పాలన చేస్తున్నారు. ఈభారతంలో శకుని బహుషా చంద్రబాబయ్యుంటాడు, లగడపాటి దుర్యోధనుడు.

    రిప్లయితొలగించండి
  9. నా దగ్గర మీ ప్రశ్న కు సమాధానం లేదు అని ఇలా కూడా చెప్పవచ్చేమో.గూగుల్ ఇమేజెస్ ద్వారా మీరు రామాయణమహాభారతాన్ని చదివేసి అధ్యయనం చేసేయండి. కొత్త విషయాలు ఏమైనా వుంటే మాకు చెప్పండి.

    "అసలు ఒక రాష్ట్ర ఏర్పాటుకు అన్ని ఏళ్ళ చరిత్ర అవసరం లేదు. మనకు స్వాతంత్రం రాకముందు భారతదేశం ఒక దేశంగా ఎప్పుడూ లేదు. కుషానులకాలంలో అఫ్ఘనిస్తాన్ కూడా మనతో కలిసుందని ఇప్పుడుండదు గదా? ఇలాంటివన్నీ ఏదో తెలుగుజాతిని విడదీస్తున్నారంటూ గగ్గోలు పెట్టే జనాలకు చెప్పాల్సి వస్తుంది గానీ నిజానికి అవసరంలేదు."

    మీ ఇష్టం. నిజాంల పాలన తుది దశ నుండి మొదలుపెట్టి 1956 వరకు మాత్రమే చరిత్రను చదువుదాం, తెలుగు మాట్లాడే ప్రాంతాలు అసలు ఎన్నడు కలిసి లేవని బొంకేద్దాం, అడిగిన సాక్షాలు ఎవరైనా చూపితే అసలు చరిత్ర చూడవలసిన అవసరం లేదని కూడా అనేద్దాం.

    రిప్లయితొలగించండి
  10. ఆహ!! అయ్యయ్యో తెలుగుజాతిని విడదీస్తున్నారీ వేర్పాటువాదులని మొసలి కన్నీల్లతో గగ్గోలుపెడదాం, ఎవరైనా ఎవరిది వేర్పాటువాదమంటే తెల్లమొహమేద్దం, ఎప్పటిది తెలుగుజాతి అంటే రెండువేల సంవత్స్రాల చరిత్రలో ఒక్క వందేల్లు పరాయి వారి పాలన చూపిద్దాం. ఇలాంటి చత్త వాదనలు చేస్తుంటే బహుషా మీకే సిగ్గేసి ఉంటుందేమో, సిగ్గనేది ఏడిస్తే!!

    రిప్లయితొలగించండి
  11. షాయి బాబు, నీ మొహానికి బచావత్ తీర్పు చదవటం రాదు, గిర్గ్లాని రిపోర్ట్ చదవటం రాదు.. మహభారతం, రామాయణం చదివావా నువ్వు? అందులో ఆంధ్రులు, తెలంగాణ వేరు వేరు అని కనిపెట్టావా? తెలంగాణ యూనివర్సిటీ లో Phd ఇస్తారేమో అడుగు నీ పరిశోధన కి? మళ్ళీ త్రిలింగ, తెలింగా వేరు వేరా? నోరు ఉంది.. నాలికుంది.. ఎదైనా వాగచ్చు. ఇదే కద దొర మీకు నేర్పింది. ౠజులు అవసరం లే, సాక్షాలు అవసరం లే.. ఇట్లా ఇంకో లక్ష అబద్దాలు పుట్టించి ఏడుపు మొహాలు పెట్టినా నీ జీవితం లో ప్రత్యేక రాష్ట్రం చూడలేవు.

    రిప్లయితొలగించండి
  12. విశ్వరూప్, సాయి, గారూ చైతన్య గారు చెప్పేది మ్యాపులలో ఎక్కడా తెలంగాణా వేరు అని లేదు. తెలంగాణా కుడా ఆంద్ర రాజ్యంలో ఒక భాగమే. అసలు తెలంగాణా అన్న శబ్దమే పూర్వకాలంలో లేనప్పుడు కొత్తగా రాష్ట్రం అడగడంలో అర్థం లేదు. మీకెవరికి విడిపోదాం, కొట్టుకుందాం, తన్నుకొందాం లేదా తంతాం, విరగాకోదతాం లాంటి పదాలు తప్ప వేరే పదాలు రావా? దేశం/రాష్ట్రం అంతా కలిసి ఉంటేనే అభివృద్ది సాధ్యం. ఎంతసేపూ విడిపోతాం అని చిన్నపిల్లలా మాదిరిగా తల నేల బాదుకొని ఏడవడం తప్ప వేరే పని ఉన్నట్లు లేదు. ఇప్పటికే మన హైదరాబాద్ కి, రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు అన్ని పక్క రాష్ట్రాల వాళ్లు తన్నుకుపోతుంటే మీఋ అనగా వేర్పాటువాదుల వాళ్ళ చాలా నష్ట పోయాం. కొంతమంది రాజకీయ నిరుద్యోగులు మరియు కుహనా మేదావులవల్ల నష్టపోయినది చాలు. ఇక ఈ ఉద్యమాలు అటక ఎక్కిస్తే సరి.

    రిప్లయితొలగించండి
  13. రవీంద్రనాథ్ గారు,
    అటక మనం ఎక్కించాలా! అభూత కల్పనలతో, అసత్య దూషణలతో మొదలైన వుద్యమాలు అలా సమసి ధూళిలో కొట్టుకుపోతాయి, అటకలు ఎక్కేంత శక్తి వున్న ఉద్యమాలు కావులేండి.

    "శ్రీకృష్ణ రిపోర్ట్ మాకు అనుకూలంగా వుంటేనే అది దిక్కుమాలిన కమిటీ కాదని ఒప్పుకుంటం" అన్న రోజే ఈ ఎదవ వుద్యమాల సత్తా తేలి పోయింది. మనోభావాలు దెబ్బతిన్న 600మంది ఎలాగూ అమరులై త్యాగాలు చేసేసేశారట! అంటే బ్రతికినోళ్ళకు మనోభావాలు దెబ్బ తిననట్టే కదా. :))

    రిప్లయితొలగించండి