12, ఏప్రిల్ 2011, మంగళవారం

'వీర తెలంగాణా నాది వేరు తెలంగాణా కాదు'- రావి నారాయణరెడ్డి

1969 ప్రత్యేక తెలంగాణా ఉద్యమం జరుగుతున్నసమయంలో చీలికవాదాన్ని ఖండిస్తూ స్వర్గీయ రావినారాయణరెడ్డి (తెలంగాణా సాయుధపోరాట వీరుడు)ఒక కరపత్రాన్ని ప్రకటించారు.అందులోని కొంత భాగం:
  "భారతదేశంలో అంతర్భాగంగా,ఆంధ్రప్రదేశ్ లో నివసించే 4.5 కోట్ల ప్రజలు ఒక విశిష్టమైన ప్రత్యేక జాతిగా,ఆంధ్రజాతిగా రూపొందారు.జాతి అని పిలవడానికి అవసరమైన లక్షణాలు అనగా ఒకే భాష,ఒకే చరిత్ర,ఒకే సంస్కృతి,ఆచార వ్యవహారాలు,ఒకే భూభాగం కల్గి వున్నారు."
ఆంధ్ర చరిత్ర చూస్తే,ఆంధ్ర సాహిత్యాన్నిఅవలోకిస్తే చారిత్రకంగా కొన్ని దశల్లో తప్ప యావత్తు తెలుగు ప్రజలు కలిసే వున్నారు.అట్టి ఎడబాటు కూడా పరాయి పాలకుల పాలనలోనే జరిగింది.అయితే సామ్రాజ్య వ్యతిరేక పోరాటదశలో ఈ రెండు ప్రాంతాలు ఉమ్మడి పోరాట సంప్రదాయాలనే కలిగి ఉన్నాయి."

"ఆంధ్ర సారస్వతంలోని కొన్ని మహత్తర కావ్యాలు తెలంగాణా గడ్డమీద తెలంగాణా కవులచే రచింపబడినాయి.అదేవిధముగా ఆంధ్ర జీవితంలో ఆంధ్ర కవులచే గూడా రచింపబడినాయి. యావత్తు తెలుగుప్రజల జీవితంతో ఇవి ముడిపడి ఉన్నాయి."
 

"ఆధునిక పారిశ్రామిక యుగంలో సైతం ఆంధ్ర ప్రజలు సర్వతోముఖాభివృద్ధ్హి చెందాలంటే, వ్యాపారంలో,విద్యలో,ఆర్ధికకార్యకలాపాలలో,పరిపాలనలో ఒకే భాష ద్వారా తమ వ్యవహారాలను కొనసాగించడం అవసరం.ప్రస్తుతం పరిపాలక వర్గ అభివృద్ధ్హి నిరోధక,సంకుచిత స్వార్థపర విధానాలవల్ల,తాత్కాలికంగా కొన్ని చిక్కులు,కలతలు సంభవించినప్పటికీ ఆంధ్ర ప్రజల సమగ్రాభివృద్ధి సమైక్యాంధ్రలోనే సాధ్యం.దీనికి ఆంధ్ర ప్రజల ఉమ్మడి సంస్కృతి,చరిత్ర పునాది."

9 కామెంట్‌లు:

  1. బాగుంది. అదేంటో, రావి నారాయణరెడ్డిగారు మనపాఠ్యపుస్తకాలలోని చరిత్రపుస్తకాల్లో ఎక్కడా భూతద్దం పెట్టుకుని వెదికినా కనపడడు. అసలు తెలంగాణా సాయుధపోరాటం, హైదరాబాదు రాష్ట్ర ఏర్పాటు విషయాలు ఎక్కడా పాఠ్యపుస్తక్కాల్లో కనపడవు, పెద్దలు మీకేమయినా అందుకు కారణం తెలిస్తే చెప్పగలరు.

    రిప్లయితొలగించండి
  2. ఆ మాట కొస్తే తెలంగాణా గురించి గొంతు చించుకుని బూతులు మాట్లాడే నాయకులు తమకు తెలియకుండానే రావి నారాయణ రెడ్డి, ధర్మబిక్షం వంటి తెలంగాణా ద్రోహుల(వారు సమైక్యవాదులే మరి) పేర్లను ఉచ్చరించడం లేదు? దేశంమొత్తంలో పాఠ్యపుస్తక్కాల్లో కమ్యునిస్టులు నడిపిన ఎన్ని ఉద్యమాలు గురించిన ప్రస్తావన ఉంది మాస్టారు? మీకు కనిపించలేదేమో గాని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఆధునిక భారత చరిత్ర కోర్సులకు సంబంధించిన స్టడీ మెటీరియల్ లో కావలసిన సమాచారం ఉంది.అది అంతా బయటకు వస్తే టిఆర్ఎస్ మరియు దాని తొత్తులు 'తెలంగాణా సాయుధ ఉద్యమాన్ని' 'తెలంగాణా ద్రోహుల ఉద్యమం' గా అభివర్ణించవలసి వస్తుంది. అందువలన ఇక్కడ మనం ఎంత తక్కువ మాట్లాడితే ప్రత్యేకతెలంగాణా ఉద్యమానికి అంత మంచిది. ప్రజలు నిజాలను తెలుసుకోవడం మంచిది కాదు. మీకు కావలిసివస్తే హైదరాబాద్ నడి బొడ్డున విశాలాంధ్ర బుక్ హౌస్ లో రావి నారాయణరెడ్డి గారి రచనలు దొరుకుతాయి.

    రిప్లయితొలగించండి
  3. రావి నారాయణరెడ్డి గురించి తెలుసుగోరేవారు ఆధునికభారత చరిత్రకారుడు, నేషనల్ బుక్ ట్రస్ట్ చైర్మన్ అగు బిపిన్ చంద్ర వ్రాసిన ఈ వ్యాసాన్ని చదవగలరు
    http://www.newageweekly.com/2010/10/remembering-ravi-narayana-reddy-by.html

    రిప్లయితొలగించండి
  4. బూర్గుల రామక్రిష్ణారావు కూడా కమ్యూనిస్టేనా? రెండు సంవత్సరాలు కూడా లేని ఆంధ్రరాష్ట్ర చరిత్రను ఘనంగా పుస్తకాల్లో రాసేవారు ఏ హైస్కూల్ చరిత్రపుస్తకాల్లో హైదరాబాదు రాష్ట్రం గురించి రాశారో చెబుతారా? ఇది కేవళం కమ్యూనిస్టులపై ఉన్న కోపంతో చేసినపనైతే బూర్గుల, హైదరాబాదు ఊసెందుకు రాయలేదు?

    తెలంగాణా కావాలనేవారంతా టీఆరెస్ వారుకాజాలరు, తెలంగాణా సాయుధపోరాటాన్ని ద్రోహుల ఉద్యమం అని అంటుంది ఇప్పుడు మీరు. ఎవరూ అనని విషయాలను లగడపాటిలాగా గోబెల్స్ ప్రచారం చెయ్యకండి.

    రిప్లయితొలగించండి
  5. అనవసరమైన మరియు అర్థంపర్థం లేని వాదనలకు సమయం లేదు. ఏ స్కూలు పుస్తకం గురించి మీరు మాట్లాడుతున్నారు?బూర్గుల రామక్రిష్ణారావు గారికి వచ్చిన లోటు ఏమిటి? నాకింకా గుర్తు వుంది నేను మాడపాటి హనుమంతరావు,రామానంద తీర్థ,సురవరం ప్రతాపరెడ్డిల గురించి స్కూలులో చదివాను. రెండు సంవత్సరాలు కూడా లేని ఆంధ్రరాష్ట్ర చరిత్రను ఏ హైస్కూల్ పుస్తకంలో ఘనంగా వ్రాసారు? హైదరాబాద్ రాష్ట్రం లో తెలుగు వారిని మూడవతరగతి పౌరులుగా, తెలంగి భేడంగులుగా అవహేళన చేసినకాలంలో ఇక్కడి మహామహులు అక్కడి తెలుగు బాష, సంస్కృతిల ఉన్నతికి జరుగుతున్న కృషికి ప్రేరేపితులై ఆంధ్రభాషా నిలయాలు, పత్రికలూ,సభలు నిర్వహించుకున్నారు.మహామహులకు ఇలా ప్రాంతీయ గజ్జి అంటగట్టవద్దు. కేసిఆర్ తనకుతానుగా తెచ్చుకొన్న గజ్జి చాలామందికే అంటించాడు.

    ప్రత్యేకవాదుల మోసపూరిత విష ప్రచారాలతో గోబెల్స్ అనే పదానికి విలువ పోయింది.వారి ముందు గోబెల్స్ ఎంత? వారి ఉద్దేశంలో సమైక్యవాదులు తెలంగాణా ద్రోహులు. అవునా కాదా?ఎవరిని పిలిపించి చెప్పించాలి?

    రిప్లయితొలగించండి
  6. మీరు గోబెల్స్ బిరుదు వేరే వాళ్ళకిస్తే లగడపాటికి కోపం వస్తుంది. ఆయనకన్నా పెద్ద గోబెల్స్ ఎవరు?

    రిప్లయితొలగించండి
  7. ఎంతైనా లగడపాటిది మీ దొర సావాస దోషం కదా, క్షమించేద్దాం ఆచారి గారు :) ఇంతకీ యాగం లో పాల్గొన్నారా?
    ఇటాలియన్ దేవత తో merger ఎప్పుడో తెలిసిందా? అప్పుడు చక్కగా మన దొర, లగడపాటి ఇద్దరూ కలసి కంబైండు సమావేశాలు, లేకపోతే కంబైండు బంగారమ్మ యాగాలు చేస్తే వెళ్ళి పందిరిలి వేసి, ప్రసాదాలు తినివద్దాములేండి :)

    నాది ఓ చిన్న ప్రశ్న, ప్రియ దెయ్యం గారి లాగా మీరూ దెయ్యమై వచ్చిన చచ్చిన శ్రీకాంతాచారా? లేక బతికిన శ్రీకాంతాచారా?

    రిప్లయితొలగించండి
  8. రావి నారాయణరెడ్డి గారు ఇప్పుడు బ్రతికుంటే బహుషా ఈ యాభైఏళ్ళ దోపిడీ చూశాక ఖచ్చితంగా తెలంగాణా కావాలనేవాడేమో. నిజాంపై పోరాటం చేసింతరువాత, ఇప్పుడు పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు తమ హక్కులను అధికారదాహంతో కాలరాస్తారని అతనికితెలిసుండదు కదా.

    రిప్లయితొలగించండి
  9. మస్తు షెప్పినవ్. నిజాం, కాశిం రజ్వీ వుంటే ఇంకోసారి బతుకమ్మ ఆడిపించుకుని చూడాల అనేటోళ్ళేమో! :))))

    రిప్లయితొలగించండి