10, ఏప్రిల్ 2011, ఆదివారం

suswaagatham

విశాలాంధ్ర మహాసభ సభ్యులకు,తెలుగు జాతి అందరికి నమస్సుమాంజలి సమర్పిస్తూ నా యొక్క తొలి బ్లాగ్ సందేశాన్ని మీ ముందుకు తీసుకు వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

ఓ ఊరి కధ!

శ్రీకాకుళం చిన్నది,
వరంగల్ వస్తాదు,
బాగ్యనగర నిర్మాణానికి
రాళ్లు ఎత్తడానికి వచ్చారు.

ఇద్దరి కళ్ళు కలిసాయి
ఇరువురి మనసులు ముడిపడ్డాయి.
మనువుకు సిద్దం అన్నారు.
పెద్దలు మాత్రం వద్దన్నారు.

మా భుములు మా ఉద్యొగాలు
అని గిరిగీసుకు కుర్చుని,
పదుగురితొ పరుగుతీయలేని,
పిరికి సన్నాసులు మనకొద్దుహేయ్
పిల్ల తండ్రి గొల!

ఔను...గ్లొబలైజేషన్ నీడలొ
ప్రపంచం మొత్తం
పరుగుపందెంలొ నిల్చున్నప్పుడు..
గెలిచేవాడే విజేత!

బానిస బతుకులు మాకొద్దని
ఓ పక్క పానాలను బలిచేసుకుంటుంటే
నీకు పిల్లగావాల్సి వచ్చిందా బాడుకొ
అని పిల్లాడి తండ్రి చీత్కారం!

ఔను..రాజకీయ రంగులొ
దొచుకొనే వాళ్లున్నన్నాళ్ళూ
ఉద్యమాల సెగ ఆరదు.
ఇక ప్రేమలకు చొటెక్కడా??

కాని ఓ సారి పుట్టిన
ప్రేమ ని ఏ శక్తీ ఆపలేదు.

ఓ చీకటి రాత్రి..
ఇద్దరు కలసి
కుల మత ప్రాంతాలకు అతీతంగా
ప్రేమైకజీవనానికి అనువయిన
ప్రదేశాన్ని వెదుక్కుంటు పారిపొయారు.

రాజకీయ రాబందులు
మాత్రమే తిరిగే స్మశాన నిశ్శబ్దం తొ
ప్రేమ పక్షులు కనపడక
ఆ ఊరు బొసి పొయింది.
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి