20, ఏప్రిల్ 2011, బుధవారం

హత్య తరువాత హత్య తో సమానమైన నేరం ’హేళన’.."- బుద్ధుడు

హత్య తరువాత హత్య తో సమానమైన నేరం ’హేళన’.."- బుద్ధుడు

రెండువైపులా సాన గల్గిన కత్తికన్నా పదునైనది మాట.
చేసినపనుల కన్నామాట చాలారోజులు గుర్తుండి పోతది!

చులకన, వెటకారం, వ్యంగ్యం ,పరిహాసం,  పర్యాచకం, పరుశ పదజాలం, నవ్వు, నిర్లక్ష్య-చూపులు, ఇవే అవహేళనకి అస్త్రాలు.

వివక్షలో భాగం
హేళన!

ఎదుటి వాడి ఆధిక్యత ని ఒప్పుకోలేని వాడు హేళనకి దిగుతాడు.
ఎదుటు వాడిపై ఆధిక్యతని చూపలేని వాడు హేళనకి దిగుతాడు.
చేతలు చేయడానికి చేత కాని  వాడు హేళనకి దిగుతాడు.
తనకి తాను సమాధానం చెప్పుకోలేనోడు హేళనకి దిగుతాడు.
మాటలతో ఒప్పించలేని వాడు హేళనకి దిగుతాడు ,
అవేమాటలతోనే నొప్పించా లనుకునే వాడు హేళనకి దిగుతాడు.
దురహం తో వున్న వాడూ  హేళనకి దిగుతాడు.
అవివేకాన్ని కప్పిపుచ్చు కోవాలనుకునే వాడు హేళనకి దిగుతాడు.
అబధ్రతా భావానికి లోనయ్యేవాడు ఎక్కువగా హేళనకి దిగుతాడు,
సొంత వాళ్ళతో లేక సొంత -భజన- బృందాలతో మెప్పు పొందాలనే  ఆరాటం ఉన్నవాడూ  హేళనకి దిగుతాడు.

హేలన చేసేవారికి ఇది ...
వ్యక్తిత్వ పరంగా ఒక దౌర్బల్యం.
సామాజిక పరంగా దౌర్భాగ్యం.
మానసికంగా ఒక అశాంతి.
జ్ఞానార్జన పరంగా ఒక ఆటంకం.
క్షేమం పరంగా ఒక సంకటం.

వెటకారం తో , వ్యంగ్యం తో చులకన చేసి ఆనంద పడే వాడు నిజంగా రాక్షసుడే!
నిజమైన శీలవంతుడు, స్వాభిమాని ఎదుటివారిని హేళన పరచడు.
శీలం లేనివాడు, దురాభిమానం కల వాడు మాత్రమే ఎదుటివారిని హేళన చేస్తాడు. (దురాభిమాని అంటే వాడి లోపాలు వాడికి తెలిసికూడా ఒప్పుకోని వాడు.)

హేళన తో ఎదుటివారిని జయించచ్చు, పరాభవించవచ్చు అనుకోవడం కూడా పొరపాటే! కాని ఆగ్రహాని మాత్రం గురవుతాం, మాటతో మనం చేసే చులకన మనకు తెలియకుండానే శత్రువులని తయారుచేసిపెడ్తుంది. ప్రతీకారం తరాలు దాటినా వెంబడిస్తుంది.

మనవైపు న్యాయమున్నా,  అవహేళనని ఆయుధం గా మలుచుకోవడం వల్ల న్యాయం కూడా మనలని వదలి వెలుతుంది.. మన వాదనని బలహీన పరుస్తుంది.

తనకి పరాభవం జరిగితే , విజ్ఞులు వివేచనతో వ్యవహరిస్తారు....
దురాభిమానులు మాటలతో హేళన చేస్తారు.

స్వాభిమానం తో వశిష్ఠ మహర్షి పై అధిక్యం చూపడానికి విజ్ఞత గల్గిన విశ్వామిత్రుడి సత్‌ప్రయత్నం తనని ఋషి నుండి  రాజర్షి, బ్రహ్మర్శి, మహర్షిని జేసింది.
దురాభిమానం తో పాండవులపై ఆధిక్యం చూపడానికి దుర్యోధనుడు చేసిన విఫల యత్నం తనని మనిషి నుండి పశువు, మృగం, రాక్షసున్ని జేసింది. 

ఒకడు హేళన చేస్తున్నప్పుడు .....
మౌనం తో సమాధానం చెప్పడం ఉత్తముల లక్షణం.
మాటల తో సమాధానం చెప్పడం మధ్యముల లక్షణం.
హేలన తో  సమాధానం చెప్పడం అధముల లక్షణం.

నిజమైన వీరుడు ద్వంద్వం లో చూసుకుంటాడు.


ఏది ఏమైనా ...... ఇప్పటికే హేళనా-రంగంలో దిగిన వారికి నామాటలు విరుధ్ధంగా అనిపించ వచ్చు!.


1 కామెంట్‌: