ప్రత్యేకరాష్ట్ర వేర్పాటు వాదులు చేసే వాదనలు చూస్తే అలాగే అనిపిస్తున్నది. నేనేమి చదువురాని అమాయకుడైన పల్లెవాడును కాను, వారు చెప్పే కాకమ్మ కబుర్లు నమ్మడానికి. అసలు ఏ రాజకీయ పార్టీ ఎప్పుడు ప్రత్యేక తెలంగాణాను ఇస్తామని హామీ ఇచ్చింది ? ఈ వేర్పాటువాద ఉద్యమం ఐదు దశాబ్దాల ఉద్యమమా.....? ఇలా మాట్లాడితే ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు నవ్వరు...? నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అనుకుని మాట్లాడే వాళ్ళని ఎవరు మాత్రం ఏమిచేయగలరు....కానీ మేధావుల ,సాహితీవేత్తల ,ఆచార్యుల (ప్రొఫెసర్లు),చరిత్రకారుల ముసుగులో కొంతమంది ఇలా వక్రభాష్యాలతో మీడియా సహకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ సమాజానికి కీడు చేస్తున్నారు అనేది జగమెరిగిన సత్యం.1972 లో జై ఆంధ్ర ఉద్యమము ఉద్ధృతంగా సాగుతున్నప్పుడు ఏమయ్యిందీ తెలంగాణా ఉద్యమం? అప్పుడు తెలంగాణా ఉద్యమకారులు ఎందుకు నిశ్శభ్దంగా ఉండిపోయారు.... రాష్ట్ర విభజన కోసం ఎందుకు పాటుపడలేదు? 1969 తర్వాత మళ్లీ కేసిఆర్ కు మంత్రి పదవి పోయేదాకా మీలో ఎవరైనా ప్రత్యేక తెలంగాణావాదాన్ని విన్నారా...? 1980 -90 దశకాలలో (1994 ,95 ,96 లలో ఉత్తర తెలంగాణా ప్రాంత విముక్తి పోరాటం అనే వరంగల్ ప్లీనరీ తీర్మానం) నగ్జలైట్లు లాంటి వారు ఎవరో ఒకరు ఎక్కడో చోట ప్రత్యేక తెలంగాణా గురించి మాట్లాడి ఉంటారు.దానిని ఉద్యమం అనాలా అన్నది మీ విఙ్ఞతకే వదిలివేస్తున్నాను. నేను హైదరాబాద్ లో చదువుకున్నాను మరియు నా స్నేహుతులు చాలామంది తెలంగాణా అదికూడా అక్కడి గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఉండేవారు.మేము అనేకానేక విషయాలగూర్చి చర్చించుకునేవాళ్ళం. కానీ ఏఒక్క సందర్భంలోను కూడా ప్రత్యేక తెలంగాణా విషయం చర్చకు రాలేదు. ప్రత్యేక తెలంగాణా వాదము 1969 ప్రాంతంలో ఒక సంవత్సరం పాటు మరియు 2009 డిసెంబర్ నుండి మాత్రమే ప్రజలలో చెలామణి అయ్యింది.అంటే వేర్పాటువాద చరిత్ర 4 (నాలుగు) సంవత్చరాలు మాత్రమె,అదే సమైఖ్యాంధ్ర చరిత్ర (6) ఆరు దశాబ్దాలకు (అంటే అరవై సంవత్చరాలు) పైమాటే అనేది చారిత్రిక అక్షర సత్యం.
రాజకీయ పార్టీల వైఖరి :------
కాంగ్రెస్ 2004 మానిఫెస్టోలో రెండవ ఎస్సార్సీ గురించి మాత్రమె మాట్లాడింది. కొంతమంది దీనిని వక్రీకరించి ,వక్రభాష్యాలతో మసిపూసి మారేడుకాయ చేసి ,గారడీ మాటల వేర్పాటు వాదంతో వచ్చిన వారు సమైఖ్యాంధ్ర (కాంగ్రెస్సు) రాష్ట్ర ప్రభుత్వంలోను మరియు కేంద్ర ప్రభుత్వంలోను చేరి కొంతకాలం మంత్రి పదవులు అనుభవించారు .తరువాత ఆపార్టీ అంతర్గత కలహాలతో కకావికలై ,ముక్కలు చక్కలై దిక్కుతోచని స్థితిలో పడింది .ఆ తరువాత కావాలని కోరితెచ్చుకున్న ఉప ఎన్నికలలో ఆ పార్టీ ఘోర పరిస్థితి ఎదుర్కొంది. కాంగ్రెస్స్ 2009లో మాత్రం కేంద్రప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి వుంటానన్నది. వైఎస్ఆర్ విభజనకు వ్యతిరేకమని మరియు అతను రాష్ట్ర ముఖ్య నేతగా వుండగా ప్రత్యేక తెలంగాణ అసంభవమని రాజకీయాలగురించి అంతగా తెలియని వానికి కుడా తెలుసు. కానీ అంతాతెలిసిన ప్రజలు వైఎస్ఆర్ నే గెలిపించారు. తెలుగుదేశం విషయానికి వస్తే ఆ పార్టీ 2004 లో ప్రత్యేకవాదాన్ని బాహాటంగానే వ్యతిరేకించి 2009 లో మాత్రం కాంగ్రెస్ 2004 లో చూపిన రాజకీయ అవకాశవాదాన్ని పుణికిపుచ్చుకుని,దానికి తగ్గ ఫలితాన్ని చవిచూసింది.దీనికి నిదర్శనం ప్రత్యెక వాదంతో వచ్చిన తెలుదేశం పార్టీ, దాని మిత్రపక్షమైన తెరాస ల కంటే వైఎస్ఆర్ నాయకత్వంలోని కాంగ్రెస్స్ పార్టీ కి తెలంగాణా ప్రాంతంలో ఎక్కువ స్థానాలు వచ్చాయి. అప్పుడు గాని, ఇప్పుడు గాని చంద్రబాబు నాయుడు ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా ఉన్నాడని ఎవరు నమ్మలేదు. 2009 ఎన్నికలలో ప్రత్యేక తెలంగాణను గట్టిగా సమర్ధించిన పార్టీ వేర్పాటువాద తెలంగాణా రాష్ట్ర సమితి మాత్రమే.కానీ ఆ పార్టీ గెలిచిన అన్ని సీట్లలో వచ్చిన మెజారిటీ మరియు ఆ పార్టీ ఒడిపోయిన సీట్లలో ప్రత్యర్ధులకు వచ్చిన మెజారిటీ చూస్తే తెలంగాణా ప్రజా తీర్పు, ప్రజల మనోభావం మనకు తెలుస్తుంది . అప్పుడు ఘోరపరాజయాన్ని చవిచూసిన టీఆర్ఎస్ తర్వాత జరిగిన జీ హెచ్ యం సీ ఎన్నికల్లలో పొటీ చేసే సాహసం కూడా చేయలేకపోయింది.
కొందరు నాయకులు తమ స్వార్థం కోసం, కొన్నేళ్ళ పాటు యదేచ్చగా, పిట్టకథలు,పొడుపు కథలతో అసత్య ప్రచారాలు చేసుకుంటూ, ప్రజల్లో విద్వేషాగ్నుల్ని రగుల్చుకుంటూ పోతుంటే.. మిగతా నాయకులు తమకేం పట్టనట్లు చూస్తూ ఉండటమో, లేకపోతే పొత్తులతో ఆ విద్వేషాగ్నుల్లో చలికాచుకోవటానికో ప్రయత్నిస్తే, అంతిమంగా ఇలాంటి పరిస్తితులు తలెత్తటంలో ఆశ్చర్యం లేదు.మన బాధలన్నిటికీ యూదులే కారణం, వారిని అంతమొందించండని" హిట్లర్ అనగానే, మొత్తం జర్మన్ ప్రజలు గుడ్డిగా ఎలా నమ్మారా..? అనే సందేహం ఉన్నవారికి ఎవరికైనా, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు కొంత సమాధానం ఇస్తాయి.
వక్రభాష్యాలు:-----
నా అభిప్రాయంలో ప్రత్యేకవాదులు వెనుకబాటుతనానికి, వివక్షకు మధ్య తేడా గుర్తించకలేక కొంచెం అయోమయంలో ఉన్నారు. మనదేశంలో వెనుకబడిన ప్రాంతాలు చాలానే ఉన్నాయి. చూస్తుంటే ఈ ఉద్యమం చేసే వాళ్ళకి ఉత్తరాంధ్ర, ప్రకాశం, రాయలసీమల వెనుకబాటు గురించిన వివరాలు వినే దయాద్ద్ర హృదయం లేనట్టుగా ఉంది. అసలు హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిని వాళ్ళు ఎందుకు లెక్కలోకి తీసుకోవడం లేదు? రాష్ట్రంలో కొత్తగా ఏర్పడుతున్న ఉద్యోగాలలో దాదాపు నాలుగింట ఐదు వంతులు హైదరాబాద్ కు చెందినవే. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోని ఐదు ముఖ్య నగరాలు మొత్తం కలిపినా దానిలో సగముకు సమము కాలేవు. హైదరాబాద్ ఆంధ్ర ప్రదేశ్ యొక్క రాజధాని కాకపోయి వుంటే ఔరంగాబాద్ లేక ఇతర చారిత్రక దక్కను నగరాల వలెనే ఉండిపోయేది. హైదరాబాద్ అభివృద్ధికి దాని యొక్క రాష్ట్ర రాజధాని స్థానముకు విడదీయలేనంత అనుబంధం ఉంది. కావున మన రాష్ట్ర ప్రజలందరికి ఆ అభివృద్ధిలో భాగం ఉంది,బాధ్యత ఉంది.
కొంతమంది తెలంగాణా వేర్పాటువాద నాయకులు,ఉద్యమ ముసుగులో ఉన్న కొంతమంది కుహానా మేధావులు ,స్వార్ధం కోసం మావోఇజం ముసుగు వేసుకున్నవారు కలసి... సమైఖ్యాంధ్రను సమర్ధించే వారు దురహంకారులని తీర్పులు చెబుతున్నారు. ఎవరు దురహంకారులు అని వీరు తీర్పు చెబుతున్నారు? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు విగ్రహాల ధ్వంసం చేసినపుడు దానికి వ్యతిరేకముగా ప్రపంచం అంతా వాదించింది . ఎవరూ కూడా నాజీలు పుస్తకాలను తగలబెట్టదాన్నిసమర్ధించలేదు.అలాగే నేను కూడా ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను ద్వంసం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాను. ఒకవేళ ప్రపంచం మొత్తం మొదటి రెండు అంశాలలో ఉంది విధ్వంసకారులు,దురహంకారులు అన్నట్లయితే,..... ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద మతిలేని విధ్వంసం సృష్టించినవాళ్ళని, వారిని సమర్ధిస్తున్న వారిని దురహంకారులు అని అంటారని ఆశిస్తున్నాను.విగ్రహాల ధ్వంసం కన్నా, దానిని సమర్థించుకునే చర్యలు, దానిని కూడా తమ రాయకీయ లబ్ధికి వాడుకునే ప్రయత్నాలే ఇంకా ఎక్కువ బాధిస్తున్నాయి.
ఆత్మ విమర్శ:------
ఎవరిది మోసం....? ఎవరు దురహంకారులు....... ? ఎవరు ఫాసిష్టులు........ ? ఎవరు అప్రజాస్వామికులు........ ? ఎవరు చేస్తున్నది దౌర్జన్యం .....? ఉస్మానియా విశ్వవిద్యాలయములో ప్రశ్నాపత్రాలు దిద్దడానికి వచ్చిన అమాయక లెక్చరర్లను కొట్టడమా ఉద్యమమంటే ? ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న మహిళా ఉద్యోగినిల పట్ల ,ఉద్యోగస్తుల పట్ల అనుచితంగా ప్రవర్తించి వారిని ఇక్కడనుండి వెళ్ళిపోవాలని బెదిరించి,దౌర్జన్యం చేసినది/చేస్తున్నది ఎవరు ? నిన్నటి దాకా ఆంధ్రలో చదువుకుని, అమెరికాలో ఉండి,నేడు హైదరాబాద్ లో వేర్పాటువాద ముసుగులో దౌర్జన్యాలు చేస్తూ,వ్యక్తులను,సంస్థలను బెదిరిచి ,బ్లాక్మెయిల్ చేస్తూ కోట్లాది రూపాయలను పోగేసింది ఎవరు...వారి అడుగులకు మడుగులు వత్తుచూ వారి అడుగుజాడలలో నడుస్తున్నది ఎవరు ? తమ పిల్లలను ఇంటర్నషనల్ స్కూళ్ళలోను, విజయవాడలో ను,గుంటూరులోనూ,ఒంగోలులోను,మద్రాసులోనూ,కర్ణాటకలోను చదివిన్చుకొంటు....తెలంగాణలో విద్యాసంస్థలను మాట మాటకు బందులతో మూయిస్తూ,ఇక్కడి మధ్యతరగతి,పేద విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటున్నది ఎవరు ? విద్యార్ధుల జీవితాలను,ప్రాణాలను సమిధలుగా వాడుకుంటున్నది ఎవరు ? నిరుద్యోగులను ఉద్యోగ అర్హత పరీక్షలకు వెళ్ళనీయకుండా అడ్డుకొని,వారిలో నిరాశా నిస్పృహా నింపుతున్నది ఎవరు ? నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్లకు కనీసం ఈ మాత్రం తెలియదా...? లేక.... వీళ్ళు ఎవరకి అనుచరులుగా పనిచేస్తున్నారు ? తోటి యమ్ఎల్ఏ ను అసెంబ్లీ సాక్షిగా కొట్టడమా ప్రజాస్వామ్యమంటే ? రాష్ట్ర ప్రధమ పౌరుడు,రాష్ట్ర రాజ్యాన్గాదిపతి అయిన గవర్నర్ మీద దాడి చేయటమా ప్రజాస్వామ్యమంటే ?దీనినేనా మీరు ప్రజాస్వామ్యక ఉద్యమం అనేది? ఇదిగో తెలంగాణా...అదిగో తెలంగాణా ...అంటూ గడువుల మీద గడువులు పెంచుకుంటూ ప్రజలను,విద్యార్ధులను మోసంచేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటోంది ఎవరు ? అన్ని రోగాలకు జిన్దాతిలిస్మాత్ ఒక్కటే మందు అన్నట్టు,అన్ని సమస్యలకు తెలంగాణా సాధన ఒక్కటే సమాధానం అని,పట్టపగలే ఆకాశంలో అరుంధతి నక్షత్రాన్నిచూపించే విధంగా మాయ మాటలతో యువకులను తప్పుదారి పట్టిస్తున్నది ఎవరు ? ఆవేశంలో పేద,మధ్యతరగతి యువకులు ఆత్మహత్య (హత్యలు) చేసుకుంటుంటే ,ఆ చావులను తమ సొంత స్కోరుగాను,ఘనకీర్తి గాను వాడుకొంటున్నది ఎవరు ? ఆత్మహత్యలు చేసుకున్నవారిలో ఎవడన్న స్థాయిగల ఒక్క నాయకుడు గాని,వారి పిల్లలు గాని ఉన్నారా..?తెలంగాణా ఉద్యమాన్ని కుటుంబాలకోసం,కులాల కోసం తాకట్టు పెడుతున్నది ఎవరు ? ఈ ఉద్యమాన్ని ఆర్ధిక , రాజకీయ లబ్దికోసం వాడుకుంటున్నది ఎవరు ?
ఇవన్నీ ప్రక్కన పెట్టినా........,తెలంగాణాగురించి,తెలంగాణాకోసంపోరాడే మేధావులకు,పౌర హక్కుల ఉద్యమ నేతలకు ,మానవ హక్కుల ఉద్యమ నేతలకు,ఆచార్యులకు(ప్రొఫెసర్లు),న్యాయవాదులకు,న్యాయకోవిదులకు,సంఘసేవకులకు,జర్నలిష్టులకు,నేను వేసే ప్రశ్న ఒక్కటే ......మానవ హక్కులు,పౌర హక్కులు,ప్రజాస్వామిక హక్కులు ప్రజలందరికి మరియు అన్ని ప్రాంతాలకు ఉంటాయా......? లేక కొంతమంది ప్రజలకు మరియు కొన్ని ప్రాంతాలకు మాత్రమె ఉంటాయా.....? ఒకవేళ తెలంగాణా ప్రాంత ప్రజలకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం నిర్ణయాధికారం ఉన్నప్పుడు , హైదరాబాద్ నగర ప్రాంత ప్రజలకు మాత్రం అటువంటి హక్కు ఉండదా? వారు ప్రత్యేక తెలంగాణలో భాగంకాకుండా వేరు పడాలని కోరుకుంటే మీరు ఎందుకని సమర్దిన్చరు...మీకు ఉలికిపాటు ఎందుకు .......? హైదరాబాద్ గురించి వేరే వాళ్ళు మాట్లాడితే నాలుకలు కోస్తాం,బట్టలు విప్పదీసి తరుముతాం ,ఆస్తులు ఆక్రమిస్తాం అని ఉద్యమంలో ఉన్న వారు,నాయకులు అంటున్నప్పుడు మీరు ఎవ్వరన్నా వారు అనేది తప్పు అని ఖండిచారా..? ఈరోజు హైదరాబాదులో ఉన్న మీడియా సంస్థలకు,అందులోని సిబ్బందికి స్వేచ్చ ఉందా....? హైదరాబాదు మీడియాని బెదిరించి ,బ్లాక్ మెయిల్ చేసి మీకు అనుకూలంగా వార్తలు వచ్చేటట్లు మార్చుకోలేదా..? తెలంగాణలో గాని,హైదరాబాదులో గాని ఎవ్వరైనా,ఎక్కడైనా సమైఖ్యాంధ్ర గురించి మాట్లాడే స్వేచ్చ లేకుండా చేసింది మీరు కాదా...? ఇదేనా మీరు చెప్పదలచుకున్న ప్రజాస్వామిక మూలసూత్రం ? ఇవేనా మీరు మాట్లాడే మానవ హక్కులకు,పౌర హక్కులకు అర్ధం ? మీరు టీవీ లలో ,చర్చా వేదికలలో మాట్లాడే మాటలు,ఇచే ఉపన్యాసాలు మేడి పండుల్లాగా లేవా ? మీ వాదాలలో పస ఎంత ? మోకాలికి బోడిగుండుకి ముడివేసి నట్లు మీకు అనిపించటం లేదా ..? సొంత ఎజెండాలతో ఒక జెండా నీడన చేరి ప్రజాస్వామ్యాన్ని,పౌర హక్కులను,మానవ హక్కులను మీరు అపహాస్యం చేయటలేదా......? భారత జాతికి మాత ఒక్కటే ఉంటుంది...తెలుగు జాతికి తల్లి ఒక్కటే ఉంటుంది.....అంతేగాని ప్రాంతానికి ఒక తల్లి,ఊరికి ఒక తల్లి, వీధికి ఒక తల్లి ఉండదు,ఈ విషయం కనీస జ్ఞానం ఉన్నవారికి ఎవరికైనా తెలుసనుకుంటాను.సమాజాన్ని,మనుషులను,మమతలను,మనసులను చీల్చే హక్కు మీకు ఎవరు ఇచ్చారు ?
విజ్ఞత:---
ఎవరు ఎవరి ప్రతిక్రియను ఆపుతున్నారు? ఎవరు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు? 2010 లో కేసిఆర్ పై విజయవాడ లో ఎవరైనా దాడి జరిపారా? దురహంకారులైన టిఆర్ఎస్ పార్టీవాదులు తిరుమలలో రాష్ట్ర విభజనకు సమర్ధనగా నినాదాలు చేయగా వారిని ఎవరైనా ఆపారా.....? ఇతర ప్రాంతాలవాళ్ళు తెలంగాణావాళ్ళని దోపిడిదార్లు, మోసకారులు అని నినదించారా....? చైతన్యవంతులైన తెలుగు ప్రజలు అన్ని రకాల అవకాశవాదాలకూ సమాధానమివ్వడం త్వరలోనే చూడొచ్చు" అని ఆశించటం మినహా వేరే మార్గం లేదు.
దీనిని బట్టి సిగ్గుపడవలసినది ఎవరో ఇట్టే అర్ధమవుతున్నది!!
వెంకటేశ్వర్. సుంకర
బచాఓ హైదరాబాద్ కౌన్సిల్ , కన్వీనర్
రాజకీయ పార్టీల వైఖరి :------
కాంగ్రెస్ 2004 మానిఫెస్టోలో రెండవ ఎస్సార్సీ గురించి మాత్రమె మాట్లాడింది. కొంతమంది దీనిని వక్రీకరించి ,వక్రభాష్యాలతో మసిపూసి మారేడుకాయ చేసి ,గారడీ మాటల వేర్పాటు వాదంతో వచ్చిన వారు సమైఖ్యాంధ్ర (కాంగ్రెస్సు) రాష్ట్ర ప్రభుత్వంలోను మరియు కేంద్ర ప్రభుత్వంలోను చేరి కొంతకాలం మంత్రి పదవులు అనుభవించారు .తరువాత ఆపార్టీ అంతర్గత కలహాలతో కకావికలై ,ముక్కలు చక్కలై దిక్కుతోచని స్థితిలో పడింది .ఆ తరువాత కావాలని కోరితెచ్చుకున్న ఉప ఎన్నికలలో ఆ పార్టీ ఘోర పరిస్థితి ఎదుర్కొంది. కాంగ్రెస్స్ 2009లో మాత్రం కేంద్రప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి వుంటానన్నది. వైఎస్ఆర్ విభజనకు వ్యతిరేకమని మరియు అతను రాష్ట్ర ముఖ్య నేతగా వుండగా ప్రత్యేక తెలంగాణ అసంభవమని రాజకీయాలగురించి అంతగా తెలియని వానికి కుడా తెలుసు. కానీ అంతాతెలిసిన ప్రజలు వైఎస్ఆర్ నే గెలిపించారు. తెలుగుదేశం విషయానికి వస్తే ఆ పార్టీ 2004 లో ప్రత్యేకవాదాన్ని బాహాటంగానే వ్యతిరేకించి 2009 లో మాత్రం కాంగ్రెస్ 2004 లో చూపిన రాజకీయ అవకాశవాదాన్ని పుణికిపుచ్చుకుని,దానికి తగ్గ ఫలితాన్ని చవిచూసింది.దీనికి నిదర్శనం ప్రత్యెక వాదంతో వచ్చిన తెలుదేశం పార్టీ, దాని మిత్రపక్షమైన తెరాస ల కంటే వైఎస్ఆర్ నాయకత్వంలోని కాంగ్రెస్స్ పార్టీ కి తెలంగాణా ప్రాంతంలో ఎక్కువ స్థానాలు వచ్చాయి. అప్పుడు గాని, ఇప్పుడు గాని చంద్రబాబు నాయుడు ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా ఉన్నాడని ఎవరు నమ్మలేదు. 2009 ఎన్నికలలో ప్రత్యేక తెలంగాణను గట్టిగా సమర్ధించిన పార్టీ వేర్పాటువాద తెలంగాణా రాష్ట్ర సమితి మాత్రమే.కానీ ఆ పార్టీ గెలిచిన అన్ని సీట్లలో వచ్చిన మెజారిటీ మరియు ఆ పార్టీ ఒడిపోయిన సీట్లలో ప్రత్యర్ధులకు వచ్చిన మెజారిటీ చూస్తే తెలంగాణా ప్రజా తీర్పు, ప్రజల మనోభావం మనకు తెలుస్తుంది . అప్పుడు ఘోరపరాజయాన్ని చవిచూసిన టీఆర్ఎస్ తర్వాత జరిగిన జీ హెచ్ యం సీ ఎన్నికల్లలో పొటీ చేసే సాహసం కూడా చేయలేకపోయింది.
కొందరు నాయకులు తమ స్వార్థం కోసం, కొన్నేళ్ళ పాటు యదేచ్చగా, పిట్టకథలు,పొడుపు కథలతో అసత్య ప్రచారాలు చేసుకుంటూ, ప్రజల్లో విద్వేషాగ్నుల్ని రగుల్చుకుంటూ పోతుంటే.. మిగతా నాయకులు తమకేం పట్టనట్లు చూస్తూ ఉండటమో, లేకపోతే పొత్తులతో ఆ విద్వేషాగ్నుల్లో చలికాచుకోవటానికో ప్రయత్నిస్తే, అంతిమంగా ఇలాంటి పరిస్తితులు తలెత్తటంలో ఆశ్చర్యం లేదు.మన బాధలన్నిటికీ యూదులే కారణం, వారిని అంతమొందించండని" హిట్లర్ అనగానే, మొత్తం జర్మన్ ప్రజలు గుడ్డిగా ఎలా నమ్మారా..? అనే సందేహం ఉన్నవారికి ఎవరికైనా, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు కొంత సమాధానం ఇస్తాయి.
వక్రభాష్యాలు:-----
నా అభిప్రాయంలో ప్రత్యేకవాదులు వెనుకబాటుతనానికి, వివక్షకు మధ్య తేడా గుర్తించకలేక కొంచెం అయోమయంలో ఉన్నారు. మనదేశంలో వెనుకబడిన ప్రాంతాలు చాలానే ఉన్నాయి. చూస్తుంటే ఈ ఉద్యమం చేసే వాళ్ళకి ఉత్తరాంధ్ర, ప్రకాశం, రాయలసీమల వెనుకబాటు గురించిన వివరాలు వినే దయాద్ద్ర హృదయం లేనట్టుగా ఉంది. అసలు హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిని వాళ్ళు ఎందుకు లెక్కలోకి తీసుకోవడం లేదు? రాష్ట్రంలో కొత్తగా ఏర్పడుతున్న ఉద్యోగాలలో దాదాపు నాలుగింట ఐదు వంతులు హైదరాబాద్ కు చెందినవే. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోని ఐదు ముఖ్య నగరాలు మొత్తం కలిపినా దానిలో సగముకు సమము కాలేవు. హైదరాబాద్ ఆంధ్ర ప్రదేశ్ యొక్క రాజధాని కాకపోయి వుంటే ఔరంగాబాద్ లేక ఇతర చారిత్రక దక్కను నగరాల వలెనే ఉండిపోయేది. హైదరాబాద్ అభివృద్ధికి దాని యొక్క రాష్ట్ర రాజధాని స్థానముకు విడదీయలేనంత అనుబంధం ఉంది. కావున మన రాష్ట్ర ప్రజలందరికి ఆ అభివృద్ధిలో భాగం ఉంది,బాధ్యత ఉంది.
కొంతమంది తెలంగాణా వేర్పాటువాద నాయకులు,ఉద్యమ ముసుగులో ఉన్న కొంతమంది కుహానా మేధావులు ,స్వార్ధం కోసం మావోఇజం ముసుగు వేసుకున్నవారు కలసి... సమైఖ్యాంధ్రను సమర్ధించే వారు దురహంకారులని తీర్పులు చెబుతున్నారు. ఎవరు దురహంకారులు అని వీరు తీర్పు చెబుతున్నారు? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు విగ్రహాల ధ్వంసం చేసినపుడు దానికి వ్యతిరేకముగా ప్రపంచం అంతా వాదించింది . ఎవరూ కూడా నాజీలు పుస్తకాలను తగలబెట్టదాన్నిసమర్ధించలేదు.అలాగే నేను కూడా ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను ద్వంసం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాను. ఒకవేళ ప్రపంచం మొత్తం మొదటి రెండు అంశాలలో ఉంది విధ్వంసకారులు,దురహంకారులు అన్నట్లయితే,..... ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద మతిలేని విధ్వంసం సృష్టించినవాళ్ళని, వారిని సమర్ధిస్తున్న వారిని దురహంకారులు అని అంటారని ఆశిస్తున్నాను.విగ్రహాల ధ్వంసం కన్నా, దానిని సమర్థించుకునే చర్యలు, దానిని కూడా తమ రాయకీయ లబ్ధికి వాడుకునే ప్రయత్నాలే ఇంకా ఎక్కువ బాధిస్తున్నాయి.
ఆత్మ విమర్శ:------
ఎవరిది మోసం....? ఎవరు దురహంకారులు....... ? ఎవరు ఫాసిష్టులు........ ? ఎవరు అప్రజాస్వామికులు........ ? ఎవరు చేస్తున్నది దౌర్జన్యం .....? ఉస్మానియా విశ్వవిద్యాలయములో ప్రశ్నాపత్రాలు దిద్దడానికి వచ్చిన అమాయక లెక్చరర్లను కొట్టడమా ఉద్యమమంటే ? ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న మహిళా ఉద్యోగినిల పట్ల ,ఉద్యోగస్తుల పట్ల అనుచితంగా ప్రవర్తించి వారిని ఇక్కడనుండి వెళ్ళిపోవాలని బెదిరించి,దౌర్జన్యం చేసినది/చేస్తున్నది ఎవరు ? నిన్నటి దాకా ఆంధ్రలో చదువుకుని, అమెరికాలో ఉండి,నేడు హైదరాబాద్ లో వేర్పాటువాద ముసుగులో దౌర్జన్యాలు చేస్తూ,వ్యక్తులను,సంస్థలను బెదిరిచి ,బ్లాక్మెయిల్ చేస్తూ కోట్లాది రూపాయలను పోగేసింది ఎవరు...వారి అడుగులకు మడుగులు వత్తుచూ వారి అడుగుజాడలలో నడుస్తున్నది ఎవరు ? తమ పిల్లలను ఇంటర్నషనల్ స్కూళ్ళలోను, విజయవాడలో ను,గుంటూరులోనూ,ఒంగోలులోను,మద్రాసులోనూ,కర్ణాటకలోను చదివిన్చుకొంటు....తెలంగాణలో విద్యాసంస్థలను మాట మాటకు బందులతో మూయిస్తూ,ఇక్కడి మధ్యతరగతి,పేద విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటున్నది ఎవరు ? విద్యార్ధుల జీవితాలను,ప్రాణాలను సమిధలుగా వాడుకుంటున్నది ఎవరు ? నిరుద్యోగులను ఉద్యోగ అర్హత పరీక్షలకు వెళ్ళనీయకుండా అడ్డుకొని,వారిలో నిరాశా నిస్పృహా నింపుతున్నది ఎవరు ? నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్లకు కనీసం ఈ మాత్రం తెలియదా...? లేక.... వీళ్ళు ఎవరకి అనుచరులుగా పనిచేస్తున్నారు ? తోటి యమ్ఎల్ఏ ను అసెంబ్లీ సాక్షిగా కొట్టడమా ప్రజాస్వామ్యమంటే ? రాష్ట్ర ప్రధమ పౌరుడు,రాష్ట్ర రాజ్యాన్గాదిపతి అయిన గవర్నర్ మీద దాడి చేయటమా ప్రజాస్వామ్యమంటే ?దీనినేనా మీరు ప్రజాస్వామ్యక ఉద్యమం అనేది? ఇదిగో తెలంగాణా...అదిగో తెలంగాణా ...అంటూ గడువుల మీద గడువులు పెంచుకుంటూ ప్రజలను,విద్యార్ధులను మోసంచేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటోంది ఎవరు ? అన్ని రోగాలకు జిన్దాతిలిస్మాత్ ఒక్కటే మందు అన్నట్టు,అన్ని సమస్యలకు తెలంగాణా సాధన ఒక్కటే సమాధానం అని,పట్టపగలే ఆకాశంలో అరుంధతి నక్షత్రాన్నిచూపించే విధంగా మాయ మాటలతో యువకులను తప్పుదారి పట్టిస్తున్నది ఎవరు ? ఆవేశంలో పేద,మధ్యతరగతి యువకులు ఆత్మహత్య (హత్యలు) చేసుకుంటుంటే ,ఆ చావులను తమ సొంత స్కోరుగాను,ఘనకీర్తి గాను వాడుకొంటున్నది ఎవరు ? ఆత్మహత్యలు చేసుకున్నవారిలో ఎవడన్న స్థాయిగల ఒక్క నాయకుడు గాని,వారి పిల్లలు గాని ఉన్నారా..?తెలంగాణా ఉద్యమాన్ని కుటుంబాలకోసం,కులాల కోసం తాకట్టు పెడుతున్నది ఎవరు ? ఈ ఉద్యమాన్ని ఆర్ధిక , రాజకీయ లబ్దికోసం వాడుకుంటున్నది ఎవరు ?
ఇవన్నీ ప్రక్కన పెట్టినా........,తెలంగాణాగురించి,తెలంగాణాకోసంపోరాడే మేధావులకు,పౌర హక్కుల ఉద్యమ నేతలకు ,మానవ హక్కుల ఉద్యమ నేతలకు,ఆచార్యులకు(ప్రొఫెసర్లు),న్యాయవాదులకు,న్యాయకోవిదులకు,సంఘసేవకులకు,జర్నలిష్టులకు,నేను వేసే ప్రశ్న ఒక్కటే ......మానవ హక్కులు,పౌర హక్కులు,ప్రజాస్వామిక హక్కులు ప్రజలందరికి మరియు అన్ని ప్రాంతాలకు ఉంటాయా......? లేక కొంతమంది ప్రజలకు మరియు కొన్ని ప్రాంతాలకు మాత్రమె ఉంటాయా.....? ఒకవేళ తెలంగాణా ప్రాంత ప్రజలకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం నిర్ణయాధికారం ఉన్నప్పుడు , హైదరాబాద్ నగర ప్రాంత ప్రజలకు మాత్రం అటువంటి హక్కు ఉండదా? వారు ప్రత్యేక తెలంగాణలో భాగంకాకుండా వేరు పడాలని కోరుకుంటే మీరు ఎందుకని సమర్దిన్చరు...మీకు ఉలికిపాటు ఎందుకు .......? హైదరాబాద్ గురించి వేరే వాళ్ళు మాట్లాడితే నాలుకలు కోస్తాం,బట్టలు విప్పదీసి తరుముతాం ,ఆస్తులు ఆక్రమిస్తాం అని ఉద్యమంలో ఉన్న వారు,నాయకులు అంటున్నప్పుడు మీరు ఎవ్వరన్నా వారు అనేది తప్పు అని ఖండిచారా..? ఈరోజు హైదరాబాదులో ఉన్న మీడియా సంస్థలకు,అందులోని సిబ్బందికి స్వేచ్చ ఉందా....? హైదరాబాదు మీడియాని బెదిరించి ,బ్లాక్ మెయిల్ చేసి మీకు అనుకూలంగా వార్తలు వచ్చేటట్లు మార్చుకోలేదా..? తెలంగాణలో గాని,హైదరాబాదులో గాని ఎవ్వరైనా,ఎక్కడైనా సమైఖ్యాంధ్ర గురించి మాట్లాడే స్వేచ్చ లేకుండా చేసింది మీరు కాదా...? ఇదేనా మీరు చెప్పదలచుకున్న ప్రజాస్వామిక మూలసూత్రం ? ఇవేనా మీరు మాట్లాడే మానవ హక్కులకు,పౌర హక్కులకు అర్ధం ? మీరు టీవీ లలో ,చర్చా వేదికలలో మాట్లాడే మాటలు,ఇచే ఉపన్యాసాలు మేడి పండుల్లాగా లేవా ? మీ వాదాలలో పస ఎంత ? మోకాలికి బోడిగుండుకి ముడివేసి నట్లు మీకు అనిపించటం లేదా ..? సొంత ఎజెండాలతో ఒక జెండా నీడన చేరి ప్రజాస్వామ్యాన్ని,పౌర హక్కులను,మానవ హక్కులను మీరు అపహాస్యం చేయటలేదా......? భారత జాతికి మాత ఒక్కటే ఉంటుంది...తెలుగు జాతికి తల్లి ఒక్కటే ఉంటుంది.....అంతేగాని ప్రాంతానికి ఒక తల్లి,ఊరికి ఒక తల్లి, వీధికి ఒక తల్లి ఉండదు,ఈ విషయం కనీస జ్ఞానం ఉన్నవారికి ఎవరికైనా తెలుసనుకుంటాను.సమాజాన్ని,మనుషులను,మమతలను,మనసులను చీల్చే హక్కు మీకు ఎవరు ఇచ్చారు ?
విజ్ఞత:---
ఎవరు ఎవరి ప్రతిక్రియను ఆపుతున్నారు? ఎవరు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు? 2010 లో కేసిఆర్ పై విజయవాడ లో ఎవరైనా దాడి జరిపారా? దురహంకారులైన టిఆర్ఎస్ పార్టీవాదులు తిరుమలలో రాష్ట్ర విభజనకు సమర్ధనగా నినాదాలు చేయగా వారిని ఎవరైనా ఆపారా.....? ఇతర ప్రాంతాలవాళ్ళు తెలంగాణావాళ్ళని దోపిడిదార్లు, మోసకారులు అని నినదించారా....? చైతన్యవంతులైన తెలుగు ప్రజలు అన్ని రకాల అవకాశవాదాలకూ సమాధానమివ్వడం త్వరలోనే చూడొచ్చు" అని ఆశించటం మినహా వేరే మార్గం లేదు.
దీనిని బట్టి సిగ్గుపడవలసినది ఎవరో ఇట్టే అర్ధమవుతున్నది!!
వెంకటేశ్వర్. సుంకర
బచాఓ హైదరాబాద్ కౌన్సిల్ , కన్వీనర్
బగా వ్రాస్తున్నారు. ప్రశ్నలు గట్టిగానే అడుగుతున్నారు కాని సమాధానాలు ఆశించకండి :)
రిప్లయితొలగించండిదేవతావస్త్రాలు తొడిగింది సమైఖ్యాంధ్ర ఉద్యమం. సిగ్గు లేకుండా హైదరాబాదు UT అడిగే సమైఖ్యాంధ్ర వాదులు బట్టలు విప్పి నగ్నంగా నిలబడి కూడా, తమనెవరూ చూడలేదన్నట్టు నటిస్తున్నారు.
రిప్లయితొలగించండిహైదరాబాదు ప్రజలని అడగనీయండి, వారికేది కావాలో. ప్రత్యేక హైదరాబాదు రాష్ట్రం కోసం ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యమం లేదు. అటువంటప్పుడు సమైఖ్యవాదులు గా చెప్పుకునే మీకు ప్రత్యేక హైదరాబాదు రాష్ట్రం గురించి మాట్లాడే హక్కెక్కడిది?
/హైదరాబాదు రాష్ట్రం గురించి మాట్లాడే హక్కెక్కడిది? /
రిప్లయితొలగించండిహక్కు కాదు, భాధ్యత అనాలి ఆచారిగారు. :) స్వార్థ విభజనకారుల భాధ్యతారాహిత్యం నుంచి అభివృద్ధి చెందిన రాజధానిని రక్షించుకునే ప్రయత్నం. విభజన కారులు తక్కిన తెలంగాణా అంతా వుందిగా, 'ఆత్మాభిమానం', సంస్కృతి', 'బతుకమ్మ, సమ్మక్క-సారక్క, ల ప్రాతిపదకపై విభజన కావాలనుకున్నటే, కాస్మోపాలిటన్ సిటీలో ఎలాగూ అవి వుండవు కదా. కాబట్టి విభజనకారులు నష్టపోయేదేమీ వుండదు. అంతా లాభమే! :)
దేవతా వస్త్రాలు తొడిగి నగ్నంగా నిలబడ్డామని సమైక్యవాదులు ఒప్పుకుంటున్నారా అయితే?
రిప్లయితొలగించండిహైదరాబాదు మీది కానప్పుడు హైదరాబాదు గురించి మాట్లాడే హక్కు మీకెక్కడిది? హైదరాబాదు అభివృద్ధి గురించి హైదరాబాదీలు చక్కగా చూసుకోగలరు. మీ ఆంధ్రా వాళ్ళు కాస్తా ఆంధ్రా అభివృద్ధి గురించి ఆలోచించండి మాష్టారూ. మీరు ఎంత గింజుకున్నా హైదరాబాదు మీకు మాత్రం రాదు.
ఓ పిచ్చి ఆచారిగారు, పక్క సమైఖ్యాంధ్రులు అని అంటూనే హైద్రాబాద్ మీది కాదంటున్నారే! :) ఇది అవగాహనా రాహిత్యం, తెలుగు భాష మీద పట్టు లేకపోవడం, ఉర్దూ కూడా సరిగ్గా రాకపోవడమే! :)
రిప్లయితొలగించండిమహాభారతకాలంలోనే ఆంధ్రుల ప్రస్తావన వుంది. తెలంగాణ ప్రస్తావన లేదు. తెలంగాణ అనేది మిథ్య! ప్రస్తుత తెలంగాణ కూడా మా సమైఖ్యాంధ్రులదే, హైద్రాబాద్ మా రాజధాని అని మీరు ఈపాటికి గ్రహించివుండాలే!? కాదంటే ఘనతవహించిన నిజాం ప్రభువు చెప్పినట్టు పాకీస్థాన్లో కలుస్తామని ప్రకటించడమే వేర్పాటువాదులకు మిగిలివున్నది. అలా అన్న మరుక్షణం ఆంధ్రావాళ్ళే కాదు, తమిళ, కేరళ, పంజాబ్, అస్సాం బెంగాలులంతా అన్నోళ్ళని కుళ్ళబొడిచి అణిచివేస్తాంగా.. ఆ అవసరమే రానియ్యం. సమజు చేసుకోవయ్యా యాద్గిరాచారి! :))
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండిపై మూడు వ్యాఖ్యలను తొలిగింపబడినవి.తెలుగువాళ్ళు యిలా తమతమ ప్రాంతాల పేర్లను కించపరుచుకోవడం తగదు
రిప్లయితొలగించండి/*నా అభిప్రాయంలో ప్రత్యేకవాదులు వెనుకబాటుతనానికి, వివక్షకు మధ్య తేడా గుర్తించకలేక కొంచెం అయోమయంలో ఉన్నారు*/
రిప్లయితొలగించండిచూడబోతే మీరు అయోమయంలో ఉన్నట్లున్నారు. అందుకే వనరులు లేక వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలను అన్ని వనరులూ, ముఖ్యంగా క్రిష్నా, గోదావరులు ఉండికూడా వెనుకబడిన తెలంగాణతో పోలుస్తున్నారు. తెలంగాణ ప్రజలు పోరాడేది వెనుకబాటుతనం గూర్చికాదు, వివక్షతో వెనక్కు నెట్టేయబడడం గురించి.
/*హైదరాబాద్ ఆంధ్ర ప్రదేశ్ యొక్క రాజధాని కాకపోయి వుంటే ఔరంగాబాద్ లేక ఇతర చారిత్రక దక్కను నగరాల వలెనే ఉండిపోయేది. */
హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ రాజధాని కాకపోతే తెలంగాణా, ఆంధ్ర కలయిక జరగేది కాదు, హైదరాబాదు తెలంగాణ రాజధాని అయ్యేది, అప్పుడూ ఇలాగే ఉండేది లేదా ఇంకా మెరుగ్గా ఉండేది (అప్పుడు భూకబ్జాలు చేసే కబ్జానేతలు తక్కువయే వారు). యాభై ఏళ్ళక్రితం కూడా హైదరాబాదు దేశంలో ఐదో ముఖ్యనగరమని కాస్త గమనించండి.
/*ఇదిగో తెలంగాణా...అదిగో తెలంగాణా ...అంటూ గడువుల మీద గడువులు పెంచుకుంటూ ప్రజలను,విద్యార్ధులను మోసంచేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటోంది ఎవరు ? */
ఎవరు? అధికారంలో ఉండి ఎన్నికలు రాగానే ఇచ్చేదీ తెచ్చేది మేమే అని చెప్పేవారు.
/*ఒకవేళ తెలంగాణా ప్రాంత ప్రజలకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం నిర్ణయాధికారం ఉన్నప్పుడు , హైదరాబాద్ నగర ప్రాంత ప్రజలకు మాత్రం అటువంటి హక్కు ఉండదా?*/
తెలంగాణా, హైదరాబాదు ఒక యూనిట్‌గా ఒక ఒప్పందం ప్రకారం సీమాంధ్రతో కలిసాయి. అలా కలిసేప్పుడు ఎస్సార్సీ ప్రకారం తెలంగానకు ఒక స్వతంత్ర రాష్ట్రంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు అడిగే తెలంగాణా రాష్ట్రానికి బేసిస్ అప్పటి ఒప్పందం, ఎస్సార్సీ. హైదరాబాదు తెలంగాణలో ఒక భాగం. హైదరాబాదు ఏబేసిస్‌పైన స్వతంత్ర రాష్ట్రం అడుగుతుంది? అయినా ఆవిషయం గురించి హైదరాబాదు ప్రజలు తేల్చుకుంటారు, సమైఖ్యరాగం చెప్పే మీకా గొడవ ఎందుకు?
"చూడబోతే మీరు అయోమయంలో ఉన్నట్లున్నారు. అందుకే వనరులు లేక వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలను అన్ని వనరులూ, ముఖ్యంగా క్రిష్నా, గోదావరులు ఉండికూడా వెనుకబడిన తెలంగాణతో పోలుస్తున్నారు. తెలంగాణ ప్రజలు పోరాడేది వెనుకబాటుతనం గూర్చికాదు, వివక్షతో వెనక్కు నెట్టేయబడడం గురించి"
రిప్లయితొలగించండికేసీఆర్ & ఫ్యామిలీ కో మరియు తమకు తెలియని దానిని గురించి వాదించే కుహన ప్రొఫెసర్లు చెప్పే కాకమ్మ కబుర్లు నమ్మేవారు అయోమయంలో వుండాలి కాని విషయావగాహన, నిజాలు తెలిసిన వారికెందుకు అయోమయం? క్రిష్నా(కృష్ణ కృష్ణ) హైదరాబాద్ కర్ణాటకలోను, గోదావరి మరాఠ్వాడాలోను ఇప్పుడు వున్నాయి , నిజాంపాలనలోను ఉండేవి. తెలంగాణా ఆ రెండు ప్రాంతాలను దాటుకొని గత యాభైఏళ్లలో ఎంతో ముందుకు వెళ్ళింది.భౌగోళిక, చారిత్రక కారణాలతో వెనుకబడిన ప్రాంతములు మనదేశంలో చాలానే వున్నాయి. స్వార్థపరులైన రాజకీయ నాయకులు చెప్పిన అబద్దాన్నే పదేళ్ళు చెప్పి చెప్పి ఇంతవరుకు తీసుకువచ్చారు. ఇక నిజాలను ప్రజలకు చేరవేసే సమయం ఆసన్నమయింది. http://tinyurl.com/3uu4xlq
"హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ రాజధాని కాకపోతే తెలంగాణా, ఆంధ్ర కలయిక జరగేది కాదు, హైదరాబాదు తెలంగాణ రాజధాని అయ్యేది, అప్పుడూ ఇలాగే ఉండేది లేదా ఇంకా మెరుగ్గా ఉండేది (అప్పుడు భూకబ్జాలు చేసే కబ్జానేతలు తక్కువయే వారు). యాభై ఏళ్ళక్రితం కూడా హైదరాబాదు దేశంలో ఐదో ముఖ్యనగరమని కాస్త గమనించండి"
మీరుగమనించ వలసినది ఏమంటే కుతుబ్ షాహిల కాలంలోనూ, అసఫ్ జాహీల కాలంలో చాల ఏళ్ళు హైదరాబాద్ అన్ని ప్రాంతాలకు రాజధానిగా ఉండేది.ప్రభువులందరు ఇతర ప్రాంతాలనుండి కప్పాలను ముక్కుపిండి వసూలు చేసి తమ కోశాగారాల్ని నింపుకున్నారు. మచిలీపట్టణం ఒకప్పుడు ప్రముఖ రేవు పట్టణముగా వర్ధిల్లేది. అందరు ప్రభువులు అక్కడ నుంచి జరిగే వర్తకంపై ఆధారపడేవాళ్ళు.ఇప్పుడు దాని పరిస్థితి ఏమిటి?ఒకప్పటి పాటలిపుత్రానికి యిప్పటి పట్నాకు స్వారూప్యామేమిటి?ఒకప్పుడు ఔరంగాబాద్, బీజాపూర్లు కూడా ముఖ్య నగరాలే.వెంకటేశ్వర్ గారు అన్న మాట సరైనదే. నిజాం హైదరాబాద్ రాష్ట్రాన్ని పీల్చి తాను ధనవంతుడయ్యాడు, దేశవిదేశాల్లో భవంతులు కట్టుకున్నాడు. 1948 లో హైదరాబాద్లో ప్యాలస్లు,భవనాలు తప్ప గొప్ప చెప్పుకోవడానికి ఏమిలేకపోయింది. ఇక హైదరాబాద్ రాష్ట్రం గురించి మాట్లాడాలంటే దాని పరిస్థితి కడు దీనం. అతి తక్కువ అక్షరాశ్యతతో,పట్టుమని పది గ్రామాలకు విద్యుత్తు లేక(అప్పటికి గోదావరి జిల్లా ఒక తాలుకాలోనే అంతకంటే ఎక్కువ పల్లెలకు కరెంటు వుండేది),నిజాం మరియు కొంతమంది పెత్తందార్ల చేతులలోనే దాదాపు భూములన్నీ ఉండిన పరిస్థితి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హైదరాబాద్ నగరంలో గత యాభై ఏళ్ళలో వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలు,నిధులు,పరిశ్రమలు,విద్యా సంస్థలు,ఉద్యోగాలు అన్నిటిపైన రాష్ట్రప్రజలందరికి హక్కు ఉంది, ఉంటుంది. ఇక భూకబ్జాల విషయాని కొస్తే మన వెంకటస్వామి ఎవరికీ తీసిపోయాడు? కోస్తా,సీమ నేతలకు తెలంగాణా మొత్తం ఉన్న మొత్తం భూమి ఎంత శాతం?ఒక శాతమా అర్థపాయింట్ శాతమా?ఇక్కడ రాజకీయ కుటుంబాల, ఒకప్పటి దొరల కుటుంబాల చేతుల్లో ఉన్నమొత్తం భూమి లెక్క ఏమైనది?బెంగళూరు చుట్టుపక్కల ఇక్కడి కన్నా ఎక్కువ కబ్జాలు జరుగుతున్నాయి. విభజన దానికి పరిష్కారమా?
"ఎవరు? అధికారంలో ఉండి ఎన్నికలు రాగానే ఇచ్చేదీ తెచ్చేది మేమే అని చెప్పేవారు"
తెలంగాణా ప్రాంత ప్రజాప్రతినిధులు చెప్పి ఉండవచ్చు. ఏ పార్టీ మానిఫెస్టో ఆ మాటనింది?
"తెలంగాణా, హైదరాబాదు ఒక యూనిట్‌గా ఒక ఒప్పందం ప్రకారం సీమాంధ్రతో కలిసాయి. అలా కలిసేప్పుడు ఎస్సార్సీ ప్రకారం తెలంగానకు ఒక స్వతంత్ర రాష్ట్రంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు అడిగే తెలంగాణా రాష్ట్రానికి బేసిస్ అప్పటి ఒప్పందం, ఎస్సార్సీ. హైదరాబాదు తెలంగాణలో ఒక భాగం. హైదరాబాదు ఏబేసిస్‌పైన స్వతంత్ర రాష్ట్రం అడుగుతుంది? అయినా ఆవిషయం గురించి హైదరాబాదు ప్రజలు తేల్చుకుంటారు, సమైఖ్యరాగం చెప్పే మీకా గొడవ ఎందుకు?"
1956 పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? హైదరాబాద్ ప్రజలలో అయన ఒకడు కాదని తెల్చివేశారా?అయన సూటిగా ఒక ప్రశ్న అడిగాడు. స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రం గురించి ఎవరన్నారు? హైదరాబాద్ తెలంగాణాలో భౌగోళికంగా ఒక భాగం.కాని రాష్ట్ర రాజధానిగా ఉన్న ఈ నగరంపై రాష్ట్రప్రజలందరికి హక్కు ఉంది.
@చైతన్య,
రిప్లయితొలగించండి>>> ఈ నగరంపై రాష్ట్రప్రజలందరికి హక్కు ఉంది
ఒకప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని చెన్నై పై మీ హక్కు తెచ్చుకోండి, హైదరాబాదు గురించి అప్పుడు ఆలోచిద్దాం. ఇది నేను వేళాకోళానికై అనడం లేదు, ఏ కారణాల ప్రకారం దానిపై మీకు హక్కు రాలేదో, అవే కారణాలపై హైదరాబాదుపై కూడా మీకు హక్కుండదు.
ఇచ్చేది ఎవరు? పుచ్చుకునేది ఎవరు?రాష్ట్రాన్ని,హక్కులను పంచేది ఎవరు?
రిప్లయితొలగించండినా మటుకు వస్తే హైదరాబాద్లో మా నాన్నగారు కేంద్రప్రభుత్వ ఉద్యోగం చేయడం వల్ల నా చదువు ఇక్కడే సాగింది,నా కొలువు ఇక్కడే ఉంది. ఎవడో రాజకీయ నిరుద్యోగి మాముళ్లకు ఆశపడి సిధ్ధిపేట లో ఏదో అన్నాడని ఇక్కడున్న నా మరియు నా తోటి వారి హక్కులను గురించి పునరాలోచించాలా?లేక హైదరాబాదేతర ప్రజలు ఏదో కోల్పోతామని భయపడాలా? మద్రాస్ ను తెలుగువారు ఎప్పుడో మర్చిపోయారు.రాష్ట్రం విడిపోతే ఇక్కడి నుండి సగం ప్రభుత్వ ఉద్యోగాలు,సంస్థలు తరలిపోతాయని గుర్తించాలి.ఎవరో స్వార్ధానికి తెలుగు వారి రాష్ట్రము మరియు వారి ముఖ్యనగర భవిషత్తు నాశనం కాకూదన్నదే నా లాంటి వాళ్ళ తాపత్రయం
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండి/రాష్ట్రానికి బేసిస్ అప్పటి ఒప్పందం/
రిప్లయితొలగించండిదశాబ్దాల కొద్దీ బూజుపట్టిన ప్రాంతీయతత్వ పిచ్చిపిచ్చి గొతెమ్మ కోర్కెల ఒప్పందాల మీద రాష్ట్ర నడపలేము.
కావాలంటే నాలుగు విగ్రహాలు కూల్చుకుని ఆటా-పాట, రోడ్ల పక్క దొరికే వాటితో వంటలు చేసి తిని వెళ్ళండి. :)
ఓ ఆచారిదేవా, మా సమైఖ్యాంధ్ర ప్రతినిధి ఒవైసీ జనాబ్‌తో తెలంగాణాకు 'కుబూల్ హై' అని ముమార్లు టి.వి9లో పలికించు. తెలంగాణ విషయం సీరియస్ గా సోచాయిస్తాము. :)
>>>రాష్ట్రం విడిపోతే ఇక్కడి నుండి సగం ప్రభుత్వ ఉద్యోగాలు,సంస్థలు తరలిపోతాయని గుర్తించాలి
రిప్లయితొలగించండిఅవన్నీ వట్టి భ్రమలు. రాష్ట్రం విడిపోయి, ప్రశాంత వాతావరణం ఏర్పడడం వలన మరింత అభివృద్ధి చెందుతుంది. పైగా మరిన్ని ఆధ్రాకు చెందిన సిటీలు కూడా అభివృద్ధి చెందుతాయి.
>>>సమైఖ్యంగా అంటే అన్నీ మావే, అని అర్థం.
తమరి వికృతాలోచనలు అందరికీ తెలుసు. మళ్ళీ మళ్ళీ ఎందుకు బయట పెట్టుకుంటారు?
>>>మా ఇష్టముంటే తెచ్చుకుంటాం,
మీ తరం కాకే గదా వదిలేసి వచ్చారు.
>>> ఒవైసీ జనాబ్‌తో తెలంగాణాకు...
ఎక్కడున్నావు వంకర్, అయితే రాయల తెలంగాణా, లేదా హైదరాబాదుతో కూడిన తెలంగాణా అని పార్లమెంటులోనే ఒవైసీ చెప్పాడు. బేగెళ్ళిపో. లేదా ఇక్కడే ఉండు, నిన్నేమనం లే.
చైతన్య గారు,
రిప్లయితొలగించండిమీకు చర్చ కొనసాగించాలనే ఉద్దేశం ఉంటే పై snkr వ్యఖ్యలను తొలగించగలరు. అలాంటి అర్ధం లేని ద్వేషపూరిత వ్యాఖ్యలు చర్చను తప్పుదోవపట్టించగలవు.
వీలయితే ఆ సదరు వాఖ్యాతకు ఒక వార్నింగు ఇవ్వగలరు.
భౌగోళిక, చారిత్రక కారణాలతో వెనుకబడిన ప్రాంతములు మనదేశంలో చాలానే వున్నాయి
రిప్లయితొలగించండిమీరు లోక్‌సత్తా శ్రీక్రిష్ణ కమిటీ రిపోర్టునుంచి కొట్టిన ముక్కలు బాగున్నాయి. ఆ రిపోర్టూ ప్రకారమే తెలంగాణాకు బచావత్ కమీషన్ ఇచ్చిన క్రిష్ణాజలాల వాటా 266 టీఎంసీలు. అలాట్ అయిన వాటాలో ఎంతమేర వాడుకోడానికి యాభై ఏళ్ల పాలనలో కాలువలు తవ్వగలిగారు? క్రిష్ణాకేమీ గోదావరిలాగా టోపాలజీ సమస్య లేదే? అసలు నికర వాటా లేకపోయినా మిగులు జలాల పేరు చెప్పి చేపట్టిన పనులు మాత్రం చక చకా ఎందుకు జరిగిపోయాయి? నికర జలాల వాటాను తెలంగాణాలో వాడకుండానే మిగులు జలాలకోసం ప్రాజెక్టులు కట్టడం ఇక్కడి వాటాను ఇక్కడివారికి కాకుండా చెయ్యడం కాదా? దాని ఫలితంగా బ్రిజేష్ ట్రిబ్యునల్ క్రిష్ణా జలాలలో మనవాటా తగ్గించడానికి భాద్యులెవ్వరు?
ఇక గోదావరిలో మీరు చెప్పిన టోపాలజీ సమస్య శ్రీరాం సాగర్‌కు ఎంతమాత్రమూ లేదు, మరి ముప్పై ఏళ్ళలో ఎందుకు ప్రాజెక్టును పూర్తిచెయ్యలేదు?
ఇంకా నియామకాల్లోనూ, ప్రమోషన్లలోనూ, Fఅండ్స్ అలకేషన్ లోనూ జరిగిన వివక్షలు ఎన్ని లేవు? ఒక 610 జీవో అమలుకోసం రాష్ట్రపతి స్వయంగా ఉత్తర్వు ఇచ్చినా ముప్పై ఏళ్ళుగా అమలు జరగకపోవడానికి కారణం ఎవ్వరు?
మీరుగమనించ వలసినది ఏమంటే కుతుబ్ షాహిల కాలంలోనూ, అసఫ్ జాహీల కాలంలో చాల ఏళ్ళు హైదరాబాద్ అన్ని ప్రాంతాలకు రాజధానిగా ఉండేది
మన దేశం స్వాతంత్రం వచ్చేవరకూ ఎప్పుడూ ఒక దేశంగాలేదు, నిరంతరం మారే అనేక రాజ్యాల సమూహం మాత్రమే, కాబట్టి చరిత్రలోకి వెలితే ఎక్కడికి వెలతారు? అసలు చరిత్రలో ఎప్పుడైనా ఇప్పుడున్న అన్ని జిల్లాల ప్రాంతాలు కలిసే ఉన్నాయా? కాబట్టి ఎప్పడిదో చరిత్ర మాట్లాడుకుని లాభం లేదు, మనకు స్వాతంత్రం వచ్చి మన రాజ్యాంగానికి లోబడి చేసుకున్న ఒప్పందాలను గౌరవించని వారు వెయ్యేల్ల క్రిందటి చరిత్ర చెబితే అది ఎందుకూ పనికిరాదు, లగడపాటి పీపీటీలకు తప్ప.
నేనిచ్చిన సమాధానం హైదరాబాదు ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని కాకపోతే తెలంగాణకు రాజ్సధాని అయివుండేది, అప్పుడు షుమారుగా ఇలాగే ఉండేది, దానికి మీరు సమాధనం దాటవేశారు.
తెలంగాణా ప్రాంత ప్రజాప్రతినిధులు చెప్పి ఉండవచ్చు. ఏ పార్టీ మానిఫెస్టో ఆ మాటనింది?
సోనియాగాంధీ తెలంగాణాలో చెప్పింది, రాష్ట్రపతి, ప్రధాని మన్మోహన్ అసెంబ్లీలో చెప్పారు, స్టేట్ కాంగ్రేస్ 2009 మానిఫెస్టోలో తెలంగాణాపై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఉంది, చూసుకోండి. ఇక పీఅర్పీ, టీడీపీ మానిఫెస్టోలసంగతి తెలిసిందే. మరి కేంద్రం ఒక నిర్ణయం తీసుకుని చిదంబరం ప్రకటన చేస్తే దానికి రాష్ట్ర కాంగ్రేస్ కట్టుబడి ఉందా?
1956 పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా?
1956 లో సమక్య రాష్ట్రంపై కొన్ని అనుమానాలు ఉండి ఒప్పందాలు చేసుకున్నారు, ఇప్పుడు యాభై ఏల్లలో అనుమానాలు నిజం అయినాయి, అంటే కానీ పరిస్థితులు ఏమీ మారలేదు. కలిసేప్పుడు ఒప్పందాలు చేసుకుని తరువాత ఇప్పుడు పరిస్థుతులు మారిపోయ్యయి కాబట్టి ఒప్పందాన్ని పట్టించుకోమనడం పెద్దమనుషుల తరహా కాదు, కేవలం నమ్మకద్రోహం. భారత రాజ్యాంగం ప్రకారం హైదరాబాదులో నివసించేహక్కు భారతీయులందరికీ ఉంది, అది తెలంగాణా రాజధాని అయినా ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినా. కానీ రాష్ట్ర ఏర్పాటును ఆపడం కొంతమంది మైనారిటీలకు ఉండదు.
ప్రత్యేక తెలంగాణా ఉద్యమం మేధావులకు మాత్రమె కనిపించటానికి అది ఏమన్నా రారాజు తొడిగే దేవతా వస్త్రమా ఏమి.......?
రిప్లయితొలగించండికల్లుండి చూడనట్టునటించే కబోధులకు ఏవస్త్రాలూ కనబడవు కానీ, చల్లకొచ్చి ముంతదాచినట్లు చేసే సమైక్యంధ్ర ఉద్యమానికి ఈదేవతావస్త్రాలపోలిక బాగా సరిపోతుందేమో.
శ్రీయుత అమర్ గారు లోకాన్ని సరిగా చూడతల్లెడా లేక నటిస్తున్నారా అనేది ప్రశ్న...నిదురపోయే మనిషిని లేప వచ్చు కానీ నటించే వ్యక్తిని లేపటం కష్టం. ఎందుకనుతున్నాను అంటే..610 జీ వో గురించి మాట్లాడారు అమర్ గారు.....అదే జీ వో తెలంగాణా వెనుకబాటుకు కారణం అవుతోందని వాదించిన నాయకుని అడుగుజాడల్లో వీరంతా ఉద్యమాన్ని నడపాలని చూస్తున్నారు.అంటే వీరి నాయకునికి అవగాహన లేదా..? ఉంటె ఆ రోజు అసెంబ్లీ లో అన్న మాట కరెక్టని ఒప్పుకోవాలి.....మరి నాయకునకి అవగాహన లేకపోతే మీరు నడుస్తున్న మార్గం తప్పు అని మీరు ఒప్పుకోవాలి. ఇందులో మీయొక్క ద్వంద నీతి ఇందులో తెలియట లేదా ...ఎవరికీ దేవతా వస్త్రాలు లాగా కనినిపిస్తోందో....? కొంతమంది పొద్దుతిరుగుడు పువ్వుల్లాగా ..అధికారం,నోరు,డబ్బు ఉన్న వాళ్లకు పవర్ బ్రోకర్లుగా మారి స్వార్ధంతో మీడియా మాఫియా ని తయారుచేసుకుని సమాజానికి చేటు చేయటం అమర్ గారికి బాగా తెలుసు. అన్ని వేళలా ఉడుత ఊపులకు చితకాయలు రాలవనేది నిజం.
రిప్లయితొలగించండిశ్రీయుతులు సుంకర వెంకటేశ్వర్ గారూ,
రిప్లయితొలగించండిఏ ఎండకాగొడుగులు పట్టే నాయకులు, పొద్దున్నకూ రాత్రికి మాటమార్చే నాయకులు రెండువైపులా ఉన్నారు. మనం మాట్లాడుకోవాల్సింది వ్యక్తులగురించికాదు ఉద్యమం గురించి అని నా మనవి. మీరు లగడపాటి అడుగుజాడల్లో నడుస్తున్నారంటే ఎలా ఒప్పుకోరో అలాగే తెలంగాణ కావాలనేవారంతా కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నట్లు కాదని గమనించగలరు.
మీరిక్కడ మీవిమర్శలు కొందరు నాయకులవరకే పరిమితం చేస్తే మేమూ మీతో గొంతు కలిపేవారిమి కానీ మీరు విమర్శిస్తోంది ఉద్యమాన్ని. మరి ప్రతివిమర్శలూ, సమాధానాలు రాగానే వాదనను వ్యక్తులపై మరల్చడం విగ్నుల లక్షణం కాదు, అన్యధా భావించరాదని మనవి.
1972 లో జై ఆంధ్ర ఉద్యమము ఉద్ధృతంగా సాగుతున్నప్పుడు ఏమయ్యిందీ తెలంగాణా ఉద్యమం?
రిప్లయితొలగించండిఅంతకు రెండు సంవత్సరాలముందే బ్రహ్మాందందుని రాక్షస నీతివలన పోలీసు కాల్పుల్లో ఐదొందలమందిని కోల్పోయి ఉద్యమం కుదేలయింది. మీదృష్టిలో ప్రజాస్వామ్య(?) ప్రభుత్వాలు ఉద్యమాలను బూటుకాళ్ళతో అణచివేసున్నాసరే దశాబ్దాలు అదేస్థాయిలో నడుస్తూ ప్రాణాలు కోల్పోవాలా? జై ఆంధ్రా ఉద్యమం చేస్తున్నప్పుడు మీఉద్యమానికి అడ్డుపడడానికి ఇక్కడెవరూ కౌంటర్ ఉద్యమాలు చెయ్యలేదే? ఎందుకిలాంటి వక్రభాష్యాలు? స్వాతంత్రోద్యమం కూడా అన్నేల్లూ ఒకేస్థాయిలో జరగలేదని గమనించగలరు.
ఈ వేర్పాటువాద ఉద్యమం ఐదు దశాబ్దాల ఉద్యమమా.....?
ముదేచెప్పినట్లు ఏ ఉద్యమం ఎప్పుడూ ఒకేస్థాయిలో ఎప్పటికీ నడవదు, అంతమాత్రాన లేనట్లు కాదని మీకు తెలుసనుకుంటాను. ఇకపోతే దయచేసి తెలంగాణా ఉద్యమాన్ని "వేర్పాటు" ఉద్యమమని పిలిచి మీ ప్రత్యేకాంధ్ర ఉద్యమాన్ని మీరే కించపరచుకోకండి. దేశాన్ని విడవాలనుకోవడం వేర్పాటు, రాష్ట్ర విభజన వేర్పాటు కాదని తమలాంటి పెద్దలకు తెలియనిది కాదు, ఐనా మనకి నచ్చని ఉద్యమాలపై అలా మాట్లాడ్డం, అలాంటి ఉద్యమాలు మనదగ్గర జరిగినప్పుడు మరోలా పిలుచుకోవడం మంచి లక్షణం కాదు.
ఎవరండీ కృష్ణానది విషయంలో సమస్య లేదన్నది?విషయాన్ని వక్ర ద్రుష్టితో చూస్తే అటువంటి అర్థాలే వస్తాయి. ఎగువ ప్రాంతంలో,అక్కడి నేలలలో కాలవలు తవ్వడం ఏదో ఆషామాషీ వ్యవహారం అనుకుంటున్నారా? లేక కేసిఆర్ చెప్పే సన్నాసి కబుర్లు లాగ మీరు కూడా జూరాల నుండి రామప్ప చెరువు కు కాలవ తవ్వేయవచ్చు అనుకుంటున్నారా? శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు సొరంగం,దాని సమస్యలు గురించి విన్నారా?కృష్ణా జలాలను అన్ని ప్రాంతాలకు బాగానే సద్వినియోగం చేసుకుంటున్నాము. ఒక సారి మీరు తెలంగాణాలో యాభై ఏళ్ల క్రితం కాలువల ద్వారా సాగు అయ్యే భూమి ఎంత వుండేది ఇపుడు ఎంత ఉంది అన్నదాని పై ప్రభుత్వ లెక్కలు సేకరించండి. ఇతర ప్రాంతాలు సంగతి కూడా పరిశీలించండి. మీకే అర్థమవుతుంది. లోక్ సత్తా రిపోర్ట్ గోదావరి జలాలను కృష్ణ డెల్టాకు మళ్లిస్తే అక్కడ 'ప్రయర్ యూజ్' ప్రకారం కేటాయింపబడ్డ నీళ్ళు ఎగువ తెలంగాణా, రాయలసీమ ప్రాంతాలకు(కాస్త ఖర్చు ఎక్కువైనా)ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచన వ్యక్తం చేస్తుంది. మీకు తెలుసా ఇతర ప్రాంతాలలో పోలిస్తే డెల్టా ప్రాంతాలలో సాగునీటికి ఎంత ఖర్చు అవుతుందో? నీరుకు స్వహతాగా ఉండే కిందకు పారే గుణాన్ని మానవమాత్రులు అపగలరా? మా నీళ్ళు దొంగిలిస్తున్నారు అన్న పిచ్చి వాదనకు అసలు అర్థం వున్నదా? మీరు శ్రీరాంసాగర్ స్టేజిలు గురించి మాట్లాడుతున్నారు. దానికింద వేల ఎకరాలలో సాగు చేయబడుతున్న భూమి మీకు కనిపించడం లేదా? అదంతా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే జరిగింది కదా?పోలవరం ప్రతిపాదించి 65 ఏళ్ళు అయ్యింది దాని కింద ఎన్ని ఎకరాలు సాగులో వున్నాయి?తెలంగాణా లోని ప్రాజెక్ట్ లే నత్తనడకన సాగుతున్నాయని అమాయక జనాలను ముందు నమ్మించండి. శ్రీరాంసాగర్ లోని నీళ్ళలో ఎంత తెలంగాణా ప్రాంతానికి చెందింది?ఆ ప్రాజెక్ట్ తెలంగాణకు ఎగువనే కదా ఉంది? పిచ్చి వాదనలు ఇక్కడ పనిచేయవా?
రిప్లయితొలగించండిఏదైనా ఆరోపించేముందు ప్రభుత్వ లెక్కలు తీసుకురండి. ఉత్తి మాటలతో వాదనలతో సమయం వృధా చేసుకోవడం నాకిష్టం లేదు. ఒక్క పెద్ద మనుషుల ఒప్పందం గురించి నేను ఒప్పుకుంటాను. కానీ అది కొంత మంది వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందం. ఇరు ప్రాంతాల నాయకులూ పదవులు సరిగా పంచుకోలేక దానిని తుంగలో తొక్కారు. మనం అభివృద్ధి , ప్రజా సంక్షేమ సూచికలు ఆధారంగా మాట్లాలి. అవి చూస్తే తెలంగాణాకు వివక్ష జరిగిందన్నది నిజం కాదు అని అర్థమవుతుంది. తెలంగాణా వెనుకబాటు కొత్త సంగతి కాదు.తెలంగాణా అభివృద్ధికి చర్యలు తీసుకోవలసిన భాద్యతను ఇక్కడి ప్రజాప్రతినిధులు సరిగా నిర్వహిస్తున్నారా అన్నది చర్చనీయంశం కావాలి.ఇక్కడి బడుగు,బలహీన వర్గాలు ఎందుకని ముందుకు సాగలేదు,ఇంకా భూసంస్కరణలు సరిగా అమలు చేయలేక పోవడానికి కారణాలు ఏమిటి అన్నదాని పై ఆలోచించాలి.అదేవిధంగా అన్ని వెనుక బడిన ప్రాంతాలు గురించి ఆలోచించాలి.ప్రతిదానికి విభజన మాత్రమే పరిష్కారము అని ప్రజలను మోసం చేయకూడదు.విభజన మూలంగా ఎవరికీ లాభం జరగదు కొందరు స్వార్ధ వ్యక్తులకు తప్ప.తెలుగు జాతి మాత్రం చీలిపోయి కొత్త గొడవలు మొదలవుతాయి
మీరు మానిఫెస్టో లు, CMP లు చదవండి. "ఏకపక్షంగా", అడిగిందే తడవుగా, అబద్దాలు, మోసపూరిత వాదనలు ప్రామాణికంగా రాష్ట్రం ఇస్తామని ఎవ్వరూ అనలేదు. అలగే మరోసారి చిదంబరం స్టేట్మెంట్ చదవండి. రాష్ట్ర ప్రజల ప్రతినిధులు కూర్చునే అసెంబ్లీ తీర్మానం సంగతి ఏమైయ్యింది?
మిగతావాటికి రేపు తీరిగ్గా సమాధానం ఇస్తాగానీ, అధికారం అడ్డుపెట్టుకుని అధికారికంగా చేసే వివక్షకు అధికారిక గణాంకాలెక్కడ తేవాలో సెలవిస్తారా?
రిప్లయితొలగించండిమీకు చాల తీరిక. అది అందరికి ఉండొద్దు?కొంచెం కష్ట పడితే ప్రభుత్వ శాఖల నుండి అధికారక సమాచారం రాబట్టొచ్చు
రిప్లయితొలగించండిమనం ఎప్పుడైనా నిజాల కోసం వెతికామా? పదేళ్ళు గా వింటున్న సన్నాసి కబుర్లు కాస్త పక్కన్న పెట్టి ఇతరుల అభిప్రాయాలను కూడా చదవండి http://www.myteluguroots.com/tables.html
ప్రభుత్వ శాఖలే విడుదల చేసే గణాంకాలు మనకు పట్టవు, వాటిని శ్రీ కృష్ణ కమిటీ తమ రిపోర్ట్ లో పొందుపరిస్తే ఆ వంక మనం చూడం, లోకసత్తా లాంటి పార్టీ రిపోర్ట్ తయారు చేసి తమ సైట్ లో పెట్టిన వాటిమీద మనకు నమ్మకం కుదరదు.
మీ తీరిక సమయాలలో అటువంటి సమాచారం సేకరించండి.
ఒహో! తమరి పరిగ్నానమంతా నలమోతు చక్రవర్తి దగ్గర కొట్టుకొచ్చిందా, మరి చెప్పరే? తెలంగాణా వాడినని బొంకుతూ తెలుగు జాతి ఐక్యతగురించి ఆంగ్లంలో రాసిన లగడపాటి తొత్తు దగ్గరికెల్తే అధికారిక వివక్ష యొక్క అధికారిక గణాంకాలు దొరుకుతాయా?
రిప్లయితొలగించండిఇలాంటి సన్నాసుల దగ్గర నేర్చుకుని మీరు సన్నాసి కబుర్లు చెబుతున్నారా? మీరూ కాస్త ఇది చదవండి.
https://myteluguflowers.wordpress.com/
నాకు తెలిసి నల్గొండ జిల్లా తెలంగాణా లో ఉంది కాని మనం మనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళను తెలంగాణా ద్రోహులు చేసేయము?పాపం అయన ఏమి చేసాడు?ప్రభుత్వ గణాంకాలు, వాటిని ఎక్కడి నుంచి సేకరించారో చెప్పడమే తప్పా? అందరు టిఆర్ఎస్ వాళ్ళు చెప్పే గాలి కబుర్లు నమ్మరు కదా?
రిప్లయితొలగించండిఇప్పటికి ఇది నాలుగో సారేమో,ఈ లగడపాటి ఎవరండీ బాబు ప్రతీ సారి మీ మరియు మీ స్నేహితుల కామెంట్స్ లో తల దూరుస్తాడు? ఆయనేమైన ఉద్యమం మొదలుపెట్టి అందరికి సన్నాసి హితభోద చేస్తున్నాడా ఏమి? శ్రీ కృష్ణ కమిటీ, లోక్ సత్తా రిపోర్ట్ ఇలా నిజాలను చూపే దేనినీ చూడకుండా కళ్ళున్నా గుడ్డివాడిలా నటిస్తే ఎలాగండి? మనం మన ప్రభుత్వాన్ని నమ్మక పొతే ఎవరిని నమ్ముతాము? పిట్టకథలు చెప్పేవాడినా?
అవును మిత్రమా చైతన్యా......శ్రీమాన్ అమర్ గార్కి ఒక్కక్షణం తీరిక కూడా ఉండదు ,ఎందుకంటే వీరు పిట్టకధల ఘనాపాటిలను ఒక్కతాటిమీదకు తెచ్చ్చే పని మరియు గారడీ మాటలతో తెలంగాణా ప్రజలను మాయ చేసేవాళ్ళను,అధికార బలంతో రాష్ట్రాన్ని దోసుకుని ఆ డబ్బు మదంతో మీడియా ద్వారా రాజకీయం చేద్దామనుకునేవారిని (వీరు సమైఖ్యవాదులని, తెలంగాణా లోకి అడుగుపెట్టనీయమని.....కనీసం రైలులోనుండి కిందకు కాలుపెట్టనీయలేదు ), మానవహక్కులు,పౌరహక్కులు,ప్రజాస్వామ్యం,పత్రికావిలువలు లాంటి విషయాల్లో (ప్రజలకు మాత్రమే నీతులుచేప్పి..వీళ్ళు మాత్రం ఆచరించరు) మాకంటే గొప్పవాళ్ళు,మాకు సరితూగేవాళ్ళు ఇంకెవరూ లేరు అని టీవీల్లోను,సభల్లోనూ దర్పాలు ఒలికించే పోద్దుతిరిగుడుపువ్వులు,నేతిబీరకాయల్లాంటి వారిని ఏకం చేసేపని (అంటే ...ఇలాంటి పని చేసే వారని దళారీలు,బ్రోకర్లు,లాబీఇష్టులు అంటారులే) లో పూర్తి గా బిజీలో ఉన్నట్టున్నారు......
రిప్లయితొలగించండిఎవరండీ కృష్ణానది విషయంలో సమస్య లేదన్నది?విషయాన్ని వక్ర ద్రుష్టితో చూస్తే అటువంటి అర్థాలే వస్తాయి. ఎగువ ప్రాంతంలో,అక్కడి నేలలలో కాలవలు తవ్వడం ఏదో ఆషామాషీ వ్యవహారం అనుకుంటున్నారా?
రిప్లయితొలగించండిసమస్యలు లేవని ఎవరూ అనలేదు. ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వాల చిత్తశుద్దిని మాత్రమే ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కుడి కాలువను మద్రాసు దాకా తీసుకెల్లి సీమంతా తడిపి కడపలో రాజావారి ఫాక్టరీలకు సైతం నీళ్ళిచ్చినవారు ఎడమకాలువపై ఎంత శ్రద్దచూపారన్న విషయంపైనే ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. లెక్కలు లెక్కలు అని అడిగే మీరు శ్రీసైలం కుడికాలువకు, ఎడమకాలువకు విడుదలైన నిధుల లెక్కలను కాస్త తెప్పించుకుని చూడండి. వెలిగొండలో ఆఘమేఘాలమీద సొరంగాలు తొవ్వినవారు ముప్పై ఏల్లలో ఒక వందమీటర్లు సైతం ఇక్కడ ఎందుకు తవ్వలేకపొయ్యరో తెలుసుకోండి.
మీకు తెలుసా ఇతర ప్రాంతాలలో పోలిస్తే డెల్టా ప్రాంతాలలో సాగునీటికి ఎంత ఖర్చు అవుతుందో? నీరుకు స్వహతాగా ఉండే కిందకు పారే గుణాన్ని మానవమాత్రులు అపగలరా? మా నీళ్ళు దొంగిలిస్తున్నారు అన్న పిచ్చి వాదనకు అసలు అర్థం వున్నదా?
వహవా, చక్కటి పాయింటు పట్టారు. మరి నీరు పల్లం వైపే వెల్తుంది కదా అలాగే వెల్లనిద్దామని మొత్తం క్రిష్ణా, గోదావరి నీరు ఆంధ్రాకే ఇచ్చేస్తే మహారాష్ట్ర, కర్ణాటకలు ఊరుకుంటాయా? డెల్టా ప్రాంతంలో కాలువలు తొవ్వడం సులభం అని చెప్పి మొత్తంగా తీసుకుందామా మరి? కర్ణాటకా, మహారాష్ట్ర వేరే రాష్ట్రాలు కనుక ఎత్తులో ఉన్నా తమ హక్కును కాపాడుకుని నీరు వాడుకుంటున్నాయి, ఇక్కడ ఒకే రాష్ట్రం కనుక తెలంగాణాలో తమ వాటాలో ఉన్న నీరు కూడా కాకుండా పోతుంది, ఇక్కడ వాడక మిగిల్చిన నీటిని మిగులు నీరని చెప్పి రాజా గారు సీమకు తరలిస్తున్నారు. అందుకే తమ హక్కును కాపాడుకోవడం కోసమే ఇక్కడ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్నారు. ఇదంతా మీకు తెలియక కాదు.
ఇక 610 జీవో గురించీ, గిర్గ్లానీ కమీషను గురించి తమ దగ్గర సమాధానాలు లేనట్లున్నాయి, దాటవేశారు మహానుభావులు. కాకిలెక్కలు చూపించి మీకేమీ అన్యాయం జరగలేదు, ఇదిగో చూడండి అని మీ జేపీ గారో, లగడపాటో చెబితే నమ్మే స్థితిలో ఇక్కడి ప్రజలు లేరు. ఉద్యోగులకు, లాయర్లకు వివ్ధ ప్రభుత్వ శాఖలలో ఎదురవుతున్న వివక్షలకు లెక్కలుండై, స్వయంగా అనుభవించినవారికి తెలుస్తుంది, జేపీకి కాదు. అందుకే నేడు స్వచ్చందంగా ఉద్యోగస్థులూ, లాయర్లూ ఉద్యమిస్తున్నారు. తమరి కాకమ్మ కబుర్లు ఇంకెవరికైనా చెప్పుకోండి. ఇక్కడ తమ హక్కులు కాపాడుకోవడానికి సమైక్య రాష్ట్రంలో వీలు కావట్లేదని ప్రత్Yఏక రాష్ట్రం అడుగుతున్నారు, మీసొమ్మేమీ అడగట్లేదు కదా, మీకెందుకు ఉలుకు?
భవదీయులు సుంకర వెంకటేశ్వర్ గారూ,
రిప్లయితొలగించండినాకెంత తీరికుంది, మీకెంత తీరికుంది, తీరిక వేళల్లో మీరేంచేస్తున్నారు, నేనేం చేస్తున్నాను అనే దానిపై ఇక్కడ చర్చ జరగట్లేదు. మీరు మీ టపాలో ఎడాపెడా తెలంగాణా ఉద్యమంపై బురద చళ్ళారు, ఇప్పుడు వివరణలు, ప్రతివిమర్శలు రాగానే చర్చ చెయ్యలేక వ్యక్తులపై బురద జల్లుడు కార్యక్రమం పూనుకోవడం తమవంటి పెద్దలకు భావ్యం కాదని ఇంతకు ముందే తమకు మనవి చేసుకున్నాను.
మీరెంత కష్టపడ్డా తెలంగాణా ఆకాంక్షను విమర్శించడానికి మీకు తర్కబద్దమయిన వాదనలెన్నటికీ దొరకవు, అందుకే ఇలాంటి తర్కహీనమయిన వాదాలు చేస్తూ, ఎవరైనా సమాధానం ఇవ్వగానే వారిపై ప్రతిదాడి చెయ్యడం జరుగుతుంది. హేతుబద్దమయిన ప్రజలాకాంక్షను వ్యతిరేకించడానికి హేతువు దొరకదని తెలుసుకోండి.
నాకు తెలిసి నల్గొండ జిల్లా తెలంగాణా లో ఉంది.
రిప్లయితొలగించండినల్లగొండ జిల్లా, హైదరాబాదు జిల్లా రెండూ తెలంగాణాలోనే ఉన్నాయి, కానీ అక్కడ ఉన్నవారందరూ తెలంగాణవారు కాబోరని తమరు గ్రహించాలని నా మనవి. తణుకు నుంచి హైదరాబాదు వచ్చి ఇక్కడ "హైదరాబాద్ బచావో" అంటూ ప్రచారం మొదలు పెడితే ఎంత విడ్డూరంగా ఉంటుందో అలాగే గుంటూరునుంచి నల్లగొండలో సాగర్ కాలువ వస్తుంది, తక్కువధరకు తెలంగాణా రైతుదగ్గర కొనుక్కుందామని చెప్పి పెద్దమనుషుల ఒప్పందాలను బుట్టదాఖలు చేసి కొనుక్కుని ఉంటున్నవారు నేను తెలంగాణావాడినని చెబితే అలాగే ఉంటుంది.
ఈలగడపాటి ఎవరు బాబూ అని రాసినట్టున్నారు, లగడపాటికీ నల్లమోతుకూ ఉన్న లింకులు మీకు తెలియకపోవచ్చుకానీ ఇక్కడ తెలుగు బ్లాగర్లకు బాగా తెలుసు. నేనిచ్చిన లింకులో మొదటి టపా చదవండి.
ఎవరి హైదరాబాదును ఎవరినుంచి ఎవరు బాచవ్ చేస్తున్నారో మరి?
గాలి కబుర్లే నమ్ముతాను,నిజాలు నాకు అక్కరలేదు,నేను చదవను,వినను,చదివిన దానిని నేను ఒప్పుకోను అనేవాళ్ళకి చెప్పేదేమీ లేదు. చదవలిసిన వారు చదివితే చాలు. భలే మాట్లాడతారండి మీరు! గాలిలో లెక్కలు చేసేసి చూపించడానికి ఇదేమన్నా గారడీనా? అధికారక లెక్కలకు, కొంత మంది వ్యక్తులకు విశ్వసనీయత అంటూ ఉంటుంది. మీకే తెలుసు సన్నాసి కబుర్లు చెప్పే వాళ్ళ విశ్వసనీయత ఏమిటో. నేను చెప్పవలసిన అవసరం లేదు. మిమ్మల్లి మీరు మోసం చేసుకోకండి.
రిప్లయితొలగించండిఅంత స్వచ్ఛందంగా ఉద్యమిస్తున్న వాళ్ళు ఉద్యమించే ముందు హరీష్ రావు లేదా ఈటెల తో రోజులపాటు సమాలోచనలెందుకండి? మమ్మల్ని ధిక్కరించి పనిచేస్తే మర్యాద దక్కదు అని తోటి వారిని బెదిరిస్తారెందుకండి(సాక్షాలు కావాలంటే రండి.బయటకు మాట్లాడితే ఏ పనికిమాలిన వెధవ ఇంటి మీద పడతాడో అని భయపడుతున్నవారిని రహస్యంగా కలుద్దాం). ఒక వైపు మా ప్రాంతం వాళ్ళు 10 % కూడా లేరంటారు మరోపక్క టి.వి స్టూడియోలకుకెక్కి 90 % మాతో ఉన్నారంటారు.ఒక పక్క మేము సహాయనిరాకరణ చేస్తున్నాము, పని చేయమంటారు మరోపక్క పే బిల్లుల పని మాత్రం చేసుకుంటారు. ఏది ఒకేఒక్క నెల పాటు జీతాలు తీసుకోకుండా 'సహాయనిరాకరణ' చేయమనండి చూద్దాం. తెలంగాణా జనాభాలో ఉద్యోగస్థులూ, లాయర్లూ ఎంత శాతం? సామాన్య జనం, రైతులు, వ్యాపారవేత్తలు, రోజు కూలిచేసుకునే వారు ఎందుకని ఉద్యమాలు చేయడం లేదు?
మీకు కబుర్లు చెప్పడానికి నేను సిద్దంగా లేనంన్దోయ్. మీరే కబుర్లు వింటానని వచ్చారు.దేశం, అందులోని రాష్ట్రం అందరి సొంతం. నా సొమ్ము పోకపోతేనేమి? వ్యక్తిగత స్వార్ధాల కోసం మోసపూరితమైన వాదనలతో మరియు వాగ్దానాలతో ప్రజలను ఏమార్చి, వారి మధ్య వైషమ్యాలు సృష్టించి, పబ్బం గడుపుకుందామని అనుకొనే వాళ్ళను వ్యతిరేకించి, తెలుగు వాళ్ళు అందరం ఐక్యంగా వుండాలని నేనంటే మీకేం పోయింది?
బురద జల్లుడు కార్యక్రమం గురించి మాట్లాడారు కదా మీరు? ఎమున్నడా లింక్ లో పనికి మాలిన చెత్త తప్పా? దానిని రాసిన వాడేమన్న దేవుడా, ఆ రాతలేమన్న భగవద్గీతనా?నల్లమోతు చక్రవర్తి రాసిన బుక్ లో ఒక్క వాక్యం పట్టుకుని ఇదుగో ఇది తప్పు అని వాదించచేతకాదు కానీ, మోకాలుకీ బోడి గుండుకి లింక్ లు పెట్టడం చేతనవునే ఆయనికి? కాస్త టివి ప్రపంచం వీడి బయటకు రండి? ఎవరా లగడపాటి? ఆయనకు సమైక్య వాదులు ఇవ్వని ప్రాధాన్యం మీరెందుకు ఇస్తున్నారు? ఆయనకు రాజకీయాలు లేకపోతే వ్యాపారాలు చేసుకుని బ్రతుకుతాడు. ఆయన సమైఖ్యవాదంతో పోడుస్తున్నది ఏమిటి? లగడపాటిని చివరి సారి చర్చ కార్యక్రమాలలో ఎప్పుడు చూశారు మాస్టారు?
రిప్లయితొలగించండిఎవరి హైదరాబాద్ ని ఎవరు బచావో చేస్తారు అని అన్న శ్రీమాన్ అమర్ గారికి ....................
రిప్లయితొలగించండిమీలాంటి వాహినీ వారి "పెద్దమనుషులు" , నేతిబీరకాయల్లాంటి మేధావులతో సరితూగే శక్తి యుక్తులు మాకులేవు "దొరా"....మాది మీ అంత స్థాయి కాదు సారూ.....మాకు మీకున్నంత నోరు లేదు తిమ్మిని బొమ్మి చేయటానికి.మాకు మీ వెనకున్న అన్ని శక్తులు లేవు.మేము ఎవరినీ బెదిరించాలేము.మేము దౌర్జన్యం చేయలేము,మేము భూ కబ్జాలు చేయలేము,అంతకంటే .....మాకు రాజకీయాలు అస్సలు తెలియవు/రావు కూడా.మేమేదో ఉన్నది ఉన్నట్టు,కళ్ళకు కనిపించింది,ప్రపంచం అంతా నిమ్మింది,ప్రపంచం ఆచరించేది,సమాజానికి హితవైనది,సర్వేజనాః సుఖినోభవంతు అని మాట్లేడే వాళ్ళం, మా బతుకు మేము సొంతంగా బతికే వాళ్ళం..హైదరాబాదు ఎవడో అబ్బసోమ్ము కాదు, ఎవరి జాగీరు కాదు.....ఎవడో హుకుం జారీ చేస్తే ..జీ హుజూర్ అనటానికి ఇక్కడేవ్వరు సిధంగా లేరు సారూ.ఉడుత ఊపులకు చింతకాయలు అస్సలు రాలవు సారూ. ఇక్కడ మాకేవ్వరు నాయకుడు లేదు సారూ.....మేము అందరమూ నాయకులమే...మేము అందరమూ కార్యకర్తలమే సారూ..,..మాకు లగడపాటి అయినా, కల్వకుంట్ల అయినా,నాగం అయినా,కోదండం అయినా కోన్కిస్కా నే సారూ.....మేము మౌనంగా ఉండటం అసమర్ధత అనుకోకండి.....గోవుల కొమ్ముల్లో ________పుట్టుకోస్తై దొరా...పిల్లిని గదిలో పెట్టి కొడితే పులి లాగా మారుతుంది సారూ ....మమ్మల్ని దయచేసి అలా తయారుచేయకండి దొరా........ఇది హైదరాబాదు భారత దేశంలో భాగం. ముఖ్యంగా ఆరు దశాబ్దాలుగా తెలుగు జాతికి ,ఆంద్ర ప్రదేశ్ కి రాజధాని ......... .తణుకు నుండి వచ్చినా ...తంజావూరు నుండి వచ్చినా .....తాండూరు నుండి వచ్చినా......తిరపతి నుండి వచ్చినా..........హైదరాబాదు అందరిది,ముఖ్యంగా తెలుగు జాతిది. కొంతమంది దురహంకారులు మాత్రమె మాట్లాడుతున్న "హైదరాబాదు గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తాం" అనే మాటలకు మీలాంటి వారే స్క్రిప్ట్ తయారు చేస్తున్నట్టున్నారనిపిస్తోంది.ఇక్కడ రాజధాని కాబట్టి ఆరు దశాబ్దాల తెలుగు జాతి స్వేదం ఇక్కడ పారుతోంది అని విజ్ఞులు అంతా నమ్ముతారు.సొంత వూళ్ళో ఉన్న ఇల్లు, వాకిళ్ళు,పొలాలు అమ్ముకుని ఇక్కడ ఉద్యోగాలు ,వ్యాపారాలు,కాయకష్టంతో కూడా పెట్టుకుని బతుకుతున్న వారిని వేర్పాటువాదంతో భయభ్రాంతులకు గురిచేసి దోపిడీ సాగిద్దామనుకునే వాళ్ళనుండి, అత్తరు పారే హైదరాబాదు నగరంలో విద్వేషాలతో నెత్తురు పారించాలని చూసే అరాచక వ్యక్తులు,శక్తులు,రాజకీయ రాబందుల నుండి హైదరాబాదు ని బచావో చేయాల్సిన / చేసుకోవాల్సిన అవసరం మా అందరిపైనా ఉంది.అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలతో,వేర్పాటువాద సంస్థలతో సంభంధాలు పెట్టుకుని చైనాలో వానొస్తే ఇక్కడ గోడుగులేసుకునే వారు,చరిత్రని వక్రీకరించే వాళ్ళు,నిజాన్ని సమాజాన్ని హ్రస్వ దృష్టితో చూసే కబోదుల్లాంటి మేధావులు,ప్రపంచానికి మాత్రమె సూక్తి ముక్తావళి భోదిస్తూ వారు మాత్రం ఆచరించని వారు,శవాలమీద పేలాలు ఏరుకునే వాళ్ళు,గారడీ మాటలు,పిట్టల దొర మాటలు చెప్పి ప్రజలని ఎమార్చేవాళ్ళు,బతుకుదేరువుకి కమ్యునిజం,మాఒఇజమ్ ముసుగు వేసుకుని సమాజాన్ని భయభ్రాంతులని చేసేవాళ్ళ నుండి హైదరాబాదుని బచావో చేయాల్సిన/చేసుకోవాల్సిన అవసరం1 కోటి హైదరాబాదు పౌరులకు,10 కోట్ల తెలుగు వారికి...120 కోట్ల భారతీయులకు అందరికి భాద్యత ఉంది. దీన్లో మీరు ఏమన్నా మినహాఇమ్పెమొ మరి ఆలోచించి సెలవివ్వండి పెద్ద సారూ...
లగడపాటి లాంటివారు స్వయంగా ఉద్యమం చెయ్యరు, వారు టీవీషోకొచ్చి మాట్లాడినా ఎవరికీ అర్ధం కాదు, ఎవరూ నమ్మరు కూడా. అందుకే ధనబలంతో ఇలాంటి నలమోతులను రంగంలోకి దించుతారు. అదిగో తెలంగాణా వాడె చెబుతున్నాడు కలిసుందామని అని ప్రచారం చేస్తే అతని దొంగ ఉద్యమానికి ఏమయినా క్రెడిబిలిటీ వస్తుందేమోనని. దానికోసం తెలంగాణా వారెవరూ దొరక్కపోతే గుంటూరునుంచి నల్లగొండ కాలవకిందికి వలస వెల్లి అమెరికాలో ఉంటున్న నలమోతును పట్టుకున్నాడు. ఇదంతా మీకు తెలియక కాదు.
రిప్లయితొలగించండినేనిచ్చిన లింకు రచయితగురించి అగౌరవంగా మాట్లాడకూడదని మనవి, అతను ఇక్కడి తెలుగు బ్లాగుల్లో సుపరిచితుడు, క్రెడిబిలిటీ ఉన్నవాడు, ఒక దళారీ పశ్చాత్తాపం రచయిత. మీకు నచ్చిన నలమోతునే దేముడనుకుంటే అది మీ ఇష్తం, నన్నెందుకు చదవమని చెప్పారు? మీకు నచ్చితే చదివి ఇక్కడ రాయండి, చర్చించుకుందాం.
మీరేమి అనుకోక పొతే మీరు కూడా పిట్టకథలు బాగానే చెబుతారండి. మీరు ఆ పుస్తకాన్ని చదవలేదు అని అర్థమవుతుంది. ఎవరో చెబితే దానినే గుడ్డిగా వేదవాక్కులా పాటిస్తున్నారు. నవ్వదగిన విషయం ఏమిటంటే ఆ చెప్పేవాడు కూడా ఆ పుస్తకాని చదవలేదు. కాని ఆయనకు, మీకు అన్నివిషయాలు తెలుసు(అన్న భ్రమ). నలమోతుగారి తో నాకు పరిచయం ఉంది. ఆయన అమెరికా వదిలి ఇండియాలోనే జాబు చేస్తున్నారు. ఆయన స్వస్థలం నల్లగొండ జిల్లాలోనే ఉంది. ఆయన పూర్వికులు ఎక్కడివారో నాకనవసరం.తెలుగు జాతిని,తెలుగు బాషని స్వతహాగా అభిమానించే వాళ్ళే అటువంటి పుస్తకాన్ని వ్రాయగలరు.నాకు తెలిసి ఆయనను ఎవరూ పట్టుకోలేదు లేక దించలేదు. ప్రత్యేకవాదుల్లాగా ఆయన సొంతంగా వండి వార్చిన లెక్కలు ఆ పుస్తకం లో లేవు. మీ చుట్టూ ఉన్నవాటి ప్రభావం మీపై ఉన్నట్లుంది.వసూళ్ళు, ప్రాపకాలు,వైషమ్యాలు సృష్టించడం,పిచ్చిరాతలు రాయడం,ఇవేకాకుండా రాష్ట్రం సమైఖ్యంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఈ రాష్ట్రమంతటా ఉన్నారు. వారందరూ ఎటువంటి వాతావరణంలో నోరు మెదపలేకపోతున్నారో ప్రజలకందరికి తెలుసు. పొరపాటున ఎవరైనా సాహసం చేస్తే మీకు లగడపాటి గుర్తొస్తాడు. ఇంకొక సారి అడుగుతున్నాను. ఎవరా లగడపాటి?ఆయనకు టిఆర్ఎస్ మరియు ప్రత్యెక తెలంగాణావాదులు ఎందుకింత ప్రాధాన్యం ఇస్తున్నారు?ఈ లగడపాటి భజనను చూసి అది మూర్ఖత్వం అనుకోవాలా లేక ఏదో రహస్య అవగాహన ఉందని అనుమానించాలా ?అనుమానించడం మీ ఒక్కరి జన్మహక్కా?
రిప్లయితొలగించండికాస్సేపు తెలుగులో సరిగా మాట్లాడలేనివాడూ, తెలుగు నాకురాదని స్వయంగా చెప్పుకున్నవాడూ, తెలుగులో రాయడం చేతకాక అనువాదకున్ని పెటుకున్నవాడు తెలుగుభాష, జాతిపై ప్రేమకలిగినవాడని మీరు పిట్టకథలు చెబితే నమ్మేస్థితిలో ఎవరూ లేరు. అతని పూర్వీకులు ఎక్కడివారో మీకవసరం లేకపోవచ్చు కానీ తెలంగాణా వారికి అవసరమే. ఇకపోతే నలమోతుగురించి ఇక్కడ చర్చ అనవసరం, అది మీరు తీసుకొచ్చారు. ఎవరు వండి వార్చారో, ఎవరివి సరైన లెక్కలో వట్టిమాటలు ఎందుకులే, మీరు తీసుకొచ్చిన లెక్కలపై మీరెంతవరకూ చర్చించగలిగారు?
రిప్లయితొలగించండిప్రత్యేకవాదాన్ని విమర్శించేవారు కేసీఆర్కెందుకంత ప్రాముఖ్యతనిస్తారు? నిజంగా తెలంగాణా కావాలని అనుకునే వారంతా తెరాస వెనుకే వుంటే ఇంతవరకూ ఎందుకు పెద్దగా గెలవలేదు? ఇప్పుడున్న పరిస్థుతులదృష్ట్యామిగతా అన్ని పార్టీలు తెలంగాణకు ఇప్పటికే ద్రోహం చేశాయి కనుక తెలంగాణకు ఇప్పుడు వోటేస్తారేమో, అంతమాత్రాన అంతా కేసీఆర్ వెనుక ఉన్నారా మరెందుకు తెలంగాణా ఉద్యమానికి కారణాలను విమర్శించలేనివారంతా కేసీఆర్‌ను విమర్శించి తెలంగాణా ఉద్యమాన్ని ఏదో చిన్నబుచ్చినట్టు చంకలు గుద్దుకుంటారు?
మీరిక్కడ విశాలాంధ్ర మహాసభ అంటూ పెట్టుకుంది ఎవరికోసం? సీమాంధ్రవారు ఎలాగూ మీవైపే ఉన్నారంటున్నారు కదా( అది కూడా పూర్తిగా నిజం కాదు, అక్కడి దలితులు వెనుకబడినవారు విభజనకే మద్దతిస్తున్నారు). మరి మీరు సమైక్యంగా ఉండాలంటే తెలంగాణ ప్రజల మనసులు గెలుచుకోవాలి, మీరు చేస్తున్నదేమిటి? మీ సుంకరగారు రోజుకుపది టపాల్లో వేర్పాటు వాదమంటూ వెక్కిరిస్తాడు మరి మీ ప్రత్యేకాంధ్ర ఉద్యమం వేర్పాటువాదమా? మీటపాలన్ని తెలంగాణా ప్రజలను హేళన చేస్తూ రాసే కవితలు, పచ్చి అబద్దాలు, కేసీఆర్‌పై తిట్లు, సెటైర్లూ, ఇలాంటి టపాలతో మీరు కలిసి ఉండడం కోసం ఇక్కడివారికి ఏం చెబుతారు? ఒకవైపు కలిసుండాలంటూ మరోవైపు వెక్కిరించే మీకూ లగడపాటికీ ఏమిటి తేడా?
వెంకటేశ్వర రావు గారు, బాగా చెబుతున్నారు. కొత్త విషయాలు తెలుస్తున్నాయి. చిన్న పేరాలుగా రాస్తే చదవడానికి బాగుంటుంది.
రిప్లయితొలగించండిఅమర్ వాదనలో కొత్తేమీ లేదు " మేము కావాలంటున్నాం, ఇచ్చేయండి" -ఇదే. ఎందుకివ్వాలో సహేతుక కారణాలు చెప్పి(ఒక్కటైనా అర్థవంతంగా వుండాలి సుమా..) దానికోసం ఎన్ని సార్లు ఇలాంటి వుద్యమాలు ఆపకుండా చేశారో కూడా చెప్పి, విభజిస్తే తప్ప ప్రాబ్లం సాల్వ్ కాదని నిరూపించి, అన్న చెత్త తిట్లకు బేషరతుగా క్షమాపణ చెబితే ...మీ డిమాండ్లను మరో కమిటీ వేసి ఆలోచిస్తాము.
మొదటి లైను లో ఆయన చెప్పేది నమ్మి రెండో లైనులో మాత్రం నమ్మరా?నమ్మకండి. సొల్లు కబుర్లు వింటూ, గిరిగీసుకొని కూర్చొని ఏమి చదవకుండానే తీర్పులు ఇచ్చేయండి. తెలుగు భాషనీ, తెలుగు జాతిని ఎంతో మంది పరబాష మాట్లేడేవారే అభిమానించారు. ఇక్కడి పుట్టి పెరిగిన వారికి అభిమానం ఉండకూడదా? లేక అది కూడా ఉద్యమాలు చేస్తున్న ఎంతో మంది లాగా డబ్బులిచ్చి కొనుక్కునే సరుకేనన్నది మీ భావనా ?తెలంగాణాలోని అందరి పుట్టు పూర్వోత్తరాలు తెలుసా మీకు? అన్ని లెక్కలకు ఆధారాలున్నాయి. అవి ప్రభుత్వ లెక్కలు మహాప్రభో అని మొదటి నుండి మొత్తుకుంటున్నాను? మీరు చక్రవర్తి వెంట పడ్డారు, లగడపాటిని లాగారు, జేపీ పై నమ్మకం లేదన్నారు , శ్రీ కృష్ణ కమిటీ విషయాని కొస్తే వాళ్ళు సీమాంధ్రర నేతలకు అమ్ముడుపోయారు అని కమిటీ ఏర్పడక ముందే తేల్చిఉంటారు. కేసిఆర్ ఆయన కుటుంబ సభ్యులకు ఒకరు ప్రాముఖ్యం ఇవ్వాలా? వాళ్ళ వాగుడు రోజుకు ఒక్కసారి చూపకపోయినా పేపర్లు, చానల్స్ లగడపాటి జేబు సంస్థలు అయిపోతాయి కదా?విశాలాంధ్ర మహాసభ ఎందుకు పెట్టారో వెబ్సైటులో రాసి ఉంది. చదువుకోండి. సుంకర గారు ఆయన వ్యక్తిగత హోదాలో వ్రాస్తారు. ఆయననేమి ఎవరిని వెక్కిరించలేదు. అబద్దాలు, తిట్లు గురించి మీరు మాట్లాడకూడదు. ఉద్యమం పేరుతో జరిగే అరాచకాలను సమైఖ్యవాదులు ఎల్లకాలం సహించరు
రిప్లయితొలగించండినలమోతు గురించి చర్చ అనవసరమని ముందే చెప్పాను. అవి ప్రభుత్వ లెక్కలు అని గొంతు చించుకుంటాన్నారు, నేను కూడా ప్రభుత్వమే చేసిన వివక్ష తప్పని చెప్పడానికి ప్రభుత్వలెక్కలు ఎంత వరకూ పనికొస్తాయి అని గొంతుచించుకొంతున్నాను, మీకు వినబడలేదేమో. పోనీ ఆప్రభుత్వలెక్కలు తీసుకొచ్చి మీరేమైనా నిరూపించారా అంటే అదీలేదు, ఇరిగేషన్ విషయంలో, గిర్గ్లానీ కమీషన్, 610 జీవో విషయంలో చేతులెత్తేశారు? మీకు అనుకూలంగా ఉన్న శ్రీక్రిష్ణ కమీషను రిపోర్టును మీరు నమ్ముతారు, దానిపై హైకోర్టు క్రిమినల్ కేసు పెట్టినా సరే, మీకు అనుకూలంగా లేని రిపోర్టులను మాత్రం నమ్మరు, ఎవరినిలా మోసగిస్తారు? జేపీ రిపోర్టును తీసుకొచ్చిందీ మీరే, పోనీ దానితోనయినా ఏమయినా సాధించారా?
రిప్లయితొలగించండిఇంతకుమందు ఇక్కడ చర్చకు నేనే పరిగెత్తుకొచ్చానని రాశారు, నేను సుంకర గారి టపాకు సమాధానం ఇచ్చాను, ఏదో పొడుస్తానని చర్చకు దిగి చేతులెత్తేసింది మీరే. విశలాంధ్ర మహాసభకు మీరు చెప్పే ఉద్దేశమేమిటో ఇక్కడే కుడిపక్కన కనిపిస్తోంది. మరి రాష్ట్రాన్ని కలిపుంచే సేక్రెడ్ డ్యూటీ చెయ్యడం కోసం విద్వేషం ఎందుకు చూపిస్తారు? పైగా వ్యక్తిగతహోడాలో అంటున్నారు, వ్యక్తిగతహోదాలో ద్వేషం రెచ్చగొడుతూ సభ ముసుగున కలిసుందామంటే ఎవరు నమ్ముతారు? విడిపోదామనుకునేవాడూ తిట్టి కలిసుందామనేవాడూ తిడితే కలిసుండడంలో అర్ధం ఏమిటో తమబోటి మేధావులకే తెలియాలి.
విడిపోవడానికి మేము వేరే కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు, మీబ్లాగులోనే Snkr,క్రిష్ణ, సుంకర గార్ల కామెంట్లూ, ద్వేషపూరిత రాతలూ చూస్తే చాలు. పొద్దునలేస్తే చూపించేది తెలంగాణాపై ద్వేషం, కలిసుందామని చెప్పి ఎవరిని మోసగిస్తారు? కలిసుండడంలో మీకెంత సొంతలాభం లేకుంతే మీరు ద్వేషించే వారితోనే కలిసుంటామంతారు? మీలాభంకోసం మమ్మల్ని కలిసుండమంటే వినే రోజులు పొయ్యాయి. గుడ్ బై!!
అనవసరమైన విషయం గురించి అన్ని వ్యాఖ్యలు ఎందుకు చేసారండి?పని లేకనా? తెలంగాణా ప్రజాప్రతినిధులు గ్రహాంతర వాసులు కాదుకదా? ప్రభుత్వం వివక్ష చూపితే వాళ్ళకు అందులో పాత్ర లేదా? అసలు ప్రభుత్వం వివక్ష చూపింది అన్న ఆధారం ఏమిటో చూపండి ముందు. 1956 లో తెలంగాణా ప్రాంతంలో ఎన్ని ఎకరాలకు కాలువల ద్వారా సేద్యం జరిగేది మరి ఇప్పుడు ఎంత జరుగుతుంది? మా నీళ్ళు మా నీళ్ళు అని ప్రజలను ఇంకా మభ్యపెడుతూనే ఉన్నారు.ఏ ప్రాంతంలో రైతులు ఉచిత/సబ్సిడీ విద్యుత్తు అధికంగా వాడుతున్నారు? ప్రభుత్వ లెక్కలు నమ్మకపోతే ఉద్యమాలతో వసూళ్ళు చేసే వాళ్ళ లెక్కలు నమ్ముతార? అలాగే ప్రజలను మోసం చేస్తారా? వివక్షతోనే ఇక్కడి తలసరి ఆదాయం అన్ని ప్రాంతాలకు కంటే త్వరితగతిన పెరిగిపోయిందా?అది కూడా తప్పు, మా సన్నాసిగాళ్ళు చెప్పే గాలి లెక్కలే కరెక్ట్ అంటారా?ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతాల పరిస్థితులు చూసారా? నిజాం రాష్ట్రంలో ఇంగ్లీష్ మాధ్యమంలో ఎన్ని పాఠశాలలు ఉండేవి? ఇక్కడి అక్షరాస్యత ఎంత ఉండేది? ఇక్కడ గ్రాడ్యుయెట్లు ఎంత మంది ఉండేవారు? census లెక్కలు చెబుతున్నాయి తెలంగాణా ఏ స్థాయి నుండి ఏ స్థాయి కొచ్చిందో. అవి కూడా వివక్ష కు రుజువులేనా? రాష్ట్రం ఏర్పడేనాటికి హైదరాబాద్ మినహా పట్టుమంటే 10 టౌన్లు, గ్రామా లలో విద్యుతు సౌకర్యం ఉండేది కాదు. అప్పటి తూర్పు గోదావరి ఒక్క జిల్లాలోనే 107 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం ఉండేది. ఇప్పుడు తెలంగాణా ప్రాంతం ఎవరితో తీసిపోయింది? తెలంగాణా జిల్లాలలో మీటర్డ్ కనెక్షన్లు తక్కువ, ఉచిత కనెక్షన్లు ఎక్కువ, అయినా యూనిట్ ధర తక్కువ. అది కూడా వివక్షేనా?ఎన్నో సంస్థలు తమ కార్యకలాపాలను రాజధానికి మార్చుకొని ఈ ప్రాంత ఆదాయాన్ని పెంచాయి. స్వాతంత్రం రాకముందు వెలిగిన నగరాలు, రేవు పట్టణాలు అక్కడి ప్రధాన కార్యాలయాలను,సంస్థలను కోల్పోయి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోతే తెలంగాణాలో హైదరాబాద్ తో సహా అన్ని జిల్లా కేంద్రాలు ఎంతోకొంత ముందుకు వెళ్ళాయి. అది కూడా వివక్ష వలనేనా?ఎలా చెప్పుకుంటూ పొతే అన్ని రంగంలోనూ తెలంగాణా అన్ని ప్రాంతాలకంటే త్వరిత గతిన అభివృద్ధి చెందింది. మూర్ఖం గా వాదించే ముందు ఒక సారి శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చిన సవివరణ రిపోర్ట్ ను చదవండి. అందులో ఉన్న నిజాలను ఎదుర్కొనే దమ్ము లేక రహస్య చాప్టర్ 8 అని గోల చేసిన వారికి , జడ్జి ముసుగు వేసుకొన్న ఒక ప్రాంత పక్షపాతికి త్వరలోనే కోర్ట్ లో అక్షింతలు పడనున్నాయి. వ్యాజ్యం మీరే వేసుకుని, తీర్పు మీరే ఇచ్చుకుంటే ఎలాగండి?ఎవడో పేపర్ కెక్కిన మాత్రాన క్రిమినల్ కేసులు నిలవవు. మనోభావాలు దెబ్బతిన్నాయి అని క్రిమినల్ కేసు లు పెడితే ప్రత్యేకవాదులు చాలామంది పై వందలాది క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుంది.
రిప్లయితొలగించండిచెప్పిన వాటిని చదివి చర్చకు రండి ఆలోచిద్దాం. మూర్ఖ వాదనలకు నాకు టైం లేదు.ఇక్కడెవరు ద్వేషపూరిత వ్యాఖ్యలు చెయ్యలేదు. పది సంవత్సరాలపాటు విషాన్ని చిమ్ముతున్న కేసిఆర్ పై మీకు ప్రేమ ఉంటె అలాంటి వ్యాఖ్యలు చదవడం మానుకోండి. ప్రత్యేకవాదమే అబద్దాలు, ద్వేషం,మోసపూరిత వాగ్ధానాలు అన్న పునాదుల పై నిలబడి ఉంది.
ద్వేషపూరితమా! ఛా! మీ ముల్లా ఒమర్ చెప్పినట్టు మీకు ఆత్మగౌరమూ, సాంప్రదాయమూ, సంస్కృతి అయిన ఆయన మాటలనే తాంబూలం పెట్టి తిరిగి ఇచ్చాము, మీ సంస్కృతి సాంప్రదాయాలకు తగిన గౌరవమిస్తూ... దానికి మీరు ఇలా పరేషాను అవుతూ మమ్ములను పరేషాను చేయడం భావ్యం కాదు.
రిప్లయితొలగించండి/నలమోతు గురించి చర్చ అనవసరమని ముందే చెప్పాను. అవి ప్రభుత్వ లెక్కలు అని గొంతు చించుకుంటాన్నారు, నేను కూడా ప్రభుత్వమే చేసిన వివక్ష తప్పని చెప్పడానికి /
పోనీ మీరే స్వంతంగా రిపోర్ట్లు రాసి, లెక్కలు కట్టి, మన రౌడీ లాయర్లతో తీర్పులిప్పించుకుందామా?! 'శ్రీకృష్ణ రిపోర్ట్ మాకు అనుకూలంగా వుంటేనే ఒప్పుకుంటాము' డిసెంబర్లో అన్న నికృష్ట పార్టీలు మీవి, సానా న్యాయం ఒప్పుకోవాల్సిందే! :)) 'మేచ్ ఫిక్సింగ్ చేయకుంటే మేము ఆడము', అంటారు, అంతేనా? బాగుంది, ఓ కొత్త ఒరవడి సృష్టించారు