ఎవరికి ఓటేశావ్?
మనసున్న మంచివాడికా?
కాదు...కాదు...
చదువున్న సంస్కారికా?
అదేం కాదు...
బాధ్యతున్న దేశభక్తుడికా?
అస్సలు కాదు...
సంఘమంటే అతనికవగాహన ఉందా?
ఏమో తెలీదు...
దేశాబ్యుదయమే అతని ఆశయమా?
కాదనుకుంటా...
మరి..ఏం తెలిసి అతనికోటేశావ్?
ఏంకోరి దేశాన్నతని చేతిలో పెట్టావ్?
అదేమీ ఆలోచించలేదా?
అవగాహనలేని, బాధ్యత లేని
తెలివిమాలిన... ఓటరువి నువ్వు!
నోట్లు పంచి ఓట్లు దండే దమ్మున్న
తెలివిమీరిన... నాయకుడు అతను!
అందుకే..ఇద్దరూ దేశద్రోహులే!!
మనసున్న మంచివాడికా?
కాదు...కాదు...
చదువున్న సంస్కారికా?
అదేం కాదు...
బాధ్యతున్న దేశభక్తుడికా?
అస్సలు కాదు...
సంఘమంటే అతనికవగాహన ఉందా?
ఏమో తెలీదు...
దేశాబ్యుదయమే అతని ఆశయమా?
కాదనుకుంటా...
మరి..ఏం తెలిసి అతనికోటేశావ్?
ఏంకోరి దేశాన్నతని చేతిలో పెట్టావ్?
అదేమీ ఆలోచించలేదా?
అవగాహనలేని, బాధ్యత లేని
తెలివిమాలిన... ఓటరువి నువ్వు!
నోట్లు పంచి ఓట్లు దండే దమ్మున్న
తెలివిమీరిన... నాయకుడు అతను!
అందుకే..ఇద్దరూ దేశద్రోహులే!!
బాగా వ్రాశారు. ఇలాగే అసలు ఓటే వెయ్యని వాళ్ళూ, ఓటు వెయ్యటం అంటే అదేదో రిక్షావాళ్ళు, లేబర్ క్లాస్ వాళ్ళు చేసే పని అనుకునే తెల్ల కాలర్ గాళ్ళ గురించి కూడ వ్రాస్తే బాగుంటుంది. అలా ఓటు వెయ్యనివాళ్ళు కూడ దేశద్రోహులే.
రిప్లయితొలగించండిsiva gaaru..meeru cheppindi koodaa nijame
రిప్లయితొలగించండి