25, ఏప్రిల్ 2011, సోమవారం

'ప్రజలను విభజించడం మహాపాపం' - సత్యసాయిబాబా

మానవ సేవయే అన్నిటికన్నా ఉన్నతమైనదని తన చేతలతో చాటి చెప్పిన సత్యసాయిబాబా ఇక లేరు. ఆయన పేరును రాజకీయాలకు, వాదనలకు (అదీ ఈ సమయంలో) వాడుకోవడం తగదు కాని వార్త పత్రికలు , టివి ఛానల్ లు  శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ యొక్క సేవలు కొనియాడుతుంటే నాకు నాలుగేళ్ల క్రితం చదివిన సంగతి జ్ఞప్తికి వచ్చింది. ప్రజలను విడదీయరాదంటూ విభజన మహాపాపం అన్న పాపానికి ఆనాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పేరు చెప్పుకుని స్వార్ధ చింతనతో స్వప్రయోజనమే అన్నిటికన్నా మిన్న అనేవిధంగా వ్యవహరిస్తున్న కొందరు నాయకులు అనవసరంగా తమ తమ నోర్లు పారేసుకొని సత్యసాయిని దుర్బాషలాడారు. టిఆర్ఎస్ ప్రోద్బలంతో ఒక విద్యార్థి సంఘం సభ్యులు ఓయు క్యాంపస్ దగ్గరున్న 'శివం' పై పడి సత్యసాయిబాబా కటౌట్లను చించి వేసారు.
 
ఆనాడు కేసిఆర్ తెలంగాణా చేనేత కార్మికుల పైన, నల్గొండ ఫ్లౌరోసిస్ బాధితుల పైన తనకున్న అపారమైన  ప్రేమను మీడియా ముందు చెప్పుకొచ్చి, బాబా ఎన్నడైనా తెలంగాణ ప్రజల సమస్యలకు పరిష్కారాలు ఆలోచించారా అని అడిగాడు http://articles.timesofindia.indiatimes.com/2007-01-24/india/27872215_1_satya-sai-baba-separate-telangana-state-trs-president ఆ ముక్క నన్నెవడు  బహిరంగంగా  అడగాలి, నేనెప్పుడు సమాధానం చెప్పాలి అన్న ధైర్యం కాబోలు. మనకు నిజాలు మాట్లాడటం తెలుసునా? నోరు తెరిస్తే సన్నాసి కబుర్లే కదా? ప్రాతినిథ్యం వహించిన జిల్లా సంగతులే మనకు తెలియవు. అయినా సమస్యలు సృష్టించడంలో కదా మనం దిట్ట. పరిష్కారాలు ఎవడికి కావాలి? 

ఈ రోజు మీడియా మొత్తం సత్యసాయి సేవలను స్మరిస్తున్నది. సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలలోని  320 పైగా గ్రామాలకు రక్షిత మంచినీటి సౌలభ్యం కల్పించింది. ఎన్ని జన్మలెత్తి, ఎన్ని ఉద్యమాలు నడిపి, ఎన్ని వసూళ్లు చేస్తే మాత్రం అటువంటి మహత్కార్యం చేయడానికి మనకు మనసొస్తుంది?

12 కామెంట్‌లు:

  1. ప్రజలను విడదీయరాదు. విభజన మహాపాపం.
    భాష పేరుతో ప్రజలను విడదీసిన "పొట్టి శ్రీరాములు" ఎంతటి ద్రోహి! కదా!!

    రిప్లయితొలగించండి
  2. సాయిబాబు..భారతదేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విడదీసారు అందులో భాగమే తెలుగు వారికి ఒక రాష్ట్రం కోసం పోరాడింది..! అప్పటి పోరాట పలితమే కర్ణాటక, ఆంద్రప్రదేశ్‌లు ఏర్పడింది..! అలా మనమొక్కరమే కాదు..! ఎక్కడైనా సరే భాష పరంగా రాష్ట్రాలు ఏర్పడతాయి.మనమొక్కరమే కాదుకదా..భాష పేరుతో విడదీయబడ్డది..? భారతీయదేశంలో ఉన్న ప్రతి భాషకో రాష్ట్రముంది.

    రిప్లయితొలగించండి
  3. పరాయి దేశస్తులు తాము యుద్ధాలలో గెలిచినా ప్రాంతాలు, బహుమానాలుగా పొందిన ప్రాంతాలు తమ సౌలభ్యం కోసం కొన్నాళ్ళు ఒక గాటిన కట్టివేస్తే ప్రజలు కలిసిపోయినట్టా? మరి భాషా సంస్కృతులు ఏర్పడడానికి వందల సంవత్సరాలు పడుతుంది. వాటిని పంచుకునే వాళ్ళ బంధాలను తెన్చివేయడం అంత సులువు కాదు. అటువంటి భాషాభిమానమే నిజాం రాష్ట్రంలోని ఆంధ్రమహాసభను నడిపి విశాలాంధ్ర కోసం పోరాడేలా చేసింది. దానికేం అంటారు?

    రిప్లయితొలగించండి
  4. కమల్ నాయనా!
    భారత దేశంలో మొట్టమొదట "భాషాప్రయుక్త రాష్ట్రా"లంటూ తమ స్వార్థానుకూల వాదాన్ని లేవనెత్తి అన్నదమ్ముల్లా కలసి ఉన్న అన్ని భాషల ప్రజలను విడదీసిన ద్రోహులు ఆంధ్రులే. అది చూసి దేశమంతా అలాంటి ద్వేషాలే చెలరేగి గందరగోళమై అట్టుడికుతుంటే, ఆనాటి కేంద్ర ప్రభుత్వం దిక్కు తోచక మొదటి ఎస్.ఆర్.సి. వేయాల్సి వచ్చింది. అది చూసే కదా శ్రీశ్రీ "భాషా భేదాలు చెలరేగె నేడు .." అంటూ వాపోయింది. "తాము చేస్తే సంసారం - ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం" అన్నట్టుంది మీ వ్యవహారం.

    రిప్లయితొలగించండి
  5. aa rojullo tamils ki telugu vaallaki sambandhalu ela undevo meeru chooda ledu. marenduku potti sreeramulu ni aadiposukovatam. ayina potti sreeramulu KCR la digajaari matladaledu. kottandi/taramandi ani himsanu rechagottaledu. santiyutanga nirahara deeksha chesadu ante.

    రిప్లయితొలగించండి
  6. సత్యదూరమైన కథను బాగానే అల్లుతున్నారు గాని శ్రీశ్రీ ఆ పాట రాసేసరికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలయింది.కాస్త పాట మొత్తం వింటే ఆయన బాధ అర్థమవుతుంది.

    ఇటువంటి వాదనలు వినిపించడానికి మీరు కేసిఆర్ కాదు మేము సన్నాసులం అంతకన్నా కాదు.

    రిప్లయితొలగించండి
  7. సూర్య గారు! చైతన్య గారు!
    దేశంలో గ్రంథాలయాలనేం మూసెయ్య లేదు. మీకు ఆసక్తి ఉంటే, ఆనాటి వార్తా పత్రికలు, చరిత్ర పుస్తకాలు దొరకక పోవు. ఆనాడు తమిళులేం మాట్లాడారో ఇప్పుడు సీమాంధ్రులు అదే మాట్లాడుతున్నారని, ఆనాడు ఆంధ్రులు విభజనకు ఏ కారణాలు చూపారో ఈనాడు తెలంగాణ వాళ్ళు అవే కారణాలు చెప్పుతున్నారని తెలుసుకోడానికి ఆ గ్రంథాలయాల్లో ఓపెన్ మైండ్ తో పఠనం చేసే చిత్తశుద్ధి ఉండాలి. అంతే! అప్పుడు సత్యమేదో సత్యదూరమేదో అర్థమవుతుంది. శ్రీశ్రీ పాటే కాదు- ఆయన అభిప్రాయాలు అర్థమవుతాయి.
    నేను కె.సి.ఆర్ ని కాదు. వాడెవడూ నాతో పోల్చడానికి ? మీరు సన్నాసులో కాదో నాకు తెలియదు. చరిత్రని అవలోడనం చేస్తే మీకే అర్థమవుతుంది.

    రిప్లయితొలగించండి
  8. తమిళులేం మాట్లాడారో సీమాంధ్రులు అదే మాట్లాడుతున్నారని, ఆంధ్రులు చెప్పిన కారణాలే తెలంగాణావాళ్ళు చెబుతున్నారని మీరు అనవచ్చుగానీ ఇక్కడ మనం మాట్లాడుతున్న విషయం అర్థం చేసుకోవడానికి గ్రంథాలయాల్లో పరిశోధనలు చేసి బోడిగుండుకి మోకాలికి ఉన్న లింక్ కనిపెట్టవలసిన అవసరం లేదు. వాదనలు కాదు వాటి మూలాల సంగతి మాట్లాడుదాం.తమిళులు అన్నది భాషా పదం. సీమాంధ్రులు అన్నది కొత్తగా వినవస్తున్న ప్రాంతీయతను చాటే పదం. తమిలాంధ్రులు అన్న పదం ఏమైనా పుస్తకాలలో ఉందేమో నాకు తెలియదు. స్వాతంత్రనంతరము అందరమూ భారతీయులమే అనే భావన కాకుండా వారు తమని అసలు ఒకటిగా ఎప్పుడు భావించారో నాకు తెలియదు.

    ఆంధ్రులు అన్న భాషాపదం వందల సంవత్సరాలనాటిది. తెలుగువారిని ప్రాంతాలవారిగా బలవంతంగా విడగొట్టి, వారి భాషను నిజాంరాష్ట్రంలో అవహేళన చేసినపుడు అదే 'ఆంధ్ర' పదాన్ని ముందుకు తెచ్చి ఆ పేరుతోనే గ్రంథాలయాలు, భాష సంఘాలు ఏర్పాటు చేసుకుని, పాలకుల పై పోరాటాలు చేసి, ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి విశాలాంధ్ర ఏర్పాటు చేసుకొని ఒకటైన తెలుగు జాతిని విడగొడితే అది మహాపాపము అని బాబాగారు తలచారేమో. ఆయన ఆలోచన అది కాకపోయినా ఇక్కడ అటువంటి అర్థమే వస్తుంది. మీరు తమిలాంధ్రులపైన పరిశోధన చేసి ఏమైనా విషయాలు వుంటే మాకు విన్నవించ ప్రార్థన

    రిప్లయితొలగించండి
  9. 1) భాష అనేది ఒక రకమయిన విభజన, ప్రాంతం మరో రకమయిన విభజన. ఒక విభజన పవిత్రమయి మరో విభజన పాపమెలా అవుతుందో? అది కూడా మీకు చెప్పటం చేతకాక బాబాల మాటలు తెచ్చి పెట్టుకున్నారు? దేవుడినని చెప్పి మనుషులను మోసం చెయ్యటం పవిత్రమేమో.
    2) ఈ తమిలాంధ్ర గోల ఎక్కడినుంచొచ్చిందో. వితండవాదాలకు హద్దుల్లేకుండా పోతున్నాయి. మద్రాసు రాష్ట్రంలో తమిల, తెలుగు, కన్నడ, మలయాల భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. అప్పుడు మీకు అన్యాయం జరుగుతుందని వేరయ్యారు, మీభాషమీద సడెన్‌గా ప్రేమ పుట్టుకొచ్చి కాదు. చరిత్ర కాస్త చెక్ చేసుకోండి. ఇప్పుడు మాకన్యాయం జరుగుతోందని మేమంటున్నాం. అప్పుడూ ఇప్పుడూ కూడా విభజనకు చెప్పిన కారణాలు నీళ్ళు, ఉద్యోగాలు, ఆత్మ గౌరవం. భాషకైనా ప్రాంతానికైనా ఈవిషయాల్లో తేడా ఉండదు.
    3) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటువరకూ గత వెయ్యెఏల్లలో ఇప్పటి అన్ని జిల్లాలప్రాంతాలూ మొత్తంగా ఒక ప్రాంతంగా ఎప్పుడూ కలిసి లేవు. ఉన్నాయని మీరనుకుంటే ఎప్పుడు శ్రీకాకులం నుంచి చిత్తూరు వరకూ, ఆదిలాబాద్ వరకూ ఎప్పుడు కలిసున్నాయో మ్యాపుతో సహా వివరించగలరు.
    4) విశాలాంధ్ర అని మీరు చెప్పే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం లాబీయింగ్ తెలుగు వారంతా కలిసుండాలని కాదు, హైదరాబాద్‌ను కబళించడం కోసమే అని మీకూ తెలుసు, కాకపోతే బయటపడరు. ఇప్పుడింత కబుర్లు చెప్పే వారు ఏనాడయినా తెలుగు మాట్లాడి ఆంధ్రప్రదేశ్‌లో లేని జిల్లాలను కలపడం కోసం ప్రయత్నం చేశారా? అవెక్కడపోతేనేం అక్కడ కబళించడానికి హైదరాబాద్ లేదుకదా?
    5) ఒక దేశంలో రాష్ట్రాలను పునర్విభజించడం రాజ్యాంగబద్దమయిన విషయం. రాజ్యాంగబద్దమయినదాన్ని వేర్పాటువాదం, పాపం అనడం ఎంతమూర్ఖత్వమో మీకుతెలియంది కాదు.
    6) ఒక భాష మాట్లాడినంతమాత్రాన కలిసి ఉండాల్సిన అవసరం లేదని మీకూ తెలుసు. కలిసి ఎందుకు ఉండాలో ఉంటే ఇక్కడివారికి ఎలా లాభమో మీదగ్గరేమయినా సహేతుక కారణాలు ఉంటే సెలవియ్యండి. శెలవ్!!

    రిప్లయితొలగించండి
  10. హైదరాబాద్ ను పక్కన పెడితే అసలు బెదిరింపులు, వసూళ్లు వుండవు, ఉద్యమాలు అసలే వుండవు. మీరే ఆలోచించండి ఎవరికీ దానిని కబలించాల్సిన అవసరం వుందో. మీతో వాదనలకు దిగే ఓపిక, సమయం లేదండి. మీకోసం కొన్ని మ్యాపులు http://visalandhra.blogspot.com/2011/04/blog-post_27.html అసలు విశాలాంధ్ర కోసం ఉద్యమించిన సమయం లోనే తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాల మ్యాపు తయారుచేయడం జరిగింది. రాష్ట్రాల పునర్విభజన సందర్భంగా కొన్ని తెలుగు ప్రాంతాలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయినా ఇచ్చిన దానిని నిలుపుకోవడానికో, లేక ఏక పార్టీ పరిపాలనలో కేంద్రాన్ని ఎదిరించలేకో లేక ఇతర భాషలు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారనో లేక మరి దేనికో ఎవరూ దానిని గట్టిగా వ్యతిరేకించలేకపోయారు.

    రిప్లయితొలగించండి
  11. హైదరాబాద్ లేకపోతే వసూల్లు ఉండవు, కబ్జాలు ఉండవు. మనం మాట్లాడేది 50 ఏల్లకింద కలిసినప్పటి ఉద్దేషం. ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాదులాంటి ఒక్క నగరం కూడా మనకు లేదు, హైదరాబాదును కలుప్కుంటే మన సమస్యలు అన్ని తీరుతాయి అన్న మీ అప్పటినాయకుల మాటలు కాస్త పరిశీలించండి.

    అవును, ఇప్పుడు సమైక్య నాటకాలాడే వాల్లకు హైదరాబాద్ కబ్జాలు ఒక్కటే కాదు, ఇంకా చాలా దోపిడీలు ఆగిపోతాయి కదా? చర్చించడానికి విషయం లేదని అర్ధం అవుతుంది కానీ ఊరికే వేర్పాటు వాదులు అంటూ నోరుపారేసుకోకండి. చేతనయితే ఎందుకు కలిసుండాలో నాలుగు ముక్కలు చెప్పండి, భాష విషయం పక్కన పెట్టి.

    రిప్లయితొలగించండి
  12. మీకు తొందర ఎక్కువ. మోసపు వాదనలను పదేళ్లుగా పాడిన పాటే మళ్లీ మళ్లీ పాడినట్టుగా వినిపించగాలేంది మీరు అడిగిందే తడవుగా మా పనులన్నీ వదులుకొని నాలుగు ముక్కలు చెప్పేమంటారా? నాలుగు కాకపొతే నలభై ముక్కలు తప్పక చెబుతాం. మాకు కొంచెం సమయం ఇవ్వండి.

    రిప్లయితొలగించండి