15, ఏప్రిల్ 2011, శుక్రవారం

వేర్పాటు వాదులకి మల్టిపుల్ చాయిస్లో మూడు ఆప్షన్లు

వేర్పాటు వాదులకి మల్టిపుల్ చాయిస్లో మూడు ఆప్షన్లు..ఏదైనా ఒకటి ఎన్నుకోవచ్చు లేదా (ఎప్పటిలా ఆడ్డంగా వాదించి) మూడూ లేదా సున్నా ఎన్నుకోవచ్చు.. సరేనా?

ఎన్నిక1: భారత దేశ స్వాతంత్రానంతరం ఏదైనా ప్రాంతం ఒక రాష్ట్రం నుండి విడి పోవాలనుకున్నప్పుడు, విడిపోవాలనుకున్న వాళ్ళకి రాజధాని దక్కలేదు.
అ. మద్రాసు రాష్ట్రం(తమిళ నాడు) నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోవాలనుకున్నప్పుడు, మద్రాసు విడిపోవాలనుకున్న ఆంధ్ర కి ఇవ్వలేదు.
ఆ. బొంబాయి రాష్ట్రం (మహారాష్ట్ర) నుండి గుజరాత్ రాష్ట్రం విడిపోవాలనుకున్నప్పుడు, బొంబాయి విడిపోవాలనుకున్న గుజరాత్ కి ఇవ్వలేదు
ఇ. పంజాబ్ నుండి హర్యానా విడిపోవాలని ముచ్చట పడినప్పుడు, రాజధాని అయిన చండీఘడ్ కేంద్ర పాలిత ప్రాంతం చెయ్యబడింది. అలాగే రెండు రాష్ట్రాలకీ ఉమ్మడి రాజధానిగా కొనసాగించబడుతోంది.
ఈ. మరే ఇతర కొత్తరాష్ట్రాల ఉదాహరణ అయినా చూసిన బుద్ది ఉన్న వాడికి ఎవడికైనా అర్ధం అవుతుంది కాబట్టి మాకు హైదరాబాద్ అక్కర లేదు, తెలంగాణా చాలు

ఎన్నిక2: సర్వ సత్తాక భారత గణతంత్ర రాజ్యం అవతరించినప్పటి నుండీ
అ. ఎప్పుడూ ఒక భాషా ప్రతిపదిక రాష్ట్రం విడతీయబడలేదు
ఆ. హైదరాబాద్ రాష్ట్రం అనే కుటుంబం నుంచి వచ్చిన ముగ్గురు ఆడ పిల్లల్లో, మరత్వాఢా మహారాష్ట్ర తోటి, కన్నడ ప్రాంతం కర్ణాటక తోటి బుద్దిగా కాపురం చేసుకుటున్నారు. మూడో పిల్లకే ఏదో మాయ రోగం వచ్చింది తప్పు తెలుసు కుంటుంది, బుద్దిగా కాపురం చేసుకుంటుంది ఇకపై.
ఇ. ఎదో ఒక సంవత్సరం ఆలీస్యంగా భారత దేశంలో కి వచ్చినంత మాత్రాన! మేమూ కూడా భారత దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళమే తెలంగాణా రాష్ట్రం ఇస్తే నక్సలిసం పెరుగుతుంది, ఇంకో కొత్త 24 రాష్ట్రాల డిమాండులు వచ్చి భారత దేస సమగ్రతకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది కాబట్టి.
భారత దేశ అభ్యున్నతిని కాంక్షించే వాళ్ళగా మాకు తెలంగాణా అవసరం లేదు. సమైక్యాంద్రని కొనసాగించండి.

ఎన్నిక 3: "అరే ఏందిరా బై నీ లొల్లి, ఈ లాజిక్లు నాక్ తెల్వద్. నాకు గీ బావిలో ఉండుడే ఇస్టం. మా తెలంగాణా మాగ్గావాలె. మా నీల్లు మాగ్గావలె. ఇయ్యక పోతే తెలంగాణలె తాలిబన్లొస్తర్, మీరు మాకు ఆప్షన్లు ఇచ్చు డేంది మేమే మీకిస్తాం , తాలిబన్లు కావల్న నక్సల్ కావాల్న తేల్చుకోండ్రి.

2 కామెంట్‌లు: