31, మే 2011, మంగళవారం

తెలుగు జాతి సాంఘిక చరిత్రకారుడు 'సురవరం ప్రతాపరెడ్డి'

మే 28,2011 ఆంధ్రజ్యోతి సంపాదకీయం పేజి నుండి

జాతీయవాద సిద్ధాంత స్ఫూర్తితో చరిత్ర రచన పరిణతి చెందుతున్న దశలో, చరిత్రకారుల దృష్టి రాజుల, రాజవంశాల వర్ణనల నుంచి క్రమేపీ సాంఘిక, సాంస్కృతికాంశాలపై మరలడం ఆరంభమైంది. 1950 దశకం నాటికి యీ వైఖరి బలపడి సాంఘిక చరిత్రలు మొదలయ్యాయి. కొమర్రాజు లక్ష్మణరావు స్థాపించిన విజ్ఞానచంద్రికా గ్రంథమండలి, చిలుకూరి వీరభద్రరావుచే రాయించిన ఆంధ్రుల చరిత్రలో రాజకీయ చరిత్రతో కొంతవరకు సామాజింకాశాలు చోటుచేసుకున్నా, వాటికి ప్రాముఖ్యం లభించని రోజుల్లో యీ గ్రంథం రాయాలనిపించడమే ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది.

సురవరం ప్రతాపరెడ్డికి, తెలంగాణ రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక పునరుజ్జీవనానికి విడదీయరాని లంకె వుంది. శ్రీకృష్ణ దేవరాయ భాషాంధ్ర నిలయం స్థాపన ( 1901) యీ పునరుజ్జీవనానికి నాంది అని భావించినా, ఆ తర్వాతి కాలంలో తెలంగాణను తట్టి మేల్కొల్పిన గ్రంథాలయోద్యమానికి సురవరం వారు ఆయువు పట్టుకాగా, 1921లో స్థాపించిన ఆంధ్ర జనసంఘ కార్యకలాపాల్లో సురవరం పాత్ర గణనీయం. తెలంగాణ మేల్కొంది.

కనీసం చిన్న సారస్వత సభ పెట్టుకోడానికి కూడ నైజాం ప్రభుత్వ అనుమతి పొందాలని నియమం వున్న రోజులు. అయిదు శాతానికి మించని అక్షరాస్యత. వెట్టిచాకిరి బానిస విధానంలో మగ్గుతున్న సామాన్య ప్రజానీకం. తెలుగు భాష అత్యంత నిరాదరణకు గురైన గడ్డుకాలం. ఇంతటి సాంస్కృతిక వెనుకబాటుతనానికి గురయిన తెలంగాణ ప్రాంతంలో తెలుగు వెలుగులు ప్రసరింపబూనుకొన్న వైతాళికుల సరసన చేరి, అగ్రగణ్యతను సాధించి, జన జీవితంలో సమూల మార్పు రావడానికి కృషి చేసిన ఆంధ్ర మహాసభ మొదట సమావేశానికి జోగిపేటలో అధ్యక్షత వహించి, మాడపాటి వారి ప్రశంసలందుకొన్నారు, సురవరం ప్రతాపరెడ్డి.

సాహిత్య, భాష, పత్రికా రంగాల్లో సురవరం గావించిన కృషి ప్రశంసనీయం. దాదాపు 40 గ్రంథాలకు (ముద్రిత, అముద్రితాలు) పైగా రచించారు. వీటిలో పలువురు ప్రశంసలు అందుకొన్న వాటిలో చెప్పుకోదగ్గవి , 'రామాయణ విశేషాలు', ' హిందువుల పండుగలు' (యీ గ్రంథానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ పీఠిక రాశారు). వీటి గురించి, యింకా వారి ఇతర రచనల గూర్చి మేమిక్కడ వివరించబూను కోవడం లేదు, కానీ, ఒకటి, రెండు విషయాలు యీ సందర్భంలో ప్రస్తావించుకోవాలి.

' గోలకొండ కవుల సంచిక' ను వెలువరించి , తెలంగాణలో కవులే లేరన్న నిరాధార, అభ్యంతరకర వ్యాఖ్యలకు దీటైన సమాధానమిచ్చారు. 'నిజాం రాష్ట్ర పాలనము' హైదరాబాద్ రాజ్య వ్యవస్థ గూర్చి పలు అంశాలను వివరించి, ప్రజా చైతన్యానికి దోహదపడింది. ప్రముఖ చరిత్రకారులు మల్లంపల్లి సోమశేఖర శర్మ యీ గ్రంథాన్ని సురవరం వారి 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర'తో పోల్చి 'ఆ రెంటిలో యేది గొప్పదో , ఏది తక్కువదో తరతమ భేదాలు నిర్ణయించడం చాల కష్టం' అన్నారు. సంస్కృతం, పారశీక, ఉర్దూ భాషల్లో (ఆంగ్లాంధ్రాలు కాక) పాండిత్యం గడించిన సురవరం, మధ్యయుగాల భావజాల నేపథ్యం నుంచి వచ్చినా , వ్యక్తి స్వేచ్ఛ , సమానత్వ భావాలను పుణికిపుచ్చుకొని నిజాం నిరంకుశాధికారాన్ని ప్రశ్నించాడు.

'ఆంధ్రుల సాంఘిక చరిత్ర' రాయపూనుకున్నప్పుడు సురవరం ఎదుర్కొన్న రెండు ముఖ్య సమస్యలు, ఒకటి, సాంఘిక చరిత్ర అంటే ఏమిటన్నది? అంతవరకూ రాజకీయ, పరిపాలనాంశాలకే చరిత్ర పరిశోధనలు దాదాపుగా పరిమితమయ్యాయి. సాంఘిక చరిత్ర గురించి సురవరం యిలా నిర్వచించుకొన్నారు వారి గ్రంథంలో.

"సాంఘిక చరిత్ర మానవచరిత్ర - ప్రజల చరిత్ర, అది మన సొంత కథ... అది మన తాతముత్తాతల చరిత్ర! వారి యిండ్లు, వారి కట్టు, వారి తిండి, వారి ఆటలు, వారి పాటలు, వారు పడిన పాట్లు, వారు మనకిచ్చిపోయిన మంచి చెడ్డలు...''. ఇక సురవరం ఎదుర్కొన్న రెండవ సమస్య; మొదటిదాని కంటే కీలకమైనది; సాంఘిక చరిత్ర రాయడానికి అవసరమైన ఆధారాలు. సురవరం ఎంపిక చేసుకొన్నవి ప్రధానంగా సాహిత్య ఆధారాలు, కొంతవరకు శాసనాలు, యాత్రా చరిత్రలు, చాటువులు, సామెతలు, నిఘంటువులు, అప్పటికి లభ్యమవుతున్న ఆంగ్ల గ్రంథాలు - విన్సెంట్ స్మిత్, ఆర్.సి.దత్తు, బిల్‌గ్రామి తదితరులు రాసినవి.

తెలుగు ప్రబంధాలన్నీ తన రచనకు ఉపయోగపడవన్నారు. కైఫీయత్తులు, నాణేలు, విదేశీ యాత్రికుల రచనలు, శిల్పాలు, చిత్రలేఖనం, సుద్దులు, జంగమ కథలు, జానపదుల పాటలు - వీటన్నిటిని వాడుకోవడంలో సురవరం చూపిన సమగ్రదృష్టి శ్లాఘనీయం. ఆధారాలు లభ్యం కాలేదంటూ సురవరం తన 'తొలిమాట'లో యిలా రాసుకున్నారు. "నేను అలంపూరు తాలూకాలోని "నీళ్ళులేని యిటికెలపాడు'' అను కుగ్రామమందుండి యీ గ్రంథము వ్రాసినందున నా వద్ద నుండు గ్రంథసామగ్రి తప్ప వేరే ఆధారము లేకపోయెను. సమీపమున నుండు కర్నూలులో ఎంత వెదికినను కావలసిన కొన్ని గ్రంథాలు లభించలేదు. అందుచేత నాకు యీ గ్రంథము తృప్తినొసగలేదు.''

గ్రంధ పరిధి తూర్పు చాళుక్యులతో ప్రారంభమై కాకతీయులు, రెడ్డిరాజులు, నాయకరాజులు, విజయనగర, బహ్మనీ, కుతుబ్‌షాహీ రాజ్యాలను దాటి ఆధునిక యుగంలో 1907 దాకా కొనసాగింది. జనజీవనంలోని సూక్ష్మాంశాలన్నింటిని, ఆ కాలంలో ప్రజలు ఏం తిన్నారు, తాగారు, ఏం కట్టుకున్నారు, ఏ పాటలు పాడి, యే ఆటలు ఆడారు.

ఇవి జన జీవితంలోని రోజువారీ వ్యవహారాలు. ఇవిమాత్రమే సాంఘిక చారిత్రకాంశాలు కావు కదా! ఒక జీవనంతో ముడిపడిన వ్యవసాయం (ఏం తింటారన్న దానికి మూలం), వ్యాపారాలు, చదువులు, యుద్ధతంత్రం, సైనికవ్యవస్థ, చేతి పనులు, గ్రామ సభలు, మతం, మతంతో ముడిపడిన కర్మకాండలు వీటిలో చోటుచేసుకున్నాయి. 1949లో ప్రధాన ముద్రణ కాగానే, రెండవ ముద్రణ 1950లోనే రావడం, (ఇటీవల మరోముద్రణ వెలువడింది) కేంద్ర సా హిత్య అకాడమీ అవార్డు (తెలుగు సాహిత్యంలో యిది మొదటిదా?) పొందింది. 'ఆంధ్రా కా సామాజిక ఇతిహాస్' హిందీలోకి అనువదింపబడింది కూడా.

ఈ గ్రంథ రచనతో సంతృప్తి పొందలేదని సురవరం చెప్పడం వారి వినయశీలతను తెలియజేసినా, యీ రచన సమగ్రమా? సమగ్రం అని మనం దేన్నీ అనలేం. ఏదైనా సాపేక్షమేనన్న సత్యాన్ని అటుంచి, అప్ప టి పరిస్థితుల్లో యిది సమగ్రం కావడానికి అనువైన మేధోపర చారిత్రక వాతావరణం లేదు. అంతేగానీ, గ్రంధకర్త లోపం కాదు. అప్పటి చరిత్ర రచనా పద్ధతిలోని పరిమితులు, సైద్ధాంతిక అంశాలు దీనికి కారణాలు.

సవిమర్శక చారిత్రక గ్రంధాలు, ఆంధ్రుల చరిత్రపై సమగ్ర విశ్లేషణలూ రావల్సి వుంది (యిప్పటికీ). పైగా, చరిత్ర రచన జాతీయోద్యమ భావజాల ప్రభావం నుంచి పూర్తిగా బయటపడి, ఆర్థిక, సామాజిక, సాంస్కృతికాంశాలపై దృష్టిపెట్టలేదు. జాతీయోద్యమ భావజాలమే కాదు, వలసవాదుల చరిత్ర రచనా దృక్పథమూ పూర్తిగా తొలగలేదు. ఈ ప్రభావాలు సురవరం వారి గ్రంథంలో, ప్రత్యేకించి ఆధునిక యుగంపై రాసిన అధ్యాయాల్లో కన్పిస్తాయి.

ఏ సమాజంలోనైనా, స్థలకాలాదులను దృష్టిలో ఉంచుకొని , అప్పటి సామాజిక పరిస్థితులు, ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ, సాంకేతికాభివృద్ధి అంశాలపై ఆధారపడివుంటాయి. ఒక ఉదాహరణ. కాకతీయుల, విజయనగర రాజుల కాలంలో చేపట్టి పెంపొందించిన నీటి పారుదల సౌకర్యాలు, వ్యవసాయాధారిత చేతి వృత్తులు, పరిశ్రమలు, అప్పటి ఆర్థిక వ్యవస్థను బలోపేత ం చేసి సమాజాన్ని ప్రభావితం చేశాయి. అసంప్రదాయ మతశాఖలు, సూఫీ, భక్తి ఉద్యమాలు, వైదిక మతాచారాలను నిరసించి , రాజ్యాధికారాన్ని ప్రశ్నించాయి.

ఇదే కాలంలో , వీటి ప్రభావంలో విలక్షణమైన సంకీర్ణ సంస్కృతి నిర్మితమైంది. వివిధ ఉద్యమాల అంతస్సంబంధాలను, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలకు మధ్య నెలకొన్న పరిస్థితులకును సామాజిక వ్యవస్థ గూర్చి వివరించడానికి బేరీజు వేసుకోవాల్సి వుంటుంది. సురవరం గ్రంథాన్ని యింకా సమగ్రం చేయడాన్కి, కాకతీయుల పూర్వ తెలుగువారి సమాజాన్ని గూర్చి రాయాల్సి వుంది. ఆధునిక యుగాన్ని గూర్చి రేఖా మాత్రంగా వారు చేసిన కృషిని పూరించాల్సి వుంది. విడివిడిగా ఒక్కో యుగాన్ని గూర్చో, లేక ఒక రాజవంశ కాలాన్ని గూర్చో గ్రంథాలు వచ్చాయి.

మొత్తం ఆంధ్రుల సమగ్ర సాంఘిక చరిత్ర యింకా రావాల్సే వుంది. సురవరం చూపిన బాటను అనుసరించి, యీ కర్తవ్యాన్ని పూరించాల్సిన అవసరాన్ని ఖండవల్లి లక్ష్మీరంజనం గారితో పాటు పలువురు చెప్పారు. సురవరం వారి కృషికి మల్లంపల్లి వారు ప్రశంసాపూర్వకంగా ' శ్రీ రెడ్డిగారు విశాలాంధ్రకే మణిపూస' అంటూ అభినందించారు. సాంఘికచరిత్ర గ్రంథం వెలువడ్డాక నార్ల వెంకటేశ్వరరావు 'ఆంధ్రప్రభ'లో 'మన తాత ముత్తాతలు' అన్న శీర్షికతో సంపాదకీయం రాసి , 'ఒక జీవిత కాలపు ముక్తాఫలం'గా గ్రంథాన్ని పేర్కొన్నారు.

రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అభినందించి , చేసిన కొన్ని సూచనలను రెండో ముద్రణలో సరిచేశారు. సురవరం తెలంగాణ జాతీయ పునరుజ్జీవకానికి మాత్రమే వేగుచుక్క, వైతాళికుడు కాదు. మొత్తం తెలుగు జాతికి, తెలుగు భాషా చరిత్ర సంస్కృతులకు వైతాళికుడు.

-వకుళాభరణం రామకృష్ణ

తెలంగాణ ఎక్కదలిచిన రైలు ఒక జీవితకాలం లేటు

ఆంధ్ర భూమి నుండి : తెలంగాణ ఎక్కదలిచిన రైలు ఒక జీవితకాలం లేటు ---సాక్షి

యువర్ అటెన్షన్ ప్లీజ్...మరికాసేపట్లో ప్లాట్‌ఫాం మీదికి వస్తుందని అనౌన్స్‌మెంటు అయిన రైలు రావడం అరగంటో గంటో ఆలస్యమైతేనే జనానికి చెడ్డచిరాకు వేస్తుంది. అదిగో వచ్చేస్తున్నదని 2009లో అనౌన్స్‌మెంటు అయిన స్టేట్ ఎక్స్‌ప్రెసు ఏణ్నర్థందాటినా ఇంకా అజాపజా లేదంటే చూచిచూచి కళ్లు కాయలు కాచిన తెలంగాణ జనానికి ఇంకెంత చిర్రెత్తాలి?

మామూలు రైలు ఎనౌన్స్ చేశాక కూడా లేటుఅవటానికి బలమైన కారణాలే ఉండొచ్చు. అనుకోని అవాంతరాలను నివారించటం ఎవరి చేతుల్లోనూ ఉండకపోవచ్చు. తెలంగాణ బండి సంగతి వేరు. దానికి ఢిల్లీ స్టేషనులో సిగ్నలు ఇవ్వకుండానే, ఇంకా కూత వెయ్యకముందే, అదిగో వచ్చేస్తోందని హైదరాబాదులో దొంగ అనౌన్స్‌మెంట్లు వరసపెట్టి మొదలవుతాయి. ఆడ నుంచి ఈడ దాకా అంతా బూటకమే; అందరిదీ నాటకమే.

జగమెరిగిన కె.సి.ఆర్. దీక్షతో తాజా అంకం ఆరంభం. అసలా దీక్షే నాటకమని గిట్టనివారి అభియోగం. దీక్షవల్ల తెలంగాణ అట్టుడుకుతున్న సమయాన ‘సైకిల్’బాబులోని సహజనటుడు బయటికి వచ్చాడు. తెలంగాణ తీర్మానం మీరు పెడతారా, నన్ను పెట్టమంటారా అని అసెంబ్లీలో సర్కారును ఎంచక్కా నిలదీశాడు. అది చూసి ఢిల్లీ దర్శకులు కారక్టర్ యాక్టర్ రోశయ్యకు చెప్పి ఆల్ పార్టీ పేరంటం పెట్టించారు. అన్ని పార్టీల వాళ్లూ తమతమ నటనా కౌశలాన్ని చూపించి తెలంగాణకు ఓకే కోరస్ పాడారు. అక్కడితో తెరదించకుండా, ‘సరే అయితే తెలంగాణ ఇచ్చేస్తున్నాం’ అని డైరక్టర్లు పిడుగులాంటి డైలాగు వేశారు. దాంతో రాష్ట్ర నటులకు కళ్లు తిరిగాయి. నాటకం డైలాగును పట్టుకుని నిజమంటే ఎట్లా అని వాళ్లు తెగ గింజుకున్నారు.

అక్కడి నుంచి ఢిల్లీ డ్రామా రసకందాయంలో పడింది. అసలు ప్లాట్‌ఫాం మీదికే తేని తెలంగాణ బండికి ఉత్తుత్తి సిగ్నల్ ఇచ్చినట్టు నటించి మేటి నటుడు చిదంబరం మాయ ప్రకటన చేశాడు. ‘హత్తెరీ’ అని సీమాంధ్ర నటులు- అనుకున్నట్టే దారికాచి పట్టాలకు అడ్డంపడ్డారు. రాని రైలును ఆపేసినట్టు నానాగత్తర అయ్యాక - ఎందుకు ఆగిందో, ఏమి చెయ్యాలో కనుక్కోమని శ్రీకృష్ణా అండ్ కంపెనీకి వేషాలేసి పంపారు. విచారణ ఘట్టాన్ని ఏడాది రక్తి కట్టించాక, కర్ర విరగకుండా, పాము చావకుండా వాళ్లేమో బహిరంగంలో అతి రహస్యాన్ని చొప్పించి, జంతర్‌మంతర్ చేశారు. రంగం మళ్లీ ఢిల్లీకి మళ్లింది.

కమిటీ రిపోర్టు ఇలా అందగానే, అలా తెలంగాణ ఇచ్చేయబోతున్నట్టు బిల్డప్ ఇచ్చిన కేంద్రం వారు రిపోర్టు వచ్చి అర్ధ సంవత్సరమైనా ఏదీ తేల్చరు. అటో, ఇటో, ఎటో నిర్ణయించాల్సిన సర్కారు- పార్టీల కోళ్లు వచ్చి కూస్తే తప్ప తెలంగాణ తెల్లవారదని మిషభిషలు పెడుతుంది. పార్టీలను కేకేసి రిపోర్టు చేతిలో పెట్టి పంపించి ఆరు నెలలు గడిచాక ఏమి చెయ్యాలో చెప్పడానికి పార్టీల పేరంటం మళ్లీ పెడతామన్న మాట ‘స్పీడ్ స్టార్’ చిదంబరం నోట జాలువారింది. ముహూర్తం కుదరడానికి ఇంకో ఆరు నెలలు పట్టవచ్చు. వాయిదాల పద్ధతిలో భేటీలు వేశాక ఫాయిదాలేదని ఎప్పటికి తేలుస్తారో, తదుపరి కర్తవ్యాన్ని ఎలా నిర్ణయిస్తారో రంగస్థలం మీద చూడాలి.

వాయిదాలు ఎన్ని వేసినా, నాటకాలు ఎన్ని ఆడినా కనీసం మూడేళ్లలోపల, 2014 ఎన్నికల నాటికైనా తెలంగాణను ఇవ్వక ఏమి చేస్తారన్న ధీమా ఇప్పటిదాకా తెలంగాణ వాళ్లకు ఉంది. చూడబోతే అదీ వెర్రి ఊహే అని తేలేటట్టుంది.
ఆశ పెట్టిన రాష్ట్రం తీరా తమకు ఇవ్వకపోతే తెలంగాణ జనం కోపగించి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు మాడు పగలగొట్టటం ఖాయమే. వై.ఎస్. వారి ధాటికి ఎలాగూ సీమాంధ్రలో ధరావతులు దక్కే ఆశలేని స్థితిలో తెలంగాణలో కూడా దేవిడీమన్నా అయతే సెంటర్లో కాంగ్రెసు అధికారానికి కష్టమే. కాని దానికి మించిన ఈతిబాధ ‘పైవాళ్ల’కు ఇంకొకటి వచ్చేట్టుంది.

తెలంగాణను ఇచ్చేస్తున్నారనగానే దేశంలో ఎక్కడెక్కడి రాష్ట్రాల్లోనూ వేర్పాటు ఆశలు మోసులెత్తాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌ను విడగొట్టి డార్జిలింగు రాజధానిగా గూర్ఖాలాండ్‌ను ఇవ్వాలని ఎప్పటినుంచో అడుగుతున్నవాళ్లకు మరీ హుషారు వచ్చింది. బెంగాల్‌లో ఉన్నది కమ్యూనిస్టు గవర్నమెంటు అయితే ఢిల్లీ వారికి ఏ బాధా లేకపోయేది. కాని ఇప్పుడక్కడ గద్దె మీద ఉన్నది మమతా దీదీ. సెంటర్లో యు.పి.ఎ. గుడారానికి ఆమె పెద్ద అండ. శుభమా అని రాజ్యానికి రాగానే వేర్పాటు కొరివి తనకెందుకని... తెలంగాణనిచ్చి తనకు కష్టాలు కొని తేవద్దని దీదీ నిక్కచ్చిగా చెప్పింది. ఏ కామ్రేడ్లో, మావోలో పుణ్యం కట్టుకోవటంవల్ల వేర్పాటు చిచ్చుపుట్టి 2014 ఎన్నికల్లో మమతమ్మ పుట్టి మునిగితే యు.పి.ఎ. డేరాకు పెద్ద దెబ్బే.

అలాగే తెలంగాణనిస్తే విదర్భకూ ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు ఇవ్వరన్న పంతం పెరుగుతుంది. అది మరాఠా మల్లుడు శరద్‌పవార్‌కు నష్టం. ఆ పవార్ కూడా యు.పి.ఎ. పవరుకు పెద్ద ఊతం. కాబట్టి ఆయనను చిక్కుల్లో పెట్టే పనికీ కాంగ్రెసు నేతలు సాహసించలేరు. అన్నట్టు ఉత్తరప్రదేశ్‌ను మూడు ముక్కలు చెయ్యాలని యు.పి.రాణి మాయావతి ఎప్పటినుంచో అడుగుతున్నది. తెలంగాణనిస్తే ఆమె కూడా గొంతు పెద్దది చేస్తుంది. ఆ అమ్మ కాంగ్రెసుకు ఎగస్పార్టీ. మాయదారి మాయకు లాభమైనది ఆటోమెటిగ్గా తమకు నష్టం కావచ్చు కనుక ఆమె ముచ్చటతీర్చటం కాంగ్రెసు వారికి ఇష్టం ఉండదు. ‘హరితప్రదేశ్’మీద కాంగ్రెసు మిత్రుడు అజిత్‌సింగు కూడా మనసుపడుతున్నమాట నిజమే. కాని - మిత్రుడుకోరేదీ శత్రువుకోరేదీ ఒకటే అయినప్పుడు ఇవ్వకపోవటమే రాజకీయం.

ఈ ప్రకారంగా ‘మమతా ఎక్స్‌ప్రెసు’ అడ్డంతగలటంవల్ల ‘తెలంగాణ పాసింజరు’ పట్టాలు ఎక్కకుండానే ఆగిపోయింది. అయినా ఆ సంగతి ఢిల్లీ మహానటులు చెప్పరు. ఎన్నిచేసినా తెలంగాణ ఉద్యమాలు ఆగేట్టు లేవు కనుక వాటిని జోకొట్టేందుకు ఇప్పుడు కొత్త జోలను ఎత్తుకున్నారు.

దానిపేరు రెండో ఎస్సార్సీ. అదీ పాతపాటే. ఇప్పుడు దాన్ని లంకించుకోవటంవల్ల ఎస్సార్సీ విచారణ తతంగం పేరిట ఇంకా కొనే్నళ్లు తెలంగాణను మాగవేయవచ్చు. ఎస్సార్సీ పేరు చెప్పి యు.పి.లో మాయావతి నోటా కరక్కాయ వేయవచ్చు. బహుశా ఈ ఎత్తుతోనే కావచ్చు కాంగ్రెసు మాతాపుత్రులు దగ్గరుండి యు.పి. కాంగ్రెసు చేత ఎస్సార్సీ సన్నాయిని నొక్కించారు.

ఈ కొత్తమేళం ఎన్నాళ్లో, తెలంగాణ రైలొచ్చేది ఏ ఏటికో చెప్పిన వారికి చక్కని బహుమతి

27, మే 2011, శుక్రవారం

TNGO సమర్పించు వంటావార్పు మార్చు కం బైటాయింపు

ఈనాడు వార్తాపత్రిక నుండి:  "తెలంగాణా కోసం మిలీనియం మార్చ్ ను మరిపించేలా హైదరాబాద్ లో పది రోజులపాటు  వంట వార్పు మార్చ్ నిర్వహించనునట్లు TNGOల  సంఘం అధ్యక్షుడు స్వామి గౌడ్ తెలిపారు. జూన్ 1 న  వనస్థలిపురం నుంచి తానూ, సంఘం నేతలతో కలిసి బస్తీ బాట పట్టనున్నట్లు ప్రకటించారు.హైదరాబాద్ వంట-వార్పు కార్యక్రమం ఎన్నడు ఎరగని రీతిలో సాగుతుందన్నారు. ఒక్కో జిల్లానుంచి ఉద్యోగులు హైదరాబాద్ చేరుకొని పిక్నిక్కు వచ్చినట్లు ఆయా రహదారుల్లో వంటావార్పు చేసుకొని సాయంత్రం వరుకు రోడ్డుపైనే బస చేయాలని కోరారు. తేది ఇతర వివరాలు త్వరలోనే  ప్రకటిస్తామని చెప్పారు."

ఏమాటకామాటే చెప్పుకోవాలి.ఉద్యోగ సంఘాల నాయకులమని చెప్పుకు తిరిగే వారికి కడుపులో చల్ల కదలకుండా డప్పు కొట్టుకుంటూ ఉద్యమాలు చేయడం అంటే ఎంతో సరదా. ఎందుకు ఉండకూడదు చెప్పండి? వారికది అలవాటేగా.ఫిభ్రవరి మాసంలోనే కదా ప్రభుత్వోద్యోగులు కార్యాలయాలు ముందు టెంట్లు , మెడలో ఒక దండ వేసుకొని, మీడియాను పిలిపించుకొని మరీ వంతుల వారీగా ఒక పూట దీక్షలో కూర్చొని గడియారంలో ఐదు ఎప్పుడెప్పుడవుతుందాని ఎదురుచూపులు చూస్తూ  సహాయనిరాకరణం చేసాం అని అనిపించారు. నేను దగ్గరగా చూసిన ఒక దీక్ష శిబిరంలో తెలంగాణా రుచులకోరకు కేటరింగ్ ఆర్డర్ ఇచ్చారు. ఇక చూడాలి ఐదు అవగానే దండలు తీసి బొజ్జలు ఊపుకుంటూ భోజనాల దగ్గరకు తినడానికి రెడీ అయిపోయారు. ఎక్కువ శిబిరాల్లో మాత్రం టైం కాగానే నిమ్మకాయ షర్బత్ లేదా ఏదో జ్యూస్ రెడీగా ఉండేది. ఈ సారి మంచి ప్లానే వేసినట్టున్నారు. పని చేయకుండానే జీతాలు తీసుకొంటూ పది రోజులపాటు రోజుకి ఐదారు రుచులతో విందు భోజనాలు చేయాలని ఈ ప్రోగ్రాం రూపొందించారనిపిస్తున్నది. జీతాలు ఆగిపోయినా,కడుపు నిండకపోయిన వీరు  కూర్చోరని నాయకులకు తెలుసుమరి. క్రితం సారిలా చాలామందిని బెదిరించి పని మార్పించి దీక్షలో కూర్చోబెట్టించే పరిస్థితి ఎలాగు లేదు. ప్రభుత్వం 'నో వర్క్ నో  పే' నిబంధనను ఖచ్చితంగా అమలు పరిచి ఇటువంటి కార్యక్రమాల్లో పాలుపంచుకోను ఉద్దేశం లేని ఉద్యోగులుకు రక్షణ కలిపిస్తుందని ఆశిస్తున్నాను


ఊరకుక్కలెవరో తెలియరావడం లేదు

తెలంగాణా తెదేపా నేతలను ఉద్దేశించి కేసిఆర్ తనయుడు కేటీఆర్ పలికిన పలుకులు "రేబిస్ వ్యాధి సోకిన కుక్కల కంటే హీనంగా వారు ప్రవర్తించారు. ఊరకుక్కల మాదిరిగా ఉన్మాదంతో వ్యవహరించారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వరకు రణరంగంగా మార్చారు. సొంత ఇంటిని చక్కదిద్దుకోలేని దద్దమ్మలు వాళ్లు. చంద్రబాబుకు డూడూ బసవన్నలు''

అయ్యకేమో పనికిమాలిన సన్నాసులంటే ప్రీతి.. కొడుకు కేమో ఉరకుక్కలంటే వల్లమాలిన ప్రేమ. వాటితో ఎన్నాళ్ళు సావాసం చేసారో ఏమో, ఎప్పుడు ఎటువంటి పోలిక తేవాలన్నా ఉర కుక్కలే గుర్తుకువస్తాయి.వాటి స్ఫూర్తితో మొరగాడమే తరువాయి. ఊరకుక్కల మాదిరిగా ఉన్మాదంతో ఎవరు వ్యవహరించారు అని వార్త పత్రికలన్నీ వెతకగా ఈ ఫోటో కనిపించింది.

 


నాగం టిఆర్ఎస్ లోకి వస్తానంటే ఆహ్వానిస్తామని కేటీఆర్ గారు సెలవిచ్చారు. ఒక వేళ నాగం సొంత కుంపటి పెట్టుకొని ప్రత్యేక తెలంగాణా పై అసలో నకిలీనో ఏదో ఒక పోరాటం చేస్తే వసూలురాజాలు, టిఆర్ఎస్ శ్రేణులు ఆయనను రోడ్ఎక్కనిస్తారా? తమ ఉనికికి ముప్పు వస్తే ఎంతకైనా తెగించేవారు వీరా తెలంగాణాను తెచ్చి ఇక్కడి ప్రజలను ఉద్ధరించేది?   

26, మే 2011, గురువారం

(చిత్ర మాలిక)మిలీనియం మార్చ్ పేరిట సృష్టించిన విధ్వంసం


  













పున:పున: ప్రతిష్టంభనం...

ఆంధ్రజ్యోతి సంపాదకీయం పేజి , మే 26 : మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రులిద్దరూ ఎందుకు ఘర్షణ పడుతున్నారు? అంతకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో తెలుగుదేశంలోనూ వైరుధ్యాలు ఎందుకు పొడసూపాయి? కరీంనగర్‌లో తెలుగుదేశం తెలంగాణా రణభేరిపై కొన్ని వర్గాలు ఎందుకు ముందేభేరీ మోగిస్తున్నాయి? స్పష్టమవుతున్నదొక్కటే - ప్రాంతాల గురించి ఎంత చెప్పినా వాస్తవంలో ప్రయోజనాల ఘర్షణ ప్రతిబింబాలే ఇవన్నీ.

ఒకే ప్రాంతంలో ఒకే జిల్లాలో ఒకే పార్టీలో ఇంత బాహాటంగా కీచులాడుకుంటున్న నేతలు ప్రతిదీ ప్రాంతాల రేఖలతో చూపించాలనుకోవడం కుదిరే పనికాదు. ఏదో ఒక రీతిలో మేము ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నామంటూ సభలు జరిపే వారిని కూడా నిలువరించడంలో కనిపించేది రాజకీయ పెనుగులాట తప్ప ప్రాంతీయ ప్రేమ కాదు. ఇక్కడ అలా వుంటే అక్కడ ఢిల్లీ స్థాయిలో మరోసారి రెండవ ఎస్సార్సీ గురించిన ఆలాపన మొదలవడం కూడా అనూహ్యం కాదు.

రాజమాత, యువ రాజుల సన్నిధిలోనే వారి స్వరాష్ట్రమైన యుపి వేదికగా చేసిన తీర్మానం సెగలు ముందుగా ఎపిపై పడటంలోనూ వింతేమీ లేదు. ఆ తర్వాత కేంద్ర మంత్రిణి పురంధేశ్వరి కూడా ఆ భావాన్నే మరింత సుస్పష్టంగా వివరించడలో అధిష్టానం ఆశీస్సులు లేవనుకోవడం అవాస్తవికమవుతుంది. అధికార స్వరాలు అలా వినిపిస్తుంటే ఇక్కడ ప్రజా ప్రతినిధులు మా నాయకత్వంపై మాకు నమ్మకం వుందని ప్రకటించడం అసహాయతకే అద్దం పడుతుంది.

ఇంతుకు ముందు కూడా ఇలాంటి నమ్మకంతోనే తేదీలు గడువులు ప్రకటించిన వారి పరిస్థితి ఆఖరుకు ఏమైందో చూడనే చూశాం. ఇన్నీ అయ్యాక మేము పాత వైఖరికే కట్టుబడి వున్నామనడంలో చిదంబర రహస్యమేమిటో ప్రవచించిన వారు మాత్రమే చెప్పగలుగుతారు. ఏతావాతా ఇవన్నీ కలసి రాష్ట్ర పరిస్థితిని పెనం మీద నుంచి పొయ్యిలోకి వేసిన చందంగా మార్చాయన్నది ఎవరూ కాదనలేని సత్యం. అనిశ్చితికి ఆలవాలంగా మారిన ఆంధ్ర్రపదేశ్‌లో ఈ పున:పున: ప్రారంభ ప్రహసనాలు ప్రజల పట్ల అలక్ష్యానికి పాలకుల బాధ్యతా రాహిత్యానికి నిదర్శనాలు.

పాత చర్రితను పక్కనబెడితే డిసెంబర్ 9 ప్రకటనలోనే కావలసినంత అస్పష్టత సందిగ్ధత వున్నాయి. తర్వాతి ప్రాంతీయ రాజకీయాలు దాన్ని ఇంకా తీవ్రం చేశాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీలన్నీ వాటి పాత్ర అవి పోషించాయి. భాషా రాష్ట్రాల విభజన వద్దనే సిపిఎం మినహా మిగిలిన పార్టీలన్ని తమ తమ వంతు గందరగోళం తాము చవి చూశాయి. అఖిలపక్ష సమావేశం, ఆ పైన శ్రీకృష్ణ కమిటీ నివేదిక, ఆ నివేదికలో సమైక్యత అత్యుత్తమని చెప్పడాన్ని ఆహ్వానించిన వారు కొందరు విభజన తర్వాత మెరుగని చెప్పడంపై నొక్కిన వారు కొందరు.

కేంద్రం మాత్రం ఏమీ చెప్పకుండా మరో సమావేశం పిలిచి మరింత ప్రతిష్టంభనకు కారణమైంది. పిలిచేవారు ఎందుకు పిలిచారో ఏమనుకుంటున్నారో చెప్పకుండా అపనిందను అవతలివారిపై నెట్టే పని కేంద్రం చాలా జయప్రదంగా చేసింది. మొదటి సమావేశంలో మరింతగా అభిప్రాయ సేకరణ చేయాలన్నది, ఆ పైన శ్రీకృష్ణ కమిటీకి అభిప్రాయ నివేదన, దాని నివేదికలో ఏదో ఒక భాగాన్ని స్వాగతించడం అన్ని పక్షాలూ చేశాయి. ఎటొచ్చీ కేంద్రం ఏదీ తేల్చకుండా నాన్చి ప్రతిష్టంభన పెంచింది.

దీన్ని ఉపయోగించుకుని జెండాలు లేని ఏకాంశ అజెండా అంటూనే ఎవరి రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలు వారు అమలు చేసుకున్నారు. ప్రభుత్వం ప్రేక్షక పాత్రలోకి మారి పక్షపాతం ఆరోపణలు పక్షవాతం అపహాస్యాలు మూటకట్టుకుంది. సమాంతరంగా సమస్యలు పేరుకుపోయి సామాన్యులు అవస్థల పాలైనారు. సంఘాల వారీ ఉద్యమాలు నడిపే వామపక్ష శ్రేణులను మినహాయిస్తే తక్కిన ప్రధాన శక్తులన్నీ ప్రాంతీయ వాదాలలో ఉక్కిరి బిక్కిరవుతూ వుండిపోయాయి. అదనంగా అధికార పక్షం జగన్ రూపంలో అంతర్గత సవాళ్లను అస్తిత్వ సమస్యలను కూడా ఎదుర్కోవలసి వచ్చింది.

అయిదు రాష్ట్రాల ఎన్నికలు, కడప ఉప ఎన్నికలు అయ్యాక ఈ సమస్యపై ఏదో ఒక ప్రకటన వెలువడుతుందని స్పష్టత వస్తుందని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ తెలంగాణా నాయకులు, టిఆర్ఎస్ నేతలు కూడా ఈ మేరకు ఆశాభావం కలిగించారు. తీరా జరిగింది వేరు. ఫలితాల వెనువెంటనే విచ్చేసిన గులాం నబీ ఆజాద్ ఎజెండానే మార్చేశారు. ఆయన సాగించిన అభిప్రాయ సేకరణ తతంగం యావత్తూ ముఖ్యమంత్రిపై ఫిర్యాదుల స్వీకరణకు అవకాశం ఇవ్వడంగానే నడిచింది తప్ప ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించిన సమగ్ర దృక్పథం అందులో నాస్తి.

వెళ్లేముందు చేసిన ప్రకటనలోనూ కాంగ్రెస్ పటిష్టత గురించి చెప్పడం తప్ప అనిశ్చితి తొలగించే ఆలోచనే లేదు. ఒక విధంగా రాజకీయ దృష్టిని అధికారపక్ష అసమ్మతి వైపు, పదవుల పంపకం వైపు మరల్చడం అధిష్ఠానం ఆలోచనగా తేలిపోయింది. ఆ పైన ముఖ్యమ్రంతి ఢిల్లీ యాత్ర కూడా ఆ దిశలోనే సాగింది. ప్రతిష్టంభనలో పడిపోయిన ప్రజా సమస్యల పరిష్కారం గురించి ప్రభుత్వంలో ఏకీభావనను కదలికను తీసుకురావడం గురించి మాత్రం ఇసుమంతైనా ఆలోచించినట్టు కనిపించదు.

అసమ్మతి స్వరాలు అధికారంలో వాటా విషయానికి వచ్చే సరికి మళ్లీ ప్రాంతాల తేడా లేకుండా కాంగ్రెస్ నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఆక్షేపించిన వారిపై ఆగ్రహిస్తున్నారు. పదవి వస్తే తీసుకోవడం రాకపోతే ప్రాంతీయ నినాదం ఎత్తుకోవడం కోసం ముఖ్యులే ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో ఎంపీల కన్నా ఎంఎల్ఎలకు ఎక్కువ ఆసక్తి గనక వారి వారి స్పందనలలోనూ తేడా కనిపిస్తున్నది.

తెలుగుదేశం నాయకత్వం తెలంగాణా సమస్యపై ఎదుర్కొంటున్న తర్జనభర్జనలు తడబాట్ల ఫలితం నాగం ప్రహసనంలో ప్రస్ఫుటమైంది. అస్పష్టతే కాంగ్రెస్ విధానం కూడా అయినప్పటికీ సంస్థాగత నిర్వహణలో తెలుగుదేశం ఎక్కువ గజిబిజికి గురి కావడానికి చాలా కారణాలున్నాయి. టిఆర్ఎస్ ప్రత్యక్ష పరోక్ష దాడి కూడా ఎక్కువగా తెలుగుదేశంపైనే కేంద్రీకృతమవుతున్నది. తెలుగుదేశం ఇక్కడ పూర్తిగా దెబ్బతినిపోయిందంటున్న టిఆర్ఎస్ నేతలు ఈ విమర్శలతో ఎందుకు దానికి ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం కాదు.

ఎప్పటికైనా తమ కోర్కె కేంద్రం ద్వారా నెరవేర్చుకోవాలి గనక కాంగ్రెస్‌తో మరీ సూటిగా తలపడకూడదన్న ఆలోచన వారిది. పైగా కాంగ్రెస్ ఎప్పటికప్పుడు ఏవో వలలు విసురుతూనే వుంది. తెలుగుదేశం ద్వంద్వ వైఖరి సమర్థనీయం కాకున్నా దాన్ని బట్టే కేంద్రం నిర్ణయం తీసుకోలేకపోతున్నదని చెప్పడం తప్ప విరుద్ధంగా వుంటుంది. పైగా ఏ నిర్ణయం తీసుకున్నా దాని వల్ల రాజకీయ లబ్ధి తమకే లభించాలనుకుంటున్న కాంగ్రెస్ నేతలు మరెవరో రాసే లేఖను బట్టి నిర్ణయం తీసుకుంటారనుకోవడం కూడా అసంబద్దం.

ఈ విషయంలో టిఆర్ఎస్‌కే ఘనత రాకూడదని వారు భావిస్తుంటే తెలుగుదేశం లేఖతో తలకిందులయ్యేది వుండదు. ఇప్పటివరకూ తెలుగుదేశం ముఖ్య నాయకుడుగా వున్న నాగం ఇంతగా ధ్వజమెత్తుతున్నారంటే వ్యక్తిగత వ్యూహాలు వుంటాయనుకోవడం సహజం. గతంలో ఆయనను తీవ్రంగా విమర్శించిన టిఆర్ఎస్ బయటకు వచ్చే వరకూ అనుకూలంగా మాట్లాడినా ఆ ఘట్టం ముగిశాక ఆయన స్వంత వేదిక ఏర్పాటు చేసుకోవడాన్ని స్వాగతిస్తుందనుకోలేము.

రెండు ప్రధాన పార్టీలలాగానే ద్వంద్వ వైఖరిని పాటిస్తూ తన పునాదిని ఏర్పాటుచేసుకోవడానికి వైఎస్ జగన్ ప్రయత్నించే అవకాశమూ వుంటుంది. పార్టీల వైరుధ్యాలు వివిధ సంఘాల వ్యక్తుల శక్తుల ఘర్షణల మధ్య కనక తెలంగాణా రాజకీయ రంగ స్థలంపై అనేక మలుపులూ కుదుపులూ చూడవలసే వుంటుంది. ఈ క్రమంలో దెబ్బతినిపోయేది జన బాహుళ్యం జీవిత పోరాటాలే.

ఇలాటి స్థితిలో కేంద్రం రెండవ ఎస్సార్సీ గురించి మాట్లాడ్డం అనుచితమే కాక ఆందోళనకరం కూడా. స్వాతంత్య్రానంతరం బ్రిటీష్ పాలనలోనూ రాజుల పాలనలోనూ రెండుగా చీలి వున్న దేశాన్ని పునర్వ్యవస్థీకరించడానికి ఎస్సార్సీ అవసరమైంది. ప్రధానంగా భాషా ప్రాతిపదికన, చరిత్ర భౌగోళికత కూడా కొలబద్దలుగా ఏర్పడిన రాష్ట్రాలు ఇప్పటివరకూ ఒద్దికగానే నడిచాయి. స్వల్ప మినహాయింపులు సమస్యలు వున్నా వాటన్నిటినీ తిరగదోడి తేనెటీగల తుట్టెను కదల్చవలసిన అవసరమే లేదు.

రాజకీయంగానే గాక రాజ్యాంగ పరంగానూ ఆ అవసరం లేదు. ఒక చోట తనే సృష్టించిన సంక్షోభాన్ని పరిష్కరించకుండా దేశ వ్యాపితంగా విస్తరింపజేయడానికే అది పనికి వస్తుంది. దేశ భద్రత, ప్రజల ఆహార సరఫరా, అధిక ధరలు, అవినీతితో సహా అనేక సమస్యలు పట్టిపీడిస్తుంటే వాటిని వదలి కొత్త సమస్యలు సృష్టించుకోవడం అవివేకం. అనర్థకం.

- తెలకపల్లి రవి

https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/may/26/edit/26edit3&more=2011/may/26/edit/editpagemain1&date=5/26/2011

23, మే 2011, సోమవారం

ఆర్ధిక అసమానతలపై శ్రీ కృష్ణ కమిటీ ఎం చెప్పింది?

శ్రీ కృష్ణ కమిటి రిపోర్ట్ చాప్టర్ 2 నుండి
"ఈ విభాగంలో ఆదాయాల్లో మార్పులు, న్యాయ సంబంధ అంశాలపై గుణాత్మక ఆధారాలను గురించి చర్చించడం జరిగింది. అనుభవపూర్వకంకా ద్వివిభిన్న, బహుళ వైవిధ్యమైన సాంకేతిక పద్ధతుల్లో ఏక కేంద్రీక వవర్తన శీల వివరణలు మరియు విశ్లేషణల పట్ల వ్యతిరేకత ను ఇంతక ముందు విభాగంలో చర్చించాం.వ్యవసాయ రంగంలో రైతుల తలసరి ఆదాయాల్లో అసమానతలపై  ( NCAER) నిర్వహించిన మానవ అభివృద్ధి అధ్యయనాల నుండి సేకరించిన గణాంకాలను పరిగణలోకి తీసుకొని క్రింద వివరణాత్మకంగా చర్చించాం. జాతీయ నమూనా అధ్యయన సంస్థ ( NSSO) 2007 -08 సంవత్సర అధ్యయన గణాంకాల నుంచి తలసరి ఆదాయం వినియోగ కహర్చుల వివరాలు స్వీకరించడం జరిగింది.
ప్రాంతీయ గ్రామీణ ఆదాయ అసమానతల్లో వాస్తవాలు : దశాబ్ద కాలానికి పైగా ఆంధ్ర ప్రదేశ్ లోని గ్రామాల్లో ప్రాంతాల వారిగా ఆదాయాల్లో మార్పుల గురించి క్రింద పేర్కొన్న గుణాత్మక సమాచారం తెలియ చేస్తుంది. ఈ సమాచారం  NCAER-జాతీయ అనువర్తిత అర్థశాస్త్ర పరిశోధన మండలి నిర్వహించిన రెండు నమూనా అధ్యయనాల నుంచి తీసుకోవడం జరిగింది. జాతీయ స్థాయిలో మానవ వనరులపై తొలిసారి గ్రామీణ భారతమంతా 1993-94 లో నిర్వహించగా, తదుపరి 2005-06 లో అధ్యయనం నిర్వహించారు. NCAER అధ్యాయంలో పేర్కొన్న సమాచారం రాష్ట్రంలోని మానవ వనరుల  అభివృద్ధి, దారిద్ర్యం మరియు ఆదాయాల్లో మార్పును తెలియ జేస్తుంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో తలసరి ఆదాయాలపై సరి పోల్చి చూడడం జరిగింది. ఈ విశ్లేషణలో హైదరాబాద్ నగరాన్ని పరిగణలోకి తీసుకోలేదు. జాతీయ అర్థ గణాంక సంస్థ దేశవ్యాప్తంగా గృహాల వారి  సమగ్రమైన అంశాలతో కూడిన ప్రశ్నావళి ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజల తలసరి ఆదాయ మార్పిడిని సమీక్షించాం. అయితే ఈ రెండు సంస్థల అధ్యయనాల సమాచారాన్ని సరిపోల్చి చూసినప్పుడు ' న్యాయం మరియు ఆదాయ అసమానతల్లో తేడాల క్రియాశీలతను అర్థం చేసుకోవడం తేలికవుతుంది.

ఆదాయ తరగతికి అనుగుణంగా తలసరి ఆదాయంలో మార్పు: రాష్ట్రంలోమి మూడు ప్రాంతాల్లోని గ్రామీణుల్లో తలసరి ఆదాయంలో వారి ఆదాయ తరగతికి అనుగుణంగా మార్పు కనిపిస్తుంది. వారి వార్షిక ఆదాయం పేర్ల వారీగా, పూర్తిగా అట్టడగు, క్రింది స్థాయి, మధ్యతరగతి, మధ్య తరగతి పై స్థాయి, సంపన్న వర్గాలుగా గ్రామీణులను ఐదు విభాగాలుగా విభజించడం జరిగింది. కోస్తాంధ్ర గ్రామాల్లో సంపన్న వర్గం మినహా అన్ని ఆదాయ వర్గాలలోను తలసరి ఆదాయం అభివృద్ధి చెందడం ఆసక్తికరమైన అంశం. కాని రాయలసీమ లో పూర్తిగా అణగారిన, అట్టడుగు వర్గాలు, ఉన్నత వర్గాల తలసరి ఆదాయం తగ్గుతూ వచ్చింది. ఇక తెలంగాణా ప్రాంతంలో కేవలం ఉన్నత వర్గాల వారే అభివృద్ధి చెందగా, పేదలు, అణగారిన వర్గాల తలసరి ఆదాయం క్రమంగా తగ్గుతూ వచ్చింది. రాష్ట్రంలో సంపూర్ణ పరిమాణం లేని ఆదాయం మరియు ఆదాయ మార్పులో దిశా నిర్దేశం, పంపిణి ప్రాముఖ్యతలు చర్చించే ఉద్దేశంతో చేర్చడం జరిగింది. ఈ విషయంలో మాత్రం కోస్తాంధ్రలో ఆదాయ వృద్ధి గణనీయ రీతిలోనే సాగింది. ఎనభై శాతం గ్రామీణుల్లో ప్రత్యేకించి కింది స్థాయిలో ఉన్నవారు కూడా క్రమానుగతంగా ఆదాయ వృద్ధి సాధించిన విషయం ఇంతకు ముందు విభాగంలో చర్చించడం జరిగింది. స్థూలంగా ఆదాయాల్లో మార్పులు తెలంగాణతో పోలిస్తే కోస్తాంధ్రలో క్రమానుగతంగా తగ్గుముఖం పట్టాయి.

మరోవైపు తెలంగాణలోని పేదల ఆదాయంలో గణనీయమైన కోత పెరుగుతూ రాగా, ఉన్నత వర్గాలు లబ్ది పొందాయి. తెలంగాణలోని ఆదాయ మార్పుల్లో పరస్పర విరుద్ధమైన వ్యత్యాసాల వాళ్ళ ఈ ప్రాంతంలోని పేదల జీవితం దుర్భాలంగా మారింది. ఈ పరిణామం జీవితంలో ఎదురైయ్యే ఆర్ధిక అవసరాల పరిష్కారానికి కొత్త అవకాశాల కోసం ప్రజా సమీకరణాలకు దారి తీసింది. ఇదే సమయంలో ఉన్నత, సంపన్న వర్గాలు సంప్రదాయంగా ముందుకొచ్చిన భూస్వామ్య వర్గాలు ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నాయి. అసంఖ్యాక ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల భావాత్మక చర్యల ప్రయోజనాలను తెలంగాణలోని సంపన్న వర్గాలు స్వీకరిస్తున్నాయి. 

ఆదాయ మార్పు మరియు వృత్తులు: వృత్తుల ఆధారిత రాబడిలో తెలంగాణా, కోస్తాంధ్ర ప్రాంతాల మధ్య తేడాలు ఉన్నట్లు విశ్లేషణలు స్పష్టంగా చెబుతున్నాయి. అన్ని ప్రాంతాలలోను రైతులు సుస్థిర ఆదాయం పొందడం గాని,అతికష్టం మీద మార్పు రావడం గాని కనిపిస్తుంది. తెలంగాణా ప్రాంతంలో వ్యవసాయ కార్మికుల వేతనాలు గణనీయంగా తగ్గుతూ వస్తుండగా, కోస్తాంధ్రలో గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి, వ్యవసాయేతర రంగాల్లో స్వయం ఉపాధి కార్యకలాపాలు, చిన్న తరహా వ్యాపారం, చేతి వృత్తులు చేసే వారి ఆదాయ రాబడి రెండు ప్రాంతాలలోను పెరుగుతూ వచ్చింది. అదే సమయంలో రాయసీమలో ఈ వర్గాల వారు యాతనకు గురైయ్యారు.

ఆదాయ మార్పు మరియు సామాగిక గుర్తింపు: కులాల వారిగా ప్రాంతాల్లో ఆదాయ రాబడిలో మార్పులు ఉన్నాయన్న విషయం మరో పరిమాణం దృఢపరుస్తున్నది. తెలంగాణా ప్రాంతంలో దళితులు, గిరిజనులు, మైనారిటీల ఆదాయ రాబడి తగ్గిపోయి ఆయా వర్గాల వారు నానా కష్టాలు పడుతూండగా, అందుకు విరుద్ధంగా కోస్తాంధ్రలో ఈ వర్గాల ఆదాయ రాబడి పెరిగిపోతూ వచ్చింది. ఇదే నిర్దిష్ట వ్యవధిలో ఉన్నత వర్గాల్లో ఆదాయ వర్గాల్లో ఆదాయ మార్పిడి పూర్తిగా ప్రతికూలంగా మారింది. 

1990 నుంచి 2000 మధ్య కాలంలో కోస్తాంధ్ర ప్రాంతంలో ఆదాయం అన్ని వర్గాలకు పంపిణి అయ్యిందని పైన పేర్కొన్న విశ్లేషణలు సూచిస్తున్నాయి.కోస్తాంధ్ర ప్రాంతంలో అణగారిన వర్గాలు, దినసరి వేతన కార్మికులు, దళితులు,గిరిజనులు, మైనారిటీల ఆదాయం పెరిగింది. తెలంగాణా ప్రాంతంలో ఈ సామాజిక వర్గాలకు చెందినా కుటుంబాల వార్షిక ఆదాయం, జీవన ప్రమాణాలు ఇంకా  అభివృద్ధి చెందలేదు. తెలంగాణలో అణగారిన సామగిక వర్గాలు కష్టాలనెదుర్కొంటున్నారు.తెలంగాణాలో రాజకీయ సమీకరణాల కోసం చేసిన వాగ్దానాలు వీరి దరికి చెరక పోగా, మరో వైపు వీరి సామాజిక సమీకరణాలు దుర్భలంగా మారాయి."

భూమి మరియు రాజకీయ పదవులు అనేక తరాలుగా అనుభవిస్తున్న కుటుంబాల నుండి వచ్చిన కొద్దిమంది ప్రత్యేకవాదులు తెలంగాణా ప్రాంతంలో మొదటినుండి నెలకొని ఉన్న అసమానతలను వారి కనుగుణంగా వినియోగించుకోవాలనుకుంటున్నారు. ఇది ఏ ఒక్కరూ కాదనలేని పచ్చి నిజం. ఒక్క సారి పార్టీ అధ్యక్షుడి స్థాయి నుండి క్రింది స్థాయి నాయకుడు వరకు చెప్పే మాటలు చేసే వాదనలు వింటే అది అవగతమవుతుంది.అసమానతలే వారి ఉద్యమాలకు ఊపిరి. అసలు  అసమానతలకు కారణాలు వెతకకుండా, అందులకు తామే ముఖ్య కారణమన్న నిజాన్ని దాచి,   మోసపూరితమైన వాదనలు ప్రజలను నూరి పోసి, ప్రాంతీయ విద్వేషాలు పెంచి, అన్ని బాధలు ప్రత్యేకరాష్ట్రం ఏర్పడగానే తీరిపోతాయి అని వారిని మభ్యపెట్టడం నీచం. అలా ఇప్పటికి పబ్బం గడుపు పోవాలనుకొంటున్న  వారు తామొక పులిని  స్వారీ చేస్తున్నారని తెలుసుకోవాలి.పరిష్కార మార్గాలు వెదకకుండా, ఇప్పటి వరుకు అనుకొన్నవాటినీ అమలుచేయకుండా శుష్క వాగ్దానాలు చేసుకుంటా పోతే అణగారిన వర్గాలు ఏదో ఒకనాడు తిరగబడతాయి. మన దురదృష్టంకొద్దీ అప్పటికి రాష్ట్రం ముక్కలయి ఉంటే 'అదిగో ఆంధ్రోడు అదిగో బూచోడు' అని వారిని బుజ్జగించే వీలుండదు. వారు తమ తాతల స్ఫూర్తితో సాయుధ పోరాటమంటే అక్కడెక్కడో ఛత్తీస్ గడ్, ఒరిస్సా సరిహద్దులావలికి పారిపోయిన మావోయిస్టు  నేతలు తప్ప సంతోషించే వారెవరూ ఉండబోరు.

22, మే 2011, ఆదివారం

సీమాంధ్రుల అహంకారానికి తెలంగాణావాది ప్రశ్న

మా మానాన మేము శాంతియుతంగా ఏదో ఒకటో రెండో విగ్రహాలు ట్యాంక్ బుండ్ మీద పగలగొట్టినంత మాత్రాన, ఒకరి ఇద్దరితో పాటుగా ఏదో ఒక ఎమ్మెల్యేని రెండు చెంప దెబ్బలు వేస్తె లేదా ఏదో పదో పన్నెండో బస్సులు తగుల పెట్టినంత మాత్రాన, ఒకటో రెండో భవంతులుని తగుల పెడితే,ఏదో ఒక చిన్న రైలు ని అంటిన్చేస్తే, ఏదో కొంత మంది చనిపోయిన విద్యార్థుల దగ్గర ఆత్మహత్యా పత్రం పెట్టినంత మాత్రాన మా తెలంగాణా ఉద్యమాన్ని మీ ఆంధ్రోల్లు మమ్మల్ని అరాచక శక్తులతో పోల్చడం ఏమైనా బాగుందా? మా తెలంగాణా జిన్నా గారు కేసీఆర్ గారు ఆమరణ నిరాహారదీక్షలో ఏదో ఎవరూ చూడకుండా అర్థ రాత్రి దాటాక ఒక డజను ఇడ్లీలో లేదా కోడి మాంసం ముక్కలు రెండు కతికి, నిద్ర పోయేదానికి ఒక్క నాలుగు పెగ్గుల తో సరి పెట్టుకొంటే మీ లగడపాటి/జగడపాటి ఆయన నిరాహారదీక్షని అపహాస్యం చేయడం ఏమైనా బాగుందా? ఇది మీ సీమాంధ్రుల అహంకారము కాదా? మా టీఆరెస్ కార్యకర్తలు మా తెలంగాణా జిన్నా కేసీఆర్ గారు ప్రతిష్టాపించిన తెలంగాణా తల్లిని తగులబెడితే మేము మీరు చేసిన పని అని ఏదో కొద్దిరోజులు రచ్చ చేసినంతమాత్రాన మీరు మమ్మల్ని ఉగ్రవాదులతో లేదా అబద్ధాల కోరులుగా భావించడం చాలా తప్పు. అది మా ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తుంది. మా విద్యార్ధి నాయకుడు ఏదో ఒక కాలేజీ పిల్ల మీద మోజు పడి తనని ప్రేమించమని లేదా ఏసిడ్ పోస్తానని చిన్నగా చెప్పినంత మాత్రాన అతడేదో మహా అపరాధం చేసినట్లుగా చూడకూడదు. అది అతని యొక్క ప్రేమ భావనని తెలియచేస్తుందే తప్ప హింస కింద చూస్తె అతనిని అవమాన పరిచినట్లు అవుతుంది. మా విమలక్క లాంకో హిల్స్ ని ఆక్రమించుకొని అక్కడ జెండాలు పాతితే అది ఆక్రమణ కాదు ప్రజా ఆగ్రహం. పాత బస్తీలో వక్ఫ్ భూముల కబ్జాని అన్యాయంగా ఆపిన అక్బరుద్దీన్ మీద తెలంగాణా సానుభూతి పరులైన శ్రీ పహిల్వాన్ గారు, వారి మిత్రులు ఏదో ఒక సారి కాల్పులు జరిపితే దానిని హింసాత్మక ఘటనగా చూడడం చాలా తప్పు. అది శ్రీ పహిల్వాన్ గారు తన అయిష్టతని ఆ విధంగా తెలియ చేసారు అంతే. ఏదో మా కవితమ్మ ముచ్చట పడి ఒకటో రెండో మీ ఆంధ్రోల్ల సైన్మాలని విడుదల కోసం అతి తక్కువగా సినిమాకు కోటిన్నర రూపాయలు మాత్రమె హఫ్తా కింద వసూలు చేస్తే మీరు అనవసరంగా ప్రశ్నించి ఆవిడని అవమానిస్తున్నారు. మా ఎమ్మెల్యేలు ఎం పీలు ఒకళ్లో ఇద్దరో మహిళలను ఇతర దేశాలకు తమ భార్యలుగా పంపిస్తే వారిని దోషులుగా చూడడం ఏమి సబబు? మా ఎం పీ గారు శ్రీ మధు యాష్కి ఒకటో రెండో దొంగ పత్రాలని చూపించి తన బంధువులు తాను అమెరికా మరియూ ఇతర దేశాలు వెడితే దానిని భూత అద్దంలో చూపుతున్నారు. మా వి.హనుమంత రావు గారి మనుమడు ముచ్చటపడి ఒక చిన్న మైక్రో ఫైనాన్సు కంపెనీ పెట్టి ఏదో కొన్ని కోట్లు వెనకేసుకొంటే మీరు ఈర్ష్యతో లేని పోనీ అభాండాలు వేస్తున్నారు. మా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వారి దగ్గి నుండి కొంత మొత్తం తీసుకొని క్రాస్ వోట్ చేస్తే దానిని పెద్ద రాద్ధాంతం చేయడం ఏమీ బాగో లేదు. మీరు మమ్మల్ని ఈ విధంగా ప్రశ్నించి మా ఆత్మగౌరవాన్ని దేబ్బతీయటం ఏమైనా బాగుందా? ఇది మీ అహంకారానికి పరాకాష్ట కాదా?

20, మే 2011, శుక్రవారం

మసకబారుతున్న ఓ.యు. ప్రతిష్ట

ఒకప్పుడు ఉస్మానియా యూనివర్శిటీ అంటే దేశ,దేశాలలో గొప్ప ఖ్యాతి ఉండేది. వేలాది మంది విద్యార్ధులు ఈ యూనివర్శిటీలో చదవడం ద్వారా విజ్ఞాప ప్రపంచంలో విహరించాలని ఆకాంక్షించేవారు.కాని ఇటీవలికాలంలో ఆ గొప్పదనం కాస్త మసకబారుతోంది.

ఇప్పుడు ఉస్మానియా యూనివర్శీటీలోకి వెళ్లాలంటే ఏదో తెలియని భయం ఆవహిస్తుంది. ప్రాంతాలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఉండవలసిన ఈ ఆధునిక దేవాలయాలు అనేక రుగ్మతలతో సతమతమవుతున్నాయి. ఈ ఒక్క విశ్వవిద్యాలయమే కాకపోవచ్చు. అనేక యూనివర్శీటీలలోఈ పరిస్థతి ఉండవచ్చు. కాని వీటిలో ఉస్మానియా పరిస్థితి ఇంకొంచెం తీవ్రంగా ఉంటోంది.అందువల్లనేమోకాని ఉస్మానియాలో చదవడం కోసం దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్దుల సంఖ్య క్రమేపి తగ్గుతున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక ఒక విశ్లేషణ ఇచ్చింది.దాని ప్రకారం ఉస్మానియా పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులలో చేరడానికి గాను నిర్వహించే ఎంట్రన్సు పరీక్షలు రాయడానికి ముందుకు వచ్చిన విద్యార్దుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఉదాహరణకు ఇంగ్లీష్ కోర్సుకు గాను ఈ ఏడాది 3997 మంది మాత్రమే ఎంట్రన్సు రాయడానికి దరఖాస్తు చేసుకున్నారు. రెండేళ్ల క్రితం ఈ కోర్సుకోసం 5368మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఎంతమంది తగ్గిపోయారో అర్దం చేసుకోవచ్చు.గత ఏడాది ఎకనామిక్స్ కోర్సు కోసం 5283మంది అప్లై చేస్తే, ఈ ఏడాది ఈ ఏడాది కేవలం 3213 మంది మాత్రమే ఎంట్రన్స్ రాయడానికి ముందుకు వచ్చారు.ఉస్మానియాలో సైన్స్ కోర్సులకు మంచి డిమాండు ఉంటుంది. కాని అలాంటి కోర్సులకు సైతం దరఖాస్తులు సగానికి సగం పడిపోయాయి. కెమిస్ట్రీ కోర్సుకుగాను20481 మంది గత ఏడాది అప్లై చేస్తే, ఈ ఏడాది అది 11765 కి పడిపోయింది.ఇలా ఏ కోర్సు చూసుకున్నా మామూలుగా పెరగవలసింది పోయి దరఖాస్తులు తగ్గిపోవడంపై యూనివర్శిటీలో ఆందోళన వ్యక్తం అవుతోంది.

తెలంగాణ ఉద్యమం యూనివర్శిటీ ఇమేజీని కొంత దెబ్బతీసిందని టీచర్లు వ్యాఖ్యానిస్తున్నారు. సీరియస్ గా చదువుకోవాలనుకునే విద్యార్ధులు ఈ యూనివర్శిటీకి రావడానికి వెనుకంజ వేస్తున్నారని అంటున్నారు.యూనివర్శీటీలో తరచూ హింసాకాండ జరుగుతున్నట్లుగా మీడియాలోతరచూ వచ్చే వార్తలు యూనివర్శిటీ ప్రతిష్టను దెబ్బతీశాయి.తాను తెలంగాణ రాష్ట్రం కోరుకునే వాడినే అయినా, తన కుమార్తెను ఈ యూనివర్శిటీలో చేర్చజాలనని, ఎందుకంటే కూతురు భవిష్యత్తు కూడా తనకు ముఖ్యమని ఒక తండ్రి వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు యూనివర్శిటీలకు ఒక బెడదగా మారి , విద్యార్ధుల భవిష్యత్తుకు ఆటంకంగా మారాయన్న వాదన కూడా ఉంది.కొందరు విద్యార్ధులు పేరుతో అక్కడే తిష్టవేసి రాజకీయ నాయకులు చెప్పినట్లు చేస్తూ యూనివర్శిటి భవిష్యత్తుకు ప్రతిబందకంగా మారుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి.

Source: http://kommineni.info/articles/dailyarticles/content_20110519_20.php


11, మే 2011, బుధవారం

భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పై మహాత్మా గాంధీ

భారతదేశానికి  స్వాతంత్ర్యం రాక ముందే ఎన్నోఏళ్ల పాటు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పై చర్చ జరిగింది. ముఖ్యంగా సైమన్ కమీషన్ నియామకం, ఒరిస్సా రాష్ట్ర ఏర్పాటు, మద్రాస్ ప్రెసిడెన్సి లోని తెలుగువారి డిమాండ్ తదీతర అంశాలు ఆ చర్చను ముందుకు నడిపించాయి. కాకపోతే  పరాయి పాలనలో ఉన్న దేశంలో రాష్ట్రాల పునర్విభజన అంశం అంత ప్రాధాన్యతను సంతరించుకోలేదు.స్వాతంత్య్ర సంగ్రామాన్ని ముందుండి నడిపించిన భారత జాతీయ కాంగ్రెస్ ముఖ్య నాయకుడు, జాతిపిత మహాత్మా గాంధీ అనేక సందర్భాలలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థించారు. ఆయన కృషితోనే  ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలను భాషా ప్రాతిపదికన ఏర్పాటు చేయడం జరిగింది.

దురదృష్టం కొద్దీ హైదరాబాద్ సంస్థాన విమోచన, భారత దేశంలో విలీన సమయానికి  మహాత్మా గాంధీ జీవించి లేరు. జీవించి ఉంటే ఆయన విశాలాంధ్ర ఏర్పాటును గట్టిగా సమర్థించి ఉండేవారు. 

సర్వేపల్లి రాధాకృష్ణన్ కు  మహాత్మాగాంధీ వ్రాసిన ఈ లేఖ చదవండి
LETTER TO S. RADHAKRISHNAN
SEGAON, WARDHA,
December 23, 1938


DEAR SIR RADHAKRISHNAN,
As you know I have always aimed at a redistribution of Provinces on a linguistic basis. The cue was taken from the Andhra movement. I should therefore be more than glad if Andhra could have its status as a Province recognized even now.
Yours sincerely,
M. K. GANDHI

ఒక సందర్భంలో విజయనగర మహారాజు కుమార్ విజయానంద్ గారు ఆంధ్ర రాష్ట్రం పై తన అభిప్రాయాన్ని తెలుపమని మహాత్మా గాంధీకి లేఖ వ్రాయగా, దానికి జవాబునిస్తూ గాంధీ ఇలా అన్నారు, " I was principally instrumental in securing from the Congress the recognition of the redistribution of the Provinces for Congress purposes on a linguistic basis. I have always agitated for the acceptance by the Government of such redistribution. I have indeed advised Tamil Nad, when such advice was needed, not to resist the Andhra demand" ( Harijan, March 29-1942)

ఇంకొక సందర్భంలో హరిజన్ పత్రిక కోసం 19th April,1942 న వ్రాసిన నోటు 'Linguistic basis' లో మహాత్మా గాంధీ ఇలా అన్నారు , "I believe that the linguistic basis is the correct basis for demarcating provinces. I should not mind two provinces speaking the same language, if they are not contiguous. If Kerala and Kashmir were speaking the same language, I would treat them as two distinct provinces" (From the Collected Works of Mahatma Gandhi Vol 82 http://www.gandhiserve.org/cwmg/VOL082.PDF )

10, మే 2011, మంగళవారం

'కాస్త మా గోడు వినండి'

ఈనాటి ఆంధ్రజ్యోతి నుండి: "తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు ఎస్సై పరీక్ష అభ్యర్థులు సీఎంను కలిశారు. పరీక్షకు ఎంపికైన 18వేల మంది అభ్యర్థుల్లో 11 వేల మంది తెలంగాణకు చెందిన వారే. పరీక్ష నిర్వహణలో జాప్యం జరిగితే మాకు నష్టం జరుగుతుంది. ఒక్కో అభ్యర్థి రాత పరీక్ష శిక్షణ కోసం నెలకు రూ.5 వేల చొప్పున ఇప్పటికి రూ.2లక్షలు ఖర్చు చేశారు. పరీక్ష మరింత ఆలస్యమైతే ఆర్థికంగా బాగా నష్టపోతాం అని ముఖ్యమంత్రికి వివరించారు."

పోటీ పరీక్షలకు చదివి హాజరైయ్యే అభ్యర్థుల గోడు మన మీడియాకు వినిపించదా? అదే పరీక్షల పేరుతో తుచ్ఛ రాజకీయం చేసేవారి వాణి మాత్రం అందరూ తప్పనిసరిగా భరించాలి. లేకపోతే మరి మీడియానే బ్లాకౌట్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేసే ఘనులు తయారైయ్యారు.

ఇప్పుడు ఇక చూడండి. కేసిఆర్ ఎంతగానో ప్రేమించే లగడపాటి పేరును  పై రిపోర్ట్ లో చూసేసి,  అసలు విషయాన్ని వదిలేసి, మరి అదేదో జీవిలా ఒక రంకె వేసి .. లగడపాటి...జగడపాటి...సీమాంధ్ర పెట్టుబడిదారులు..దోపిడీదారులు..కుట్ర...అని బుసలు కొడుతూ పనికిమాలిన వ్యాఖ్యలు చేయడానికి  చాలామంది అందుబాటు లోకి వస్తారు.


6, మే 2011, శుక్రవారం

కాసేపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రోద్యమాన్ని ఆంగ్లభాష లో స్తుతిద్దాం

In Praise of ‘T’ Agitation

- పరకాల ప్రభాకర్, విశాలాంధ్ర మహాసభ సభ్యులు   
Communication manufactures perceptions. Effective communication manufactures perceptions that are far more biting than reality. In their most potent form they can, in fact, replace reality and obfuscate one’s reasoning faculty. The ongoing Telangana agitation offers a formidable example of effective use of political communication. It is in the deployment of a well-designed communication strategy that the present agitation differs from the earlier one. It is the sophisticated use of communication that gave depth to the present stir.

Earlier agitation in 1969 was superficial. It was a mere venting of grievances centred mainly on sharing of political offices and government jobs. The present agitation began its journey by raising issues of economic backwardness, exploitation, and discrimination. Eventually, its communication strategy put a spin on the region’s history, culture, language, and even cuisine in terms of ‘us’ and ‘they’. Telangana is portrayed as not only an underdog but also as a distinct linguistic, cultural and historical entity different from the other two regions in the state of Andhra Pradesh. This was indeed a very competent attempt at deepening the agitation. That the strategy is working is evident.  When the statues of the icons of Telugu culture were desecrated and demolished, the outrage against it was muted.

It is improbable that no one from the region is opposed to the agitation. Yet one hardly hears dissenting voices in public forums. That is the power of the communication strategy. It is successful in casting a spell: That anyone who is not in favour of a separate statehood for Telangana is an enemy of Telangana. The biggest success of the communication strategy is that the popular mind is unable to decouple demand for separate statehood and love for Telangana.

The agitation’s communication strategy went on to circulate that it was the most backward region in the state. Voluminous authentic data to the contrary is still unable to dispel the myth. There is another interesting spin. Left-wing poets and popular balladeers of the region wrote heart-rending lyrics narrating the inhuman treatment of the common people by the landlords of Telangana. Every ill in the Telangana region was blamed on the class enemy. But now, all of a sudden, these litterateurs want everyone to believe that the misery was because of the exploitation by people from the other two regions of the state. The spin is working. It is powerful enough.

Communication can give new meaning and unexpected connotation to centuries old words. ‘Andhra’ was always used as a word indicating the language, and the people who spoke the language. Telugu and Andhra were until recently used interchangeably. Under the Nizam ‘Andhra Mahasabha’ fought for the protection of Telugu language and the people who spoke it. In the erstwhile Hyderabad state, Telugu people were treated as second class citizens because they did not speak Urdu. Hyderabad state had Kannada, Marathi and Telugu speaking areas. The area where Telugu was spoken came to be known as ‘Telangana’ (literally meaning ‘a land where Telugu is spoken’). The anti-Nizam struggle was spearheaded by Andhra Mahasabha. In the former Hyderabad state Srikrishnadeva Raya Andhra Bhasha Nilayam was established as the repository of telugu culture and literature. Madapati Huanumantha Rao who was one of the pioneers of this cultural and political movement was lionized as ‘Andhra Pitamaha’. Potana, who hailed from this region wrote ‘Srimad Andhra Mahabhagavatam’. But today the agitation’s powerful propaganda has succeeded in showing ‘Andhra’ and ‘Telangana’ as not just two terms describing telugu cultural and linguistic identity, but as representing two inimical regional-cultural groups. The idiom and accent Telugu gained in the erstwhile Nizam region due to strong influence of Urdu is now shown as a linguistic distinction that separates the people of the region. This spin is accomplished in a very short time by the agitators.

Historically Telugu people have lived under single political authority for centuries. Sometimes they were scattered across different political units but only to quickly come together. The recent such episode was under the Nizam. He ruled over what are now the Coastal and Rayalasema regions till the end of eighteenth century. He then lost them to the British. The formation of Andhra Pradesh in the mid twentieth century was only a reunification of Telugu people who, for a brief spell of less than two centuries, were under the British and the Nizam. But the agitation’s compelling propaganda has successfully created an impression that Telangana has historically nothing to do with the rest of the Telugu speaking areas and people.

A spin’s life is short.  Any competent communication strategist knows it. Therefore, a new one should come out before an old one expires. Continuously.  Without a gap. When the spin on economy to show backwardness and exploitation wore out, another spin on history, then on language and culture were ready. And as these are tapering off, another one on self-rule is readied. Notwithstanding thousands of Sarpanches, over a hundred MLAs, more than a dozen MPs elected by the people of Telangana, and as many Ministers from the region, through their communication strategy the agitators are trying to make people believe that somebody else is ruling them. This is in Telangana which gave the country one of its finest rulers of India in P V Narasimha Rao.

A communication strategy is successful if it achieves the goal before the spell it casts is broken. The jury is still out on the Telangana agitation’s communication strategy. But there can be no two opinions on its strength and competence. It is, indeed, an interesting case study.
http://parakala.org/2011/05/02/in-praise-of-t-agitation/

4, మే 2011, బుధవారం

లై బోలో తెలంగాణ


మనకు శంకరనే ఒక దర్శకుడున్నాడంట. దర్శకుడు శంకరంటే 'జంటిల్మెన్' శంకరనే అనుకుంటూండేవాణ్ణి నేను. కానీ ఇతడు ఆ తమిళ శంకరు కాదనీ.. తెలుగు శంకరేనని తరవాత తెలిసింది. అయితే అతడు తనను తెలంగాణ శంకరని పిలుచుకుంటన్నాడు. ఇదివరకు పెద్దగా కనబడేవాడు కాదుగానీ, ఈమధ్య మాత్రం హఠాత్తుగా ఎక్కడబడితే అక్కడ తెగ కనబడిపోతున్నాడు, వినబడిపోతున్నాడు.ఔను మరి ఇది తెలంగాణ సీజను కదా!

తాను తెలంగాణ శంకరని చెప్పుకుంటన్నాడు కాబట్టి బాగా వార్తల్లో పడ్డాడు. ఈమధ్య తెలంగాణ ఉద్యమాన్ని తన సినిమా కోసం బాగానే వాడుకున్నాడు. సినిమా వాళ్ళు ఒకపక్క సమ్మె చేసుకుంటూ ఉంటే, ఈయన తన సినిమాను (దాని పేరు జై బోలో తెలంగాణ) ఈ సమ్మె నుంచి మినహాయింపించుకున్నాడు. తెలంగాణ సినిమా జాక్ అనేది కూడా ఒకటుందంట కూడా -ఈయనే పెట్టేసుంటాడు. జాకా మజాకా!

 టీవీ9లో ఒక ఫోనాఫోనీలో పాల్గొన్నాడీయన. అమెరికా యూరప్పుల నుంచి మనవాళ్ళు ఫోను చేసి ప్రశ్నలేస్తే ఈయన సమాధానాలిస్తాడన్నమాట. వెంకట్ అనే ఒకాయన అడిగిన ప్రశ్న.. "ఉస్మానియాలో ఉద్యమం పేరుతో డబ్బులు ఎలా వసూలు చేసారో మీ సినిమాలో చూపిస్తున్నారా" అని. దానికి ఈయనిచ్చిన సమాధాన మేంటంటే.. ఉద్యమం అన్నాక, కొన్ని లంపెన్ ఎలిమెంట్లు ఎక్కడైనా ఉంటాయండీ. వాటికి అంత ప్రాధాన్యత నివ్వకూడదు. ఉద్యమం పూర్తి స్వభావాన్ని చూడాలి కానీ ఇలాంటి చిన్నచిన్న విషయాలను పట్టించుకోకూడదు. పైగా మీరే అంటున్నారు అది పుకారని. దానికి విలువ ఎలా ఇస్తామండీ? నిరూపణ కానిదాన్ని చూపించడంట. అద్భుతమైన విలువలు కదా! మరి ఈయన గారి మిగతా విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం.. (సినిమావాడికి విలువలేంటయా అంటారా.. నిజమేననుకోండి!)

 ఆ సినిమాలో కేసీయారు రాసిన ఒక పాటను టీవీలో చూపించా రీ మధ్య. అందులో సమైక్యాంధ్ర ఉద్యమం కృత్రిమ ఉద్యమం అని వర్ణించారు. కేసీయారు ఇన్నాళ్ళుగా చేస్తున్న ఆరోపణే అది; ఎక్కడా రుజువు లేని, నిరాధారమైన ఆరోపణ. దాన్ని పాటలో పెట్టెయ్యడం ఈ దర్శకుడికి అనుచితమనిపించలేదు మరి. ఆంధ్రుల మీద వచ్చే పుకార్లను ఎడాపెడా నమ్మేసి సినిమాలో యథేచ్ఛగా పెట్టేస్తాడా?  తెలంగాణ ఉద్యమం గురించి వచ్చిన పుకార్లను సినిమాలో పెట్టడం మాత్రం అనుచితమా? ఇంతోటి సన్నాసితనానికి ఉద్యమం, దాని స్వభావం అంటూ పోసుకోలు కబుర్లు చెప్పడం ఎందుకూ? ఏదో తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టేసుకుని, ఒక సినిమా తీసేసుకుని, కాసిని డబ్బులు చేసేసుకుందామని అనుకుంటన్నాను అని చెబితే పట్టించుకోకపోదుం గదా!

కాబట్టి నీతి ఏంటన్నమాటా.. ఉద్యమాన్ని ఎట్టాగూ అబద్ధాలతోనే గదా నిర్మించారు, ఇక దాన్ని వాడుకుని తీసే సినిమా దానికి భిన్నంగా ఉంటదని అనుకోకూడదు. ఉద్యమం లాగే ఈ సినిమా కూడా .. జై బోలో  కాదు,  లై బోలో తెలంగాణ!  లై బోలో  తెవాదీ అంటే మరింత బాగుంటాది.
http://chaduvari.blogspot.com/2011/01/blog-post_20.html

ప్రత్యేక తెలంగాణ పిడివాదుల మొండి వాదనలు


కాంగ్రెసు, తెదేపా, ప్రజారాజ్యమూ, .. 'ఇలా ఈ పార్టీలన్నీ గతంలో తెలంగాణకు అనుకూలమని చెప్పి ఇప్పుడు తీరా తెలంగాణ ప్రకటించేసాక, మాట మార్చాయి/లేదా ఆయా పార్టీల కోస్తా సీమ నాయకులు మాటమార్చారు. ఎవడికి వాడు రాజీనామా చేసి సమైక్యవాదమంటూ దీక్షలు మొదలెట్టారు, ఊసరవెల్లులు, గోడమీద పిల్లులు ' అంటూ తెలంగాణావాదులు, టీవీల్లో కనబడే ఘంటా చక్రపాణీ తిట్టడం చూస్తూంటాం. సరే వాళ్ళు మాటమార్చారు నిజమే! కానీ ఇలా తిట్టేవాళ్ళు, తిట్టేసి సేద తీరేటపుడు కొన్ని సంగతులు ఆలోచించాలి..

  • రాష్ట్రవిభజన తెలంగాణవాదులకు రాజకీయ పార్టీలకూ సంబంధించిన సంగతి మాత్రమేనా? ఈ గొడవతో కోస్తా సీమ ప్రజలకేమీ సంబంధం లేదా?
  • వాళ్ళెన్నుకున్న నాయకులు వాళ్ళ మనోభావాలను ప్రతిబింబించాల్సిన అవసరం లేదా? అక్కడి నేతలు కూడా తెలంగాణవాదుల నినాదాలకు జైకొట్టాలా? తెలంగాణవాదాన్ని సమర్ధంగా వినిపించిన తెలంగాణ నాయకులను నెత్తికెత్తుకుని, సరిగ్గా వినిపించని వాళ్ళను ఎత్తి కుదెయ్యలేదా, ఈ తెలంగాణవాదులు? ఏఁ, ఆ మాత్రపు స్వాభిమానం, నాయకులమీద ఆ మాత్రపు హక్కు ఇతరులకుండదా?
  • తమ నాయకులు తమ అభిప్రాయాలను వినిపించనపుడు ఉద్యమాలు చేసి, సదరు నాయకులు తమ వాణిని వినిపించేలా చెయ్యకూడదా?
  • ఈ పనులు చేసే హక్కు తెలంగాణ వాదులకు మాత్రమే ఉందా? వీళ్ళు చేస్తే ఆత్మగౌరవమూను, వాళ్ళు చేస్తే అణగదొక్కడమూనా?
తాము చేసే పనినే కోస్తా సీమ వాసులు కూడా చేస్తే ఎందుకో వాళ్లకీ కడుపుమంట!!
..............................

మీ నుంచి మేం విడిపోతామని ఎవరైనా అంటే అవతలివాడికి ఇబ్బందేమీ ఉండకూడదు, ఉండదు కూడా! కానీ, వెళ్తూ వెళ్తూ 'మనందరం కలిసి కూడబెట్టుకున్న ఆస్తిపాస్తులని (హైదరాబాదును) మేం మాత్రమే పట్టుకుపోతాం' అనడం మాత్రం అతితెలివి! 'మేమలా పట్టుకుపోతుంటే నువ్వుమాత్రం నోరు మెదపకూడదు' అని అనడం కంత్రీతనం!! ఓపక్కన ఈ రకంగా వాదిస్తూ, మరోపక్క అన్నల్దమ్ముల్లాగా విడిపోదామనడం జగత్కంత్రీతనం!!!
..............................

దేశంలో చాలా రాష్ట్రాలు విడిపోయినై.. తెలంగాణ విడిపోడానికేంటి ఇబ్బంది అంటూ ఆవేశపడిపోతూ, ఆవేదన చెందుతూ ఉంటారు, తెలంగాణావాదులు. ఆయా రాష్ట్రాల్లో విడిపోయినవాళ్ళు తాము విడిపోయారు, విడిపోయి తమ రాజధాన్ని తాము ఏర్పాటు చేసుకున్నారు. అంతేగానీ రాజధాన్ని మేం పట్టుకుపోతాం మీరు వేరే రాజధాన్ని చూసుకోండి అని అనలా! ఆ మాటే గనక అని ఉంటే ఆ రాష్ట్రాలు విడిపోయేవి కావు. అంతేకాదు, బహుశా బీహార్లో రక్తపాతం జరిగుండేది. ఎంచేతంటే, అవి కోస్తా, తెలంగాణా, సీమలంత ప్రశాంతసీమలు కావు.

---------------------

తమిళనాడులోని హోసూరుకు శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నది, గోపీనాథ్ అనే తెలుగువాడు. తెలుగు పట్ల ఎంతో అభిమానం ఉన్నవాడు. ఇప్పుడాయన రాష్ట్రాన్ని చీల్చాలనే మన గొడవగురించి ఆవేదన చెందుతూ 'మనలో మనం గొడవ పెట్టేసుకుంటున్నామే..' అని బాధపడ్డాడంట! పాపం మన ఆత్మగౌరవం, మనాళ్ళ సెంటిమెంట్లు ఎక్కడున్నాయో ఆయనకు తెలిసినట్టు లేదు. తెలుగు, ఆంధ్రం వేరువేరనే మన ఆత్మగౌరవ రవాల గురించి, అమ్మను పూజించడంలో కాదు, తిట్టిపోయడంలో ఉన్న మన సెంటిమెంటు గురించీ పాపమాయనకు తెలిసుండదు.
http://chaduvari.blogspot.com/2010/01/blog-post_07.html

మే..ధావుల ’వర్గవివక్ష’


తెలంగాణ వాదులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చి, తమకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యమని డిమాండుతున్నారు. అంటే వేరు పడతామంటున్నారు. వేర్పాటువాదులన్నమాట! కానీ, ’దాన్ని ప్రత్యేకవాదమని అనాలిగానీ, వేర్పాటువాదమని అనకూడదు’ అని పాత్రికేయుడొకాయన చెబుతున్నారు. ఈ ముక్క గతంలో కొందరు రాజకీయులూ అన్నారు. సమాధానం చెప్పాల్సిన వాళ్ళు చెప్పారు. బ్లాగుల్లోనూ అన్నారు, అప్పుడూ తగు సమాధానాలే చెప్పారు. కాకపోతే ఇప్పుడు అంటున్నది, మేధావి వర్గానికి చెందిన పాత్రికేయుడు. ఏప్రిల్ 4, ఆదివారం నాడు హెచ్చెమ్ టీవీలో పాల్గొన్న పాత్రికేయులకు 'వేర్పాటువాదం’ అనే మాట తప్పనిపించింది. ఆ మాటను దేశం నుండి విడిపోవాలని కోరితేనే అనాలంట. తెలంగాణ డిమాండును ఆ పేరుతో పిలిస్తే ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల్ని అవమానించినట్టేనంట!! ఈ ముక్కలన్నది ఎ.శ్రీనివాసరావు. 


ఓ పాత్రికేయ మేధావీ.. మీ తెలంగాణ పక్షపాతం చూపించుకోడానికి పదాల అర్థాలను కూడా మార్చేస్తారా? ఇదిగో, బ్రౌణ్యం ఏం చెబుతోందో చూడండి.. వేర్పాటు అంటే ప్రత్యేకపడటమే! దేశం నుంచి విడిపోతారా, రాష్ట్రం నుంచి విడిపోతారా, తండ్రి ఆస్తిని విడగొట్టుకుంటారా,.. అనేవి ఆ పదానికి అనవసరం, దానికి వివక్షలేమీ లేవు. అంచేత, మీ తె.వాద పక్షపాతాన్ని చూపించుకోడానికి మరో పద్ధతిని - మరే పద్ధతినైనా - ఎంచుకోండి. భాషకు కొత్తర్థాలు చెప్పకండి.

’అన్నల్దమ్ముల్లాగా విడిపోదాం’ అనే మాట వినని ఆంధ్రుడున్నాడా ఇవ్వాళ?  ఇది తె.వాదుల ఊతపదం కాబట్టి, దాన్ని వాళ్ళు విచ్చలవిడిగా వాడతారు కాబట్టి ఇప్పుడే పుట్టిన పసిపిల్లాడు కూడా ఈ మాట బారిన పడకుండా తప్పించుకోలేడు. అన్నల్దమ్ములు విడిపోయి ఆస్తులు అప్పులూ పంచుకోడాన్ని ఏర్లు పడటం / వేర్లు పడటం / వేరు పడటం అనే అంటారు.వేరు పడటం అనే మాట తప్పేమీ కాదు, గౌరవహీనమైనదేమీ కాదు. కాకపోతే వేరుపడటం అనే పని ఏమంత ఉదాత్తమైనదేమీ కాదు, అంచేత ఆ మాట ఈ పాత్రికేయుడికి తప్పుగా అనిపించి ఉండొచ్చు.
 
ప్రత్యేకరాష్ట్రం కావాలని అడగడం వేర్పాటే. అలా అడిగేవాడు వేర్పాటువాదే! తె.వాదుల కోసం దాన్ని మార్చనక్కర్లేదు. ఈ మేధావులు తమ నూత్న తె.వాద మహా విజ్ఞానంతో టీవీ కెమెరాల ముందుకొచ్చి నిష్పాక్షికులమంటూ పోజు కొడుతూ అబద్ధాలు చెప్పుకుపోతూంటారు. మనకు జ్ఞానదానం చేసేద్దామని చూసేస్తుంటారు. పాత్రికేయుడు, ప్రొఫెసరు, ఆచార్యుడు,.. అంటూ తమకో ట్యాగు తగిలించుకు తిరుగుతూంటారు. వీళ్ళు చెప్పే అబద్ధాలు వింటూ, టీవీల లంగర్లు కొందరు పళ్ళికిలించి ఆహా ఓహో అని అంటూంటారు.

ఈ కార్యక్రమంలో ఆ లంగరు ’అదేంటండీ ఆ మాట తప్పెలా అవుతుంది’ అని అడగలేదు. లంగరు పని వాళ్ళ చేత వాగించడం వరకేను, సొంత అభిప్రాయాలు చెప్పడం కాదు అని అంటారా.. అది నిజమే, లంగరు వాళ్ళ చేత వాగించాలిగానీ తాను వాళ్ళ అభిప్రాయాలను ఖండించడం లాంటివి చెయ్యకూడదు. మరి అదే లంగరు ఓ పక్కన తిరపతి నుండి ఒక ప్రొఫెసరు గారితో కూడా మాటలు కలిపాడు. మాటల్లో ఆయనేదో చెప్పబోగా, ఈయన కలిగించుకోని ఆయన అభిప్రాయాలను తోసిపుచ్చాడు. ఈ లంగరుకెందుకంత పక్షపాతం?
................
 
నిష్పాక్షిక విశ్లేషకులమని చెప్పుకుంటూ ’వక్రవాణి’ వినిపించే ప్రొఫెసర్లు మనకు కొంతమంది ఉన్నారు. వీళ్ళతో పోలిస్తే, ఈ పాత్రికేయ మేధావులు చాలా నయం. మీరు ఏ టైములోనైనా టీవీ పెట్టండి.. ఏదో ఒక చానల్లో మొహం గంటు పెట్టుకునో, ఎవడో ఒకణ్ణి తిడుతూనో కనిపిస్తారీ వక్రవాణులు. అసలు వీళ్ళు కాలేజీలకి పోయి పిల్లలకు పాఠాలెప్పుడు చెబుతారో అర్థం కాదు. ఇక్కడ మాత్రం లంగర్లకు, తోటి విశ్లేషకులకు క్లాసులు పీకుతూంటారు.

ఈమధ్య ఐన్యూస్ లో ఒక చర్చ చూసాను. లంగరు పేరు అంకం రవి. ప్రభాకరు అనే తెరాస నాయకుడు, చక్రపాణి అనే ప్రొఫెసరు :) , ఈమధ్య కాలంలో ఉస్మానియా ఐకాసలో నాయకుడై ఆ తరవాత టీవీల్లో విశ్లేషకుడైన ఒక విద్యార్థి -ఈ ముగ్గురూ చర్చించేవారు.

తెరాస నాయకులు రాజీనామాలు చెయ్యగా ఏర్పడిన ఖాళీల్లోఆత్మహత్య చేసుకున్న కుర్రాళ్ళ కుటుంబీకుల్ని నిలబెట్టాలని ఆ కుర్రాడు (విద్యార్థి) అంటున్నాడు.  ప్రభాకరు, చక్రపాణీ కలిసి అతగాడి నోరు మూయిస్తున్నారు. ప్రభాకరు చాలా నయం.. నువ్వు అలా మాట్టాడ్డం తప్పు, ఇలా మాట్టాడ్డం తెలంగాణ ఉద్యమానికి చేటు అంటూ మాట్టాడుతున్నాడు. చక్రపాణి మాత్రం ఆ కుర్రాడి నోరు బలవంతానా నొక్కెయ్యాలనే చూసాడు (ఈయనలో తెలంగాణ పట్ల నిష్పాక్షికత ఎల్లప్పుడూ పొంగి పొర్లుతూ ఉంటుంది). ఇలాంటి వాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చి చర్చలు పెట్టి తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు అంటూ లంగరు మీద ఆవేశపడి, ఆయాసపడి పోయాడు. ’ఇతణ్ణి మాట్టాడకుండా ఆపుతారా నన్ను వెళ్ళిపొమంటారా’ అని లంగరును బెదిరించాడు.

చక్రపాణి, ప్రభాకరు ఆ కుర్రాణ్ణి నానామాటలూ అన్నారు. మరో విద్యార్థి నాయకుడు ఫోనులో చెప్పిన మాటలను పట్టుకుని, నువ్వసలు ఉద్యమంలో పాల్గొననేలేదు, నువ్వు సమైక్యవాదుల తొత్తువు అనే అర్థం వచ్చేలా చిన్నబుచ్చబోయారు. ఇవన్నీ నేరుగా అతణ్ణి అనలేదు, తెలివిగా ఆ ఆర్థం వచ్చేలా మాట్టాడారు. నువ్వసలు తెలంగాణ వాడివే కాదు, ఖమ్మం జిల్లా సరిహద్దుకు చెందిన కృష్ణా జిల్లా వాడివి అనీ అన్నారు.

పాపం అతడు సమాధానం చెప్పుకోబోతే మధ్యలోనే అడ్డుపడి నోరు మూయించారు. నేను ఉద్యమంలో పాల్గొని జైలుకు పోయాను, చంద్రబాబు ఇంటిదగ్గర ధర్నా చేసి అరెస్టయ్యాను. అంటూ తన ఉద్యమ నేపథ్యాన్ని చెప్పుకోబోతే చక్రపాణి అరిచేసి నోరు మూయించాడు. ఏంమాట్టాడుతున్నావు నువ్వు అంటూ ఆ కుర్రాణ్ణి బెదిరించబోయాడు. ఆ కుర్రాడు చక్రపాణిని ఎదిరించేందుకు ప్రయత్నించాడు. అయితే చక్రపాణికి దీటుగా రౌడీతనం చెయ్యలేకపోయాడు పాపం! అంకం రవి ప్రేక్షకుడే అయ్యాడు.  ఇదే చక్రపాణి గతంలో ఒక కోస్తా ప్రాంతపు విద్యార్థిపై కూడా జులుం చేసాడు. అప్పుడు నే రాసిన టపా చూడండి.

ఇదే చక్రపాణి, నెల్లూరులో హెచ్చెమ్ టీవీ వాళ్ళ దశ దిశ కార్యక్రమంలో కూడా ఇలాంటి 'నిష్పాక్షిక' వ్యాఖ్యలే చేసాడు.. తెలంగాణ రాజకీయ నాయకులు విద్యార్థులను రెచ్చగొట్టి ఉద్యమాలు చేయిస్తున్నారు అని వచ్చిన ఆరోపణను ప్రస్తావిస్తూ... ’ఎవరో రెచ్చగొట్టినంత మాత్రాన ప్రజా ఉద్యమాలు రావు. ప్రజల్లో సహజంగా ఉప్పొంగిన చైతన్యమే తెలంగాణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది.’ అని చెప్పుకుపోయాడు. కానీ, అదే లెక్క కోస్తా సీమల్లో వచ్చిన ఉద్యమానికి వర్తింపజేయడాయన. కోస్తా సీమల ఉద్యమం, కేవలం నాయకులు చేస్తున్నదేగానీ ప్రజల్లోంచి వచ్చినది కాదని టీవీల్లో చెబుతూంటాడిదే వ్యక్తి!

నిష్పాక్షిక విశ్లేషకులమని చెప్పుకుంటూ, టీవీల ముందు దొంగ కబుర్లు చెబుతూ, వక్రవాణి వినిపించే నిష్పాక్షికుల నోరు మూయించే రోజు ఎప్పుడొస్తుందో! ఈ మే..ధావుల వర్గవివక్ష నుండి సామాన్యులకు ఎప్పటికి విముక్తి కలుగుతుందో!!
http://chaduvari.blogspot.com/2010/04/blog-post.html

2010 జనవరి 18 - తెలంగాణ ఉద్యమంలో కంచె అయిలయ్య రోజు!


తెలంగాణ ఉద్యమంలో 2010 జనవరి 18 న హఠాత్తుగా కులం ప్రసక్తి తలెత్తింది. ఉద్యమ నేతల కులాలను ఎత్తిచూపి, ఎందుకు వాళ్లకింత ప్రాముఖ్యత, దళిత బహుజనులకు ప్రాముఖ్యత ఎందుకు లేదు అంటూ కంచె అయిలయ్య ప్రశ్నిస్తూంటే చర్చలో పాల్గొన్న ఇతర నాయకులు, విశ్లేషక శేఖరులూ కొండొకచో మాటల కోసం తడుముకోవాల్సి వచ్చింది.

అయిలయ్యవి సూటిప్రశ్నలు.., తెలంగాణ రాజకీయ జేయేసీకి కోదండరామిరెడ్డి నాయకుడు. తెదేపా తరపున నాగం జనార్దనరెడ్డి, కాంగ్రెసు తరపున జానారెడ్డి, రామిరెడ్డి దామోదరరెడ్డి,.. అంతా వీళ్ళేనా? ఏఁ, జేయేసీ నాయకుడిగా కోదండరామిరెడ్డి కాకుండా మంద కృష్ణ మాదిగను ఎందుకు పెట్టలేదు? మంద కృష్ణను జేయేసీ నాయకుడిగా చేసి, తెలంగాణ ఏర్పడ్డాక ఆయన్ను ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించండి అని అన్నాడు. మొన్నమొన్నటిదాకా సిద్ధాంతకర్త జయశంకర్ ఉండేవాడు, ఇప్పుడసలు కనబడ్డమే లేదు. ఎందుకు ఆయన్ను పక్కనబెట్టారు? -ఇదీ వరస!

జేయేసీ నాయకుడిగా కోదండరామిరెడ్డి తెలంగాణ వ్యాప్తంగా సర్పంచులను, స్థానిక ప్రజా ప్రతినిధులను తమ పదవులకు రాజీనామాలు చెయ్యమని అడుగుతున్నాడు. అసలు ముందు ఆయన రాజీనామా చెయ్యాలి. ఆయన చెయ్యకుండా ఇతరులను చెయ్యమనడం ఏంటి? అని అయిలయ్య ప్రశ్నించాడు. ఉద్యమం జరుగుతున్న కాలంలో ఒకరోజున హరీష్ రావు పెట్రోలు పోసుకుని అంటించుకుంటానన్నాడు. కానీ అందరూ ఆపారు. ఆ తరవాత పదుల సంఖ్యలో దళిత బహుజన పిల్లలు పెట్రోలు పోసుకుని కాల్చుకుని చనిపోయారు. ఇప్పుడు జేయేసీ నాయకుడు మీరు రాజీనామాలు చేసెయ్యండి అని అంటున్నాడుగానీ తాను మాత్రం రాజీనామా చెయ్యడం లేదు అని పాయింటు లాగాడు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన అత్యంత నిష్పాక్షిక (నిష్పాక్షికత = తెలంగాణ వాదం) రాజకీయ విశ్లేషకుడైన ఘంటా చక్రపాణి తన మామూలు ధోరణిలోనే - కోస్తా విద్యార్థి నాయకులను గౌరవించినట్టుగానే- అయిలయ్యనూ గౌరవించబోయాడు. 'ఆయా రాజకీయ పదవుల్లో ఉన్నవారు రాజీనామా చెయ్యడానికీ కోదండరామ్ రాజీనామా చెయ్యడానికీ సంబంధం ఏంటి? ఆ పదవుల్లో ఉన్నవాళ్లకు ఆ పదవే జీవనాధారం అంటే వాళ్లను అవమానించడమే' అని అన్నాడు. 'ఏదో బీసీలు బీసీలూ అని అంటున్నారే.. ఇంత ఉద్యమం జరుగుతూంటే బీసీలు ఎందుకు పాలుపంచుకోడం లేదండి?' అని అడిగాడు.  వెంటనే అయిలయ్య బీసీలను అవమానిస్తున్నారు అంటూ అనబోయాడు. నిష్పాక్షిక విశ్లేషకుడు వెంటనే సర్దుకుని, 'మీరెందుకు ఉద్యమంలో పాలుపంచుకోవడంలేదు?' అని అడిగాడు. 'మనలాగా స్టూడియోలకొచ్చి విమర్శించడం కాదండీ గొప్ప, ఉద్యమంలో చేరి, ప్రత్యక్ష కార్యాచరణలో పాలుపంచుకోవాలి' అనీ అన్నాడు. 'యూనివర్సిటీలో అంత ఉద్యమం జరుగుతూంటే కనీసం అటు తొంగైనా చూళ్ళేదు గానీ నాయకత్వం వహించి ఉద్యమాన్ని నడిపిస్తున్న కోదండరాం గారిని రాజీనామా చెయ్యమని అడగడమేంటండి' అంటూ ఈసడించాడు.

చర్చలో 'ఇప్పటిదాకా ఆయన్ను కోదండరామ్‌గానే ప్రజలెరుగుదురు. ఇప్పుడు మీరు రెడ్డి అంటూ కులం పేరుతో పిలిచి కులాన్ని మధ్యలోకి లాగుతున్నారు' అనే విమర్శ తలెత్తినపుడు, అయిలయ్య 'నేనేమీ కొత్తగా పిలవడం లేదు. యూనివర్సిటీలో ఆయన్ను కోదండరామిరెడ్డిగానే అందరూ పిలుస్తారు. ఇక్కడ కోదండరామ్ అని పిలుస్తున్న సంగతి నాకు తెలవదు' అని అన్నాడు.

అయిలయ్య కమ్యూనిస్టులను విమర్శిస్తూ, 'ఒక్క పుచ్చలపల్లి సుందరయ్య తప్పించి కమ్యూనిస్టుల్లో సరైన నాయకుడంటూ లేడు. అందరూ అగ్రకులాలకు చెందినవాళ్ళే. బెంగాల్లో కూడా అంతే.. బసులు, బెనర్జీలు, ముఖర్జీలు, .. అందరూ అగ్రకులాలవాళ్ళే', అంటూ విమర్శించాడు. చర్చలో మంద కృష్ణ పాల్గొంటూ, 'దళిత బహుజనులకు జేయేసీలో ప్రాముఖ్యత లేద'ని అయిలయ్యతో ఏకీభవించాడు. కడియం శ్రీహరి దళితులకు ప్రాధాన్యత లేదని అంగికరిస్తూనే, ప్రస్తుతం ఉద్యమమున్న పరిస్థితిలో ఏ కులాలను పట్టించుకోకూడదనీ, పక్కనబెట్టాలనీ అన్నాడు.

అయిలయ్యది దళిత బహుజనవాదం. ఈ వాదాన్ని ముందుకు తీసుకురావడానికి ఇది సందర్భమా కాదా అనేది ఆయనకు అనవసరం. తెలంగాణ ఏర్పడటం కంటే, దళిత బహుజనులు అధికారంలోకి రావడమే ఆయనకు ముఖ్యం. చర్చలో అయిలయ్య సమైక్యవాద నాయకులకు కూడా ఒక ప్రతిపాదన చేసాడు.. ఆంధ్ర ప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ధర్మాన ప్రసాదరావును, ఉపముఖ్యమంత్రిగా తెలంగాణ నుండి దామోదర్ రాజనర్సింహను పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి నడిపిద్దాం రండి, నేనూ సమర్ధిస్తాను అని అన్నాడు. అదీ సంగతి!
http://chaduvari.blogspot.com/2010/01/2010-18.html

తెలంగాణ వాదుల మరో పచ్చి అబద్ధం


అభివృద్ధిలో వెనకబడి పోయామని, మాకు అన్యాయం జరిగిందనీ, జరుగుతోందనీ చెబుతూ ప్రత్యేక రాష్ట్రం ఉంటే తప్ప లాభంలేదని తె.వాదులు డిమాండు చేస్తూ వచ్చారు. తరవాత్తరవాత వీళ్ళ గొంతు కాస్త మారి, 'ఆంద్రోళ్ళు' మమ్మల్ని అణగదొక్కారంటూ రాష్ట్ర విభజన భజన చేసేవారు. ఇప్పుడవన్నీ పక్కకు నెట్టి ఆత్మగౌరవం కోసం తెలంగాణ, స్వపరిపాలన కోసం తెలంగాణ అంటూ కొత్త కారణాలు చెబుతున్నారు. ఈ కారణాల్లో న్యాయం ఉందా లేదా చెప్పండి అంటూ తెలివితక్కువ వాదనలు చేస్తున్నారు. అభివృద్ధి లేదన్న మాట మాత్రం ఇప్పుడు వీళ్ళ నాలుకల మీద కనబడదు.
ఆ వాదనలో పసలేదని తేలిపోయింది. తె.వాదులు చెప్పే అభివృద్ధిలో-మేం-వెనకబడ్డాం-ఆంద్రోళ్ళు-ముందుబడ్డారు అనే వాదన శుద్ధ తప్పని తేలిపోయింది కాబట్టి, వాళ్ళు చెప్పే లెక్కలన్నీ కాకిలెక్కలని తేలిపోయింది కాబట్టి వాళ్ళకు వాదన మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. అంచేత మార్చారు. అయితే ఈ అబద్ధాలను ఇంకా చెప్పుకుంటూ తిరుగుతున్న తె.వాదులు కొందరు అక్కడక్కడ లేకపోలేదు. ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్న మరో పాత అబద్ధం గురించి మాట్టాడుకుందాం.

1956 లో హైదరాబాదు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రాలను కలిపెయ్యక ముందు హై. రాష్ట్రం బడ్జెట్టు మిగుల్లో ఉండేది. ఆ డబ్బుల్ని కొట్టేద్దామని దురుద్దేశంతో, ఆంద్రోళ్ళు కుట్ర చేసి, రెండు రాష్ట్రాలనూ కలిపేసారు. ఆ మీదట మా ప్రాంతపు మిగులునంతా ఆంధ్ర ప్రాంతానికి వాడేసారు అంటూ తె.వాదులు ఆరోపణలు చేస్తూంటారు. కోస్తా సీమల జనం మాత్రం దానికి ఎక్కడా సమాధానం చెప్పలేదు. పాపం, మరి కుట్రలు చెయ్యడం తప్పే గదా అని నోరు మూసుకుని ఉంటారు. నేనైతే అందుకే నోరు మూసుకుని ఉన్నాను. అయితే సత్యం కుంభకోణంలో లాగా తె.వాదుల అబద్ధాలు ఒకటొక్కటే బయటకు రావడం మొదలయ్యాక, ప్రచారంలో ఉన్నవాటిలో ఇంకా ఎన్నెన్ని అబద్ధాలున్నాయో తెలుసుకుందామని వెతికితే, ఓ నాల్రోల కిందట కొత్త సంగతి బైటపడింది. నాకిది కొత్తదేగానీ మీలో కొందరికి తెలిసే ఉండొచ్చు. ఆ నిజమిది..

1956 నాటికి హైదరాబాదు రాష్ట్రం లోటు బడ్జెట్టులో ఉంది. ఆ ఏడాదే కాదు, 1952-53 నుండి ఆ రాష్ట్రం లోటు బడ్జెట్టులోనే ఉంది. 1951-52 లో 92 లక్షల మిగులులో ఉన్న బడ్జెట్టు, 1955-56 నాటికి 5 కోట్ల 32 లక్షల లోటు చూపించింది.



1955-56 లో ఆ రాష్ట్ర నికరాదాయం ఎంత ఉందో చూసారా? 21 కోట్ల 62 లక్షలు. ఖర్చు 26 కోట్ల 94 లక్షలు. తె.వాదులూ ఏమిటి దీనర్థం? రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగేనాటికి హై. రాష్ట్రాన్ని పతనం బాటలో నడిపిస్తోంది అప్పటి ప్రభుత్వం. మరొక్క గమనిక.. ఈ నిర్వాకం ప్రజా ప్రభుత్వం హయాంలో జరిగింది. సైనిక పాలనలోనో, అధికారి పాలనలోనో కాదు.

సరే, ఇప్పుడిక ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఏంటో చూద్దాం..



1955-56 నాటికి ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కూడా గొప్పగా ఏమీ లేదు. 10 కోట్ల 73 లక్షల లోటు బడ్జెట్టుతో ఉంది. ఇక్కడో సంగతి.. ఆంధ్ర రాష్ట్రం అప్పుడప్పుడే కొత్తగా ఏర్పడింది. మౌలిక వసతుల కోసమే ఎంతో ఖర్చు పెట్టాల్సిన సమయం. పైగా, సరిగ్గా అదే సమయంలో (1952లో) విజయవాడ దగ్గర కృష్ణానదిమీద బ్యారేజీ కొట్టుకుపోయింది. కొత్త బ్యారేజీని (ఇప్పటి ప్రకాశం బ్యారేజీ) కట్టాల్సొచ్చింది. అది 1954 లో మొదలై, 1957లో పూర్తయింది. ఆకాలంలో జరిగిన పంట నష్టం, కొత్త బ్యారేజీ కట్టడానికి జరిగిన ఖర్చు - ఇదంతా కొత్త రాష్ట్రం బడ్జెట్టు తూకాన్ని కొంతవరకైనా దెబ్బతీసి ఉంటుంది. బడ్జెట్టును పరిశీలించేటపుడు మనం వీటిని పరిగణనలోకి తీసుకోవాలి.

ఈ లెక్కలను బట్టి చూస్తే తెలుస్తోందేంటయ్యా అంటే రెండు రాష్ట్రాలు కూడా ఆర్థిక పరంగా ఒకే రకంగా ఉన్నాయి. మేం అద్భుతంగా ఉన్నాం అంటూ తె.వాదులు చెప్పుకునే గొప్పతనాలేవీ ఈ లెక్కల్లో కనబడవు. అప్పటి ఆంధ్ర రాష్ట్ర విపత్కర పరిస్థితిని లెక్కలోకి తీసుకుంటే, హైదరాబాదు రాష్ట్రంలో ఇప్పటి తెలంగాణతో పాటు ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్రల్లో భాగమైపోయిన భూభాగం కూడా కలిసి ఉండేదన్న సంగతిని గమనంలో ఉంచుకుని చూస్తే బహుశా తెలంగాణ కంటే ఆంధ్రే మెరుగ్గా ఉండి ఉండొచ్చు కూడా.

సరే, ఈ లెక్కలను ఒకసారి పోల్చి చూద్దాం..
1955-56 నాటికి హై. రాష్ట్రం ఆదాయం: 21 కోట్లు. ఆంధ్ర రాష్ట్రం ఆదాయం: 17 కోట్లు
మొత్తం ఆదాయంలో హై. వాటా: 55% (హైదరాబాదు రాష్ట్రమంటే, తెలంగాణతో పాటు ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్రల్లో భాగమైపోయిన భూభాగం కూడా. ఆ ప్రాంతం నుండి వచ్చినఆదాయం కూడా ఇందులో కలిసుందని మనం గుర్తుంచుకోవాలి.)
ఆంధ్ర వాటా: 45%
ప్రస్తుతం ఈ వాటాల అంతరం ఇంకా పెరిగి ఉంటుంది.

మా మిగులును వాడేసుకున్నారు బాబో యంటూ అబద్ధాలు చెప్పెయ్యడమే కాదు, తమ అబద్ధాలను నిజమని మనల్ని నమ్మించడానికి 'హైదరాబాదు ఆదాయాన్ని మీ అభివ్రుద్ధికి ఉపయోగించడంతో పాటు హైదరాబాదును రాజధాని అవసరాలకు వాడుకున్నందుకు కూడా పరిహారం ఇవ్వాలి.' అని అడుగుతున్నారు.

తె.వాదులూ.. కోస్తా సీమలు వాడేసుకోడానికి, ఆనాటి హై. రాష్ట్రబడ్జెట్టులో పెద్ద బొక్క తప్ప, ఇక్కడేమీ లేదు. వాళ్ళంటూ ఏదన్నా వాడుకుని ఉంటే అది మీ బడ్జెట్టు లోటునే అయ్యుండాలి. వాళ్లకున్న బడ్జెట్టు లోటు చాలదన్నట్టు మీ లోటును కూడా, కుట్ర చేసి మరీ, ఎత్తుకుపోయారంటారా? ఇహనాపండి మీ అసంబద్ధ, అబద్ధ వాదనలు.
http://chaduvari.blogspot.com/2010/01/blog-post_11.html

చవకబారున్నర విశ్లేషకుడు

ఆ మధ్య హై.లో సినిమా షూటింగుల మీదబడి ధ్వంసం చేసారు ముష్కరులు. మనోజ్ సినిమా షూటింగు సంఘటన పట్ల స్పందనగా మోహన్‌బాబు ఘాటుగానే మాట్టాడాడు. ఆ తరవాత అల్లు అర్జున్ సినిమా షూటింగు మీద కూడా దాడి జరిగింది.

మన టీవీలవాళ్ళకు ఘంటా చక్రపాణి అనే నిలయ విద్వాంసుడి లాంటి విశ్లేషకు డొకాయనున్నాడు. దాడి విషయమ్మీద ఓ టీవీలో మాట్టాడుతూ -
'మోహన్ బాబు మాట్టాడినదానిపై ఎవ్వరూ ఖండించలేదేంటి' అని వాపోయాడు. వెనువెంటనే, అల్లు అర్జున్ సినిమాపై జరిగిన దాడి గురించి మీరేమంటారు అని అడిగితే, అందుకు సమాధానంగా, అదెవరో ఏబీవీపీ వాళ్ళు చేసినది అని తేల్చెయ్యబోయాడు ముందు. మళ్ళీ తిప్పుకుని, దాడిని సమర్ధిస్తూ మాట్టాడాడు. అతగాడి దృష్టిలో ముష్కరులు చేసిన దాడి సమర్ధనీయము, దాన్ని ఎదుర్కొన్నవాళ్ళ బాధ మాత్రం ఖండనీయము! రెండు నాలుకల విశ్లేషకుడు!

ఇవ్వాళ మహాటీవీలో అతడి ప్రవర్తన మరీ నేలబారుగా ఉంది. చర్చలో అతడితోపాటు ఒక సమైక్యాంధ్ర ఉద్యమ విద్యార్థి కూడా పాల్గొన్నాడు. ఆ కుర్రాడి వయసు ఇతగాడి వయసులో సగం కూడా ఉండదు. ఆ కుర్రవాణ్ణి ఇష్టమొచ్చినట్టుగా చీదరించుకున్నాడు, కసిరేసాడు. ఆ కుర్రాడు కేసీయారు గురించి మాట్టాడుతూ అతడి తాగుబోతుతనం గురించి మాట్టాడబోగా వ్యక్తిగత విషయాలు మాట్టడవద్దని చెబుతూ, "ఇక్కడ పిచ్చివాగుడు వాగకు" అని అన్నాడు. పోనీ ఘంటా ఏమన్నా సరిగ్గా మాట్టాడాడా.. విజయవాడలో ఒక ఎంపీ యొక్క ఇద్దరు భార్యల వ్యవహారం గురించి మాట్టాడాడు. అది ఆ ఎంపీ వ్యక్తిగత వ్యవహారమన్న ఇంగితం లేకుండా పోయింది అతడికి.  ఇదీ అతగాడి దిగజారుడు వ్యక్తిత్వం.

ఆ కుర్రాడు లగడపాటి గురించి మాట్టాడబోగా, మాకు అలాంటివాళ్ళ సంగతి అనవసరంలెండి అంటూ తీసేసాడు. అప్పుడా కుర్రవాడు అదేంటండీ ఆయన ఎంపీ, రేపు పార్లమెంటులో ఓటు వెయ్యాల్సి ఉంది మరి అని అన్నాడు. అందుకు ఘంటా చక్రపాణి ఏమన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతాం. "ఓటెయ్యకపోతే దొబ్బెయ్యమనండి, అతడి ఓటు మాకేం అక్కర్లేదు". ఖచ్చితంగా ఇవేమాటలుకాదుగానీ దాదాపుగా ఇవేముక్కలన్నాడు. ఒక చర్చలో ఇలా మాట్టాడే ఇతగాడొక ప్రొఫెసరంట! కనకపు సింహాసనమున.. గుర్తొచ్చింది నాకు.

అలా సాగిన ఆ చర్చలో ఆ కుర్రాడి గురించి, ఒకసారి ఇలా అన్నాడు..
"మీ ఉద్రేకాలు చూపించాలనుకుంటే మీ ప్రాంతంలో చూపించుకోండి, చానళ్ళలో కాదు." అంటే కోస్తా సీమల వాళ్ళు తమ ఉద్రేకాలను తమ ప్రాంతాల్లో చూపించాలి, ఈయన మాత్రం తన ఉద్రేకాన్ని చానళ్ళలో చూపిస్తాడు కాబోలు.

ఈ చర్చలో ఘంటా ప్రవర్తన ఏ క్షణంలో కూడా ఒక ప్రొఫెసరు స్థాయికి తగినట్టుగా లేదు. నిష్పాక్షిక విశ్లేషకుడు కాదుగదా.. కనీసం ఒక చవకబారు విశ్లేషకుడు లాగా కూడా ప్రవర్తించలేదాతడు. ఉద్యమం పేరిట బస్సుల్ని తగలబెట్టే ఏదో ముఠాలో నుండి మార్పుకోసం నేరుగా స్టూడియోకి వచ్చిన బాపతులాగా అనిపించాడు.

టీవీలవాళ్ళూ, సమస్యకు సామరస్య పరిష్కారం కావాలంటే ఈ రకం మనుషులను మాత్రం దూరంగా ఉంచాలి.
http://chaduvari.blogspot.com/2009/12/blog-post_553.html

తెలంగాణవాదుల దొంగ లెక్కలు


ఎప్పుడో ఐదారు దశాబ్దాల కిందట.. పోలీసు చర్య తరవాత హైదరాబాదు రాష్ట్రం ఏర్పడింది. ఆ తరవాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. రెండు రాష్ట్రాలూ కలిసి ఒకే రాష్త్రంగా ఏర్పడాలని పెద్దలు కోరుకున్నారు. హైదరాబాదు రాష్ట్ర శాసనసభ మెజారిటీతో ఈ ప్రతిపాదనను ఆమోదించింది. ఆ విధంగా ఏకమయ్యాక, తెలంగాణకు అనేక అన్యాయాలు జరిగాయనే ఉద్దేశంతో, విడిపోవాలనే ఉద్యమం మొదలెట్టారు, తెలంగాణవాదులు. 1969లో పెద్ద ఉద్యమమే చేసారు. అప్పటికి ఆ ఉద్యమం చల్లారిపోయింది. ఆ తరవాత, ఈ నలభై యేళ్ళలోనూ అనేక మార్పులొచ్చాయి, అభివృద్ధి జరిగింది. అయితే విడిపోవాలనే తెలంగాణవాది కోరిక అలాగే ఉండిపోయింది. తెలంగాణవాదుల కసి ('ఆంద్రోళ్ళు' అభివృద్ధి చెందారు, మేం చెందలేదు అనే కసి), కాంక్ష (పదవీ కాంక్ష) అలాగే ఉండిపోయాయి. కానీ ఈ కారణాలను బైటకు చెప్పుకోలేరు. అంచేత అభివృద్ధి జరగలేదని చెబుతూ రకరకాలుగా అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారు. చేస్తూ, ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం చేస్తున్నారు.


 ఈ మధ్య ఒక వెబ్‌సైటులో ప్రభుత్వోద్యోగుల గురించిన ఒక దొంగ లెక్క చూసాను. అందులో ఇలా రాసారు..


మొత్తం ప్రభుత్వోద్యోగులు – కోస్తా+సీమ (13 జిల్లాలు) 9 లక్షలు, తెలంగాణ (10 జిల్లాలు) 3 లక్షలు. తెలంగాణలోని ప్రభుత్వోద్యోగుల సంఖ్య కోస్తా సీమలతో పోలిస్తే మూడోవంతు మాత్రమే ఉన్నారంట! అబద్ధాలు చెప్పినా కాస్తో కూస్తో నమ్మేట్టుండాలి. ఈ లెక్కలను చిన్నపిల్లలు కూడా నమ్మరు. ఇలాంటి దొంగ లెక్కలు చెప్పి సానుభూతి కొట్టెయ్యాలని చూస్తూంటారీ తెలంగాణవాదులు. అసలు లెక్కలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది: సీమ+కోస్తాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య:684083 తెలంగాణలో:614971. చూసారా తేడా ఎంతలా ఉందో! ఇవి 2006 వ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక లెక్కలు.

ఈ అబద్ధాలు చెప్పడంలో వీళ్ళు ఒక టెక్నిక్ వాడుతూంటారు.. అదేంటంటే, తమకు అనుకూలంగా ఉందనుకుంటే హైదరాబాదును లెక్కలోకి వేసుకుంటారు లేదంటే తీసేస్తారు. తెలంగాణ పది జిల్లాలోను గణాంకాలు ఇలా ఉన్నాయి అని అంటారు. పది జిల్లాల గురించి మాట్టాడుతున్నారుగదా, హైదరాబాదును కూడా కలిపే ఉంటార్లే అని అనుకుంటాం మనం. కానీ అబద్ధాలు చెప్పడంలో చెయ్యి తిరిగిన తెలంగాణావాది సామాన్యుడనుకుంటున్నారా? ఉదాహరణకు ప్రభుత్వ గ్రంథాలయాల గురించిన లెక్క ఇలా చెబుతారు:
ప్రభుత్వ గ్రంథాలయాల సంఖ్య – కోస్తా (9 జిల్లాలు) 630, రాయలసీమ (4 జిల్లాలు) 243, తెలంగాణ (10 జిల్లాలు) 450.
తెలంగాణ 10 జిల్లాల్లోని గ్రంథాలయాల లెక్క అంటే.., హైదరాబాదును కూడా కలిపేసి ఉంటారు లెమ్మనుకుంటాం. కానీ పైలెక్కలో హై.లోని గ్రంథాలయాల లెక్క కలపలేదు. అది కలిపితే తెలంగాణ గ్రంథాలయాల సంఖ్య 562 అవుతుంది. మొత్తం గ్రంథాలయాల సంఖ్యలో 61 శాతం కోస్తా సీమల్లో ఉంటే 39 శాతం తెలంగాణలో ఉన్నాయి. ఈ గణాంకాలు కేవలం శాఖా గ్రంథాలయాల లెక్క మాత్రమే. అన్ని రకాల గ్రంథాలయాలను లెక్కలోకి తీసుకుంటే 60శాతం కోస్తా సీమల్లో ఉంటే, 40 శాతం తెలంగాణలో ఉన్నాయి. రెండు ప్రాంతాల భౌగోళిక నిష్పత్తితో సమానం.

ఇక జిల్లాల వెనకబాటుతనం చూద్దాం: తెలంగాణలోని మహబూబ్‌నగరు, నల్గొండ జిల్లాలు తప్పించి ఇతర జిల్లాలను పోల్చి చూడండి. మిగతా ప్రాంతంలోని అభివృద్ధి చెందిన జిల్లాలతో పోల్చదగిన అభివృద్ధి ఈ జిల్లాల్లో జరిగిందనేది వాస్తవం. రెండు ప్రాంతాల్లోని వరి ఉత్పత్తి గణాంకాల సంగతే చూడండి:
రాష్ట్రంలో జరిగే మొత్తం వరి ఉత్పత్తిలో కోస్తా+సీమల శాతం: 62
తెలంగాణ శాతం: 38. ఇది భౌగోళిక విస్తీర్ణాల ఉత్పత్తికి సమానం. (హైదరాబాదు జిల్లాలో వరి ఉత్పత్తి సున్నా అని గుర్తుంచుకోవాలి.

కింది పట్టికలో తెలంగాణ జిల్లాల్లోని వరి ఉత్పత్తిని, కోస్తా సీమ ప్రాంతాల్లోని వెనకబడ్డ జిల్లాల ఉత్పత్తితో పోల్చి చూపించాను.
2005-06లో కోస్తా, సీమల్లోని కొన్ని జిల్లాల్లో వరి ఉత్పత్తి ఇలా ఉంది: (టన్నుల్లో)
  1. శ్రీకాకుళం; 281,000
  2. విజయనగరం: 141,000
  3. విశాఖపట్నం: 132,000
  4. అనంతపురం: 125,000
  5. కడప: 142,000
  6. చిత్తూరు: 231,000
పై జిల్లాల్లో ఏ ఒక్క జిల్లా కూడా తెలంగాణ జిల్లాల వరి ఉత్పత్తికి సరిరాదు!

కేవలం ఉభయగోదావరులు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం నెల్లూరు, కర్నూలు జిల్లాలు మాత్రమే తెలంగాణ జిల్లాల్లో ఏదో ఒకదానికంటే ముందంజలో ఉన్నాయి.

తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో ఉత్పత్తి ఇలా ఉంది: (టన్నుల్లో)
  1. నిజామాబాదు: 506,000
  2. కరీంనగరు: 913,000
  3. మెదక్: 248,000
  4. వరంగల్లు: 646,000
  5. ఖమ్మం: 531,000
  6. మహబూబ్‌నగరు: 320,000
  7. నల్లగొండ: 939,000
హైదరాబాదు జిల్లా పూర్తిగాను, రంగారెడ్డి జిల్లా చాలావరకు పట్టణీకరణం చెందిందని అక్కడ వ్యవసాయం దాదాపుగా లేదన్న సంగతిని మనం గుర్తుంచుకోవాలి.

"ఆంధ్ర ప్రదేశ్ లోని అత్యంత వెనకబడ్డ మహబూబ్‌నగరు జిల్లాలో 4% తెల్ల కార్డులిచ్చారు. అన్నిటికంటే అభివృద్ధి చెందిన పశ్చిమ గోదావరి జిల్లాలో 7% కార్డులిచ్చారు" అని తెలంగాణవాదులు తమ వెబ్‌సైటులో చెప్పుకున్నారు. అదెంత నిజమో చూద్దాం. 2005-06 లో ప్రభుత్వం పంచిన రేషను బియ్యం వివరాలు ఇలా ఉన్నాయి: మహబూబ్ నగరు: 1,33,796.505 టన్నులు. పశ్చిమ గోదావరి: 1,26,160.655 టన్నులు.అనంతపురం తరవాత మహబూబ్‌నగర్లోనే ఎక్కువ బియ్యాన్ని పంచారు. కార్డుల శాతాల్లో తెలంగాణవాదులు చెప్పిన తేడా నిజంగా ఉంటే, బియ్యం పంపిణీలో ఈ తేడా ఎలా వస్తుంది? ఈ లెక్కలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినవి. తెలంగాణవాదులు తమ దొంగలెక్కలను ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో తెలవదు మరి.

తెలంగాణ ముఖ్యమంత్రుల మొత్తం పదవీకాలం ఆరేళ్ళని రాసారు. కానీ అది దాదాపు తొమ్మిదేళ్ళు. చేతకానివాడు ఆరేళ్ళున్నా తొమ్మిదేళ్ళున్నా ఒకటేననుకోండి. తమ ప్రజాప్రతినిధుల చేతకానితనానికి తమను తాము నిందించుకోక, 'ఆంద్రోళ్ళ'ను నిందించడం తెలంగాణవాదులకు సహజనైజంగా మారింది.

లేనిపోని కట్టుకథలు చెప్పి, వాటన్నిటికీ కారణం 'ఆంద్రోళ్ళే' నని చెప్పడం తెలంగాణ వాదులకు అలవాటైపోయింది. కాబట్టి తెలంగాణవాదులు చెప్పే అంకెల్లోని నిజాలను గమనిస్తూ ఉండాలి.
----------------------------------------

తాజాకలం: రాష్ట్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల కోసం ఈ లింకు చూడండి.
  • 610 GO: http://go610.ap.gov.in/
  • 6 సూత్రాల ఒప్పందం: http://www.aponline.gov.in/Apportal/HomePageLinks/PresidentialOrder/Presidential_Order.pdf
  • జలాశయాల వివరాలు: http://irrigation.cgg.gov.in/reservoirssms/
  • నీటిపారుదల ప్రాజెక్టులు: http://www.irrigation.ap.gov.in/ దీని ప్రకారం కొత్త ఆయకట్టు వివరాలు:
    • ఆంధ్ర: 477646
    • తెలంగాణ: 476479
    • రాయలసీమ: 57768
  • జలయజ్ఞం: http://www.irrigation.ap.gov.in/
http://chaduvari.blogspot.com/2009/12/blog-post_27.html

    'ఆంద్రోళ్ళు' దురాక్రమణవాదులా?


    తెలంగాణ ఎందుకు అని అడిగితే నీళ్ళు, నిధులు, నియామకాల కోసం అని సమాధానం వస్తుంది. ఇంకోటి కూడా వినవస్తుంది.. దాడి, దోపిడీ, దురాక్రమణలను ఎదుర్కొనేందుకు అని. సంస్కృతి మీద దాడి, నిధుల దోపిడీ, ఆస్తుల దురాక్రమణలను ను ఎదుర్కొనేందుకు అని వీటికర్థం. ఈ రెండో సెట్టు సరిగ్గా ఇదే కాకపోవచ్చు, నేను పొరపాటు పడి ఉండవచ్చు. కాస్త అటూ ఇటూగా ఇలాగే ఉంటది.


    తెలంగాణ ప్రాంతానికి వచ్చి, 'ఆంద్రోళ్ళు' పెద్దాళ్ళై పోయారు, మా భూముల్ని ఆక్రమించారు అనే వాదన వినిపిస్తారు తెలంగాణవాదులు.  దాని వెంటనే మరో ముక్క చెబుతారు.. పొట్ట చేతపట్టుకొచ్చిన వాళ్ల గురించి మాకేం ఇబ్బంది లేదు, మా ఆస్తులని అక్రమంగా ఆక్రమించుకున్నవాళ్ల గురించే మా వ్యతిరేకతంతా అని అంటారు. ఎవరో కొందరు రావుల గురించో, కొందరు రెడ్డిల గురించో, కొందరు చౌదర్ల గురించో వీళ్ళ ఫిర్యాదు! వాళ్ళెవరో అక్రమంగా ఆస్తుల్ని సంపాదించుకుంటే యావజ్జాతీ తప్పు చేసినట్టా? ఆ కొందరి కారణంగా కోస్తా సీమల వాసులంతా దురాక్రమణదారులెలా అయ్యారు? 'అందరూ దురాక్రమణ దారులే అని మేమెక్కడన్నాం? కొందరే దురాక్రమణదారులు' అని అంటారు వెంటనే! మరి, ఎవరో కొందరి కారణంగా రాష్ట్రాన్ని ఎందుకు విడదీద్దామనుకుంటున్నారు?  అటువంటి కబ్జాలే చేసిన తెలంగాణ వాళ్ళ సంగతేంటి? వాళ్ళ గురించేమీ మాట్టాడరేఁ? వాళ్ళ కోసం తెలంగాణను మళ్ళీ చీలుస్తారా?

    సరే.., ఎవరో కొందరి కోసం రాష్ట్రాన్ని చీలుస్తారు, బానే ఉంది. జరిగిపోయిన దురాక్రమణలను ఎలా సరిదిద్దుతారు? ఆయా భూములను తిరిగి లాక్కుంటారా? అది సాధ్యమయ్యే పనేనా? చట్టపరమైన చిక్కులెన్ని? అసలు చట్టంతో చుట్టరికం నెరపి చట్టవిరుద్ధమైన పనులు చేసే రాజకీయ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఉండరా? వాళ్ళు డబ్బుకు గడ్డి తినరా? ఇప్పటి ఉద్యమ నాయకుల సారథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినా సరే..,  ఇప్పటిదాకా తమ బద్ధవిరోధి అయిన ఫలానా వారి లాంకో కొండలను స్వయంగా ప్రభుత్వమే లోపాయికారీగా రక్షిస్తుందనే విషయంలో ఎవరికైనా సందేహాలున్నాయా? సందేహాలున్నవారు 2004 కు ముందు పేపర్లనిండా పరుచుకున్న సవాళ్ళను, 2004 తరవాత జరిగిన వాస్తవాలనూ బేరీజు వేసి చూడాలి. చరిత్రను మళ్ళీ ఒకసారి చదూకోవాలి. ఐ.ఎమ్.జి భారత తప్ప మిగతా ఆరోపణలు, సవాళ్ళకేమయినా అయిందా అనే సంగతిని ఆరా తీయాలి.

    కాబట్టి, తెలంగాణ ఏర్పడినంత మాత్రాన తెలంగాణవాదులు చెబుతున్న దురాక్రమణల విషయంలో అద్భుతాలేమీ జరగవు. అప్పుడు కూడా పరిస్థితులు ఇలాగే ఉంటాయి. అంతేకాదు, ఆ దురాక్రమణలు అప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కానీ తిట్టడానికి 'ఆంద్రోడుం'డడు. అప్పుడెవరితో పోరాడతారు? పాలమూరు జిల్లావాళ్ళు, కరీంనగరంతోటి, నల్లగొండ వాళ్ళు నిజామాబాదుతోటీ పోట్టాడతారా? పోరాటాల పురిటిగడ్డ కదా!

    పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ అని అంటూంటారు, నిజమే. నిజాముతో పోరాడారు, చారిత్రాత్మకమైన విముక్తి పోరాటం చేసారు. కానీ ఇప్పుడు చేస్తున్నదేమిటి.. శత్రువెవరో తెలుసుకోకుండా పోరాటం చేస్తున్నారు -కాదు చేయిస్తున్నారు. లక్ష్యం ఒకదాన్ని పెట్టుకున్నారు -ప్రత్యేకరాష్ట్రం.. అంతే! అది సాధించడం కోసం శత్రువుగా ఎవర్ని ఎంచుకుంటే బాగుంటుందో చూసుకుని, 'ఆంద్రోళ్ళ'ను ఎంచుకున్నారు. ఇక ప్రచారం మొదలుపెట్టి ప్రజల మనసులను కలుషితం చేసి, పోరాటం చేయిస్తున్నారు. నిజమైన శత్రువెవరో గుర్తించలేక కాదు, గుర్తిస్తే, ఆ శత్రువు నెదిరించడానికీ, రాష్ట్ర విభజనకూ సంబంధమేంటీ అనే ప్రశ్న తలెత్తుతుంది. దానికి సమాధానం లేదు కాబట్టి 'ఆంద్రోళ్ళం'దరినీ శత్రువుగా చూపించారు. పోరాట సంప్రదాయాన్నే కొనసాగించాలనే తలంపుతో ఎవరితో పోరాడాలో చెప్పకుండా ఒక దిశలేని పోరాటం చేయిస్తున్నారు.

    అంచేత, 'ఆంద్రోళ్ళ' దురాక్రమణ వాదం అనేది కూడా అబద్ధమే! కేవలం జనాల్లో తెలంగాణ వాదాన్ని నిలబెట్టి ఉంచడం కోసం, కొత్త తరానికి ఆ వాదాన్ని తలకెక్కించడం కోసం, కోస్తా, సీమల వ్యతిరేక భావోద్వేగాన్ని నిలబెట్టి ఉంచడం కోసం తెలంగాణ వాదుల చేతిలో ఉన్న మరో ఆయుధం 'ఆంద్రోళ్ళ' దురాక్రమణ అనే అబద్ధం. అంతేకాదు ఈ వాదనను నిరంతరం నిలబెడుతూ ప్రజల్లో సమైక్య భావన అనేది పాదుకొనకుండా పాటుబడుతున్నారు ఈ తెలంగాణ వాదులు.
    అక్రమంగా ఆస్తులను సంపాదించుకున్న కొందరు తెలంగాణేతరులపై ఉన్న కోపాన్ని మొత్తం తెలంగాణేతరులపై మళ్ళిస్తున్నారు. అలా చూపెట్టి రాష్ట్రాన్ని విడగొట్టమంటున్నారు. 


    ---------------------------------------

    ఇవ్వాళొకాయన టీవీలో ఓ అబద్ధం చెప్పాడు. ఆయన చెప్పినదాని ప్రకారం..  తెలంగాణలో సహజవనరులు సమృద్ధిగా ఉన్నాయి. రాయలసీమలో ఏవో కాసిని గ్రానైటు లాంటివున్నాయిగానీ, కోస్తాలోనైతే అసలేమీ లేవు. విడిపోతే తమ మనుగడ ప్రశ్నార్థకమౌతుందని వాళ్లకు తెలుసు. అంచేతే సమైక్య వాదాన్ని ముందుకు తెచ్చారు.  (తన వాదనకు నిరూపణగా అన్నట్టు, తెలంగాణలో బొగ్గు ఉంది, కోస్తాలో లేదని కూడా అన్నాడు) ఎలాంటి అబద్ధాలు, అసంబద్ధాలు చెప్పుకుపోతున్నారో చూడండి.

    ఒకవేళ ఆ మాట నిజమే అయితే, రాష్ట్రాన్ని విడగొట్టడం తప్పే కాదు, దేశద్రోహ నేరం కూడా!
    http://chaduvari.blogspot.com/2009/12/blog-post_16.html