మీ ఆంధ్రకో దండం.. మీ తెలంగానకో దండం..
అయ్యా మీకో దండం...
మీ ఆంధ్రకో దండం.. మీ తెలంగానకో దండం..
మా బతుకులు మాకు ఈయండి..
మీ రాజకీయాలకో దండం.. మీ ఉద్యమాలకో దండం..
ఇక మా కడుపు కాస్త నిండనివ్వండి..
మూటలెత్తే మల్లేశన్న ముద్దదిని పక్షం అయ్యింది..
బందంటారు.. సమ్మె అంటార్..
ఆకలికి ఆంధ్ర .. తెలంగాన తేడా తెలీదయ్య..
టీకొట్టు సింహాచలం.. కొడుకు సచ్చి బండయ్యాడు..
ఎవని కడుపు మంట ఆపుతారయ్య.. ఊళ్ళు కాల్చి..
అమాయకుడి రక్తం ఏరులయ్యింది..
అమ్మ కడుపుకోత కన్నీటి వరదలైంది..
ఆ నెత్తుటిదీ.. ఈ ఏడుపుదీ ఏ రాష్ట్రమయ్యా ?
మేధావులూ. విధ్యార్ధులూ.. మీకూ ఓ పెద్ద దండం..
కలిసి వున్నా.. ముక్కలై మురిసిన..
మాకు రెక్కాడితే గానీ దినం గడవదు..
మీ కొలువు మీకుంటది.. మీ ఇలువ మీకుంటది.
మా పొట్టకొట్టకండి సారూ.
కలిసి వుండిపోతే కరువు ఆగుద్దా ?
ముక్కలైపోతే బీడు పండుద్దా ?
అయ్యా.. ఎంపీలూ ఎమ్మెల్యేలూ.. దండం...
మంత్రులకు ఇంకా పెద్ద దండం..
మీ రాజీనామాలు విదిల్చకండయ్యా.. ఎంగిలాకుల్లాగ..
వొందకో ఓటు అమ్ముకోడానికి సిగ్గెస్తాది మళ్ళీ..
మీకే సత్తువుంటె.. మీ బిజినెస్సులకి చెయ్యండి రాజీనామా..
బామ్మర్ది పేరిన వేసిన టెండర్లు చించండి..
కొట్టుకుంటూ.. తిట్టుకుంటూ.. మీరు బాగుంటరు..
మీ పెళ్ళికాళ్ళొస్తరు.. ఆళ్ళింట సావుకు మీరు తోడెల్తరు..
కానీ మాకు చావే పెళ్ళాయె సారు..
ఓ నాలుగు దినాలు మమ్మల్నీ బతికి చావనివ్వండి..
సార్లూ.. కొట్టుకోడంలో బాగా కలిసిపోయారు..
సానా సంతోషం... థాంక్సూ..
మీ జెండా కర్రలెత్తుకుని కలిసి వూర్లో వూరేగండి..
చూడ ముచ్చటగా వుంటది..
కానీ మా కడుపుల్లోకి దించకండి సార్లూ..
( ఎవరు రైటో.. ఎవరు రాంగో కానీ.. మధ్యలో నలిగిపోతున్నది సామాన్యుడే.
తొందర్లోనే ఈ రావణ కాష్టానికి ముగింపు పడుతుందని ఆశిస్తూ... )
http://naaharivillu.blogspot.com/2009/12/blog-post_24.html

చాలా బాగుంది అనలేను కారణం ఇది ఆవేదన
రిప్లయితొలగించండిచెత్తగా ఉంది అనలేను కారణం ఇది నివేదన
ఈ నాయకుల నోట్లో దుమ్ముబడా
ఈ ఉద్యమకారుల కంట్లో నలుసు పడా
మన మల్లేసన్న కడుపులో ముద్ద పడా
మన సింహాచలం మనసు చల్లపడా...
జై తెలుగు జాతి !! జై జై తెలుగు బిడ్డా !!
యువత ఆవేశం ఆలోచనగా మారే స్వేచ్ఛ,
రిప్లయితొలగించండినాయకుల భవిష్యత్తు పునాదుల నిర్మాణంలో పాతుబడిపోయింది.
http://alochanalu.wordpress.com/2011/05/04/
ఎటు చూసినా చివరకు చిక్కిపోయేది మధ్య తరగతి మానవుడే..నిజాన్ని నిక్కచ్చిగా చెప్పారు.