తాను తెలంగాణ శంకరని చెప్పుకుంటన్నాడు కాబట్టి బాగా వార్తల్లో పడ్డాడు. ఈమధ్య తెలంగాణ ఉద్యమాన్ని తన సినిమా కోసం బాగానే వాడుకున్నాడు. సినిమా వాళ్ళు ఒకపక్క సమ్మె చేసుకుంటూ ఉంటే, ఈయన తన సినిమాను (దాని పేరు జై బోలో తెలంగాణ) ఈ సమ్మె నుంచి మినహాయింపించుకున్నాడు. తెలంగాణ సినిమా జాక్ అనేది కూడా ఒకటుందంట కూడా -ఈయనే పెట్టేసుంటాడు. జాకా మజాకా!
టీవీ9లో ఒక ఫోనాఫోనీలో పాల్గొన్నాడీయన. అమెరికా యూరప్పుల నుంచి మనవాళ్ళు ఫోను చేసి ప్రశ్నలేస్తే ఈయన సమాధానాలిస్తాడన్నమాట. వెంకట్ అనే ఒకాయన అడిగిన ప్రశ్న.. "ఉస్మానియాలో ఉద్యమం పేరుతో డబ్బులు ఎలా వసూలు చేసారో మీ సినిమాలో చూపిస్తున్నారా" అని. దానికి ఈయనిచ్చిన సమాధాన మేంటంటే.. ఉద్యమం అన్నాక, కొన్ని లంపెన్ ఎలిమెంట్లు ఎక్కడైనా ఉంటాయండీ. వాటికి అంత ప్రాధాన్యత నివ్వకూడదు. ఉద్యమం పూర్తి స్వభావాన్ని చూడాలి కానీ ఇలాంటి చిన్నచిన్న విషయాలను పట్టించుకోకూడదు. పైగా మీరే అంటున్నారు అది పుకారని. దానికి విలువ ఎలా ఇస్తామండీ? నిరూపణ కానిదాన్ని చూపించడంట. అద్భుతమైన విలువలు కదా! మరి ఈయన గారి మిగతా విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం.. (సినిమావాడికి విలువలేంటయా అంటారా.. నిజమేననుకోండి!)
ఆ సినిమాలో కేసీయారు రాసిన ఒక పాటను టీవీలో చూపించా రీ మధ్య. అందులో సమైక్యాంధ్ర ఉద్యమం కృత్రిమ ఉద్యమం అని వర్ణించారు. కేసీయారు ఇన్నాళ్ళుగా చేస్తున్న ఆరోపణే అది; ఎక్కడా రుజువు లేని, నిరాధారమైన ఆరోపణ. దాన్ని పాటలో పెట్టెయ్యడం ఈ దర్శకుడికి అనుచితమనిపించలేదు మరి. ఆంధ్రుల మీద వచ్చే పుకార్లను ఎడాపెడా నమ్మేసి సినిమాలో యథేచ్ఛగా పెట్టేస్తాడా? తెలంగాణ ఉద్యమం గురించి వచ్చిన పుకార్లను సినిమాలో పెట్టడం మాత్రం అనుచితమా? ఇంతోటి సన్నాసితనానికి ఉద్యమం, దాని స్వభావం అంటూ పోసుకోలు కబుర్లు చెప్పడం ఎందుకూ? ఏదో తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టేసుకుని, ఒక సినిమా తీసేసుకుని, కాసిని డబ్బులు చేసేసుకుందామని అనుకుంటన్నాను అని చెబితే పట్టించుకోకపోదుం గదా!
కాబట్టి నీతి ఏంటన్నమాటా.. ఉద్యమాన్ని ఎట్టాగూ అబద్ధాలతోనే గదా నిర్మించారు, ఇక దాన్ని వాడుకుని తీసే సినిమా దానికి భిన్నంగా ఉంటదని అనుకోకూడదు. ఉద్యమం లాగే ఈ సినిమా కూడా .. జై బోలో కాదు, లై బోలో తెలంగాణ! లై బోలో తెవాదీ అంటే మరింత బాగుంటాది.
http://chaduvari.blogspot.com/2011/01/blog-post_20.html
can you give the video link...
రిప్లయితొలగించండి