27, మే 2011, శుక్రవారం

TNGO సమర్పించు వంటావార్పు మార్చు కం బైటాయింపు

ఈనాడు వార్తాపత్రిక నుండి:  "తెలంగాణా కోసం మిలీనియం మార్చ్ ను మరిపించేలా హైదరాబాద్ లో పది రోజులపాటు  వంట వార్పు మార్చ్ నిర్వహించనునట్లు TNGOల  సంఘం అధ్యక్షుడు స్వామి గౌడ్ తెలిపారు. జూన్ 1 న  వనస్థలిపురం నుంచి తానూ, సంఘం నేతలతో కలిసి బస్తీ బాట పట్టనున్నట్లు ప్రకటించారు.హైదరాబాద్ వంట-వార్పు కార్యక్రమం ఎన్నడు ఎరగని రీతిలో సాగుతుందన్నారు. ఒక్కో జిల్లానుంచి ఉద్యోగులు హైదరాబాద్ చేరుకొని పిక్నిక్కు వచ్చినట్లు ఆయా రహదారుల్లో వంటావార్పు చేసుకొని సాయంత్రం వరుకు రోడ్డుపైనే బస చేయాలని కోరారు. తేది ఇతర వివరాలు త్వరలోనే  ప్రకటిస్తామని చెప్పారు."

ఏమాటకామాటే చెప్పుకోవాలి.ఉద్యోగ సంఘాల నాయకులమని చెప్పుకు తిరిగే వారికి కడుపులో చల్ల కదలకుండా డప్పు కొట్టుకుంటూ ఉద్యమాలు చేయడం అంటే ఎంతో సరదా. ఎందుకు ఉండకూడదు చెప్పండి? వారికది అలవాటేగా.ఫిభ్రవరి మాసంలోనే కదా ప్రభుత్వోద్యోగులు కార్యాలయాలు ముందు టెంట్లు , మెడలో ఒక దండ వేసుకొని, మీడియాను పిలిపించుకొని మరీ వంతుల వారీగా ఒక పూట దీక్షలో కూర్చొని గడియారంలో ఐదు ఎప్పుడెప్పుడవుతుందాని ఎదురుచూపులు చూస్తూ  సహాయనిరాకరణం చేసాం అని అనిపించారు. నేను దగ్గరగా చూసిన ఒక దీక్ష శిబిరంలో తెలంగాణా రుచులకోరకు కేటరింగ్ ఆర్డర్ ఇచ్చారు. ఇక చూడాలి ఐదు అవగానే దండలు తీసి బొజ్జలు ఊపుకుంటూ భోజనాల దగ్గరకు తినడానికి రెడీ అయిపోయారు. ఎక్కువ శిబిరాల్లో మాత్రం టైం కాగానే నిమ్మకాయ షర్బత్ లేదా ఏదో జ్యూస్ రెడీగా ఉండేది. ఈ సారి మంచి ప్లానే వేసినట్టున్నారు. పని చేయకుండానే జీతాలు తీసుకొంటూ పది రోజులపాటు రోజుకి ఐదారు రుచులతో విందు భోజనాలు చేయాలని ఈ ప్రోగ్రాం రూపొందించారనిపిస్తున్నది. జీతాలు ఆగిపోయినా,కడుపు నిండకపోయిన వీరు  కూర్చోరని నాయకులకు తెలుసుమరి. క్రితం సారిలా చాలామందిని బెదిరించి పని మార్పించి దీక్షలో కూర్చోబెట్టించే పరిస్థితి ఎలాగు లేదు. ప్రభుత్వం 'నో వర్క్ నో  పే' నిబంధనను ఖచ్చితంగా అమలు పరిచి ఇటువంటి కార్యక్రమాల్లో పాలుపంచుకోను ఉద్దేశం లేని ఉద్యోగులుకు రక్షణ కలిపిస్తుందని ఆశిస్తున్నాను


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి