ఈ మధ్య ఒక వెబ్‌సైటులో ప్రభుత్వోద్యోగుల గురించిన ఒక దొంగ లెక్క చూసాను. అందులో ఇలా రాసారు..
మొత్తం ప్రభుత్వోద్యోగులు – కోస్తా+సీమ (13 జిల్లాలు) 9 లక్షలు, తెలంగాణ (10 జిల్లాలు) 3 లక్షలు. తెలంగాణలోని ప్రభుత్వోద్యోగుల సంఖ్య కోస్తా సీమలతో పోలిస్తే మూడోవంతు మాత్రమే ఉన్నారంట! అబద్ధాలు చెప్పినా కాస్తో కూస్తో నమ్మేట్టుండాలి. ఈ లెక్కలను చిన్నపిల్లలు కూడా నమ్మరు. ఇలాంటి దొంగ లెక్కలు చెప్పి సానుభూతి కొట్టెయ్యాలని చూస్తూంటారీ తెలంగాణవాదులు. అసలు లెక్కలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది: సీమ+కోస్తాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య:684083 తెలంగాణలో:614971. చూసారా తేడా ఎంతలా ఉందో! ఇవి 2006 వ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక లెక్కలు.
ప్రభుత్వ గ్రంథాలయాల సంఖ్య – కోస్తా (9 జిల్లాలు) 630, రాయలసీమ (4 జిల్లాలు) 243, తెలంగాణ (10 జిల్లాలు) 450.
తెలంగాణ 10 జిల్లాల్లోని గ్రంథాలయాల లెక్క అంటే.., హైదరాబాదును కూడా కలిపేసి ఉంటారు లెమ్మనుకుంటాం. కానీ పైలెక్కలో హై.లోని గ్రంథాలయాల లెక్క కలపలేదు. అది కలిపితే తెలంగాణ గ్రంథాలయాల సంఖ్య 562 అవుతుంది. మొత్తం గ్రంథాలయాల సంఖ్యలో 61 శాతం కోస్తా సీమల్లో ఉంటే 39 శాతం తెలంగాణలో ఉన్నాయి. ఈ గణాంకాలు కేవలం శాఖా గ్రంథాలయాల లెక్క మాత్రమే. అన్ని రకాల గ్రంథాలయాలను లెక్కలోకి తీసుకుంటే 60శాతం కోస్తా సీమల్లో ఉంటే, 40 శాతం తెలంగాణలో ఉన్నాయి. రెండు ప్రాంతాల భౌగోళిక నిష్పత్తితో సమానం.
ఇక జిల్లాల వెనకబాటుతనం చూద్దాం: తెలంగాణలోని మహబూబ్‌నగరు, నల్గొండ జిల్లాలు తప్పించి ఇతర జిల్లాలను పోల్చి చూడండి. మిగతా ప్రాంతంలోని అభివృద్ధి చెందిన జిల్లాలతో పోల్చదగిన అభివృద్ధి ఈ జిల్లాల్లో జరిగిందనేది వాస్తవం. రెండు ప్రాంతాల్లోని వరి ఉత్పత్తి గణాంకాల సంగతే చూడండి:
రాష్ట్రంలో జరిగే మొత్తం వరి ఉత్పత్తిలో కోస్తా+సీమల శాతం: 62
తెలంగాణ శాతం: 38. ఇది భౌగోళిక విస్తీర్ణాల ఉత్పత్తికి సమానం. (హైదరాబాదు జిల్లాలో వరి ఉత్పత్తి సున్నా అని గుర్తుంచుకోవాలి.
కింది పట్టికలో తెలంగాణ జిల్లాల్లోని వరి ఉత్పత్తిని, కోస్తా సీమ ప్రాంతాల్లోని వెనకబడ్డ జిల్లాల ఉత్పత్తితో పోల్చి చూపించాను.
2005-06లో కోస్తా, సీమల్లోని కొన్ని జిల్లాల్లో వరి ఉత్పత్తి ఇలా ఉంది: (టన్నుల్లో)
కేవలం ఉభయగోదావరులు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం నెల్లూరు, కర్నూలు జిల్లాలు మాత్రమే తెలంగాణ జిల్లాల్లో ఏదో ఒకదానికంటే ముందంజలో ఉన్నాయి. | తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో ఉత్పత్తి ఇలా ఉంది: (టన్నుల్లో)
|
"ఆంధ్ర ప్రదేశ్ లోని అత్యంత వెనకబడ్డ మహబూబ్‌నగరు జిల్లాలో 4% తెల్ల కార్డులిచ్చారు. అన్నిటికంటే అభివృద్ధి చెందిన పశ్చిమ గోదావరి జిల్లాలో 7% కార్డులిచ్చారు" అని తెలంగాణవాదులు తమ వెబ్‌సైటులో చెప్పుకున్నారు. అదెంత నిజమో చూద్దాం. 2005-06 లో ప్రభుత్వం పంచిన రేషను బియ్యం వివరాలు ఇలా ఉన్నాయి: మహబూబ్ నగరు: 1,33,796.505 టన్నులు. పశ్చిమ గోదావరి: 1,26,160.655 టన్నులు.అనంతపురం తరవాత మహబూబ్‌నగర్లోనే ఎక్కువ బియ్యాన్ని పంచారు. కార్డుల శాతాల్లో తెలంగాణవాదులు చెప్పిన తేడా నిజంగా ఉంటే, బియ్యం పంపిణీలో ఈ తేడా ఎలా వస్తుంది? ఈ లెక్కలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినవి. తెలంగాణవాదులు తమ దొంగలెక్కలను ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో తెలవదు మరి.
లేనిపోని కట్టుకథలు చెప్పి, వాటన్నిటికీ కారణం 'ఆంద్రోళ్ళే' నని చెప్పడం తెలంగాణ వాదులకు అలవాటైపోయింది. కాబట్టి తెలంగాణవాదులు చెప్పే అంకెల్లోని నిజాలను గమనిస్తూ ఉండాలి.
----------------------------------------
తాజాకలం: రాష్ట్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల కోసం ఈ లింకు చూడండి.- 610 GO: http://go610.ap.gov.in/
- 6 సూత్రాల ఒప్పందం: http://www.aponline.gov.in/Apportal/HomePageLinks/PresidentialOrder/Presidential_Order.pdf
- జలాశయాల వివరాలు: http://irrigation.cgg.gov.in/reservoirssms/
- నీటిపారుదల ప్రాజెక్టులు: http://www.irrigation.ap.gov.in/ దీని ప్రకారం కొత్త ఆయకట్టు వివరాలు:
- ఆంధ్ర: 477646
- తెలంగాణ: 476479
- రాయలసీమ: 57768
- జలయజ్ఞం: http://www.irrigation.ap.gov.in/
సచ్చిన గాడిదని మళ్ళీ మళ్ళీ కొడుతున్నారు. ఓడ్రించి ఓడ్రించి గమ్మునున్నారు కదా. ఏదో నాలుగు విగ్రహాలిస్తే కూలగొట్టుడు కార్యక్రమాలు చేసుకుని తృప్తిపడతారు. చదువుల్లో ఎనకబడ్డోళ్ళకి ఈ లెక్కలు అర్థమెలా అవుతాయండి? :P
రిప్లయితొలగించండిక్లాసులకు బంకు కొట్టే ప్రొపసర్ కోదండం కూడా కవరేజి లేక క్లాసులకు మూసుకు కూచున్నాడు. :D