22, మే 2011, ఆదివారం

సీమాంధ్రుల అహంకారానికి తెలంగాణావాది ప్రశ్న

మా మానాన మేము శాంతియుతంగా ఏదో ఒకటో రెండో విగ్రహాలు ట్యాంక్ బుండ్ మీద పగలగొట్టినంత మాత్రాన, ఒకరి ఇద్దరితో పాటుగా ఏదో ఒక ఎమ్మెల్యేని రెండు చెంప దెబ్బలు వేస్తె లేదా ఏదో పదో పన్నెండో బస్సులు తగుల పెట్టినంత మాత్రాన, ఒకటో రెండో భవంతులుని తగుల పెడితే,ఏదో ఒక చిన్న రైలు ని అంటిన్చేస్తే, ఏదో కొంత మంది చనిపోయిన విద్యార్థుల దగ్గర ఆత్మహత్యా పత్రం పెట్టినంత మాత్రాన మా తెలంగాణా ఉద్యమాన్ని మీ ఆంధ్రోల్లు మమ్మల్ని అరాచక శక్తులతో పోల్చడం ఏమైనా బాగుందా? మా తెలంగాణా జిన్నా గారు కేసీఆర్ గారు ఆమరణ నిరాహారదీక్షలో ఏదో ఎవరూ చూడకుండా అర్థ రాత్రి దాటాక ఒక డజను ఇడ్లీలో లేదా కోడి మాంసం ముక్కలు రెండు కతికి, నిద్ర పోయేదానికి ఒక్క నాలుగు పెగ్గుల తో సరి పెట్టుకొంటే మీ లగడపాటి/జగడపాటి ఆయన నిరాహారదీక్షని అపహాస్యం చేయడం ఏమైనా బాగుందా? ఇది మీ సీమాంధ్రుల అహంకారము కాదా? మా టీఆరెస్ కార్యకర్తలు మా తెలంగాణా జిన్నా కేసీఆర్ గారు ప్రతిష్టాపించిన తెలంగాణా తల్లిని తగులబెడితే మేము మీరు చేసిన పని అని ఏదో కొద్దిరోజులు రచ్చ చేసినంతమాత్రాన మీరు మమ్మల్ని ఉగ్రవాదులతో లేదా అబద్ధాల కోరులుగా భావించడం చాలా తప్పు. అది మా ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తుంది. మా విద్యార్ధి నాయకుడు ఏదో ఒక కాలేజీ పిల్ల మీద మోజు పడి తనని ప్రేమించమని లేదా ఏసిడ్ పోస్తానని చిన్నగా చెప్పినంత మాత్రాన అతడేదో మహా అపరాధం చేసినట్లుగా చూడకూడదు. అది అతని యొక్క ప్రేమ భావనని తెలియచేస్తుందే తప్ప హింస కింద చూస్తె అతనిని అవమాన పరిచినట్లు అవుతుంది. మా విమలక్క లాంకో హిల్స్ ని ఆక్రమించుకొని అక్కడ జెండాలు పాతితే అది ఆక్రమణ కాదు ప్రజా ఆగ్రహం. పాత బస్తీలో వక్ఫ్ భూముల కబ్జాని అన్యాయంగా ఆపిన అక్బరుద్దీన్ మీద తెలంగాణా సానుభూతి పరులైన శ్రీ పహిల్వాన్ గారు, వారి మిత్రులు ఏదో ఒక సారి కాల్పులు జరిపితే దానిని హింసాత్మక ఘటనగా చూడడం చాలా తప్పు. అది శ్రీ పహిల్వాన్ గారు తన అయిష్టతని ఆ విధంగా తెలియ చేసారు అంతే. ఏదో మా కవితమ్మ ముచ్చట పడి ఒకటో రెండో మీ ఆంధ్రోల్ల సైన్మాలని విడుదల కోసం అతి తక్కువగా సినిమాకు కోటిన్నర రూపాయలు మాత్రమె హఫ్తా కింద వసూలు చేస్తే మీరు అనవసరంగా ప్రశ్నించి ఆవిడని అవమానిస్తున్నారు. మా ఎమ్మెల్యేలు ఎం పీలు ఒకళ్లో ఇద్దరో మహిళలను ఇతర దేశాలకు తమ భార్యలుగా పంపిస్తే వారిని దోషులుగా చూడడం ఏమి సబబు? మా ఎం పీ గారు శ్రీ మధు యాష్కి ఒకటో రెండో దొంగ పత్రాలని చూపించి తన బంధువులు తాను అమెరికా మరియూ ఇతర దేశాలు వెడితే దానిని భూత అద్దంలో చూపుతున్నారు. మా వి.హనుమంత రావు గారి మనుమడు ముచ్చటపడి ఒక చిన్న మైక్రో ఫైనాన్సు కంపెనీ పెట్టి ఏదో కొన్ని కోట్లు వెనకేసుకొంటే మీరు ఈర్ష్యతో లేని పోనీ అభాండాలు వేస్తున్నారు. మా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వారి దగ్గి నుండి కొంత మొత్తం తీసుకొని క్రాస్ వోట్ చేస్తే దానిని పెద్ద రాద్ధాంతం చేయడం ఏమీ బాగో లేదు. మీరు మమ్మల్ని ఈ విధంగా ప్రశ్నించి మా ఆత్మగౌరవాన్ని దేబ్బతీయటం ఏమైనా బాగుందా? ఇది మీ అహంకారానికి పరాకాష్ట కాదా?

10 కామెంట్‌లు:

  1. vidveshaalu evaru reccha gottina tappe endukanta baada vidipote vidipommanandi maharashtra, tamil nadu velladaaniki visa kavala alane telamgana evari drushti konam valladi lite

    రిప్లయితొలగించండి
  2. I dont think thins post is in good taste. We expect articles of insight rather ignite. Especially these lines..

    " మా తెలంగాణా జిన్నా గారు కేసీఆర్ గారు ఆమరణ నిరాహారదీక్షలో ఏదో ఎవరూ చూడకుండా అర్థ రాత్రి దాటాక ఒక డజను ఇడ్లీలో లేదా కోడి మాంసం ముక్కలు రెండు కతికి, నిద్ర పోయేదానికి ఒక్క నాలుగు పెగ్గుల తో సరి పెట్టుకొంటే మీ లగడపాటి/జగడపాటి ఆయన నిరాహారదీక్షని అపహాస్యం చేయడం ఏమైనా బాగుందా?

    రిప్లయితొలగించండి
  3. మీ కడుపులో ఇంత విష ముందా
    కక్కండి
    బ్లాగుల్లో కక్కేందుకు మీకు కావలసినంత స్వేచ్చ వుంది.
    ముక్కు మూసుకుని పోయేవాడు పోతాడు మీ పని మీరు కానిచ్చేయండి.
    కక్కండి
    ఆశుద్దాన్ని కక్కేయండి.

    రిప్లయితొలగించండి
  4. తెలబానుల కంటే అశుద్దాని ఎవరయినా కక్కగలరా, అనుభవజ్ఞులు మీకు తెలియదా :-)))

    తెలబానుల చేష్టలను, ముఖ్యం గా దొరగారిని ఆయన కుటుంబాన్ని ఏమయినా అంటే, మీ మనోభావాలు దెబ్బ తింటాయి అని ఇంకా ఈ కొత్త బ్లాగరు తెలుసుకొన్నట్లు లేరు, ఎదో క్షమించేసి, వెళ్లి ట్యాంకుబండు మీద మిగిలిన విగ్రహాల మీద ప్రతాప, పౌరుషాలు చూపండి :)))


    ఇక టపా వరకు వస్తే, ఈ బ్లాగులో ఇంతకముందు వచ్చిన టపాలతో పోలిస్తే వ్యంగ్యం పాలు ఎక్కువ అయ్యింది అనవచ్చు. అది కొందరకు మింగుడు పడక పోవచ్చు కూడా, కాకపోతే సగటు తెలబాను మానసికవేదనను చక్కగా వ్యక్తపరచారు. మాంచి ప్రశ్నలే :)

    రిప్లయితొలగించండి
  5. "...ఏదో కొంత మంది చనిపోయిన విద్యార్థుల దగ్గర ఆత్మహత్యా పత్రం పెట్టినంత మాత్రాన మా తెలంగాణా ఉద్యమాన్ని ...."

    Sir, its very bad.
    Ramu

    రిప్లయితొలగించండి
  6. మీరు ఇలాంటి వ్రాతల ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారో ఒక సారి ఆలోచించండి. మీరు ఏం సాధించాలనుకుంటున్నారో తెలీదు కానీ అది రాష్ట్ర సమైక్యత మాత్రం కాదని ఆర్థమౌతుంది.

    Best of luck :)

    రిప్లయితొలగించండి
  7. 1. అయ్యా బ్రిగేడ్ గారూ, నేను ఈ వ్యాసంలో విద్వేషాన్ని రెచ్చగోట్టలేదు. తెలంగాణవాదులు చేస్తున్న తప్పులని ఎత్తిచూపడానికి ప్రయత్నిచాను.
    2. సత్యగారూ గుడ్ టేస్ట్ అంటే మీ ఉద్దేశములో ఏదో సందేశం లేదా న్యూస్ లేదా వివరణ ఇవ్వడం మాత్రమేనా.ఆ విధంగా ఇవ్వాలంటే ఎవరైనా ఇవ్వవచ్చు. దానికి నేను అవసరం లేదు. ఇంకొక విషయం, నేను కేసీ ఆర్ గారి పనులను ఆయన చేసే వ్యాఖ్యలు లేదా వాడె భాషను సమర్ధించ లేను. ఒక ప్రాంతం వారిని తిడుతున్నప్పుడు మీరు ఎక్కడికి పోయారు. అప్పుడు మాకు మనోభావాలు ఉండవా లేక మీ వేర్పాటువాదుల సొంతమా?
    3. గౌతం నవయంగారు మీరు రాసిన పదాలను ఒక్కసారి చూస్తె మీ తెలంగాణా జిన్నా గారి భాషే గుర్తుకు వస్తుంది. మీరు భాష విషయంలో అభిప్రాయ విషయంలో రాసిన భాషే శ్రీ కేసీఆర్ గారు ఎదుటివారి ఆహార విషయంలోనూ అన్నారు. మీ ఇద్దరికీ ఏమీ తేడా లేదు. ఎదుటివారిని విమర్శించే బదులు మనం ఎటువంటి భాషని ఉపయోగిస్తున్నాం అనేది చూడండి. ఇంకొక విషయం నేను రాసినది వ్యంగ్యముగానే కానీ మీరు రాసిన భాషే నాకు రోత పుట్టేతట్లుగా ఉంది.
    4. సీతారాం గారు నేను రాసినది తప్పైతే ఒక్క విషయం చెప్పండి. ఒక వ్యక్తి తన శరీరాన్ని నిప్పుతో తగుల పెట్టుకొంటే తొంభై శాతం శరీరం తగులబడింది కానీ అతనివద్ద ఉన్న ఆత్మహత్యా పత్రం తెల్ల కాగితంలా ఉంటే మీకు ఎలా ఉందోకానీ నాకు ఆ విధంగా కాగితం తగలబడకుండా ఉండే సాంకేతిక పరిజ్ఞానం తెలిస్తే మన శాస్త్రజ్ఞులకు తెలిపి పేటెంట్ తీసుకొందామను కొంటున్నాను. మీరు మళ్లీ సీమాంధ్రుల వ్యాపార ధోరణి అని నిందించకండి.
    5. షాడో గారు, ఒక సమైక్యవాదిగా నాలా చాలామంది బాధ పడుతూ పైకి చెప్పలేకపోయిన వారికి ఈ వ్యాసం కొంత హాస్యాన్ని కొంత బాధని మరిచిపోయి నవ్వుకొనే టానిక్ లా ఉండాలనే ఉద్దేశం తోనే ఈ విధంగా రాసాను. అంతే తప్ప వేరేవేరినో ఇబ్బంది పట్టే యోచన లేదు. నేను రాసినవి సత్యాలు. నిజం ఎప్పుడూ కటువుగానే ఉంటుంది. కాక పొతే కొంచెం వ్యంగ్యంగా రాయడం జరిగింది.
    6. కృష్ణ గారు, మీకు నా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. @ రాళ్ళబండి గారూ: విద్యార్థుల ఆత్మహత్యల విషయములో నేను మీ వాదనను సమర్థించలేను. సరైన విచారణ అనేది తెలంగాణ అంశముపై అసాధ్యముగనుక వాటిని నావరకు అలాంటి ఆత్మహత్యలుగానే పరిగణిస్తున్నాను.

    @ మిగిలిన తెలంగాణవాదులు: గత పదేళ్ళ నుంచి మీరు చేస్తున్న పనే ఇప్పుడు మిగిలిన ప్రాంతాలవాళ్ళు చేస్తున్నాను. నీవు నేర్పిన విద్యే నీరజాక్షా.

    @ షాడో: సమైక్యత కాదనుకున్నప్పుడు మిగిలేది విధ్వంసమే. మీ ప్రోత్సాహం అందుకే అయితే అభినందనలు మీకు. త్వరలో చూడబోయే రావణకాష్టానికి సిద్ధంగా ఉండండి.

    రిప్లయితొలగించండి
  9. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి