11, మే 2011, బుధవారం

భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పై మహాత్మా గాంధీ

భారతదేశానికి  స్వాతంత్ర్యం రాక ముందే ఎన్నోఏళ్ల పాటు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పై చర్చ జరిగింది. ముఖ్యంగా సైమన్ కమీషన్ నియామకం, ఒరిస్సా రాష్ట్ర ఏర్పాటు, మద్రాస్ ప్రెసిడెన్సి లోని తెలుగువారి డిమాండ్ తదీతర అంశాలు ఆ చర్చను ముందుకు నడిపించాయి. కాకపోతే  పరాయి పాలనలో ఉన్న దేశంలో రాష్ట్రాల పునర్విభజన అంశం అంత ప్రాధాన్యతను సంతరించుకోలేదు.స్వాతంత్య్ర సంగ్రామాన్ని ముందుండి నడిపించిన భారత జాతీయ కాంగ్రెస్ ముఖ్య నాయకుడు, జాతిపిత మహాత్మా గాంధీ అనేక సందర్భాలలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థించారు. ఆయన కృషితోనే  ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలను భాషా ప్రాతిపదికన ఏర్పాటు చేయడం జరిగింది.

దురదృష్టం కొద్దీ హైదరాబాద్ సంస్థాన విమోచన, భారత దేశంలో విలీన సమయానికి  మహాత్మా గాంధీ జీవించి లేరు. జీవించి ఉంటే ఆయన విశాలాంధ్ర ఏర్పాటును గట్టిగా సమర్థించి ఉండేవారు. 

సర్వేపల్లి రాధాకృష్ణన్ కు  మహాత్మాగాంధీ వ్రాసిన ఈ లేఖ చదవండి
LETTER TO S. RADHAKRISHNAN
SEGAON, WARDHA,
December 23, 1938


DEAR SIR RADHAKRISHNAN,
As you know I have always aimed at a redistribution of Provinces on a linguistic basis. The cue was taken from the Andhra movement. I should therefore be more than glad if Andhra could have its status as a Province recognized even now.
Yours sincerely,
M. K. GANDHI

ఒక సందర్భంలో విజయనగర మహారాజు కుమార్ విజయానంద్ గారు ఆంధ్ర రాష్ట్రం పై తన అభిప్రాయాన్ని తెలుపమని మహాత్మా గాంధీకి లేఖ వ్రాయగా, దానికి జవాబునిస్తూ గాంధీ ఇలా అన్నారు, " I was principally instrumental in securing from the Congress the recognition of the redistribution of the Provinces for Congress purposes on a linguistic basis. I have always agitated for the acceptance by the Government of such redistribution. I have indeed advised Tamil Nad, when such advice was needed, not to resist the Andhra demand" ( Harijan, March 29-1942)

ఇంకొక సందర్భంలో హరిజన్ పత్రిక కోసం 19th April,1942 న వ్రాసిన నోటు 'Linguistic basis' లో మహాత్మా గాంధీ ఇలా అన్నారు , "I believe that the linguistic basis is the correct basis for demarcating provinces. I should not mind two provinces speaking the same language, if they are not contiguous. If Kerala and Kashmir were speaking the same language, I would treat them as two distinct provinces" (From the Collected Works of Mahatma Gandhi Vol 82 http://www.gandhiserve.org/cwmg/VOL082.PDF )

28 కామెంట్‌లు:

  1. చాలా విలువైన సమాచారం

    రిప్లయితొలగించండి
  2. Gandhiji was not a fool to get confused, in understanding the term - "linguistic State". He saw NORTHERN PROVINCE and CENTRAL PROVINCE already existing as two states, in which people were speaking same language. He had full clarity of the following matter...
    "Every State must be an unilingual State. One State, one language.
    The formula one State, one language must not be confused with the formula of one language, one State.
    The formula one language, one State means that all people speaking one language should be brought under one Government irrespective of area, population and dissimilarity of conditions among the people speaking the language. This is an absurd formula. It must be abandoned. A people speaking one language may be cut up into many States as is done in other parts of the world.
    Into how many States a people speaking one language should be cut up, should depend upon (1) the requirements of efficient administration, (2) the needs of the different areas, (3) the sentiments of the different areas, and (4) the proportion between the majority and minority."

    రిప్లయితొలగించండి
  3. శాయి గారు, మహాత్మా గాంధీ గురించి మాట్లాడుతూ అంబేద్కర్.org నుండి పేస్టు చేసారేమిటి? వారు వేరు వేరు వ్యక్తులు అని మీకు తెలుసని నేను అనుకోవచ్చా? మీరు మీ అధ్యయనాలు ఏమిటో నా కర్థం కావు . ఇంతకు ముందు మీరే కదా గూగుల్ పిక్స్ నుండి మహాభారతంలో తెలింగ దేశం గురించి లోకానికి తెలియని కొత్త విషయాలు కనిపెట్టారు?

    రిప్లయితొలగించండి
  4. మీరు ఇచ్చిన కొటేషన్లలో గాంధీ ఆంధ్రా విభజనను సమర్థించినట్టు కనబడుతుంది. అంతే గానీ ఆంధ్రా, హైదరాబాదులను కలపాలని ఎక్కడా లేదు. లేని దాన్ని ఊహించుకొని మీరు రాసినందుకే శాయి అలా ప్రతిస్పందించారు.

    మీరు పైన ఉటంకించిన దాంట్లో గాంధీ ఉద్దేశ్యం ఒక రాష్ట్రానికి ఒకే భాష ఉండాలనే కానీ ఒకే భాష మాట్లాడే వారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని కాదు. అలా చెప్పడానికి గాంధీ కొంతమందిలా తెలివి తక్కువ వాదనలు చేసే మనిషి కాదు.

    రిప్లయితొలగించండి
  5. ఇప్పుడున్నది భాషాప్రయుక్త రాష్ట్రమే కదా! 53ఏళ్ళు లేని సందేహాలు ఇప్పుడే ఎందుకొస్తున్నాయి?! గప్పుడే ఎందుకు రాలేదు? :)
    /గాంధీ కొంతమందిలా తెలివి తక్కువ వాదనలు చేసే మనిషి కాదు./
    ఇది వాస్తవమే! అందుకే అంబేద్కర్ గాంధీగారు చెప్పేది ఎప్పుడూ ఒప్పుకునేవారు కారట. :P

    రిప్లయితొలగించండి
  6. /అంతే గానీ ఆంధ్రా, హైదరాబాదులను కలపాలని ఎక్కడా లేదు./
    చెప్పడానికేం బాగానే చెప్పారు, కానీ...
    గాంధీగారు పోయేటప్పటికి (జనవరి 1948) హైద్రాబాద్ ఇండియాలో కలవలేదు, గాంధీగారిని ఒగ్గేయండి. నిజాం రాజ్యం విమోచనం జరిగింది సెప్టెంబర్ 1948.

    ఇప్పుడిది చదువుకోండి - /గాంధీ కొంతమందిలా తెలివి తక్కువ వాదనలు చేసే మనిషి కాదు./

    రిప్లయితొలగించండి
  7. గాంధీ ఉద్దేశ్యం ఒక రాష్ట్రానికి ఒకే భాష ఉండాలని మాత్రమే కాదు.ఈ లైను చదివారా? " I should not mind two provinces speaking the same language, if they are not contiguous"

    తెలివితక్కువ వాదన? ఏడ్చినట్టే ఉంది. కాళేశ్వర రావు గారు, మాడపాటి హనుమంతరావు గారు, సురవరం ప్రతాపరెడ్డి గారు, దేవులపల్లి రామానుజం గారు తెలివి లేకనే పాపం విశాలాంధ్రమహాసభ కార్యక్రమాలలో పాల్గొన్నారు. తెలంగాణా సాయుధ పోరాట వీరులైన రావి నారాయణరెడ్డి గారు, ఇటీవలే స్వర్గస్తులైన ధర్మబిక్షం మొదలైన వారు కూడా మతి చెడి విశాలాంధ్ర ఏర్పాటును సమర్ధించారు. మరి తెలివి తక్కువ ప్రజా ప్రతినిధులు ఎమన్నా తక్కువ తిన్నారా? హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విడదీసి భాషానుగుణంగా పక్క రాష్ట్రాలలో కలపాలని వారు అధిక సంఖ్యలో తీర్మానాలు చేసారు.

    రిప్లయితొలగించండి
  8. Gandhi is neither an intellect nor he knows constitution, administration. How does Gandhi opinion count? As per Gandhi (from the same document above) all the states speaking Hindi can be combined if there is such request from states, how practical it is?

    On the contrary Ambedkar is an intellect, charman of constitution committe, so whose opinion matters in the matter of linguistic states?

    రిప్లయితొలగించండి
  9. In my view, Mahatma Gandhi even without such designations was more practical and knowledgeable about Indian society & the then existing administrative system.I don't know much about Ambedkar's words or deeds prior to his installation in 1946 as drafting committee chairman by the constituent assembly.On the other hand, Mahatma Gandhi was instrumental in changing INC's constitution way back in 1921 and turned it into a panIndia mass based organization.

    Hindi speaking areas as in all areas speaking Rajasthani,Haryanvi,Avadhi,Maithili etc.,? I don't think Gandhi proposed for their amalgamation

    I simply made a post on Mahatma Gandhi's view on linguistic basis of reorganizing states which had led to some indigestion problem. Or else what has Ambedkar got to do with anything here and how can anyone attribute his views with respect to some other part of India to anything here?

    రిప్లయితొలగించండి
  10. avadhi is spoken in avadha region of UP (one 3rd of current UP), part of madhya pradesh and delhi. maithili is spoken in bihar and west bengal too. Do you think north indian states are formed based on these languages? And importanat thing is taht these are not fully different languages but just a bit more than dialects of Hindi. If this can be the basis for a state then telangana dialect can be very well a reason for separate state. If anyone is arguing that a state should be united just because people speak same language even if it is so big that administration is not feasible then either they are fools or they get disproportianate advantage with that policy, in what case do you fall in?

    On your comments about Ambedkar, he has not just passed some comments about some other part of the country but he has given a comprehensive report about state reorganization for the entire country recommending several small states including telangana. And his rationale is quite simple, linguistic states does not mean one state per language but it is one language per state and a states should be divided for each language as many as distinct administrally feasible different regions exist. Any rational person would agree how important is constitution committe charma's analysis about smaller states.

    రిప్లయితొలగించండి
  11. >> but he has given a comprehensive report about state reorganization for the entire country recommending several small states including telangana.

    My God.. Who else supported? Bhagat Singh, Raja Rammohan Rai, Bipinchandra paul, Balagandhar tilak etc are also supported telangana, if you ppl are left to speak whatever u want

    రిప్లయితొలగించండి
  12. >> Gandhi is neither an intellect nor he knows constitution, administration.

    Expected stuff. If someone's opinion is against to ur wishes they are simply useless.. Probably u guys dont know that u will end up with a list of crores. including Justice Bachawat.. poor fellow, who doesnt know the simple funda to divide the river water is based on catchment area, which pundit Jayasankar derived with his extensive study.

    రిప్లయితొలగించండి
  13. satya,

    >>>>My God.. Who else supported? Bhagat Singh, Raja Rammohan Rai, Bipinchandra paul, Balagandhar tilak etc are also supported telangana, if you ppl are left to speak whatever u want >>>>

    The appropriate question would be OMG, who else supported samikyandhra?Raja Rammohan Rai, Bipinchandra paul, Balagandhar tilak etc and the question should be directed to Mr. Chaitanya as he is the one who brought gandhi here.

    Secondly FYI there is a detailed document available in net about Ambedkar's report to SRC, search if you are interested.

    రిప్లయితొలగించండి
  14. "avadhi is spoken in avadha region of UP (one 3rd of current UP), part of madhya pradesh and delhi. maithili is spoken in bihar and west bengal too. Do you think north indian states are formed based on these languages?"

    I can't understand your spin in comment after comment. It seems you are upset with Gandhi's views. To answer your question, find out a map of 'British India in 1947' and check out for boundaries of United provinces, Central provinces, Bihar ( Here it is http://media-2.web.britannica.com/eb-media/14/1614-004-ECF334AE.gif ). Let me know if there was any discussion on redrawing those boundaries years after independence. Reorganisation of states had more to do with regions under Bombay,Madras presidencies and newly acceded princely states. Linguistic basis was a natural choice. All apprehensions related to regionalism, rise of sub-national tendencies have been negated over time.Today there is no dispute in saying that it was the best choice made ever.


    "On your comments about Ambedkar, he has not just passed some comments about some other part of the country but he has given a comprehensive report about state reorganization for the entire country recommending several small states including telangana"

    Read those few pages on ambedkar.org again and again, join few of our well known middle aged&overstaying research scholars of OU to produce a thesis on "Putting words in to Dr.Ambedkar's mouth". But it is not the point of our discussion here.I am not aware of Ambedkar recommending Telangana but if it was about creation of smaller states just for the sake of it,then the question of "how small" has to be addressed. People need convincing answers on the basis for discarding linguistic basis. If Ambedkar was referring to decentralization of power, then again there are better means as recommended by Mahatma Gandhi http://appliedgandhi.blogspot.com/2008/03/gandhi-and-political-decentralisation.html

    రిప్లయితొలగించండి
  15. @viswaroop, don't u know the list who supported samaikhyandra? Indira Gandhi did, Raavi Narayana Reddy did, Madapati Hanumantha Rao did, Dasardhi Krishnamacharya did, Justice Srikrishna did and many more. and who supported telangana?

    can u show the lines in any book where ambedkar supported telangana like you are posting in ur blog. anyways.. it is foolish to expect truth from T vaadis

    రిప్లయితొలగించండి
  16. అయ్యా ‘విశాలాంధ్ర హృదయా‘!
    ఇంకా నేనేదో ‘మహాభారతం‘ గురించి కనిపెట్టాననుకొంటున్నావంటే... నువ్వు “కనీసం నేను చెప్పింది నిజమేనా?“ అని కొన్ని గ్రంథాలైనా వెదుకలేని బద్ధకస్థుడివి.. బావిలో కప్పవని తేలిపోయింది.
    ఏటుకూరి బలరామమూర్తి( ఇతడు ‘కోస్తా‘ వాడే సుమా.. చాలా ప్రసిద్ధ రచయిత ) రచించిన ‘ఆంధ్రుల చరిత్ర‘ గ్రంథం చదువు. ‘తెలింగ‘ లేక ‘తెలగ‘ జాతీయులు ఆనాడు కూడా ఇక్కడి స్థానికులు అని, ‘ఆంధ్రులు‘ వేరే జాతి వారని, వారు ఆనాడూ ఉత్తర భారత దేశం నుండి ఆర్యులు పెట్టే బాధలు పడలేక పారిపోయి వచ్చిన వలసదారులని తెలుస్తుంది. ఆంధ్రులు కంసాది రాజుల వద్ద ‘కిరాయి వస్తాదులు‘గా ‘బానిసలు‘గా పని చేసారని తెలుస్తుంది. బలరామ, శ్రీకృష్ణులతో కంసుని ‘కిరాయి గూండా‘ గా పోరాడి చచ్చిన ‘చాణూరుడు‘ ఆంధ్రుడు అని తెలుస్తుంది. ‘చాణూరాంధ్ర నిషూధనా‘ అని నువ్వూ భక్తితో శ్రీకృష్ణ సంకీర్తనం చేసే ఉంటావు. అర్థం మాత్రం గ్రహించి ఉండవు. ఆ గ్రంథం చదివితే ఆంధ్రులు కౌరవుల పక్షాన, తెలగలు పాండవుల పక్షాన పోరాడిన విషయమూ తెలుస్తుంది. కలియుగ ప్రారంభం తరువాత గానీ, ఆంధ్రులు దక్షిణానికి వలస వచ్చి తెలగలతో కలసిపోయారు. అప్పటికే తెలింగ దేశంలో ఉన్న తెలగలు లిపి లేని తెలుగు ( కొంచెం ప్రాకృతం కూడా కలిసి ఉండేదేమో) మాట్లాడే వారు. అప్పటికి ఆంధ్రులు వాళ్ళ పోషకులైన ఆర్యుల సంస్కృత భాషనే మాట్లాడే వారు. అప్పుడు అవసరాన్ని బట్టి వారు సంస్కృతం, తెలుగు కలగలసిన ’ఆంధ్రము’ ను తయారు చేసుకొన్నారు. రాను రాను తెలుగు, ఆంధ్రము ఒక్కటిగా కలిసిపోయాయి. పర్యాయ పదాలుగా మారిపోయాయి. కాని ఇప్పటికీ తెలంగాణ మాండలికంలో అచ్చ తెలుగు పదాలెక్కువ, కోస్తా మాండలికంలో సంస్కృత పదాలెక్కువ అన్నది కనీస భాషా జ్ఞానం ఉన్న వారికెవరికైనా అర్థం అవుతుంది. ఇవన్నీ భాష మీద అభిరుచితో ఎప్పుడో ఇరవయ్యేళ్ళ క్రితం నేను చేసిన అధ్యయనంలో వెల్లడియైన విషయాలు. నీలా ఇప్పుడేదో ఉద్యమం వచ్చింది కాబట్టి, హృదయ కవాటాలు మూసుకొని, మనకు పనికి వచ్చే విషయాలు ఎక్కడున్నాయి అని పైపైన వెదుకులాటలు కావు. అందుకే నీకు నా అధ్యయనాలు అర్థం కావు మరి. ఇంకా నీకు చిత్తశుద్ధి ఉండి చదవాలనుకొంటే ’History of Ancient India' లాంటి ఎన్నో ఆంగ్ల గ్రంథాలూ ఉన్నాయి. నీకు, ఆ ’సత్యా’కు ఉక్రోశాన్ని అణచుకొని, సత్యాన్ని అంగీకరించే నిజాయితీ కావాలి - అంతే!
    ఇంకేం ... నన్ను, నా ఈ కామెంటును వెటకారం, అపహాస్యం చెయ్. మా తెలంగాణవాదులు ఏ విషయం చెప్పినా, అందులోని నిజానిజాలను తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా, “ కె.సి.ఆర్ చెప్పాడా? కోదండరాం రాశాడా?“ అంటారు. మీ కుహనా సమైక్య వాదులకు అంత కన్న ఏం చేతనవుతుంది?

    రిప్లయితొలగించండి
  17. 'బాంచన్ కాల్మొక్తా' అనడంలో ఎవరిది బానిస రక్తమో తెలుస్తుంది. పరేషాను, ఖుష్ అయ్యిండా, ఫికరు చేయకుర్రి, గానా, జింఖానా, జిఖానా, పరేషానా, పాయిఖానా, పిషాప్ ఖానా (ఏదిబడితే అది తినేయడమే!) ఇవన్నీ తెలంగానాటైపు అచ్చతెలుగు పదాలే.
    తెలగలో ..జలగలో.. పాండవుల దగ్గర బానిసలని ఋజువులుంటే, కోర్ట్ కెళ్ళి నిరూపించుకోండి. లేదా వెళ్ళి హస్తినలో పార్లమెంటు కింద తవ్వకాలు జరుపుకోండి. మాకేంటి అంట?! పాండవులు విగ్రహాలు కూల్చిండ్రా? రోడ్లపక్కన పెంటకుప్పల దగ్గర వంటలు చేసి తినిన్రా? కంబడి కప్పుకుని పిచ్చి గానాలు గాయిండ్రా? అనేది రీచెచ్చి చేసి తెలుసుకోన్రి, కావాలంటే అడుక్కుంటే అమ్మ ఫండ్స్ ఇస్తాది. 'పాండవుల దగ్గర నౌక్రి చేసినమ్' అని బుర్రకథల్ కట్టి వినేవాడికి చెప్పుకోన్రి, కావాలంటే వినిపెడతాం.

    రిప్లయితొలగించండి
  18. సమైక్యవాదులకు హేళన తప్ప హేతుబద్దమయిన చర్చ ఎన్నటికీ చేతకాదని Snkr, Chaitanya, satya నిరూపించారు. ఒక అబద్ధాన్ని సమర్ధించడానికి తర్కబద్దమయిన హేతువు దొరకదు మరి.

    రిప్లయితొలగించండి
  19. తలాతోక లేని టైమ్‌పాస్ డిమాండ్లకు చైతన్య, సుంకర, ఆచంగ, సత్యలు చేస్తున్న అర్థవంతమైన చర్చలు తలకెక్కవు. ' నిజాం ధర్మ ప్రభువు', 'బ్రిడ్జీలు, రైళ్ళు, బస్సులను పేల్చే నకసలైట్లంటే గర్వపడుతున్నము', 'మాగ్గావాలె, గంతనే' టైపు తింగర వాదనలు చేసేటోళ్ళకు కూడా అర్తవంతమైన( గంటే తెలంగాన ఇచ్చుడో చచ్చుడో టైపన్నమాట) చర్చలు కావాలా?!! :)))

    ఈ తెలబాన్లు పాండవుల వైపు 'పోరాటాలు సేసినారంట' అందుకు రాష్ట్రంలో సగం ఈయున్రి అని అర్థవంతంగా అడుగుతుంటే, మేము గట్లనా అని ఈయాలంట! :)) ఎట్లిస్తం? కౌరవులపక్క నిలబడినోళ్ళం, సూది మొన మోపినంత కూడా ఇయ్యం. రాయబారం సినిమాలు చూడలేదా?
    పైగా ఆర్యులు ఆంధ్రోళ్ళనందరిని ఒకేవైపు ఈళ్ళ తెలగాన వైపే తరిమిండ్రంట! ఇంకే స్టేట్కు పోకుండ ఆళ్ళొచ్చి ఈడ సెటిల్ అయ్యిండ్రంట, కాబట్టి 'మా గ్గావాలె, గీయున్రి' షానా 'హేతుబద్ధమైన' డిమాండే!! ... ఇస్తాం ...ఇస్తాం.. కేరళ తమిల్నాడు పోలీసులతో ఇప్పిస్తాం, రోడ్ల పెంటకుప్పల పక్కన వండుకుని తిన్నదంతా కక్కిస్తాం.

    రిప్లయితొలగించండి
  20. అయ్యా షాయి గారు,

    మొత్తానికి స్థానిక 'తెలగ' జాతి గురించి మంచి కథనే పట్టారు/అల్లారు కాని ఎవరు రాసిందా మహాభారతం అన్నది మాత్రం ఎప్పటికీ తేలక పోకపోవచ్చు .మీ వ్యాఖ్యలో జాతి అన్న పదానికి ఒక కొత్త నిర్వచనం దొరికింది. కట్ చేస్తే "ఆంధ్ర జాతీయులు ఉత్తర భారతం నుండి కలియుగ ప్రారంభంలో దక్షిణానికి ఆర్యులచే తమరబడ్డారు". (అందులో ఎటువంటి అభ్యంతరం లేదు ). మళ్లీ కట్ చేస్తే " ఆంధ్ర జాతీయులు వస్తూ వస్తూ, స్థానిక తెలగలను దాటుకొని (బహుశా ఆకాశమార్గంలో ఆనాటి పుష్పక విమానాలలో అయివుంటుంది) ఈనాటి సీమంధ్ర జిల్లా ప్రాంతాలలో సెటిల్ అయిపోయారు". మరి తెలగల రాజ్యంలో ఉన్నవారందరూ భూమిపుత్రులేనా? నేటి సీమాంధ్ర ఒకప్పటి తెలగ రాజ్యంలో భాగమేనా? లేకపోతే సారవంతమైన డెల్టా భూములు, వాణిజ్యానుకూల సముద్ర తీర ప్రాంతాలను వదిలేసి ఏం పోయేకాలం వచ్చిందని వారు పీఠ భూమిలో స్థిరబడి పోయారు? సీమాంధ్ర కూడా తెలగ రాజ్యంలో భాగమని అనుకోవచ్చుకదా? మరైతే తెలుగు ప్రాంతాలన్నీ ఒకప్పుడు ఒకటిగా ఉండేవంటే ప్రత్యేకవాదులకు ఎందుకంత కోపం ?మీ గూగుల్ మ్యాప్ లో ఆంధ్ర రాజ్యం మహాభారత సమయంలో దక్షిణాన ఉందేమిటి? వారు ఉత్తరానికి వెళ్లి యుద్ధం లో పాల్గొన్నట్టు గా అర్థమవుతుంది.మరి మీరేమో కలియుగం దాక తెలగలదే రాజ్యం అంటిరి. నాకింకో సందేహం. ఆ గూగుల్ పిక్స్ ఆనాటి పుష్పకవిమానల మీద నుండి తీసినవేనా? ఇది హేళన కాదు సుమా!

    రిప్లయితొలగించండి
  21. షాయి,చైతన్యా దయ చేసి ఈ లింక్ చూడండి. మీ మీ అభిప్రాయాలో ఏదైనా క్లారిటీ కానీ, మార్పు కానీ వస్తుందేమో.
    http://en.wikipedia.org/wiki/Telaga
    ఇది కేవలం చరిత్రకు రిఫరెన్స్ మాత్రమే.కులాల ప్రస్తావన కాదు

    రిప్లయితొలగించండి
  22. అయ్యా ష్యాయి బాబు, ఒకసారి ఆ పుస్తకం లోని మిగిలిన విషయాలు కూడా చదువు.అందులో తెలంగాణ ప్రాంతం లో నివసించే ద్రావిడ,జాతి తెగలు అప్పటి రాయలసీమ మిగిలిన ద్రావిడ ప్రాంతాల నించి క్రమం గా తెలనాణ ప్రాంతం వైపు వచ్చారని రచయిత వ్యక్తపరిచారు. అంతేకాక, వింధ్య పర్వతాలని దాటి వచ్చిన ఆంధ్రులు మొదట మారాట్వాడ, తరువాత తెలాంగాణ ప్రాంతం లో తమ రాజ్యాలు స్థాపించారు, వారే తర్వాత సారవంతమైన భూముల వైపు తమ రాజ్యాలని విస్తరించారు అని అదే పుస్తకం లో ఉన్న విషయం తమరికి కనపడలేదా?

    అసలు తెగలు గా తప్ప, ఒక జాతిగా కాని, ఒక రాజ్యం గా నివసించని ఆనాటి తెలంగాణా ప్రాంతం ఏ ప్రాతిపదకన ప్రత్యేకత సంతరించుకుంటుంది? అసలు తెలంగాణ ని పరిపాలించి రాజులు ఎవరు? చరిత్ర లో ఏ రాజు తను కేవలం తెలంగాణ రాజు అని ప్రకటించుకున్నాడు?

    మహాభారత కాలానికి నేటి విభజన కి, ఒక ప్రాంత ప్రజలని ద్రోహులుగా చిత్రీకరించటానికి సంభంధం ఏంటి? అలా పోలిస్తే ఈ భారతదేశం మొత్తం లో కౌరవుల పక్షాన పోరాడిన వాళ్ళే ఎక్కువ. అంటే ఇంక ఆయా ప్రాంతాలు, ప్రజలు ద్రోహులనా?

    by the way.. మీరు మర్చిపోయినట్లున్నారు.. ఈ మధ్య తమరి OU విధ్యార్ధుల తలతిక్క చేష్టల్లో మరో కలికితురాయి. గత దీపావళి నాడు వాళ్ళేదో పనికి మాలిన సభ నిర్వహించి అందులో ఆర్యుడైన శ్రీకృష్ణుడు తమ రాజైన నరకాసురుడిని వధించాడని, ఆ తర్వత ఈ ప్రాంతాలకు వచ్చిన ఆర్యులు తమ గ్రంధాలలో వాళ్ళ రాజుని దుర్మార్గుడిగా చిత్రించారని వ్రాసారు. మరి మీరెలా ఆ శ్రీకృష్ణుడ్ని స్తుతిస్తున్నారు?

    తమరు సురవరం ప్రతాపరెడ్డి గారు వ్రాసిన 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర ' చదివారా? (ఇతను తెలంగాణ వ్యక్త్యే.. ఇతని విగ్రహం కూడా ట్యాంక్‌బండ్ పై ఉంది). ఈ పుస్తకం ఆంధ్రులకు సంభందించినంత వరకు చాలా ప్రామాణిక గ్రంధం. మరి ఈ పుస్తకం లో తెలంగాణ కి చందిన రచయిత ఎక్కడా తెలంగాణ, ఆంధ్ర వేరు వేరు శభాలని, వేరు జాతులని ఎక్కడా ప్రస్తావించలేదెందుకో చెప్తారా?

    రిప్లయితొలగించండి
  23. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  24. ఇక్కడ మనం ఏరా పోరా అని సంభోధించుకోవడం మంచిది కాదు. నేను షాయిగారు చెప్పిన దాంట్లో సగానికి పైగా ఏకీభవిస్తాను. ఆంధ్రులు దక్షిణానికి వలసి వచ్చారనేది, స్థానిక తెగలతో మమేక మయ్యారనేది, మహాభారతం లో ఉన్న ప్రస్తావన ఆధారంగా వారు కౌరవుల పక్షాన పోరాడారనే విషయాల్లో చరిత్రకారుల మధ్యనే పెద్దగా బిన్నాభిప్రాయాలు లేవు. వేరొక అభిప్రాయం వ్యక్తం చేయడానికి వారికి పురాణాలు తప్ప చారిత్రిక ఆధారాలు లేవు.

    కాకపోతే ప్రత్యేక తెలంగాణావాదులు పురాణాలను, చరిత్రను తిరగ రాసి తెలగలనే కొత్త జాతిని కనుగొని ఆంధ్రులు అనేది ఒక భాష పదమో, జాతిని తెలిపే పదమో కాదని, అది కేవలం ఆధునిక కాలంలో ప్రజలు సృష్టించుకున్న లేక అర్థంచేసుకున్న ప్రాంతీయతను తెలిపే పదము మాత్రమే అని నమ్మబలుకుతున్నారు. పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత కూడా ఆ దేశంవారు పాపం ఇటువంటి identity cisis నే ఫేస్ చేసి 8 వ శతాబ్దానికి ముందరి చరిత్రను బలవంతంగా చెరిపేసుకున్నారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే పబ్బం గడుపుకోవాలనే వారు ఆ దారినే ఎంచుకొన్నట్లు కనిపిస్తున్నది.

    అయ్యా ప్రత్యేకవాదులు( వేర్పాటు వాదులంటే వారికి కోపం), స్థానిక తెగలంటే ప్రత్యేకించి నేటి తెలంగాణాలోఉన్న 9 జిల్లా ప్రజలు కాదండి. వారిని మనం ఈనాటికి కూడా గిరిపుత్రులనో, ఎస్ టీ లానో సంభోదిస్తాం. వారు నిజమైన భూమి పుత్రులు. వారు ఆదిలాబాద్, కరీంనగర్ లలో ఉన్నారు అటు ఖమ్మం, గోదావరి ఏజెన్సీ, ఉత్తరాంధ్ర జిల్లాలలోను అటు నల్లమల్ల ప్రాంతాలలోను ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సంస్కృతంతో సంబంధం లేకుండే కొన్ని తెలుగు పదాలు ఇంకా గోండుల భాషలో కనిపిస్తాయి.

    ఏ చరిత్ర పుస్తకంలోను, పురాణంలోను ఆంధ్రులు తీరప్రాంతాల వారు మాత్రమే అని ఎవరు చెప్పి ఉండరు. ఈమధ్య T (for K'T'R) ఛానళ్ళు, పేపర్లు, చరిత్ర, 'సన్నాసుల మాటామంచి మా సొల్లు కథలు' అని ఎవరైనా బ్లాగుల్లో , విషాన్ని చిమ్మే సైట్లలో పెట్టుకున్నారేమో నాకు తెలియదు.

    రిప్లయితొలగించండి
  25. Admin, I request you not to encourage comments with abuse and pl delete them. We need a healthy discussion

    రిప్లయితొలగించండి
  26. అయ్యా Shayi గారూ,

    మీ పరిశోధనా శక్తి తేజము ముందు మా కన్నులు మరేదీ కాంచలేకున్నవి. మీ తేజమును కాస్త ఉపశమింపజేయండి. మహాభారతాన్ని పుక్కిట బట్టిన మహాశయా శ్రీకృష్ణుడు స్వయంగా అంధక వృష్టీయములో పుట్టాడు. తన జాతి సైనికులంతా కౌరవుల పక్షాన పోరాడాలని ఆయన శాశనం. అందువల్లనే వారు కౌరవుల పక్షాన పోరాడారు పరిశోధనా దురంధరా! ఓ 'తెలగ' జాతి సృష్టికర్తా, తెలగ అనేది కోస్తాంధ్ర ప్రాంతములో మరీ ముఖ్యముగా గోదావరీ తీరములో ఒక ప్రముఖ కులం. గోదావరీనది పరివాహక ప్రాంతాన్ని తెలంగాణ అంటారు ఆ నది పూర్వనామధేయము తేలివహా అన్న నిజము తమ పరిశోధనా శక్తికి తలవంచి మిన్నకుండిపోయింది. సింధునది పేరున మనం హిందువులు ఎలా అయ్యామో, తేలివాహానది పేరుమీద ఆ ప్రాంతానికి తెలంగాణ, ప్రాంత ప్రజలకు తెలంగాణ్యులని పేరుపడ్డది. గోదావరి జిల్లాలవాసులూ తెలంగాణ ప్రజలే పరొశోధనా గండరగండా.. నాకు నవ్వాగటం లేదు పరిశోధనా గండబేరుండా, తెలంగాణ తెలుగులో ప్రాకృతం....ప్రాకృతం ఆర్యభాష మహోదయా. ఏ ప్రాంత రాజకీయ అవసరాల నిమిత్తం ఆయా స్థానిక ప్రాంతాలలోనికి వేరే భాషా పదాలు వస్తాయి. సమజైందా బై. తవరుసెప్పిన పుత్తకాలో సూసేనండీ నేనీ ఇసయాలు తెలుసుకుంది ఆఁయ్. నిండా గట్టివాదన వినిపించేదానికి నిజాలు సెప్పవలసిందిగదా. ఎమిటోనమా ఈల్లకెప్పుడు తలకెక్కుతుందో నాకేమి తెలవటంనేదు.

    రిప్లయితొలగించండి
  27. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి