4, మే 2011, బుధవారం

తెలంగాణ వాదుల మరో పచ్చి అబద్ధం


అభివృద్ధిలో వెనకబడి పోయామని, మాకు అన్యాయం జరిగిందనీ, జరుగుతోందనీ చెబుతూ ప్రత్యేక రాష్ట్రం ఉంటే తప్ప లాభంలేదని తె.వాదులు డిమాండు చేస్తూ వచ్చారు. తరవాత్తరవాత వీళ్ళ గొంతు కాస్త మారి, 'ఆంద్రోళ్ళు' మమ్మల్ని అణగదొక్కారంటూ రాష్ట్ర విభజన భజన చేసేవారు. ఇప్పుడవన్నీ పక్కకు నెట్టి ఆత్మగౌరవం కోసం తెలంగాణ, స్వపరిపాలన కోసం తెలంగాణ అంటూ కొత్త కారణాలు చెబుతున్నారు. ఈ కారణాల్లో న్యాయం ఉందా లేదా చెప్పండి అంటూ తెలివితక్కువ వాదనలు చేస్తున్నారు. అభివృద్ధి లేదన్న మాట మాత్రం ఇప్పుడు వీళ్ళ నాలుకల మీద కనబడదు.
ఆ వాదనలో పసలేదని తేలిపోయింది. తె.వాదులు చెప్పే అభివృద్ధిలో-మేం-వెనకబడ్డాం-ఆంద్రోళ్ళు-ముందుబడ్డారు అనే వాదన శుద్ధ తప్పని తేలిపోయింది కాబట్టి, వాళ్ళు చెప్పే లెక్కలన్నీ కాకిలెక్కలని తేలిపోయింది కాబట్టి వాళ్ళకు వాదన మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. అంచేత మార్చారు. అయితే ఈ అబద్ధాలను ఇంకా చెప్పుకుంటూ తిరుగుతున్న తె.వాదులు కొందరు అక్కడక్కడ లేకపోలేదు. ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్న మరో పాత అబద్ధం గురించి మాట్టాడుకుందాం.

1956 లో హైదరాబాదు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రాలను కలిపెయ్యక ముందు హై. రాష్ట్రం బడ్జెట్టు మిగుల్లో ఉండేది. ఆ డబ్బుల్ని కొట్టేద్దామని దురుద్దేశంతో, ఆంద్రోళ్ళు కుట్ర చేసి, రెండు రాష్ట్రాలనూ కలిపేసారు. ఆ మీదట మా ప్రాంతపు మిగులునంతా ఆంధ్ర ప్రాంతానికి వాడేసారు అంటూ తె.వాదులు ఆరోపణలు చేస్తూంటారు. కోస్తా సీమల జనం మాత్రం దానికి ఎక్కడా సమాధానం చెప్పలేదు. పాపం, మరి కుట్రలు చెయ్యడం తప్పే గదా అని నోరు మూసుకుని ఉంటారు. నేనైతే అందుకే నోరు మూసుకుని ఉన్నాను. అయితే సత్యం కుంభకోణంలో లాగా తె.వాదుల అబద్ధాలు ఒకటొక్కటే బయటకు రావడం మొదలయ్యాక, ప్రచారంలో ఉన్నవాటిలో ఇంకా ఎన్నెన్ని అబద్ధాలున్నాయో తెలుసుకుందామని వెతికితే, ఓ నాల్రోల కిందట కొత్త సంగతి బైటపడింది. నాకిది కొత్తదేగానీ మీలో కొందరికి తెలిసే ఉండొచ్చు. ఆ నిజమిది..

1956 నాటికి హైదరాబాదు రాష్ట్రం లోటు బడ్జెట్టులో ఉంది. ఆ ఏడాదే కాదు, 1952-53 నుండి ఆ రాష్ట్రం లోటు బడ్జెట్టులోనే ఉంది. 1951-52 లో 92 లక్షల మిగులులో ఉన్న బడ్జెట్టు, 1955-56 నాటికి 5 కోట్ల 32 లక్షల లోటు చూపించింది.



1955-56 లో ఆ రాష్ట్ర నికరాదాయం ఎంత ఉందో చూసారా? 21 కోట్ల 62 లక్షలు. ఖర్చు 26 కోట్ల 94 లక్షలు. తె.వాదులూ ఏమిటి దీనర్థం? రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగేనాటికి హై. రాష్ట్రాన్ని పతనం బాటలో నడిపిస్తోంది అప్పటి ప్రభుత్వం. మరొక్క గమనిక.. ఈ నిర్వాకం ప్రజా ప్రభుత్వం హయాంలో జరిగింది. సైనిక పాలనలోనో, అధికారి పాలనలోనో కాదు.

సరే, ఇప్పుడిక ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఏంటో చూద్దాం..



1955-56 నాటికి ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కూడా గొప్పగా ఏమీ లేదు. 10 కోట్ల 73 లక్షల లోటు బడ్జెట్టుతో ఉంది. ఇక్కడో సంగతి.. ఆంధ్ర రాష్ట్రం అప్పుడప్పుడే కొత్తగా ఏర్పడింది. మౌలిక వసతుల కోసమే ఎంతో ఖర్చు పెట్టాల్సిన సమయం. పైగా, సరిగ్గా అదే సమయంలో (1952లో) విజయవాడ దగ్గర కృష్ణానదిమీద బ్యారేజీ కొట్టుకుపోయింది. కొత్త బ్యారేజీని (ఇప్పటి ప్రకాశం బ్యారేజీ) కట్టాల్సొచ్చింది. అది 1954 లో మొదలై, 1957లో పూర్తయింది. ఆకాలంలో జరిగిన పంట నష్టం, కొత్త బ్యారేజీ కట్టడానికి జరిగిన ఖర్చు - ఇదంతా కొత్త రాష్ట్రం బడ్జెట్టు తూకాన్ని కొంతవరకైనా దెబ్బతీసి ఉంటుంది. బడ్జెట్టును పరిశీలించేటపుడు మనం వీటిని పరిగణనలోకి తీసుకోవాలి.

ఈ లెక్కలను బట్టి చూస్తే తెలుస్తోందేంటయ్యా అంటే రెండు రాష్ట్రాలు కూడా ఆర్థిక పరంగా ఒకే రకంగా ఉన్నాయి. మేం అద్భుతంగా ఉన్నాం అంటూ తె.వాదులు చెప్పుకునే గొప్పతనాలేవీ ఈ లెక్కల్లో కనబడవు. అప్పటి ఆంధ్ర రాష్ట్ర విపత్కర పరిస్థితిని లెక్కలోకి తీసుకుంటే, హైదరాబాదు రాష్ట్రంలో ఇప్పటి తెలంగాణతో పాటు ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్రల్లో భాగమైపోయిన భూభాగం కూడా కలిసి ఉండేదన్న సంగతిని గమనంలో ఉంచుకుని చూస్తే బహుశా తెలంగాణ కంటే ఆంధ్రే మెరుగ్గా ఉండి ఉండొచ్చు కూడా.

సరే, ఈ లెక్కలను ఒకసారి పోల్చి చూద్దాం..
1955-56 నాటికి హై. రాష్ట్రం ఆదాయం: 21 కోట్లు. ఆంధ్ర రాష్ట్రం ఆదాయం: 17 కోట్లు
మొత్తం ఆదాయంలో హై. వాటా: 55% (హైదరాబాదు రాష్ట్రమంటే, తెలంగాణతో పాటు ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్రల్లో భాగమైపోయిన భూభాగం కూడా. ఆ ప్రాంతం నుండి వచ్చినఆదాయం కూడా ఇందులో కలిసుందని మనం గుర్తుంచుకోవాలి.)
ఆంధ్ర వాటా: 45%
ప్రస్తుతం ఈ వాటాల అంతరం ఇంకా పెరిగి ఉంటుంది.

మా మిగులును వాడేసుకున్నారు బాబో యంటూ అబద్ధాలు చెప్పెయ్యడమే కాదు, తమ అబద్ధాలను నిజమని మనల్ని నమ్మించడానికి 'హైదరాబాదు ఆదాయాన్ని మీ అభివ్రుద్ధికి ఉపయోగించడంతో పాటు హైదరాబాదును రాజధాని అవసరాలకు వాడుకున్నందుకు కూడా పరిహారం ఇవ్వాలి.' అని అడుగుతున్నారు.

తె.వాదులూ.. కోస్తా సీమలు వాడేసుకోడానికి, ఆనాటి హై. రాష్ట్రబడ్జెట్టులో పెద్ద బొక్క తప్ప, ఇక్కడేమీ లేదు. వాళ్ళంటూ ఏదన్నా వాడుకుని ఉంటే అది మీ బడ్జెట్టు లోటునే అయ్యుండాలి. వాళ్లకున్న బడ్జెట్టు లోటు చాలదన్నట్టు మీ లోటును కూడా, కుట్ర చేసి మరీ, ఎత్తుకుపోయారంటారా? ఇహనాపండి మీ అసంబద్ధ, అబద్ధ వాదనలు.
http://chaduvari.blogspot.com/2010/01/blog-post_11.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి