ఈనాటి ఆంధ్రజ్యోతి నుండి: "తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు ఎస్సై పరీక్ష అభ్యర్థులు సీఎంను కలిశారు. పరీక్షకు ఎంపికైన 18వేల మంది అభ్యర్థుల్లో 11 వేల మంది తెలంగాణకు చెందిన వారే. పరీక్ష నిర్వహణలో జాప్యం జరిగితే మాకు నష్టం జరుగుతుంది. ఒక్కో అభ్యర్థి రాత పరీక్ష శిక్షణ కోసం నెలకు రూ.5 వేల చొప్పున ఇప్పటికి రూ.2లక్షలు ఖర్చు చేశారు. పరీక్ష మరింత ఆలస్యమైతే ఆర్థికంగా బాగా నష్టపోతాం అని ముఖ్యమంత్రికి వివరించారు."
పోటీ పరీక్షలకు చదివి హాజరైయ్యే అభ్యర్థుల గోడు మన మీడియాకు వినిపించదా? అదే పరీక్షల పేరుతో తుచ్ఛ రాజకీయం చేసేవారి వాణి మాత్రం అందరూ తప్పనిసరిగా భరించాలి. లేకపోతే మరి మీడియానే బ్లాకౌట్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేసే ఘనులు తయారైయ్యారు.
ఇప్పుడు ఇక చూడండి. కేసిఆర్ ఎంతగానో ప్రేమించే లగడపాటి పేరును పై రిపోర్ట్ లో చూసేసి, అసలు విషయాన్ని వదిలేసి, మరి అదేదో జీవిలా ఒక రంకె వేసి .. లగడపాటి...జగడపాటి...సీమాంధ్ర పెట్టుబడిదారులు..దోపిడీదారులు..కుట్ర...అని బుసలు కొడుతూ పనికిమాలిన వ్యాఖ్యలు చేయడానికి చాలామంది అందుబాటు లోకి వస్తారు.
‘ఎస్ఐ రాత పరీక్షలు వెంటనే నిర్వహించాలి’
రిప్లయితొలగించండిhttp://www.sakshi.com/main/FullStory.aspx?catid=155253&Categoryid=14&subcatid=0
ప్రభుత్వం ఎస్‌ఐ రాత పరీక్షలు వెంటనే నిర్వహించాలని తెలంగాణ ప్రాంత ఎస్‌ఐ రాత అభ్యర్థులు డిమాండ్ చేశారు. వారు గురువారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఓయూ జేఏసీ చెబుతున్నట్లుగా తాము ఎస్‌ఐ పరీక్షల నిర్వహణను వ్యతిరేకించటం లేదన్నారు.
ఫ్రీజోన్ అంశంపై రాజకీయాలే తప్పా చిత్తశుద్ధి లేదని ఎస్‌ఐ అభ్యర్థులు వ్యాఖ్యానించారు. ఫ్రీజోన్‌కు ఎస్‌ఐ పరీక్షలకు సంబంధమే లేదన్నారు. ఉద్యమం వేరు... జీవితం వేరని వారు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల పెట్టిన కేసులతో వారికి ప్రభుత్వ ఉద్యోగాలు రావటం లేదన్నారు.
దీనిపై టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, హరీశ్‌రావులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తామంతా తెలంగాణ విద్యార్థులమేనని, ఎస్‌ఐ పరీక్షలు రాయటానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి: 5,6 జోన్ పరిధిలో తొమ్మిది వేల మంది ఉన్నారని, 50 శాతానికి పైగా తెలంగాణ వారికి అవకాశం ఉన్నట్టు తెలిపారు. 643 పోస్టులు తెలంగాణ అభ్యర్థులకే దక్కనున్నాయన్నారు. నిరుపేద నిరుద్యోగులు మూడేళ్లుగా ఎస్ఐ రాతపరీక్షల కోచింగ్ తీసుకుంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వారి బాధను అర్థం చేసుకుని ఈ రాతపరీక్షలకు అందరూ సహకరిస్తే బాగుంటుందన్నారు. కొందరికి వయోపరిమితి దాటిపోయే పరిస్థితులు కూడా ఉత్పన్నం కానున్నాయని తెలిపారు.
రిప్లయితొలగించండిhttps://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/may/13/main/13main1&more=2011/may/13/main/main&date=5/13/2011