శ్రీ కృష్ణ కమిటి రిపోర్ట్ చాప్టర్ 2 నుండి
"ఈ విభాగంలో ఆదాయాల్లో మార్పులు, న్యాయ సంబంధ అంశాలపై గుణాత్మక ఆధారాలను గురించి చర్చించడం జరిగింది. అనుభవపూర్వకంకా ద్వివిభిన్న, బహుళ వైవిధ్యమైన సాంకేతిక పద్ధతుల్లో ఏక కేంద్రీక వవర్తన శీల వివరణలు మరియు విశ్లేషణల పట్ల వ్యతిరేకత ను ఇంతక ముందు విభాగంలో చర్చించాం.వ్యవసాయ రంగంలో రైతుల తలసరి ఆదాయాల్లో అసమానతలపై ( NCAER) నిర్వహించిన మానవ అభివృద్ధి అధ్యయనాల నుండి సేకరించిన గణాంకాలను పరిగణలోకి తీసుకొని క్రింద వివరణాత్మకంగా చర్చించాం. జాతీయ నమూనా అధ్యయన సంస్థ ( NSSO) 2007 -08 సంవత్సర అధ్యయన గణాంకాల నుంచి తలసరి ఆదాయం వినియోగ కహర్చుల వివరాలు స్వీకరించడం జరిగింది.
ప్రాంతీయ గ్రామీణ ఆదాయ అసమానతల్లో వాస్తవాలు : దశాబ్ద కాలానికి పైగా ఆంధ్ర ప్రదేశ్ లోని గ్రామాల్లో ప్రాంతాల వారిగా ఆదాయాల్లో మార్పుల గురించి క్రింద పేర్కొన్న గుణాత్మక సమాచారం తెలియ చేస్తుంది. ఈ సమాచారం NCAER-జాతీయ అనువర్తిత అర్థశాస్త్ర పరిశోధన మండలి నిర్వహించిన రెండు నమూనా అధ్యయనాల నుంచి తీసుకోవడం జరిగింది. జాతీయ స్థాయిలో మానవ వనరులపై తొలిసారి గ్రామీణ భారతమంతా 1993-94 లో నిర్వహించగా, తదుపరి 2005-06 లో అధ్యయనం నిర్వహించారు. NCAER అధ్యాయంలో పేర్కొన్న సమాచారం రాష్ట్రంలోని మానవ వనరుల అభివృద్ధి, దారిద్ర్యం మరియు ఆదాయాల్లో మార్పును తెలియ జేస్తుంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో తలసరి ఆదాయాలపై సరి పోల్చి చూడడం జరిగింది. ఈ విశ్లేషణలో హైదరాబాద్ నగరాన్ని పరిగణలోకి తీసుకోలేదు. జాతీయ అర్థ గణాంక సంస్థ దేశవ్యాప్తంగా గృహాల వారి సమగ్రమైన అంశాలతో కూడిన ప్రశ్నావళి ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజల తలసరి ఆదాయ మార్పిడిని సమీక్షించాం. అయితే ఈ రెండు సంస్థల అధ్యయనాల సమాచారాన్ని సరిపోల్చి చూసినప్పుడు ' న్యాయం మరియు ఆదాయ అసమానతల్లో తేడాల క్రియాశీలతను అర్థం చేసుకోవడం తేలికవుతుంది.
ఆదాయ తరగతికి అనుగుణంగా తలసరి ఆదాయంలో మార్పు: రాష్ట్రంలోమి మూడు ప్రాంతాల్లోని గ్రామీణుల్లో తలసరి ఆదాయంలో వారి ఆదాయ తరగతికి అనుగుణంగా మార్పు కనిపిస్తుంది. వారి వార్షిక ఆదాయం పేర్ల వారీగా, పూర్తిగా అట్టడగు, క్రింది స్థాయి, మధ్యతరగతి, మధ్య తరగతి పై స్థాయి, సంపన్న వర్గాలుగా గ్రామీణులను ఐదు విభాగాలుగా విభజించడం జరిగింది. కోస్తాంధ్ర గ్రామాల్లో సంపన్న వర్గం మినహా అన్ని ఆదాయ వర్గాలలోను తలసరి ఆదాయం అభివృద్ధి చెందడం ఆసక్తికరమైన అంశం. కాని రాయలసీమ లో పూర్తిగా అణగారిన, అట్టడుగు వర్గాలు, ఉన్నత వర్గాల తలసరి ఆదాయం తగ్గుతూ వచ్చింది. ఇక తెలంగాణా ప్రాంతంలో కేవలం ఉన్నత వర్గాల వారే అభివృద్ధి చెందగా, పేదలు, అణగారిన వర్గాల తలసరి ఆదాయం క్రమంగా తగ్గుతూ వచ్చింది. రాష్ట్రంలో సంపూర్ణ పరిమాణం లేని ఆదాయం మరియు ఆదాయ మార్పులో దిశా నిర్దేశం, పంపిణి ప్రాముఖ్యతలు చర్చించే ఉద్దేశంతో చేర్చడం జరిగింది. ఈ విషయంలో మాత్రం కోస్తాంధ్రలో ఆదాయ వృద్ధి గణనీయ రీతిలోనే సాగింది. ఎనభై శాతం గ్రామీణుల్లో ప్రత్యేకించి కింది స్థాయిలో ఉన్నవారు కూడా క్రమానుగతంగా ఆదాయ వృద్ధి సాధించిన విషయం ఇంతకు ముందు విభాగంలో చర్చించడం జరిగింది. స్థూలంగా ఆదాయాల్లో మార్పులు తెలంగాణతో పోలిస్తే కోస్తాంధ్రలో క్రమానుగతంగా తగ్గుముఖం పట్టాయి.
మరోవైపు తెలంగాణలోని పేదల ఆదాయంలో గణనీయమైన కోత పెరుగుతూ రాగా, ఉన్నత వర్గాలు లబ్ది పొందాయి. తెలంగాణలోని ఆదాయ మార్పుల్లో పరస్పర విరుద్ధమైన వ్యత్యాసాల వాళ్ళ ఈ ప్రాంతంలోని పేదల జీవితం దుర్భాలంగా మారింది. ఈ పరిణామం జీవితంలో ఎదురైయ్యే ఆర్ధిక అవసరాల పరిష్కారానికి కొత్త అవకాశాల కోసం ప్రజా సమీకరణాలకు దారి తీసింది. ఇదే సమయంలో ఉన్నత, సంపన్న వర్గాలు సంప్రదాయంగా ముందుకొచ్చిన భూస్వామ్య వర్గాలు ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నాయి. అసంఖ్యాక ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల భావాత్మక చర్యల ప్రయోజనాలను తెలంగాణలోని సంపన్న వర్గాలు స్వీకరిస్తున్నాయి.
ఆదాయ మార్పు మరియు వృత్తులు: వృత్తుల ఆధారిత రాబడిలో తెలంగాణా, కోస్తాంధ్ర ప్రాంతాల మధ్య తేడాలు ఉన్నట్లు విశ్లేషణలు స్పష్టంగా చెబుతున్నాయి. అన్ని ప్రాంతాలలోను రైతులు సుస్థిర ఆదాయం పొందడం గాని,అతికష్టం మీద మార్పు రావడం గాని కనిపిస్తుంది. తెలంగాణా ప్రాంతంలో వ్యవసాయ కార్మికుల వేతనాలు గణనీయంగా తగ్గుతూ వస్తుండగా, కోస్తాంధ్రలో గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి, వ్యవసాయేతర రంగాల్లో స్వయం ఉపాధి కార్యకలాపాలు, చిన్న తరహా వ్యాపారం, చేతి వృత్తులు చేసే వారి ఆదాయ రాబడి రెండు ప్రాంతాలలోను పెరుగుతూ వచ్చింది. అదే సమయంలో రాయసీమలో ఈ వర్గాల వారు యాతనకు గురైయ్యారు.
ఆదాయ మార్పు మరియు సామాగిక గుర్తింపు: కులాల వారిగా ప్రాంతాల్లో ఆదాయ రాబడిలో మార్పులు ఉన్నాయన్న విషయం మరో పరిమాణం దృఢపరుస్తున్నది. తెలంగాణా ప్రాంతంలో దళితులు, గిరిజనులు, మైనారిటీల ఆదాయ రాబడి తగ్గిపోయి ఆయా వర్గాల వారు నానా కష్టాలు పడుతూండగా, అందుకు విరుద్ధంగా కోస్తాంధ్రలో ఈ వర్గాల ఆదాయ రాబడి పెరిగిపోతూ వచ్చింది. ఇదే నిర్దిష్ట వ్యవధిలో ఉన్నత వర్గాల్లో ఆదాయ వర్గాల్లో ఆదాయ మార్పిడి పూర్తిగా ప్రతికూలంగా మారింది.
1990 నుంచి 2000 మధ్య కాలంలో కోస్తాంధ్ర ప్రాంతంలో ఆదాయం అన్ని వర్గాలకు పంపిణి అయ్యిందని పైన పేర్కొన్న విశ్లేషణలు సూచిస్తున్నాయి.కోస్తాంధ్ర ప్రాంతంలో అణగారిన వర్గాలు, దినసరి వేతన కార్మికులు, దళితులు,గిరిజనులు, మైనారిటీల ఆదాయం పెరిగింది. తెలంగాణా ప్రాంతంలో ఈ సామాజిక వర్గాలకు చెందినా కుటుంబాల వార్షిక ఆదాయం, జీవన ప్రమాణాలు ఇంకా అభివృద్ధి చెందలేదు. తెలంగాణలో అణగారిన సామగిక వర్గాలు కష్టాలనెదుర్కొంటున్నారు.తెలంగాణాలో రాజకీయ సమీకరణాల కోసం చేసిన వాగ్దానాలు వీరి దరికి చెరక పోగా, మరో వైపు వీరి సామాజిక సమీకరణాలు దుర్భలంగా మారాయి."
భూమి మరియు రాజకీయ పదవులు అనేక తరాలుగా అనుభవిస్తున్న కుటుంబాల నుండి వచ్చిన కొద్దిమంది ప్రత్యేకవాదులు తెలంగాణా ప్రాంతంలో మొదటినుండి నెలకొని ఉన్న అసమానతలను వారి కనుగుణంగా వినియోగించుకోవాలనుకుంటున్నారు. ఇది ఏ ఒక్కరూ కాదనలేని పచ్చి నిజం. ఒక్క సారి పార్టీ అధ్యక్షుడి స్థాయి నుండి క్రింది స్థాయి నాయకుడు వరకు చెప్పే మాటలు చేసే వాదనలు వింటే అది అవగతమవుతుంది.అసమానతలే వారి ఉద్యమాలకు ఊపిరి. అసలు అసమానతలకు కారణాలు వెతకకుండా, అందులకు తామే ముఖ్య కారణమన్న నిజాన్ని దాచి, మోసపూరితమైన వాదనలు ప్రజలను నూరి పోసి, ప్రాంతీయ విద్వేషాలు పెంచి, అన్ని బాధలు ప్రత్యేకరాష్ట్రం ఏర్పడగానే తీరిపోతాయి అని వారిని మభ్యపెట్టడం నీచం. అలా ఇప్పటికి పబ్బం గడుపు పోవాలనుకొంటున్న వారు తామొక పులిని స్వారీ చేస్తున్నారని తెలుసుకోవాలి.పరిష్కార మార్గాలు వెదకకుండా, ఇప్పటి వరుకు అనుకొన్నవాటినీ అమలుచేయకుండా శుష్క వాగ్దానాలు చేసుకుంటా పోతే అణగారిన వర్గాలు ఏదో ఒకనాడు తిరగబడతాయి. మన దురదృష్టంకొద్దీ అప్పటికి రాష్ట్రం ముక్కలయి ఉంటే 'అదిగో ఆంధ్రోడు అదిగో బూచోడు' అని వారిని బుజ్జగించే వీలుండదు. వారు తమ తాతల స్ఫూర్తితో సాయుధ పోరాటమంటే అక్కడెక్కడో ఛత్తీస్ గడ్, ఒరిస్సా సరిహద్దులావలికి పారిపోయిన మావోయిస్టు నేతలు తప్ప సంతోషించే వారెవరూ ఉండబోరు.
దయచేసి ఖతి పరిమాణం (font size) కాస్త పెంచగలరని ప్రార్థన.
రిప్లయితొలగించండిlarge font size మరీ పెద్దగా ఉంది. ఇతర బ్లాగుల నుండి ఏమైనా సూచనలు ఉంటే దయచేసి ఇవ్వండి
రిప్లయితొలగించండిgive 10pt size for post font size in edit html. this is standard font size
రిప్లయితొలగించండిఇప్పుడు బానే ఉంది.
రిప్లయితొలగించండి