తామేపాపం చేయకపోయినా అనేకమంది ఓయూ విద్యార్థులు ఈ వేసవిలో సెలవలనేవి లేకుండా విద్యాసంవత్సరం పూర్తిచేద్దాం అని ఎన్నో తిప్పలు పడుతున్నారు. అదలా ఉండగా పులివెందుల ,కడప ఉపఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ప్రత్యేక తెలంగాణవాదులు మరోసారి రాష్ట్రంలో కల్లోలం సృష్టించాలని యోచన చేస్తున్నారా? గత కొన్ని రోజులుగా పని లేకనో మీడియా ప్రచారం లేకనో కుతకుత లాడుతున్న నాయకులు ఒకవైపు, చదువుసంధ్య లేకుండా ఏళ్ళ పాటు నిర్లజ్జగా ప్రభుత్వ సబ్సిడీలతో నడిచే హాస్టల్ లలో తిష్ట వేసి రీసెర్చ్ స్కాలర్లమని చెప్పుకుంటూ పార్టీ జెండాలు మోస్తున్న కొద్దిమంది మరోవైపు, కలిసికట్టుగా తామెందుకూ కొరగాకపోతే పోయాం ఇతరులెవ్వరూ చదువుకొని బాగుపడకూడదు లేదా ప్రశాంతంగా జీవిస్తూ జీవనోపాధి పొందకూడదు అని కంకణం కట్టుకున్నారా? వారి మాటలు విన్నా, వారియొక్క పనికిమాలిన యోచనల గురించి చదివినా అలాగే అనిపిస్తుంది. వీరు తెలంగాణ ప్రజల బాగు కోరేవారంటే నమ్మే బుద్ధిహీనులు ఎవరైనా ఉన్నారా? వుంటే చెప్పండి. జూన్ కల్లా కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కాబోతున్నది. అటువంటి సమయంలో కేజీ నుండి పీజీ వరకూ అన్ని స్థాయిలలో తెలంగాణా అంతటా విద్యాసంవత్సరం బహిష్కరించమని పిలుపు ఇవ్వడానికి వీరు నిజంగానే సంసిద్ధులవుతున్నరా?పిలుపు ఇచ్చి ఊరుకుంటారా లేక కిరాయి మనుషులు పెట్టి దానిని పాటించని వారిపై భౌతికదాడులకు కూడా పాల్పడుతారా?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి