4, మే 2011, బుధవారం

చవకబారున్నర విశ్లేషకుడు

ఆ మధ్య హై.లో సినిమా షూటింగుల మీదబడి ధ్వంసం చేసారు ముష్కరులు. మనోజ్ సినిమా షూటింగు సంఘటన పట్ల స్పందనగా మోహన్‌బాబు ఘాటుగానే మాట్టాడాడు. ఆ తరవాత అల్లు అర్జున్ సినిమా షూటింగు మీద కూడా దాడి జరిగింది.

మన టీవీలవాళ్ళకు ఘంటా చక్రపాణి అనే నిలయ విద్వాంసుడి లాంటి విశ్లేషకు డొకాయనున్నాడు. దాడి విషయమ్మీద ఓ టీవీలో మాట్టాడుతూ -
'మోహన్ బాబు మాట్టాడినదానిపై ఎవ్వరూ ఖండించలేదేంటి' అని వాపోయాడు. వెనువెంటనే, అల్లు అర్జున్ సినిమాపై జరిగిన దాడి గురించి మీరేమంటారు అని అడిగితే, అందుకు సమాధానంగా, అదెవరో ఏబీవీపీ వాళ్ళు చేసినది అని తేల్చెయ్యబోయాడు ముందు. మళ్ళీ తిప్పుకుని, దాడిని సమర్ధిస్తూ మాట్టాడాడు. అతగాడి దృష్టిలో ముష్కరులు చేసిన దాడి సమర్ధనీయము, దాన్ని ఎదుర్కొన్నవాళ్ళ బాధ మాత్రం ఖండనీయము! రెండు నాలుకల విశ్లేషకుడు!

ఇవ్వాళ మహాటీవీలో అతడి ప్రవర్తన మరీ నేలబారుగా ఉంది. చర్చలో అతడితోపాటు ఒక సమైక్యాంధ్ర ఉద్యమ విద్యార్థి కూడా పాల్గొన్నాడు. ఆ కుర్రాడి వయసు ఇతగాడి వయసులో సగం కూడా ఉండదు. ఆ కుర్రవాణ్ణి ఇష్టమొచ్చినట్టుగా చీదరించుకున్నాడు, కసిరేసాడు. ఆ కుర్రాడు కేసీయారు గురించి మాట్టాడుతూ అతడి తాగుబోతుతనం గురించి మాట్టాడబోగా వ్యక్తిగత విషయాలు మాట్టడవద్దని చెబుతూ, "ఇక్కడ పిచ్చివాగుడు వాగకు" అని అన్నాడు. పోనీ ఘంటా ఏమన్నా సరిగ్గా మాట్టాడాడా.. విజయవాడలో ఒక ఎంపీ యొక్క ఇద్దరు భార్యల వ్యవహారం గురించి మాట్టాడాడు. అది ఆ ఎంపీ వ్యక్తిగత వ్యవహారమన్న ఇంగితం లేకుండా పోయింది అతడికి.  ఇదీ అతగాడి దిగజారుడు వ్యక్తిత్వం.

ఆ కుర్రాడు లగడపాటి గురించి మాట్టాడబోగా, మాకు అలాంటివాళ్ళ సంగతి అనవసరంలెండి అంటూ తీసేసాడు. అప్పుడా కుర్రవాడు అదేంటండీ ఆయన ఎంపీ, రేపు పార్లమెంటులో ఓటు వెయ్యాల్సి ఉంది మరి అని అన్నాడు. అందుకు ఘంటా చక్రపాణి ఏమన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతాం. "ఓటెయ్యకపోతే దొబ్బెయ్యమనండి, అతడి ఓటు మాకేం అక్కర్లేదు". ఖచ్చితంగా ఇవేమాటలుకాదుగానీ దాదాపుగా ఇవేముక్కలన్నాడు. ఒక చర్చలో ఇలా మాట్టాడే ఇతగాడొక ప్రొఫెసరంట! కనకపు సింహాసనమున.. గుర్తొచ్చింది నాకు.

అలా సాగిన ఆ చర్చలో ఆ కుర్రాడి గురించి, ఒకసారి ఇలా అన్నాడు..
"మీ ఉద్రేకాలు చూపించాలనుకుంటే మీ ప్రాంతంలో చూపించుకోండి, చానళ్ళలో కాదు." అంటే కోస్తా సీమల వాళ్ళు తమ ఉద్రేకాలను తమ ప్రాంతాల్లో చూపించాలి, ఈయన మాత్రం తన ఉద్రేకాన్ని చానళ్ళలో చూపిస్తాడు కాబోలు.

ఈ చర్చలో ఘంటా ప్రవర్తన ఏ క్షణంలో కూడా ఒక ప్రొఫెసరు స్థాయికి తగినట్టుగా లేదు. నిష్పాక్షిక విశ్లేషకుడు కాదుగదా.. కనీసం ఒక చవకబారు విశ్లేషకుడు లాగా కూడా ప్రవర్తించలేదాతడు. ఉద్యమం పేరిట బస్సుల్ని తగలబెట్టే ఏదో ముఠాలో నుండి మార్పుకోసం నేరుగా స్టూడియోకి వచ్చిన బాపతులాగా అనిపించాడు.

టీవీలవాళ్ళూ, సమస్యకు సామరస్య పరిష్కారం కావాలంటే ఈ రకం మనుషులను మాత్రం దూరంగా ఉంచాలి.
http://chaduvari.blogspot.com/2009/12/blog-post_553.html

5 కామెంట్‌లు:

  1. Thanks for highlighting this double tongue poisonous snake...

    రిప్లయితొలగించండి
  2. very cunning, dubious, double standard, double tongue fellow...disgrace to Teaching profession..hs position is definitely not by his Merit...but due to somebody's mercy..

    రిప్లయితొలగించండి
  3. మీరు గమనించారో లేదో మీడియా చాలావరకు తెలంగాణా పక్షపాతులు. నిష్పాక్షికంగా మాట్లాడాలి అంటే వణుకు. ఎందుకంటే వాళ్ళ ఆఫీస్ లన్ని హైదరాబాద్ లో వున్నాయి.

    రిప్లయితొలగించండి
  4. అవును ఆంధ్రుడు గారు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం. లుచ్చాలు అంటే ఎవరు నాన్నా అని మా అబ్బాయి అడిగాడు. ఇపుడు నాకు సమాధానం దొరికింది."వక్రపాణి"ని చూపించొచ్చు అన్నమాట.

    రిప్లయితొలగించండి