4, అక్టోబర్ 2011, మంగళవారం

ఏమి ఖర్మరా బాబు!

గాంధీ జయంతి రోజున మన కేచరా (అదేదో తిట్టు అనుకునేరు. అంతర్జాలంలో చాల చోట్ల కే.చంద్ర శేఖర్ రావును కచరా అని సంబోధిస్తున్నారు. తేడా గమనించగలరు )చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉండవలసిన TRSV రౌడీ నాయకుడు  సుమన్, ఇతర నాయకులను వెంటబెట్టుకొని గాంధీ టోపీ ధరించి మరీ రాజఘాట్ లో దీక్షలో కూర్చోవడమేమిటి? మాది శాంతియుత మైన ఉద్యమం,మమ్ములను ప్రభుత్వం అణిచివేస్తున్నది అని నేషనల్ మీడియా ద్వారా పిట్ట కథలు చెబుతుంటే మనం వినడమేమిటి! ఏదో ఏదేదో జరగబోతున్నది  అని 20 రోజుల పాటు  సమ్మెను నడిపించి, ఢిల్లీ మీడియా అంతగా పట్టించుకోవకపోవడంతో భంగపడి, ఇక లాభం లేదు అనుకొని దేశ రాజధానిలో వారు నానా వేషాలు వేస్తున్నారు, నానా పాట్లు పడుతున్నారు .
చదువు పేరిట అప్పన్నంగా ప్రభుత్వ హాస్టల్ లలో తిష్ట వేసిన కొంత మంది పరమ రౌడీ వెధవలను ఏరికోరి ఎంచుకొని వారిని బాగా మేపి జనాల మీదకు వదిలారు తెరాస వాళ్ళు. వారిలో ప్రముఖుడు మన సుమన్. సాటి వ్యక్తిపై(తెలంగాణావాదే) అందరూ చూస్తుండగానే ఒక మీడియా ఛానల్ చర్చా కార్యక్రమం లో చేయిచేసుకున్న ఘనుడు వాడు. మొన్నటికి మొన్న ఖైరతాబాద్ RTA ఆఫీసులో అధికారి పై చేయిచేసుకొన్నాడు. అటువంటి వారితో మరి శాంతియుతం గానే ఉద్యమం చేయాలి .లేకపోతే అంతటా అశాంతమే! ఢిల్లీ లో కూడా గొర్రెలు మాత్రమే ఉన్నాయి అని కేచరా అనుకుంటున్నారా? అక్కడికి వీరి భాగోతం ఎప్పుడో పాకిపోయింది
బహుశా కేచరా అక్కడి నుండే ఇక్కడి గొర్రెలకు మీడియా ద్వారా సందేశాలు పంపిస్తున్నాడేమో!జీతాలు ఆగిపోయి తిప్పలు పడుతున్న ప్రభుత్వోద్యోగులను, కార్మికులను, కరెంటు లేక పంటలు ఎండిపోతూ ఉండగా తల పట్టుకున్న రైతులను, సమ్మె మూలంగా నానారకాల పాట్లు పడుతున్న సకల జనులను మభ్య పెట్టడానికి అదుగో మీ కష్టాలకు మేము కారణం కాదు, మిమ్ములను గట్టెక్కించడానికే ఇంత దూరం వచ్చి ప్రధానమంత్రిని  కూడా కలిసాం, చేతులు దులిపేసుకున్నాం అని చెప్పకోవడానికేనేమో ఈ పాట్లు. ఈ మధ్యనే ఒవైసీ కేసిఆర్ ను ఏదో పలకరిద్దాం అని వెళ్తే అదిగో నా దగ్గరకు కేంద్రం నుండి దూత వచ్చాడు, తెలంగాణాతో పాటు ఇంకో రెండు జిల్లాలు కూడా ఇవ్వజూపారు అని ప్రచారం చేసుకొన్నాడు. అదే ఒవైసీ ఇతర పార్టీ నేతలు దగ్గరికి కూడా వెళ్ళాడు, కేచరా వ్యాఖ్యలను బహిరంగంగా ఖండించాడు. అయితేనేం కేచరా అప్పటికే రాయలతెలంగాణపై పెద్ద దుమారాన్నే లేపాడు.కొంత కాలం క్రితం కేచరా  టీ కాంగ్రెస్ నాయకులు ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేస్తున్నప్పుడు పిలవని పేరంటానికి వెళ్లి అదిగో ఉద్యమ నాయకుడు వచ్చేశాడు ఇదిగో మా చెవిలో తెలంగాణా రెండు వారాల్లో రాబోతున్నదని ఊదేశాడు అని అనిపించుకున్న సంఘటన  గుర్తున్నదా?

3 కామెంట్‌లు:

  1. అయ్యా "కచరా" అనేది కె.చంద్ర శేఖర రావు కు కాదు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు సంక్షిప్త నామం. కాబట్టి కచరా అనడంలో తప్పులేదు :)

    రిప్లయితొలగించండి
  2. /రాయలతెలంగాణపై పెద్ద దుమారాన్నే లేపాడు/
    కచరాలు దుమ్ములో పొర్లినప్పుడు, పేద్ద కచరా ఐతే పెద్ద దుమారం లేవడం, చిన్న కచరాలకు చిన్నదుమారం లేవడం మామూలే కదా. :)

    రిప్లయితొలగించండి
  3. వుజ్జమం 'సరైన దిశ'లోనే సాగుతోంది అని నా అభిప్రాయం. వుజ్జమానికి తగిన పరిష్కారం కూడా త్వరలోనే ఉన్నట్టు అనిపిస్తోంది. :D

    రిప్లయితొలగించండి