4, అక్టోబర్ 2011, మంగళవారం

రైతు కన్నీళ్లకు బాధ్యులు ఆ ఇద్దరే : CM



ఈనాడు photo

 సూర్య దినపత్రిక: తెలంగాణ ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని రైతులు విద్యుత్‌ సరఫరా లేక పంట నష్టపోవడానికి కారణం టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, కేసీఆర్‌, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కారణమని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. రైతుల ఉసురు పోసుకోవద్దని కేసీఆర్‌, కోదండరామ్‌లకు సూచించారు. రైతులకు నష్టం కల్గించే చర్యలను ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తారని ఆయ న హెచ్చరించారు. గోదావరిఖని, ఖమ్మం వెళ్ళి కోదండ రామ్‌ బొగ్గు ఉత్పత్తిని నిలిపి వేయించారని సీఎం ఆరో పించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 75 లక్షల ఎకరాలు బొర్లు కింద సాగువుతుండగా అందులో 60 శాతం తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయన్నారు. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టడానికి కోదండరామ్‌, కేసీఆర్‌లు ప్రయత్నిస్తున్నారని మండి పడ్డారు.శ్రీశైలం నాగార్జున సాగర్‌లో కావాల్సినంత నీరు ఉన్నా విద్యుత్‌ ఉత్పత్తి చేయడం లేదని వస్తు న్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

2 కామెంట్‌లు:

  1. బాగుంది యవారం. ఈయనా, ఈయన యంత్రాంగమూ, అధికారమూ "వాళ్ళిద్దరి" పాటి చెయ్యవన్నమాట. వాళ్ళను ఏదో చెయ్యొద్దనటమేగానీ అసలుకంటు ఈయనేంచేస్తున్నాడో?

    రిప్లయితొలగించండి
  2. Government must immediately all the union leaders along with KCR and Kodanda Ram and go for crack down. It can be tackled in a week time.

    రిప్లయితొలగించండి