30, అక్టోబర్ 2011, ఆదివారం

విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో రాష్ట్రావతరణ దినోత్సవం

తెలుగు సోదర , సోదరీమణులారా........!
విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నవంబరు 1 వ తేదీన ఉదయం 11.30 గంటలకు హైదరాబాదు సచివాలయం ఎదురుగా ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి పుష్ప మాల సమర్పణ మరియు స్వాతంత్ర్య సమరయోధులకు సన్మాన కార్యక్రమం నిర్వహింపబడును .ఈ కార్యక్రమము లో సర్వశ్రీ నర్రా మాధవ రావు గారు (స్వాతంత్ర్య సమరయోధులు ) , ఆంజనేయ రెడ్డి గారు ( మాజీ డీ జీ పీ ),డా.పరకాల ప్రభాకర్,ప్రొఫెసర్ . ఆర్ వీ ఆర్ చంద్ర శేఖర్ రావు గారు, ,ప్రొఫెసర్ మురళి ,ఏ బీ కే ప్రసాద్ గారు , సి .నరసింహా రావు గారు,కుమార్ చౌదరి యాదవ్ ,కొడిచర్ల వెంకటయ్య,పీ .రవితేజ ,నల్లమోతు చక్రవర్తి ,చేగొండి రామ జోగయ్య గారు,సుంకర వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొందురు.కావున తామెందరు ఈ కార్యక్రమములో పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము .

వేదిక : హైదరాబాదు ,సచివాలయం ఎదురుగా ఉన్న "మన తెలుగు తల్లి విగ్రహం "

సమయం : ది . 1 నవంబరు ఉదయము 11.30 గంటలకు

ఇట్లు,
విశాలాంధ్ర మహాసభ

3 కామెంట్‌లు:

  1. Innallu Hindu/Muslim festivals police rakshanalo jarigevi. Ippudu Rashtravatarana vedukalu kuda police bandobastulo Telanganalo jarapalsi vastondi. Telugu talliki vandanalu. Unmadulaki sadbuddhi prasadinchu talli!

    రిప్లయితొలగించండి
  2. మా తెలుగు తల్లికి రక్షణ కల్పించండి!
    మా సోదరులకు నిజాలను తెలిపి
    తెలుగు తల్లి! తెలంగాణ తల్లి!
    అన్న విభజన!
    కొందరు కుహనా నాయకుల కుట్రల ఫలితమె
    మనమందరం తెలుగు తల్లి ముద్దు బిడ్డలమే
    అన్నది మాత్రం నిత్య సత్యం.

    రిప్లయితొలగించండి
  3. ఆంధ్ర రాష్ట్రము వచ్చే,మహా ఆంధ్ర రాజ్య
    మేరుపడురోజు పొలిమేర చేరి నిలిచే
    నా తెలంగాణాతల్లి యానంద పడగా
    --శ్రీ దాశరధి
    Source:07-03-1956 on Nehru visalandhra announcement at Nizambad meeting published in Andhrapatrika daily.

    రిప్లయితొలగించండి