4, అక్టోబర్ 2011, మంగళవారం

నకిరేకల్ వద్ద బస్ లపై రాళ్లు-ప్రయాణికుల పాట్లు


Kommineni.info: నల్లగొండ జిల్లా నకిరేకల్ వద్ద తెలంగాణ ఆందోళనకారులు కొందరు ప్రయాణికులు ఉన్న బస్ లపై రాళ్లు విసిరి అద్దాలు పగులకొట్టడంతో పలువురు గాయపడ్డారు. సుమారు ఇరవై బస్ ల అద్దాలు పగిలినట్లు సమాచారం వస్తోంది.ఆదివారం సాయంత్రం బయల్దేరిన ప్రయాణికులు, తిండి, తిప్పలు లేకుండా నానా కష్టాలు పడుతున్నారు. అలాంటి సమయంలో ఈ రాళ్లదాడులు మరింత ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఎవరైనా కాని ఇలా రాళ్లు వేయడం ఏమాత్రం పద్దతి కాదు. బస్ లలో కేవలం ఒక ప్రాంతం వారే ప్రయాణించరు. అన్ని ప్రాంతాల వారు ఉంటారు. కేవలం అమాయకత్వంతోనో, ఎవరో స్వార్దపరులు రెచ్చగొడితేనో ఇలా చేస్తే అది మానవత్వం అనిపించుకోదు. దీనివల్ల తెలంగాణ లక్ష్యానికి విఘాతం కలిగే అవకాశం ఉంది. పోలీసులు చోద్యం చూస్తున్నారు తప్ప తగు చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు టీవీ చానళ్లకు ఫోన్ చేసి చెబుతున్నారు. బస్ లోపల అద్దాల పగిలి కూర్చోవడానికి కూడా ఇబ్బందిగా మారిందని వారు చెబుతున్నారు. 
Deccan Chronicle:  http://www.deccanchronicle.com/channels/nation/south/telangana-activists-damage-buses-coming-andhra-175




Hindustan Times: http://www.hindustantimes.com/Telangana-agitation-Hundreds-stranded-on-roads/Article1-752946.aspx

24 కామెంట్‌లు:

  1. Rallu padite Matladina Andhra media , pranalu poinappudu ekkada pandkunai ??? VIJAYWADA TO HYDERABAD is a nightmare from now ... WE DONT LIKE PEOPLE WHO DONT RESPECT OUR ASPIRATIONS . BETTER STAY IN UR VIJYAWADA WE HAVE BEARED U LONG ENOUGH !! GET LOST BEFORE U GET BEATEN UP WORSE ... AND STOP SAYING UNITED PRINCIPLES TO US ... U IDIOTS HAVE DEMANDED SEPERATE STATE FROM MADRAS AND LICKED OUR BOOTS TO JOIN WITH US !!

    రిప్లయితొలగించండి
  2. విశాలాంధ్ర దృక్పథమే కోస్తా ఆంధ్రవారిది కానీ తెలంగాణా వారిది కాదు. భింద్రన్‌వాలా టైమ్‌లో ఖలిస్తాన్ ఉగ్రవాదులు సిక్కు మతాన్ని హిందువులపై రుద్దినట్టు కోస్తా ఆంధ్రులు సమైక్యవాదాన్ని తెలంగాణాపై రుద్దుతోంటే కోస్తా ఆంధ్రకి చెందిన ప్రైవేట్ బస్సులపై తెలంగాణావాదులు రాళ్ళు విసిరి అద్దాలు బద్దలగొట్టడంలో విచిత్రమేముంది?

    రిప్లయితొలగించండి
  3. వుజ్జమం 'సరైన దిశ'లోనే సాగుతోంది అని నా అభిప్రాయం. వుజ్జమానికి తగిన పరిష్కారం కూడా త్వరలోనే ఉన్నట్టు అనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  4. ప్రైవేట్ బస్సులు ఎండ్ టు ఎండ్ ప్రయాణికులని తీసుకెళ్తాయి. వాటిలో కృష్ణా జిల్లాకీ, రంగారెడ్డి జిల్లాకీ మధ్యన ఉన్న నల్లగొండ జిల్లావాళ్ళు ఎక్కరని తెలిసే ఆ బస్సుల మీదకి రాళ్ళు విసిరారు.

    రిప్లయితొలగించండి
  5. హైదరాబాద్ నుంచి నవరాత్రులలో విజయవాడ దుర్గ గుడిని దర్శించుకోవాలనుకునే ఏ తెలంగాణా కుటుంబమైనా ఆ బస్సులలో ఉండదంటావా ప్రవీణూ? లేక నల్లగొండ వాళ్ళు కాదు కాబట్టి ఎవరి మీద రాళ్ళేసినా మనకేంటిలే అని వేశారంటావా?

    "విశాలాంధ్ర దృక్పథమే కోస్తా ఆంధ్రవారిది కానీ తెలంగాణా వారిది కాదు."
    నీకు తెలిసి మాట్లాడతావో తెలియక మాట్లాడతావో తెలియదు కానీ సమైక్య వాదులు, విభజన వాదులు రెండు ప్రాంతాలలోనూ ఉన్నారు.

    "భింద్రన్‌వాలా టైమ్‌లో ఖలిస్తాన్ ఉగ్రవాదులు........."
    ఆహా ఏం పోలిక దొరికింది నీకు ప్రవీణూ! నీ అంత అమాయక మూర్ఖుడిని నేను ఇంత వరకూ చూడలేదనుకో. నువ్వు కేక

    @కాళిదాసు గారు
    అరె! భలే చెప్పారు. ఎవడబ్బ సొమ్ము సార్ ఈ దేశం? రావద్దనడానికి? జనాలు ఈ పిచ్చి నా ------------ల నూరు తప్పుల కోసం ఎదురుచూస్తునారు. ఆ తరువాత ఇక శిశుపాల వధే:) . అన్నట్టు "నా తెలంగాణా కోటి రతనాల వీణ" అని మీరు గర్వంగా చెప్పుకునే మాటను అందించిన దాశరధి విశాలాంధ్రనే కోరుకున్నారని మీకు తెలియదా?. ఇంకోసారి ఇలా రావద్దు, నరికేస్తాం అని స్టేట్మెంట్లు ఇవ్వకండి సర్. కుక్క మరీ మొరుగుతుంటే మున్సిపాలిటీ వాన్ ఎక్కిన్చేయగలరు జాగర్త మరి.

    రిప్లయితొలగించండి
  6. సమైక్యవాదులకీ, భింద్రన్‌వాలా టైమ్ నాటి ఖలిస్తాన్ ఉగ్రవాదులకీ మధ్య తేడా ఏమీ లేదనే నమ్ముతాను. అక్కడ వాళ్ళు హిందువులు తలపాగా వేసుకుని ఖల్సా నియమాలు అనుసరించాలని ఆదేశిస్తే ఇక్కడ వీళ్ళు తెలంగాణా ప్రజలు రెండుంపావు జిల్లాల భాష మాట్లాడాలని శాసిస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  7. చరిత్రని తిరగేసి వ్రాయకు. మొదట్లో విశాలాంధ్రని సమర్థించిన దాశరధి తరువాత తెలంగాణావాదాన్ని చేపట్టాడు. అంతే కానీ తెలంగాణావాదం నుంచి విశాలాంధ్రవాదానికి డీవియేట్ అవ్వలేదు.

    రిప్లయితొలగించండి
  8. https://plus.google.com/111113261980146074416/posts/ftcXyC8n3nr బస్సులు మీద రాళ్ళు విసురుతారనే జ్ఞానం చాలా మందికి కలిగింది కానీ మొన్న బస్సులలో ప్రయాణించినవాళ్ళకి కలగకపోతే అది తెలంగాణావాదుల తప్పా?

    రిప్లయితొలగించండి
  9. Rendunnara nundi rendumpaavu ku enduku diginatto? Papam 'Namaste Telangaana' kooda aa rendumpaavu jillala basha ne upayogistunnattlu undi kaadaa?

    రిప్లయితొలగించండి
  10. దేశపతి శ్రీనివాస్ గారు తాను చిన్నప్పుడు మలక పొద్దు అనే పదం ఉచ్ఛరిస్తే పెద్దైన తరువాత ఆ పదం ఉచ్ఛరించడం అవమానం అనుకుని మానేశానని చెప్పారు. అది రెండుంపావు జిల్లాల భాష ఆధిపత్యానికి నిదర్శనం కాదా? సమ్మె జరుగుతోందని 50% మందికి పైగా పర్యాటకులు హైదరాబాద్ వెళ్ళలేదు. కొందరు విజయవాడవాసులు సాహసం చెయ్యరా డింభకా అంటూ వెళ్ళారు. అది వాళ్ళ తప్పే కదా.

    రిప్లయితొలగించండి
  11. /కుక్క మరీ మొరుగుతుంటే మున్సిపాలిటీ వాన్ ఎక్కిన్చేయగలరు జాగర్త మరి/
    :)) అవి తప్పిపోయి వస్తే ఎక్కిస్తారు, మరి మన (గ్రామ)సింబా మాటేమిటి, శంకర్ గారు? :) ఏదో ఓ మార్గం చూడండి. ;)

    రిప్లయితొలగించండి
  12. "బస్సులు మీద రాళ్ళు విసురుతారనే జ్ఞానం చాలా మందికి కలిగింది కానీ మొన్న బస్సులలో ప్రయాణించినవాళ్ళకి కలగకపోతే అది తెలంగాణావాదుల తప్పా? "

    అందరూ కూపస్త మండూకాలు కాదు కదండీ!ఎంతో మంది ఎన్నో కారణాలతో ప్రయాణాలు చేస్తారు.పర్యాటకులతో వారికి పోలికేమిటి? మీరెక్కడ వుంటారు? ఎలా ప్రయాణాలు చేస్తారు?మనుషులను,బంధువులను ఎలా కలుస్తారు?(కప్పలకు కూడా బంధుబలగం ఉంటాయని విన్నాను. మనం రోడ్లంబడి వాహనాలలో పోతే అవి వర్షం వెంబడి పోతాయంట)ఆఫీసులకు ఎలా వెళతారు? ఒప్పుకుంటాను కొన్ని జీవులు తమ తమ నూతులలో కాలం గడుపుతూ బయట ప్రపంచం తెలియక, ఒళ్ళు వంగక, వసూళ్లు చేసుకోవడమో, తమ కష్టాలకు ఇంకెవరినో బాధ్యులను చేయడమో, సన్నాసి పిట్టలదొర చెప్పిన సన్నాసి కబుర్లను మళ్లీ మళ్లీ వింటూనో కాలం గడుపుతాయి.

    మనం 'కాసిం రజ్వి రాజ్యంలోకి ప్రయాణం' గురించి మాట్లాడుకోవడం లేదు కదా?అసలు తెలంగాణాలో సాయుధ పోరాటం జరుగుతునప్పుడే విజయవాడ నుండి సప్ప్లైలు తెలంగాణావాదులు ఆపేసుకొని ఉంటే ఎక్కడి వారు అక్కడే పెర్మనెంట్ గా ఉండిపోయే వారు. 'వీర తెలంగాణా నాది వేరు తెలంగాణా కాదు' అని బహిరంగంగా చాటిన రావి నారాయణరెడ్డి లాంటి తెలంగాణా సాయుధ పోరాట యోధులు ఏదో కక్కుర్తి పడి విజయవాడ వైపు మనుషుల సహాయం పై ఆధారపడ్డారు. వారు చేసిన తప్పుకు నవయుగం తెలంగాణావాదులు చేతులో రాళ్ళు పట్టుకొంటున్నారు. పాపం ఎంత కష్టమో!

    రిప్లయితొలగించండి
  13. కూర్చుకున్న కొమ్మను నరుక్కోవడం తెలంగాణా వేర్పాటు వాదులకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. కెసిఆర్ ప్రధాన మంత్రి ని కలవడానికి కొన్ని గంటల ముందే జాతీయ రహదారి పైన సీమంధ్ర రవాణా సాధనాల పైన రాళ్ళ దాడి ప్రధాన మంత్రి కి ఎటువంటి సంకేతం పంపిస్తుంది.ఈ విషయం ప్రధాని కి తెలియదు అనుకుంటున్నారేమో. అలా ఎప్పటికీ జరగదు. ప్రధాని ని కలవడానికి చీమ వచ్చినా, అప్పటికి ఒక్క నిమిషం వరకు ఆ చీమ పుట్టు పూర్వత్తరాలు ప్రధానికి తెలియ జేయడం జరుగుతుంది.

    తెలంగాణా లో వున్నా 70 నుండి 80 లక్షల సీమంద్రుల రక్షణ బాధ్యత తెలంగాణా ప్రజలు, నాయకులదే. సీమ ఆంధ్ర లో వుండే ప్రజలు ఆ రక్షణ బాధ్యత తీసుకోవడానికి సిద్ధమే. కాకుంటే అది అంతర్యుద్ధ పరిస్థితి కి దారి తీస్తుంది. తరువాత మీ ఇష్టం.

    రిప్లయితొలగించండి
  14. నమస్తే తెలంగాణా వసూళ్ళ దిన పత్రిక లో ఆ రెండుపావు జిల్లాల భాష కాకుండా మిగిలిన ఇరవై ఒకటిన్నర జిల్లాల భాష వాడ వచ్చు కదా

    రిప్లయితొలగించండి
  15. @ప్రవీణ్:
    మీ పరేశాన్ మస్తుగుంది. జరగా రెండుపావు జిల్లాల భాష ఎరుకైతే జెప్పరాదే!

    @Snkr, శంకర్, చైతన్య, కృష్ణమోహన్:
    మా ఊళ్ళో ఒక ఆచారం ఉంది. గ్రామదేవత తిరునాళ్ళప్పుడు ఒక దున్నపోతును అమ్మోరి పేరుమీద అచ్చువేసి దాన్ని ఊరుమీద వదలిపెడతారు. ఆ తర్వాత ఇక దాని బీభత్సం చూడాలి. దానికి షావుకారు చేనైనా గవుళ్ళ (గౌడలు) చేనైనా ఒకటే. దానికి ఇక దొరికిన చేలన్నీ తొక్కి వదలితేగాని కడుపు నిండదు. అలా ఊరిమీద వదలింది మనమేకదా అని దాన్ని ఎవరో ఒకరు కారపులంక (మాంసాహారానికి మావైపు ముద్దుపేరు) తోలేవరకూ భరిస్తారు. కాబట్టి ఎక్కువ సమయం దానిమీద వృధాచేయటం అనవసరం.

    @కృష్ణమోహన్:
    యుద్ధమో లేదా అంతర్యుద్ధమో తప్పదని తెలిసినప్పుడు ఆయుదాలు పదునుపెట్టుకోవటం తెలివైనవారి చర్య.

    రిప్లయితొలగించండి
  16. కాళిదాసు, ఎవరు నూట్లు నాకారో మీకు తెలుసా? బూర్గుల రామ కృష్ణ రావు, కొండ వెంకట రంగా రెడ్డి కర్నూల కి మూడు సార్లు వచ్చారు బూట్లు నాకదానికి. ఆంధ్ర ప్రదేశ్ వచ్చేంత వరకూ అక్కడి వాళ్ళు ఒక్కటంటే ఒక్క సారి కూడా హైదరాబాద్ కి రాలేదు. నిజానికి ఆంధ్ర వారికే ఇష్టం వుండేది కాదు కలవడం. మీకు తెలియకుంటే మీ పిట్టల దొర కచార ని అడగండి చెబుతాడు. అప్పటికీ తెలియకుంటే కొంత సేపు తరువాత ఈ బ్లాగ్ కి రండి, నేను తెలియ చెబుతా

    రిప్లయితొలగించండి
  17. ఆచంగ గారు, ఈ తెలంగాణా అచ్చోసిన దున్నబోతు కి కారపు లంక దసరా తరవాతేనా? ముందా?

    రిప్లయితొలగించండి
  18. కృష్ణమోహన్ గారూ,
    కారపులంకా లేక దాన్నలా అచ్చోసి వదిలినందుకు మనమే ఆసుపత్రికి వెళ్ళాలా అనేది కాలమే సమాధానం చెప్పాలి. మన చేతుల్లో ఉన్నది ఓపికగా పరిస్థితులను అంచనా వేసుకుంటూ ఎదుర్కోగల సామర్థ్యాన్ని సంపాదించుకోవటమే.

    రిప్లయితొలగించండి
  19. పనులున్నాయి, నిజమే కానీ తెలంగాణాలో ఉన్న పరిస్థితి సీమాంధ్ర ప్రయాణికులకి తెలియదా? అంత సాహసం చెయ్యాలని ఉంటే కాశ్మీర్ బోర్డర్ దగ్గర నిలబడి జిహాద్, జిహాద్ అని అరవొచ్చు. నల్లగొండ జిల్లాలో హైవే మీదే ప్రయాణించాలని రూల్ లేదు.

    రిప్లయితొలగించండి
  20. కోమటిరెడ్డి వెంకట రెడ్డి కి జనా రెడ్డి కి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరాట ఫలితం ఇది అని కొంచెం తెలివైన వారికి అర్థం అవుతుంది. ప్రభుత్వానికి కూడా తెలుసు. కాకుంటే చర్య తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది. మరొక్క ఒకటి లేదా రెండు వారాలు. ఆ తరువాత ఎవరు ఎక్కడ నిలబడి జిహాద్ అంటారో తెలిస్తుంది

    రిప్లయితొలగించండి
  21. "పనులున్నాయి, నిజమే కానీ తెలంగాణాలో ఉన్న పరిస్థితి సీమాంధ్ర ప్రయాణికులకి తెలియదా? అంత సాహసం చెయ్యాలని ఉంటే కాశ్మీర్ బోర్డర్ దగ్గర నిలబడి జిహాద్, జిహాద్ అని అరవొచ్చు. నల్లగొండ జిల్లాలో హైవే మీదే ప్రయాణించాలని రూల్ లేదు."

    విజయవాడ నుండి హైదరాబాద్ కు హైవే నల్లగుండ గూండానే ఉండి కదా?చుట్టు తిరిగి వెళ్ళమంటారా?మీకిదంతా ఏదో సంబడంగా ఉందనుకొంటాను. ఏదో పది మంది పనికిమాలిన వెధవలు రోడ్ షో చేస్తే వేలాది మంది వారి పనులాపుకోవాలా?ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు ఆ పదిమందికి ఎలా బుద్ధి చెప్పాలో మన పోలీసు వాళ్ళకు తెలుసు. మీరనుకొంటున్న పరిస్థితులు ఎక్కడా లేవు. మీడియా కెమెరాలు లేకపోతే ఆ పది మందిలో సగం కూడా మిగలరు.

    రిప్లయితొలగించండి
  22. అసలు 1969 జనవరి లో ఇలాంటి పనులు చేస్తే సీమంధ్ర వారు వీరికి గట్టి బుద్ధి చెప్పారు.దాని వివరాలు అతి త్వరలో ఇదే బ్లాగ్ లో పోస్ట్ చేస్తా

    రిప్లయితొలగించండి
  23. innocent people in both regions suffering due to madness of all politicians. Congress wants to play safe game, and watching peoples trouble as tv serial.

    రిప్లయితొలగించండి
  24. మావూరి బస్సొచ్చి నాతో కన్నీళ్ళు పెట్టుకుంది!!.. నీ
    మా ఊరంటే బస్సే గుర్తొస్తుంది..!

    చదువుకోటానికి నానా అగచాట్లు పడేప్పుడు
    ఫ్రీ-పాసులిచ్చి పదికిలోమీటర్లు పట్టుకెళ్ళి,
    అక్షరాలు నేర్పిన "అదే"గుర్తొస్తుంది.

    పొలంలో కోటేరుని,
    కొణిజర్లలో స్మసానం లో తగలబడుతున్న శవాన్ని..
    ఒళ్ళోకూర్చోబెట్టుకుని కళ్ళారా చూపిచ్చిన బస్సు గుర్తొస్తుంది.!
    కిటికీకి గడ్డం ఆనిచ్చిన చిన్నతనం,
    సీటెనుక పదేళ్ళప్పుడు రాసిన కవిత్వం గుర్తొస్తుంది.!

    బస్సంటే నన్ను చంకనెత్తుకున్న్న అవ్వ,
    బస్సంటే నావరకు గోరుముద్దలు తినిపించిన అమ్మ!

    మా ఊరి మోటుజనపు నేలవిమానం బస్సు

    ఎవడో చుట్టంగాడి పెళ్ళికి అందరూ..
    చిన్నకార్లలొ,మోటారుసైకిల్లలో వస్తే..
    మా గరీబు నాన్న ఎక్కించిన ఎర్రబస్సు గొప్పగా గుర్తొస్తంది !

    ఎదో పనిమీదెళ్తే..
    దిల్-సుఖ్-నగర్ రోడ్డుమీద మా బస్సు కనిపిస్తే
    ఎదురెళ్ళి ముఖం మీద ముద్దుపెట్టుకోబుద్దయ్యేది,
    ఒక పాత స్నేహితుణ్ణి చూసినట్టో..
    ఏదో విషాదం గుండె అడుగునుంచి కారుతున్నట్టొ వుండేది!

    * * *
    ఎవడో చదువుకున్నోడట బస్సుని రాళ్ళతో బద్దలు కొడుతున్నాడు!
    కసాయిలా కిరసనాయులు పోసి కాల్చేస్తునాడు!
    ఎవడొ.. దయామయి బస్సుని ధ్వంసం చేస్తున్నాడు!

    ఇప్పుడెందుకో బస్సుకి గొంతుంటే బాగుండనిపిస్తుంది నాకు!

    మావూరి మట్టిరోడ్డుమీద బస్సుపోతున్నట్లు
    నా ముఖం మీద కన్నీళ్ళు పోతున్నాయి

    తగలబడుతున్న బస్సుల మధ్య కూలబడి
    విజ్ఞానులనే అజ్ఞానుల ఉన్మాదాన్ని వార్తలు చేసుకుంటున్నా..,

    అయినా సరె..
    కారుతున్న నా కన్నీళ్ళని సీసాలో పట్టుంచా..
    తిలక్ ఓసారి ఇలావచ్చి తగలబడుతున్న బస్సుమీద పోసెళ్ళు..

    ఇంతకుముండె..
    మావూరి బస్సొచ్చి నాతో కన్నీళ్ళు పెట్టుకుంది!!

    ...... నీ

    (నకిరేకల్ వద్ద బస్ లపై రాళ్లు విసిరి అద్దాలు పగులకొట్టి , హైదరాబాద్ లో బస్సులను తగలబెడుతున్న విద్యార్ధి ఉద్యమకారులకి, మేధావులకి.. ఉద్యమస్పూర్తితో...అంకితం)

    రిప్లయితొలగించండి