6, అక్టోబర్ 2011, గురువారం

తెలంగాణా ఆదాయం - వేర్పాటువాదుల అబద్ధం (రెండవ భాగం)

  • నిజాం పరిపాలనలో ప్రజల రక్త మాంసాలు పిండి కూడబెట్టిన కొన్ని కోట్ల రూపాయులు చూపించి హైదరాబాద్ రాష్ట్రంలోని  తెలంగాణలోని జిల్లాలని మిగులు రాష్ట్రముగా ఉండేది అనటం సరికాదు 

  • నిజాములు కోస్తా ఆంధ్ర ని లీజుకి ఇచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు. ఆనాడే 24 % వడ్డీకి పామర్ కంపెనీ వద్ద నుండే కాక స్థానిక  మార్వాడీల వద్ద నుండి కోట్లాది రూపాయుల అప్పులు తీసుకోవడమేకాక నగలు తాకట్టు పెట్టేవారు. ఆండస్ బ్రిటిష్ కౌన్సిల్ వరిష్ట సభ్యుడు అయిన తర్వాత నిజాంని దీన స్థితి నుంచి బయట వెయ్యడానికి  బ్రిటిష్ ప్రభుత్వమే పామర్ కంపెనీకి ఇవ్వాల్సింది తగ్గించి ఎనభైలక్షల సిక్కాలకు సెటిల్ చేసి ధనం కట్టివేసింది. దానీ బదులుగా ఉత్తర కోస్తా జిల్లాల నుంచి వచ్చే పెష్కష్ లీజుని వదులుకొని ఉత్తర కోస్తా ప్రజలను బ్రిటిష్ వారికి పూర్తిగా వదిలి పెట్టారు హైదరాబాద్ పాలకులు 

  • అయినా నిజాం సంస్థానం అప్పులు మరల పెరుగుతూ వచ్చాయి. బ్రిటిష్ వారిని  అప్పుకొరకు రాయచూరు,బీడ్, లేదా బేరార్ జిల్లాలను ఇవ్వగలమని కోరారు. తర్వాత బ్రిటిష్ వారికి చెల్లించాల్సిన అప్పులకు కనీసం నాలుగు నెలలు సమయం ఇమ్మంటే ఇవ్వకపోగా హైదరాబాద్ సిటీ రక్షణలను బ్రిటిష్ సైనికులు పరిశీలించి ఏర్పాట్లు చేసుకుంటుంటే తప్పనిసరి అయి బేరార్ తో పాటు రాయచూరు, ఒస్మానాబాద్ ఒదులుకోవాల్సి వచ్చింది. బ్రిటిష్ వారికి  వీరవిధేయుడిగా 1857 మొదటి భారత స్వతంత్ర సంగ్రామాన్ని అణిచివేయడం వల్ల బ్రిటిష్ నిజాంకి తిరిగి కొన్ని జిల్లాలు ఇవ్వడమే కాక ధన సహాయం చేయడం వల్ల హైదరాబాద్ సంస్థానం ఆర్థికంగా నిలబడగలిగింది. 

  • అసలు నిజాంలకు ముందు తీరాంధ్ర-రాయలసీమ పరిస్థితిని పరశీలిద్దాం. హిజ్రీ 1079 లో 1 ,03 ,62 .661  హౌన్లు గోల్కొండ నవాబులకి మైన్ల ద్వారా వచ్చేది. ఇది మొత్తం సంస్థాన ఆదాయంలో మూడవ వంతు. ఈ మైన్లన్నీ దాదాపు కృష్ణ , గుంటూరు లలోనే ఉండేవి. 1680 లలో మాధవాయిపాలెం -నర్సాపురంలో ఓడల నిర్మాణానికి ఇతర దేశాల వారు క్యూలో ఉండేవారు. 1918 -19  ఓడల నిర్మాణాలు చూస్తె భారత దేశం మొత్తం 36, 264 టన్నుల ఓడలు నిర్మానమవ్వగా ఉమ్మడి మద్రాసులో 21 ,312 నిర్మాణమయ్యాయి.రాయలసీమ రత్నాలను హైదరాబాద్ లో సానబెట్టి అమ్మేవారు.మచిలీపట్నం పట్టణం అప్పుడు వ్యాపారానికి ముఖ్యమైన రేవు. ఆనాడు కోస్తాలో రెవిన్యూ ఆదాయాన్ని పరిశీలిస్తే ఒక సంవత్సరానికి రాజమండ్రిలో భూమిశిస్తు ద్వారా 77692  పౌండ్లు వసూలయ్యేది.


    •  తీరాంధ్రలో స్వాతంత్రోద్యమ సమయంలో కాల్పుల్లో అనకాపల్లి, విజయవాడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, ఏలూరు, నెల్లూరు,విశాఖపట్నం, విజయనగరం లాంటి ప్రాంతాలల్లో  ఎంతో మంది చనిపోయారు, ప్రజలు ఎన్నెన్నో త్యాగాలు చేసారు. ఆర్థిక, సామాజిక వ్యవస్థ ఎంత పరిపుష్టంగా ఉన్న ఎన్నో సంవత్సరాల నుండి సాగుతున్న ఆంధ్ర పోరాటం, సహాయనిరాకరణ, వ్యవస్థలకి అంతరాయాల వల్ల ఆదాయం తగ్గింది కాని ఆనాటి ఆంధ్రరాష్ట్రంల్లో తగిన వనరులు లేక కాదు.ఆదాయములో శతాబ్దాలుగా కోస్తా ఎంతో మిన్నగా ఉండేది. రాజధానిగా కర్నూలు, హై కోర్ట్ గుంటూరులో పెట్టుకొని ప్లానింగ్ అవి చేసుకొని సర్దుకునే సమయంలో మరల నైజాంఆంధ్ర వచ్చి ఆంధ్ర రాష్ట్రంల్లో విలీనం అవ్వడము జరిగింది. ఆ సమయంలో పేరుకు లోటులో ఉండటము సహజమే

      • 1888 కి నిజాం సంస్థానం పరిస్థితి దిగజారిపోయింది. దాంతో భారత ప్రభుత్వము రెండు కోట్ల రూపాయులు హైదరాబాద్ కి అప్పు ఇచ్చి కష్టాల నుండి బయట పదవేసిందని రికార్డులు తెలుపుతున్నాయి. అప్పటి భారత ప్రభుత్వంలో తీరాంధ్ర భాగమేనని వారు కట్టిన పన్నులుండేవనేది గమనార్హం. 1905 -06 నుంచి 1955 -56 వరకూ యాభై సంవత్సరాలను నిశితంగా పరిశీలిస్తే అనేక సంవత్సరాలలో రెవిన్యూలోటు తో హైదరాబాద్ సంస్థానం లేదా రాష్ట్రం ఉండేది. రైల్వేలు,  ఇంకంటాక్స్ అనేకం ఒక సంస్థానం గాబట్టి హైదరాబాద్ ఎకౌంటులో 1948  సెప్టెంబర్ వరకూ ఉండేవి గాన కొన్ని నిధులు ఎక్కువ ఉన్నట్లు కనపడుతుంది. అదే ఆంధ్ర ప్రాంతం లో భారత ప్రభుత్వానికి ఆ పన్నులు అన్ని డైరెక్ట్ గా వెళ్ళిపోవడం మూలంగా అది కనపడదు. అంతేతప్ప లోటులో  ఉన్నట్లు కాదు. హైదరాబాద్ రెవిన్యూ ఆదాయంలో మద్యం అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం 25 -30 % వరకూ ఉండేది.ఆంధ్రలో మధ్య నిషేధం ఉండేది

        •  1956 లో హైదరాబాద్ రాష్ట్ర ప్లాన్ను పరిశీలిస్తే కొంత లోటులో ఉన్దేదనేది చాలామందికి తెలియక పోవచ్చు. 1956 -57 నాటికి అఖండ హైదరాబాద్ రాష్ట్రము కూడా 7 .315 % (2 .21 కోట్ల రూపాయలు) లోటు లో ఉండేది. ఆంధ్ర రాష్ట్రం లో లోటు 2 .42 కోట్లు(ప్లాను ప్రకారం) . అయినా ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1 న మద్రాస్ నుంచి విడి ప్రత్యెక రాష్ట్రముగా అంతకు ముందే అవతరించి కుదురుకొనే సమయంలో ఉంది. ఆంధ్ర రాష్ట్ర 1955 -56  బడ్జెట్ ప్రకారం కొన్ని వివరాలు: 18 ,౦౦౦ ప్రాథమిక పాఠశాలలు, 600 ప్రాథమికోన్నత పాఠశాలలు, 78  ట్రైనింగ్ స్కూల్స్ ఉన్నాయి. మూడు కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పరిచారు.ఆహార ధాన్యాల ఉత్పత్తి 44 .60 లక్షల టన్నులు ఉంటే చాలా పక్కన ఉన్న హైదరాబాద్కు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చెయ్యడం జరిగింది.స్టేట్ ఫైనాన్సియల్ కార్పోరేషన్ కోట్లాది నిధులతో ఉండేది. భారీగా నిధులు జామిందారి భూములకు compensation ఇవ్వాల్సి వచ్చింది.కోట్లాది రూపాయులు సాగునీటి కోసం ఖర్చు పెట్టింది(నాగార్జున సాగర్ కు కేటాయించిన 1 .80  కోట్లు కాక) . 

            • అదే రెవిన్యూ( 1955 -56 ) వివరాలు చూదాం . 1955 -56లో అభివృద్ధికి హైదరాబాద్ అవిభక్త రాష్ట్రంలో ఖర్చు 12 .66 కోట్ల రూపాయులు కాగా ఆంధ్రలో అది 16 .50 కోట్లు. తలసరి పెట్టిన ఖర్చు హైదరాబాద్ రాష్ట్రంలో 6 .8 కాగా ఆంధ్రలో 9 .27 రూపాయలు    

            రెండవ భాగానికి ఆధారం: చలసాని శ్రీనివాస్ రచించిన 'జై ఆంధ్ర జై తెలంగాణా' పుస్తకము. పుస్తకంలో అన్ని వివరాలు రెఫెరెన్సుల సహా ఇవ్వడం జరిగింది.

            27 కామెంట్‌లు:

            1. Nice brother. Looking for this article only. Actually I have a plan to commemorate these points from pre-nizam times to 90's era. This would give a complete picture right from who we are and how we were exploited, looted and how we became one again in the name uni-culture and language based state.

              రిప్లయితొలగించండి
            2. తెలంగాణా సాధ్యం కాదు అంటారు. మీరు తెలంగాణాకి వ్యతిరేకంగా ఇంతలా అరిచి ఘీ పెడితే తెలంగాణా సాధ్యం కాబట్టే అరుస్తున్నారు అని అనుమానం వస్తుంది. సాధ్యం కాదు అనేది నిజమైతే ఈ కబుర్లన్నీ అవసరమా? ఆచరణ సాధ్యం కాని డిమాండ్లు చేసేవాళ్ళని చూసి భయపడడం ఎందుకు? నేను తెలంగాణాకి అనుకూలంగా http://telanganasolidarity.in వెబ్‌సైట్ ఎందుకు పెట్టానంటే రేపు కెసి‌ఆర్‌కి గవర్నర్ పదవి వస్తుందంటే టి‌ఆర్‌ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చెయ్యడని గ్యారంటీ లేదు, అప్పుడైనా తెలంగాణా ఉద్యమం సజీవంగా ఉండాలి కాబట్టి. కానీ మీ సంగతి ఏమిటి? తెలంగాణా ఏర్పాటు అసాధ్యమని చెపుతూనే తెలంగాణా నిజంగా వస్తుందని భయపడుతున్నట్టు తెలంగాణా సాధ్యం కాదని నమ్మించడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నారు.

              రిప్లయితొలగించండి
            3. ప్రవీణ్ శర్మ, మీరు ఇలాగే కంటిన్యూ అయిపోండి. మీరు పెట్టిన వెబ్సైటు చూసాను. తాలిబంస్ కి కూడా సంఘీభావ సైట్ పెట్టుకోండి. మనలని పెట్టి ఎవడూ సినిమా తియ్యక పోతే మనది మనమే తీసుకోవడం గొప్ప విషయం. మీలో నాకు ఆ స్ఫూర్తి, అచంచల విశ్వాసం కనిపిస్తున్నాయి. మీరు మమ్మల్ని ఎలా అయినా తిట్టుకోండి. మాకు ఏమీ అభ్యంతరం లేదు. నేను నిన్న చెప్పినట్టు మీరు మీ ఇంట్లో వుపయోగించే బాష ఇదే నేమో అని మేము అనుకోవడానికి ఆస్కారం కల్పించాకండి.

              రిప్లయితొలగించండి
            4. మరొకటి, కేంద్ర ప్రభుత్వం వారు తెలంగాణా ఇస్తే వెళ్లి సంచి లో పెట్టి తెచ్చుకోండి. మేము ఆపం.

              కాకుంటే వేర్పాటు వాదుల అబద్ధాలను చకి రేవు పెట్టవలిసిన భాద్యత మా మీద వుంది.

              రిప్లయితొలగించండి
            5. మీ వేర్పాటు వాదులకు చెప్పండి.

              నిన్న ప్రణబ్ దా చెప్పినది విన్న తరువాత, తెలంగాణా వస్తుంది అనుకునే వారికి, ప్రపంచ ఆపార ఆశావాది అనే బిరుదు ఇవ్వబడుతుంది అని.

              రిప్లయితొలగించండి
            6. Praveensharma gaaru, nenu meeku loose anukovlaa leda sontha prachaaraaniki tahalaadutunna vyakti gaa choodamantaara? Endukandi pratee postlo tala doorchi artham pardam leni vaagudu vaagutaaru? mee site ki AD maro chota vesukondi.Emiti mee baadha?Prajalu eppatiki abbadaalalo jeevinchalalani undaa. vaaru mosapoyi saati vaari pai dwesham penchukunte meekem orugutundi?

              రిప్లయితొలగించండి
            7. విద్వేషం అంటే ఏమిటో తెలంగాణావాదుల కంటే సమైక్యవాదులకే బాగా తెలుసు కదా. "హైదరాబాద్ లేకపోతే ఆంధ్రాకి మిగిలేది గెంజి అన్నం, అంబలి" అని కొందరు సమైక్యవాదులు పాడుతోంటే ఒక సమైక్యవాద చానెల్ వాళ్ళకి నిస్సిగ్గుగా పబ్లిసిటీ ఇచ్చంది. సొంత ప్రాంతం అభివృద్ధి చెందకపోయినా ఫర్వాలేదు, హైదరాబాద్ అభివృద్ధిని చూసి సంతృప్తి పడదాం అనే అడుక్కుతినేవాళ్ళ భావనని బలంగా విశ్వసించేవాళ్ళు ప్రేమా-విద్వేషాల గురించి మాట్లాడుతున్నారు. హైదరాబాద్ కోసం తెలంగాణా మీద ద్వేషం పెట్టుకోండిరా అని ప్రచారం చేస్తున్నవాళ్ళకి పబ్లిసిటీ ఇవ్వడం తప్పు అని ఒక్క సోకాల్డ్ సమైక్యవాదికి కూడా అనిపించలేదు.

              రిప్లయితొలగించండి
            8. Ayyipoyindaa? tondaraga muginchi velli potaarani ashistunnanu.

              Maaku Telangana vaadulapai etuvanti vidhwesham ledu. Telangaanaa vadulu samaikyavaadulu kaakoodadu ani merekkadaina neroopinchaaraa?Unte naaku kaasta pampiyyandi. Raavinaaraayana Reddy Telanganavaadi kaadaa leka Samaikyavaadi kaadaa?

              రిప్లయితొలగించండి
            9. ప్రవీణ్ శర్మా, హైదరబాద్ అమెరికా లో లేదు. అది ఆంధ్ర ప్రదేశ్ రాజధాని. హైదరాబాద్ అభివృద్ధి ప్రతి ఆంధ్రుడికి గర్వకారణం. మద్రాస అభివృద్ధి ప్రతి తమిలుడికి గర్వకారణం అయినట్టే. ఢిల్లీ లో ని మెట్రో రైల్ ప్రతి భారతీయుడికి గర్వకారణం అయినట్టు.

              బహుసా మీ మానసిక స్థితి కొంచెం బాగున్నట్టు లేదు.అంతకు మించి నేను ఏమీ చెప్పలేను.

              రిప్లయితొలగించండి
            10. అయ్యా ముందుగానే ద్వేషభావం, ఆత్మ న్యూనత.
              దాని పై పండు గాడు (ప్రణబ్) కొట్టిన దెబ్బకి మతి పూర్తిగా పోయి ఉన్నట్టున్నది.
              కాబట్టి ప్రవీణ్ శర్మ గారిని అలా వదిలివేయడమే మంచిది.

              రోగులను, పిచ్చివాళ్ళను తిట్టడం పాపం కూడాను.

              రిప్లయితొలగించండి
            11. చా, నిజమా? ఢిల్లీ మెట్రో రైల్‌తో ఎంత మందికి ఉపయోగం? ఢిల్లీలో మెట్రో రైల్ ఉందని నాకు ఎవరో చెపితేనే తెలిసింది. ఒక నగరాన్ని మాత్రమే అభివృద్ధి చేసి ఆ నగర అభివృద్ధిని చూసి కోట్ల మందిని సంతృప్తి పడమంటే పడరు. బస్తర్ అడవులలోకి వెళ్ళి అక్కడి గిరిజనులని అడగండి, ఢిల్లీ మెట్రో అంటే ఏమిటో ఒక్క ముక్కైనా చెప్పలేడు.

              రిప్లయితొలగించండి
            12. ప్రవీణ్ శర్మ గారూ, తాత మీసాలకు అవ్వ మోకాలికి ముడి పెట్టడం ఎక్కడ నేర్చుకున్నారండి బాబూ. బస్తర్ అడవులలో గిరిజనులా, మీరు కూడా చూసి వుండనివి వారు చాలా చూసారు. వెళ్లి దంతెవాడ, బీజాపూర్, రాజనందగావు, బస్తర్ అడవులలోకి వెళ్లి అడగండి.

              రిప్లయితొలగించండి
            13. అయ్యా ప్రవీణ్ బాబు, ఈ మధ్య ఇందుగలడందు లేడని ఎక్కడ చూసినా నువ్వే. నీలాంటి వాళ్ళు ఒక పదిమంది జాలంలోనూ వందమంది బయటానూ బయలుదేరితే తెలంగాణా ఏర్పాటు మాటేమో గానీ ఒకమోస్తరుగా తల పనిచేసే జనాలు మాత్రం అన్నీ అడవుల్లోకి పారిపోవడం ఖాయం.

              రిప్లయితొలగించండి
            14. నాకు పెద్ద చరిత్రే ఉందిలే. 1983 నుంచి 2008 వరకు Maoist Internationalist Movement అనే ఒక నెట్వర్క్ ఉండేదిలే. వాళ్ళు నాకు 2004లో ఆన్లైన్‌లో పరిచయమయ్యారు. వాళ్ళలో ఎక్కువ మంది నల్ల జాతి & హిస్పానిక్ తరగతులకి చెందిన అమెరికన్లు. వాళ్ళు 1994లో ఒక వెబ్‌సైట్ పెట్టి దాని ద్వారా కొందరు కెనడియన్లు, భారతీయులు & ఆస్ట్రేలియన్లని కూడా కలుపుకున్నారు. అలా నేను వాళ్ళకి 2004లో దొరికాను. 2007లో నాకు ఆ సంస్థతో అభిప్రాయ భేదాలు ఏర్పడి వాళ్ళ నుంచి బయటకి వచ్చి సొంత వెబ్‌సైట్ ఒకటి పెట్టుకున్నాను. అప్పట్లో పరిచయమైన మండవ స్వప్న & టిమోతీ కెర్స్వెల్‌లు నాతో ఇప్పటికీ టచ్‌లో ఉన్నారు. వాళ్ళతో కలిసి ఇప్పటికీ నెట్వర్క్ కొనసాగిస్తున్నాను. వాళ్ళ ద్వారా నాకు middle eastకి చెందిన చాలా మంది పరిచయమయ్యారు. అలా నా నెట్వర్క్ తిరిగి పెరిగింది. ఇప్పుడు నేను ఉన్నది middle east solidarity networksలోనే. నేను తెలంగాణావాదం వైపు వచ్చింది 2009 డిసెంబర్‌లోనే. తెలంగాణావాదంలో నేను మందార ప్రభాకర్ అనే బ్లాగర్ ద్వారా ప్రభావితమయ్యాను. తెలంగాణావాదం లేకపోతే నా రెడ్ నెట్వర్క్ నాకు ఉంటుంది. ఇదేమీ నాకు priority issue కాదు. కానీ తెలంగాణా నుంచి నాకు వచ్చిన ఫోన్ కాల్స్ ద్వారా తెలంగాణాలోనూ నా అభిమానులు ఉన్నారని తెలిసింది. In this condition, I cannot desert my solidarity to Telangana movement.

              రిప్లయితొలగించండి
            15. Ippudu mottam sangati artham ayyindi meedi aa problem ani. I express my solidarity with you. But you can surely desert us.We'll not mind:)

              రిప్లయితొలగించండి
            16. నిజమే, మీతో నాకు పని లేదు. నా రెడ్ నెట్వర్క్స్ నాకు ఉన్నాయని ఎలాగూ చెప్పాను కదా.

              రిప్లయితొలగించండి
            17. రెడ్ నెట్ వర్క్స్ వున్నాయి అని పెద్దగా చెప్పకండి, అసలే రోజులు బాగా లేవు,

              రిప్లయితొలగించండి
            18. రెడ్ నెట్వర్క్స్ అంటే ఎర్రగురివింద నెట్‌వర్క్స్ లిమిటెడ్ అనుకుంటారనుకున్నా, ఎర్రగడ్డ నెట్‌వర్క్స్ అని మీకెలా తెలిసిపోయింది?! :P :))

              రిప్లయితొలగించండి
            19. 1956 కి ముందు ఆంధ్ర-తెలంగాణ బడ్జెట్ మిగులు,తగులు గొడవ చూసాను..మీరు గమనించవలసినవి..
              1) ఇక్కడ చర్చ ప్రధానంగా 1956 నాటికి ఆంధ్ర-తెలంగాణ బడ్జెట్ మిగులు,తగులు గూర్చి..3rd five year plan 1968 తెలంగాణ స్థితి గూర్చి భార్గవ కమిటీ ఏమి చెప్పింది కాదు..మళ్ళీ చెప్తున్నా 1956 నాటికి ఆంధ్ర-తెలంగాణ బడ్జెట్ మిగులు గూర్చి..మీకు వీలైతే 1955 తెలంగాణ బడ్జెట్ in hyd state assembly మీకు అందుబాటులో ఉంటే అందులో hyd state మొత్తంలో తెలంగాణ ప్రాంత(అప్పటికి 8 జిల్లాల తెలంగాణ అది)బడ్జెట్ మిగులు గా అప్పటి hyd state ఆర్థిక మంత్రి చూపించారని నిరూపించండి..నేను 1957 జులై 7 న వచ్చిన ఆంధ్రప్రదేశ్ తొలి బడ్జెట్ లో కొంత భాగాన్నికింద చూపించాను.1957 పూర్తి బడ్జెట్ పాఠం మీరు చూడాలనుకొంటే క్లిక్ చేయండి http://budget.ap.gov.in/.

              Revenue Deficits
              8. Revenue Deficits:-let me now conclude my introductory remarks and begin the story of our finances. Our revenue deficits since 1954-55 are as follows


              Rs. Crores
              year Andhra Telangana Total
              1954-55 5.18 0.51 5.69
              1955-56 5.29 1.70 6.99
              1956-57 2.43 2.25 4.68
              1957-58 2.43 3.05 5.48
              పైన 1956-57,1957-58 పక్కన R.E(revised estimates) అని ఉండాలి కాని text adjust కావడం లేదని తీసేసాను.పూర్తి బడ్జెట్ పాఠం మీరు చూడాలనుకొంటే క్లిక్ చేయండి http://budget.ap.gov.in

              ఇంకా ఇందులోనే
              Telengana.--Till recently, as we all know, Telengana formed part of the composite Hyderabad State and its accounts were not being maintained separately. It is, therefore, a little difficult to analyse the growth of revenue and expenditure of Telengana during the last few years. In order to have a rough idea, however, it can be assumed that Telangana's share in the revenue, expenditure, etc., of the composite Hyderabad State amounted to about 60%. On this basis the figures would work out some what as follows:-

              (Rs. In crores)
              Year Revenue Expenditure Deficit
              1954-55 16.50 17.01 0.51
              1955-56 16.88 18.58 1.70
              1956-57 19.08 21.33 2.25
              1957-58 20.93 23.98 3.05

              కాబట్టి తెవాదులు వాదించినట్టు కలిసేనాటికి తెలంగాణ బడ్జెట్ మిగులు లేదని 0.51 లోటు ఉందని స్పష్టమైంది.
              2) నేను తెవాదులు వాదన అబద్ధం అని నిరూపించడానికి ప్రయత్నం చేసాను కాని నిజానికి ఈ బడ్జెట్ మిగులు అనే వాదనే సరైనది కాదు.నిజానికి అభివృద్ది చెందిన దేశాలెన్నో deficit financing ని కావాలనే అవలంబిస్తాయి.ఇది ఒక ఆర్థిక వ్యూహం..1929 మహా ఆర్థిక మాంద్యం తరువాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నేర్చుకొన్న పాఠాలలో deficit financing ఒకటి.John Maynard Keynes వంటి గొప్ప ఆర్థికవేత్తలు 1929 మహా ఆర్థిక మాంద్యం తరవాత deficit financing యొక్క అవసరాన్నిప్రంపంచ దేశాలకు తెలియచెప్పారు.అప్పటినుండి చాలా దేశాలు (ఇప్పుడు దాదాపు అన్ని దేశాలు)అవలంబిస్తున్నాయి కూడా.అంతెందుకు 2010 లో USA budget deficit $1.17 trillion dollors.USA GDP లో అది దాదాపు 10శాతం.budget surplus చూపించడం పెద్ద విషయమేమీ కాదు.కొన్ని అప్రాధన్య రంగాలకు బడ్జెట్ కేటాయింపులు తరువాతి సంIIలకి వాయిదా వేసేస్తే సరి(ఉదా:చంద్రయాన్-I కి బడ్జెట్ కేటాయింపు సంక్షేమ పాలన కు సంబంధించింది కాదు.అంతరిక్ష పరిశోధన,ప్రజా పరిపాలనకు సంబంధించి అప్రాధన్య రంగం)కొన్నిప్రాధాన్యరంగాలు కూడా అంత అత్యవసరం కానప్పుడు కూడా వాయిదా వేయొచ్చు.ఉదా:(golden quadrilateral road to join major cities in India)..లోటు బడ్జెట్ అనేది ఒక ఆర్థికవ్యూహం అని గుర్తుంచుకోండి.మీకింకా అనుమానం ఉంటే మీ దగ్గరలోని ఏదైనా university ఆర్థికశాస్ర్త ఆచార్లులకు Keynesian economics మరీ ముఖ్యంగా 1929 gtreat depression గూర్చి Keynesian economics ఏం చెప్పింది.దాన్ని ప్రపంచ దేశాలు ఎంతవరకు ఆమోదించాయో వివరించమనండి.ఒకవేళ నిజంగా hyd state కి 1956 నాటికి బడ్జెట్ మిగులు ఉంటే రాష్ట్ర సంక్షేమానికి అప్పటి hyd CM అయిన బూర్గుల సరైన ఆర్థిక విధానాన్ని అవలంబించలేదని అర్థం.

              రిప్లయితొలగించండి
            20. What is decided in 1968 is about the surplus funds diverted about 10 years back and that's why after Bhargava Committee the Union Government has decided to make amends for the delays also and hence closed the entire matter by releasing 45 crores as lumpsum.
              If surplus was not there, why the very first paragraph of the Gentlemen's Agreement should mention about the utilization of any such surplus for development of Telangana itself?
              This matter was discussed threadbare in the Telangana Regional Committee then in existence, which appealed to the Chief Minister about differences in the surplus showed by different agencies and the Chief Minister accepted in 1968 the amount of Rs. 30 crores or so suggested by them. There were differences in the figures Lalith citing some, Bhargava committee computing something else, etc. but none doubted that there were surpluses and they were diverted. So why are u unnecessarily worried? If you want to build up an alternative argument that all this is mere hullabaloo, there were never any Telangana surpluses which were diverted and all this was unjust, fraudulent and mala fide fabrication of Telanganites or separatists, then go, study the various reports of the TRC on finance matters and also relevant material and place your arguments cogently. But please mind that none before you - there are stalwart economists both in Andhra and Telangana - dared to contradict the fact of surpluses and also their diversion. They only differed on the amount and cause for such.

              రిప్లయితొలగించండి
            21. The Telangana surpluses diverted or not spent in Telangana region spread from 1956-68 and the problem was finally settled and CLOSED with the Government of India fixing Rs. 45 crores (including compensatory amounts for delays in spending) and releasing that as loan grant to the Govt. of AP in 1970 and after that generally there have not been any Telangana surpluses since more than due proportion of funds were spent for the development of TELANGANA region. Also the revenue in Andhra region vastly improved with what the lifting of prohibition and other developmental activities coming to fruition, etc.
              For those interested in further study, I have posted the excellent paper on TELANGANA SURPLUSES by Sri B.P.R. Vithal on my blog: http://Telugujativedika.blogspot.com and they may peruse it there.

              రిప్లయితొలగించండి
            22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

              రిప్లయితొలగించండి
            23. శర్మ గారు..అన్సర్ మీ దగ్గరే ఉంది కదండి..ఇక్కడ మీరు చాలా దూరంగా ఏదో ఆలోచించేస్తున్నారు..అవకాశమిస్తే ఒక్కసారి ఈ అర్గ్యుమెంట్ మొత్తాన్ని నేను రిపీట్ చేస్తాను వివరంగా..వినండి..
              ..1956 నవంబర్ 1 న ఆంధ్ర మరియు అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో జనాభాలోను,భూబాగంలోనూ దాదాపు సగంగా ఉన్న తెలంగాణ ప్రాంతం కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడ్డాయి.ఇంతవరకూ ఒకే కదా.ఇప్పుడు తెవాదుల వాదన ఏంటంటే "అలా 1956 నవంబర్ 1 కలిసేనాటికి తెలంగాణ మిగులు బడ్జెట్ తో ఉంది".(అంటే సుసంపన్నమైన ప్రాంతమని వాళ్ళ ఉద్దేశ్యం.లోటు బడ్జెట్ ని ఎందుకు అవలంబిస్తారో ముందు పోస్ట్ లో వివరించాను).సరే పోనీ వాళ్ళ వాదన నిజమా కాదా తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.ఇది నిజమా కాదా తెలుసుకోవడానికి మనకున్న అవకాశం ఒకే ఒక్కటి.ఏంటంటే 1955 మార్చి నాటి అప్పటి హైదరాబాద్ రాష్ట్ర బడ్జెట్.అందులో కూడా పూర్తి హైదరాబాద్ రాష్ట్ర బడ్జెట్ లెక్కలు ఉంటాయి కాని ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంత ఆదాయం మరియు ఖర్చు మనకు లభించవు.కాబట్టి 1955 హైదరాబాద్ రాష్ట్ర బడ్జెట్ మనకు లభించినా అందులో తెలంగాణ లెక్కలు ప్రత్యేకంగా లభించే అవకాశం లేదు..కాని 1956 నవంబర్ 1 న కలిసిన తర్వాత ప్రవేశపెట్టబడిన తొలి బడ్జెట్ (1957 july 7)లో అప్పటి ఆంధ్రప్రదేశ్ తొలి ఆర్థిక మంత్రి తెలంగాణ లెక్కలు ప్రత్యేకంగా ఖచ్చితంగా దొరకడంలేదు అంటూనే వీలైనంత వరకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని బడ్జెట్ ప్రసంగంలో తెలియజేసే ప్రయత్నం చేసారు.ఆ ప్రయత్నంలో భాగం గానే తెలంగాణ రెవెన్యూ లోటు ఆంధ్రప్రదేశ్ ఏర్పడేనాటికి 0.51 అని ఆ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు..అదే నేను ముందు పోస్ట్ లో వివరించాను.

              ఇక bhargava నివేదిక గూర్చి..శర్మగారు.చాలా క్లియర్ గా ఆ కమిటీ terms of reference లో ఉంది కదా సార్..
              a)examine the varying estimates made of such surpluses during the period 1st November,1956 to 31st March,1968 and of the unspent portion of such surpluses and also any representations made against these estimates; and
              b) determine the sum which ought to have been spent on the development of Telangana Region in accordance with the agreements but remained unspent on the 31st March,1968.
              ఇంత క్లియర్ గా ఉంది కదా."
              a)1st November,1956 నుండి 31st March,1968 మధ్య,తెలంగాణ ప్రాంత మిగులు యొక్క అంచనాలను మరియు అలాంటి మిగులు ఖర్చు పెట్టకపోతే(unspent) దాని అంచనాలు.
              b) అలాగే తెలంగాణ అభివృద్ది కోసం ఒప్పందాలకు లోబడి ఈ మిగులు ఖర్చు పెట్టారా లేదా.అలా ఖర్చు పెట్టగా ఇంకా ఏమైనా మిగిలిందా? "..
              మీరు కనుక్కోవాల్సింది ఇది అని భారత ప్రభుత్వం Vashista Bhargava గారిని ఆదేశించింది...అంతే గాని 1956 నవంబర్ 1 కి ముందు తెలంగాణ ప్రాంత మిగులును గూర్చి కాదుకదా.వాళ్ళు రిపోర్ట్ లో కూడా 1st November,1956 నుండి 31st March,1968 కాలానికి తెలంగాణ ప్రాంత మిగులు లెక్కలే ఇచ్చారు. 1956 నవంబర్ 1 కి ముందు తెలంగాణ ప్రాంత మిగులును గూర్చి ఆ రిపోర్ట్ లో లేదని నా ఉద్దేశ్యం.పోనీ ఆ రిపోర్ట్ లో అలా ఎక్కడైనా ఉంటే నేనే పొరబడ్డాననుకొంటాను.
              To see the actual report given by Vashista Bhargava on Telagana surpluses clik this link

              http://books.google.com/books?id=mISVwxcF5asC&ots=knn_jTsLVn&pg=PA175#v=onepage&q&f=false

              రిప్లయితొలగించండి
            24. @I.M.Sharma garu
              "లోటు బడ్జెట్ అనేది ఒక ఆర్థిక వ్యూహం.మిగులు ఉన్నంత మాత్రాన సుసంపన్న రాష్ట్రం/దేశమని కాదు..లోటు ఉన్నంత మాత్రాన పేద రాష్ట్రం/దేశమని కాదు." అనే నా వాదన కి ఏమైనా స్పందించదలచుకొంటే స్పందించగలరని మనవి.

              రిప్లయితొలగించండి
            25. Well said, Truth Teller. Interesting!

              "What the U.S. Federal Budget Deficit Is:
              The budget deficit is when the government spends more than it receives in revenue. In FY 2011 the deficit is projected to be $1.26 trillion, the difference between $3.83 trillion in spending and $2.57 trillion in revenue. Although this deficit huge, it is less than the $1.6 trillion deficit in FY 2010, and the $1.4 trillion deficit in FY 2009. (Source: OMB Table S-1)"
              http://useconomy.about.com/od/fiscalpolicy/p/deficit.htm

              If so called Telangana intellectuals argue that Telangana was better in 1956 than present US.... :D :))) leave them to Musi river.

              రిప్లయితొలగించండి
            26. @I.M .Sharma garu

              చదివాను http://telugujativedika.blogspot.com/ లో ఆ vitthal report and bhargava report మొత్తం చదివాను..నా వరకైతే ఈ రెండు రిపోర్ట్ ల లోనూ ఎక్కడా 1956 కి ముందు తెలంగాణ మిగులు బడ్జెట్ తో ఉంది అని కనిపించలేదు..ఈ రిపోర్ట్ ల గొడవ అంతా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక 1968 వరకు తెలంగాణ ప్రాంత మిగులు gentleman agreement ప్రకారం ఖర్చు చేయలేదని TRC అభ్యంతరాలు చెప్పడం దానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ సమాధానాలు,వివరణలు మాత్రమే కనిపిస్తున్నాయి..కాని ఎక్కడా పొరపాటున కూడా 1956 కి ముందు తెలంగాణ మిగులు బడ్జెట్ గూర్చి లేదు.

              మీరు కూడా deviate అయిపోకుండా" 1956 కి ముందు తెలంగాణ మిగులు బడ్జెట్ తో ఉంది " అని నిరూపించే ప్రయత్నం చేయగలరని మనవి.

              రిప్లయితొలగించండి
            27. @I.M.Sharma
              /If surplus was not there, why the very first paragraph of the Gentlemen's Agreement should mention about the utilization of any such surplus for development of Telangana itself? /
              నిజమే Gentlemen's Agreement లో ఈ షరతు ఉంది కాని అది రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ ప్రాంత మిగులు గూర్చి కాదు.."రాష్ట్రం ఏర్పడ్డాక భవిష్యత్తులో తెలంగాణ ప్రాంతంలో ఏమైనా మిగులు ఏర్పడితే దాన్ని తెలంగాణ అభివృద్ధికి మాత్రమే వినియోగించాలి"అని దానర్థం.ఇది నిజానికి తెలంగాణ కు దీర్ఘకాలు ప్రయోజనాల కోసం ఉద్దేశించినది.కేవలం 1956 Nov 1 నాటికి తెలంగాణ మిగులును ఆ ప్రాంతంలో ఖర్చు పెట్టి చేతులు దులుపుకోండి అని కాదు.అసలు అప్పటి తెలంగాణ ఆర్థిక పరిస్థితి గూర్చి వాస్తవ లెక్కలు లేవు కాబట్టి ఆ ఒక్క సంవత్సరం దీన్ని పట్టించుకోలేదు కూడా..ఇకనుండి అంటే ఆంధ్రప్రదేశ్ తో కలిసినప్పటి నుండి ఏమైనా మిగులు ఏర్పడితే దాని గూర్చి ఈ షరతు.ఈ షరతు అమలు కోసమే కదా Telangana Regional Council ఏర్పాటు చేసారు...సార్ శర్మ గారు..మీరు చెప్తున్నవి ఏమీ నేను ఖండించడం లేదు...కాని మీరు చెప్పేవన్నీ 1956 తరవాత విషయాలు
              .కాని ఈ బ్లాగులో ప్రస్తుతానికి మేం చర్చిస్తోంది ఏంటంటే..తెవాదులు "రాష్ట్రం ఏర్పడేనాటికి 1956 Nov 1 నాటికి మాది మిగులు తో ఉన్న గొప్ప సుసంపన్నమైన రాష్ట్రం మీది లోటు బడ్జెట్ తో ఉన్న పేద రాష్ట్రం.కాని కలిసిన తర్వాత మేం వెనకబడిపోయాం" అని వాదిస్తున్నారు..అది అబద్ధం అని నిరూపించే ప్రయత్నమే ఈ చర్చ.
              ..కాని మీ పోస్ట్ లలో వేరే చర్చ కనిపిస్తుంది.మీరు deviate అయిపోతూ 1956 to 1968 కి సంబంధించిన నివేదకల్ని ఉదహరిస్తున్నారు...అసలు అది వేరే చర్చ కదా..

              రిప్లయితొలగించండి