1, నవంబర్ 2011, మంగళవారం

రాష్ట్రావతరణ దినోత్సవాన విశాలాంధ్ర మహాసభచే స్వాతంత్య్రసమరయోధులకు సన్మానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవంనాడు  'విశాలాంధ్ర మహాసభ' ఆధ్వర్యంలో తెలుగు తల్లి పాదాలచెంత జరిగిన  కార్యక్రమం విజయవంతమయ్యింది. ఈ సందర్భంగా విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు స్వాతంత్య్రసమరయోధులను సన్మానించారు.సచివాలయం చెంతనున్న 'మన తెలుగు తల్లి' విగ్రహానికి పూలమాలలు అర్పించిన సమరయోధులు, రాష్ట్రంలో కొనసాగుతున్న వేర్పాటువాద ధోరణులను ఖండించి తెలుగువారందరూ ఐక్యంగా ఉండాలని అభిలాషించారు. 

వయస్సు పై బడి ఆరోగ్యం సహకరించకపోయినా మా కోరికను మన్నించి కార్యక్రమానికి విచ్చేసిన దేశభక్తులకు పేరు పేరునా మా వందనాలు.సన్మానింపబడిన వారు -
శ్రీ నర్రా మాధవరావు
శ్రీమతి సుగుణమ్మ 
శ్రీ కే.ఎస్.మెహబూబ్ 
శ్రీ అల్లాడి నాగన్న 
శ్రీ పి. రామస్వామి  
-విశాలాంధ్ర మహాసభ 



సూర్య దినపత్రిక: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేం దుకు సర్వ శక్తులూ ఒడ్డుతామని, అన్ని శక్తులను సమీకరిస్తామని విశాలాంధ్ర మహాసభ నేత పరకాల ప్రభాకర్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరగాలని ఆందోళనలు చేస్తున్న వారు అసత్య ప్రచా రాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రావతరణ సందర్భంగా మంగళవారం ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసేందుకు మరికొందరు విశాలాంధ్ర నేతలతో కలసి వచ్చిన పరకాలను కొందరు తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉన్న పోలీసులు తెలంగాణ వాదులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించటంతో స్వల్ప ఉద్రిక్త వాతా వరణం ఏర్పడింది. తెలంగాణ వాదులు వెళ్ళిపోయిన అనంతరం విశాలాంధ్ర మహాసభ నేతలు తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆ తర్వాత కొందరు స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించారు.

భావ ప్రకటన స్వేచ్ఛ లేదా?
తెలంగాణ వాదులు తమపట్ల వ్యవహరించిన తీరుపై ఆ తర్వాత పరకాల అసంతృప్తి వ్యక్తం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని, దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించటం దారుణం అన్నారు. తెలంగాణ వాదులు తమ వాదాన్ని వినిపిస్తు న్నట్టే తాము సమైక్య వాదాన్ని వినిపిస్తున్నామన్నారు. రాష్ట్ర విభనపై తెలంగాణ వాదులు చెబుతున్న మాట లు, చూపిస్తున్న ఆధారాలలో వాస్తవం లేదని, సమైక్యం గా ఉంచాలన్న వాదనతో కూడిన ఆధారాలు తమ వద్ద సైతం ఉన్నాయని పరకాల స్పష్టం చేశారు.


My Telugu Roots : Visalandhra Mahasabha, on November 1st 2011, felicitated freedom fighters at the Telugu Thalli statue near Secretariat. Freedom fighters have put garlands at Telugu Thalli’s feet. They were later felicitated by the representatives of Visalandhra Mahasabha. Five freedom fighters have participated in the event. All of them are from the Nizam Telangana region. They have unequivocally and vociferously spoke against the division of our state. Andhra Pradesh Freedom Fighter’s Association President Sri Narra Madhav Rao was felicitated by former DGP Sri Anjaneya Reddy, Smt. Sugunamma by Dr. Parakala Prabhakar, Sri K.S. Mehabub by Sri Chegonti Ramajogaiah, Sri Alladi Naganna by Sri Sunkara Venkateswara Rao, and Sri P. Ramaswamy by Sri Kumar Chowdhary Yadav.
Speaking at the event, Sri Narra Madhav Rao garu recollected his memories from his time fighting the Razakars. He said he and his fellow fighters have made enormous sacrifices during their lifetime. He said that he is saddened and outraged with the way politicians are ruining Telugu unity that has been won over after a long-fought battle. He ridiculed the separatist politicians as little kids who were not even born when they were fighting for Telugu unity. He said that the politicians know nothing about what Telugu people had endured prior to 1956.
Smt. Sugunamma said she is a proud native of udhyamala gadda Nalgonda. She recollected her battles with Razakars and how she was a gun-toting fighter in those days. Though she had a bit of difficulty in walking, her energy kept her going. Her energy was a source of inspiration to people around her. She urged the media to take her message of Telugu unity to the people of our State.
Sri K.S. Mehbub spoke eloquently about Visalandhralo Prajarajyam. He said politicians are running amok with our state. He said there are many daunting social issues that need to be tackled including corruption, caste discrimination, and income inequality, unfortunately our leaders have taken up the ill-conceived separatist movement. He expressed anguish at the way hatred being spread among people of different regions.
Freedom fighters, despite their old age, gave loud slogans non-stop for nearly five minutes- “Varthillali Varthillai, Visalandhra Varthillali”, “Jai Samaikyandhra, Jai Jai Samaikyandhra”. It was an unforgettable moment.
We are grateful to our venerable freedom fighters for their uncompromising belief in Telugu unity. They are our inspiration and Visalandhra Mahasabha will continue to fight to ensure that their sacrifices don’t go in vain.
Save Andhra Pradesh!
Nalamotu Chakravarthy


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి