26, నవంబర్ 2011, శనివారం

వాదన కాని వాదం పలాయనవాదం

విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులతో చర్చకు సిద్ధం అని బహిరంగ లేఖ రాసిన TNF మనసు మార్చుకున్నట్లుంది. వారి లేఖకు విశాలాంధ్రమహాసభ తరపున పరకాల ప్రభాకర్ గారు బదులు ఇచ్చిన సంగతి విదితమే ( http://visalandhra.blogspot.com/2011/11/blog-post_22.html ) ఇప్పుడేమో వారు విశాలాంధ్రను కోరుకొనే వాళ్ళు తెలంగాణాలో ఎవరు ఉన్నారో చూపమని అభ్యంతరకరమైన పదజాలంతో ప్రభాకర్ గారి  పేస్ బుక్ వాల్ పై ఒక ప్రత్యుత్తరాన్ని  పోస్ట్ చేసారు. దానిని  చదివిన తర్వాత అసలు వారికి  ఏ విధమైన నిర్మాణాత్మకమైన చర్చలోనూ పాల్గొనే ఉద్దేశంలేదని అనిపిస్తుంది. మీరే చదివి చూడండి

మీ అభినందలకు, మా ప్రతి అభివందనాలు..

సమైక్య వాదం అన్ని ప్రాంతాలలోనూ వున్నది అని చెప్పి, తెలంగాణా ప్రాంతం వాళ్ళు కూడా సమైక్యంద్ర కోరుకుంటున్నారు అని చెప్పడంలో, మీ అర్థం ఏంటి, మీ అభిప్రాయాలను రుద్దే ప్రయత్నమే కదా..?

సమైక్యాంధ్ర కోరుకునే వాళ్ళు తెలంగాణా లో వున్నారు అనేది పచ్చి అబద్ధమే అని మేము భావిస్తున్నాం, ఇంత వరకు మేము చూడలేదు, వినలేదు. దానికి మీ దగ్గర ఆధారాలు, వెక్తుల పేర్లు వుంటే బయట పెట్టండి. తెలంగాణా ప్రాంత ప్రజల్లో సమైక్యంద్ర వాదులంటే, మీ తెలుగు రూట్స్ చక్రవర్తి గురించేనా మీరు మాట్లడేది, ముందు వాడి రూట్స్ ఎక్కడివో చెప్పమనండి. సమైక్య వాదం అన్ని ప్రాంతాల్లో వుంది అని, మా తెలంగాణా ప్రజలని మబ్బే పెట్టడం కోసమే కదా మీరు ఈలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు.

సమైక్యంద్ర వాదులు అన్ని ప్రాంతాల్లో వున్నారో లేదో మీరే నిరూపించాలి, కాని విభజన వాదులు ఆంధ్ర లో, తెలంగాణా లో వున్నారు అని మీరు గ్రహించాలి, అది మా సొంత అభిప్రాయం కాదు, ఆంధ్ర జే.ఏ.సి. చేసిన ఇటివల చేసిన వాక్యలు, మద్దతు చుడండి “రాష్ట్ర విభజన ప్రజాస్వామ్య ఆకాంక్ష”. ఆంధ్ర జే.ఏ.సి. వారికి మా తెలంగాణా ప్రాంత ప్రజల నుండి కృతజ్ఞతలు.

మా మట్టుకు అయితే రాష్ట్ర విభజన అనేది ఆత్మ గౌరవ పోరాటం., మా ఉనికి కోసం పోరాటం, మా స్వపరిపాలన కోసం పోరాటం.

సమైక్యంద్ర పాలనలో మేము గ్రహించింది ఏమిటి అంటే, మీలాంటి ఆంధ్ర మేధావులతో, ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి, చెప్పి , ఆ అబద్ధాన్ని నిజం చేసి, తెలంగాణా ప్రజల మీద రుద్దే తత్వం ఎప్పటి నుండో అనుసరిస్తున్న పాత సూత్రం.

దానికి నిదర్శనం మీ రాతలు చూస్తే అర్థం కూడా అయ్యింది, విశాలాంద్ర వాదాలు, 1956 లో, 1969 లో, మరియు 1972 లో విన పడ్డాయి అని.. ఇప్పుడు 2011 లో కూడా వినిపిస్తున్నాయి (మీతో).. 1972 జై ఆంధ్ర ఉద్యమం ప్రత్యేక వాదమని అని గుర్తించాలి, మీరు సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేసిన, ప్రత్యేక వాదం కోసం ఉద్యమం చేసిన మా తెలంగాణా రాష్ట్ర సాధనకు అడ్డ పుల్ల వేసేందుకే అని గత చరిత్ర చెప్పుతుంది.. బిన్న అభిప్రాయాలూ ఆంధ్ర ప్రాంతం లో వున్నాయి అని గ్రహించండి. అంతెందుకు ఇదువరకు మీకున్న అభిప్రాయాలకు, ఇప్పటి అభిప్రాయాల్లో తేడా వుందో లేదో గ్రహించాలి, సొంత ఇంట్లో ఎకబిప్రాయం తెచ్చుకోండి, విభజన వాదమా? విశాలాంద్ర వాదమా? మా తెలంగాణా ప్రాంతలో అప్పటికి ఇప్పటికి ఒకటే మాట, ఒకే బాట.. తెలంగాణా రాష్ట్ర సాధన. ఇట్లాంటి అబద్ధాలను చెప్పి నమ్మిచ్చే ప్రయత్నాలు మానుకోవాలి.

సమైక్యంద్ర బ్రోకర్లు ఇంతకు మించి చెప్పేది ఏముంది, రాష్ట్రం సమైక్యంగా వుండాలి, తెలంగాణాను ఇంతకు ఇంత దోచుకోవాలి, ఇక్కడ వున్న వరనులను, నీళ్ళను, ఉద్యోగ అవకాశాల మీద దోపిడీకి అలవాటు పడ్డ ప్రానమాయే ,ఇప్పటికి ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే మా బతుకులు ఏమయిపోవాలి, తెలంగాణా బంగారు బాతును ఎందుకు వదలాలి?ఇక్కడ వనరులను, విద్య , ఉద్యోగ అవకాశాలను కొల్ల గొట్టడమే కదా సమైక్యాంధ్ర ఏకైక అజెండా, మీ వ్యాపారాలకు, మీ పెట్టుబడుల లావా దేవిలకే కదా మీకు ఈ తెలంగాణా ప్రజలు, వాళ్ళకున్న వనరులు.

ఇదంతా సుత్తి అనసవరం, మీ అజెండా మీకుంది , మా అజెండా మాకు వుంది, పాయింట్ కి వద్దాం, “మీరు అన్నట్టు విశాలాంద్ర కోరుకునే వారు తెలంగాణా లోను వున్నారు”.. ఆ తెలంగాణా వాసులేవ్వరో బయటికి రమ్మనండి, వాళ్ళ రూట్స్ ఎక్కడివో చెప్పమను, జనం లోకి రమ్మను, అంతెందుకు నేటిజేన్స్ ముందుకు రమ్మనండి… విశాలాంద్ర కు జై కొట్టే తెలంగాణా ప్రాంతం వాళ్ళ ఉనికిని నిరుపించుకోమనండి.

జై తెలంగాణా
తెలంగాణా నేటిజేన్స్ ఫోరం
TNF – Telangana Netizens Forum

8 కామెంట్‌లు:

  1. Letterheadలో చిరునామా లేదు, వెబ్ సైటు కూడా placeholder. ముందు అనుమానం వచ్చినట్టే ఈ "సంస్థ" మిథ్యే అని తోస్తుంది. మనకు పబ్లిసిటీ వచ్చింది కదా, అదే పది వేలు.

    రిప్లయితొలగించండి
  2. ఈ వేర్పాటువాదులు ఒక దాని తర్వాత వేరొక వాదన క్రమేపీ ఓడిపోతూ వస్తూ ఉంటే వీళ్ళు ఏదో ఒక రకంగా తమ వాదనని నిరూపించుకోవాలనే తపన దిన దినానికి తగ్గుతూ వస్తోంది. వీరికి ఎవరైనా జై ఆంధ్రా ఉద్యమ కారులు కనిపిస్తే వీళ్ళకి ఎడారిలో ఒయాసిస్సులా ఉంటోంది. ఒక వేళ మనం తెలంగాణా లో అందరూ విభజనవాదులు కారు కొంతమంది సమైక్యవాదులూ ఉన్నారంటే వీరికి రోషం ఆత్మాభిమానం పొడుచుకొని వచ్చి వాళ్ళు ఎవరో చూపమంటూ దుర్భాషలాడడంలో నిష్ణాతులు. ఆ చీపిన వాళ్లెవరో చూపించు చూస్తాను అని బెదిరింపులకు దిగి తమ బెదిరింపులతో సమైక్య వాదుల నోరు నోక్కే ప్రయత్నం చేస్తారు.

    రిప్లయితొలగించండి
  3. TNF పేరు పెట్టుకున్న "చచ్చినాళ్ళు" తమ నిజస్వరూపం చూపించారు :)

    రిప్లయితొలగించండి
  4. "ముందు అనుమానం వచ్చినట్టే ఈ "సంస్థ" మిథ్యే అని తోస్తుంది. మనకు పబ్లిసిటీ వచ్చింది కదా, అదే పది వేలు."

    మీ ఉద్దేశం ఏమైనా గాని బాగా చెప్పారు ! మరి వేర్పాటువాద ఉద్యమాన్ని ఇంతకాలం రోడ్లపై సకల జనుల పేరిట నడిపి నానా హంగామా సృష్టించింది ఎవరనుకున్నారు?అనంత కోటి జాక్ సభ్యులు పబ్లిసిటీ (లేదా కలక్షన్స్) లేకపోతే రోడ్ల పై ఎందుకు ఎందుకువస్తారండి? http://www.etelangana.org/Tg_Netizens%20Jac.asp

    రిప్లయితొలగించండి
  5. "TNF, TN-JAC ఒకటేనా?"

    ఎవడు చూడొచ్చాడు?మనోళ్ళకు ప్రొద్దస్తమానం రోడ్లేక్కడమే పని. తెలిసిన మొహాలేమైన ఉన్నాయేమో చూసుకోండి http://missiontelangana.com/?p=3202

    రిప్లయితొలగించండి
  6. @Chaitanya: "ఎవడు చూడొచ్చాడు"

    You made the allegation, so you prove it. You can ask the guy who got the letterhead printed, web site registered & created the correspondence. (Hint: highly educated, he now runs a communications company)

    రిప్లయితొలగించండి
  7. What allegation? You are not talking any sense here.

    "You can ask the guy who got the letterhead printed, web site registered & created the correspondence. (Hint: highly educated, he now runs a communications company)"

    I care a damn about TNF or someother unworthy JAC. They contacted one VMS member and that is the only reason we are talking about them.

    రిప్లయితొలగించండి