3, నవంబర్ 2011, గురువారం

వర్క్‌షాప్‌నకు జూబ్లీహాల్ ఇవ్వాలని ఆదేశించండి : విశాలాంధ్ర మహాసభ

వర్క్‌షాప్‌నకు జూబ్లీహాల్ ఇవ్వాలని ఆదేశించండి: మీడియా వర్క్‌షాప్ నిర్వహణకు జూబ్లీహాల్‌ను కేటాయించేలా సర్కారును ఆదేశించాలని కోరుతూ విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు ఎన్.చక్రవర్తి హైకోర్టును కోరారు. ఈ నెల 22, 23 తేదీల్లో జూబ్లీహాల్లో మీడియా వర్క్‌షాప్, ఎగ్జిబిషన్‌ను నిర్వహించాలని నిర్ణయించి, ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని, అయితే అధికారులు అనుమతి నిరాకరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. నవంబర్ 5, 6 తేదీల్లో మీడియా వర్క్‌షాప్, ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నామని అందుకు జూబ్లీహాల్‌ను కేటాయించేలా సర్కారును ఆదేశించాలని కోర్టును కోరారు.
 'విశాలాంధ్ర' పిటిషన్‌పై విచారణ వాయిదా : హైదరాబాద్, నవంబర్ 2 : విశాలాంధ్ర మహాసభ 5, 6 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన రెండు రోజుల మీడియా వర్క్‌షాపు సందిగ్ధంలో పడింది. ఈ వర్క్‌షాపు నిర్వహణకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో,నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిని విచారించిన హైకోర్టు, ప్రభుత్వ వివరణ కోరింది. బక్రీదు పండుగ ఉందని, గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని బందోబస్తు కోసం పోలీసు బలగాలను భారీగా కేంద్రీకరించాల్సి వస్తోందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో విశాలాంధ్ర మహాసభ తరఫున దాఖలైన పిటిషన్ విచారణ నవంబర్ 8కి వాయిదా పడింది.
 

2 కామెంట్‌లు:

  1. విశాలాంద్ర మహాసభ లేదా సమైక్యంద్ర జే.ఏ.సి అంటే అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు ,సమన్వయ కర్తలు ఉండాలి కాని ఒక ప్రాంతం నుంచి మాత్రమే ఉంటె అది సమైక్యం అని ఎలా అంటారు ఆలోచించండి ఒకసారి ,మీ సోదరుడు మీతో కలిసి ఉండనని అంటదు మీరు కలిసి ఉండమంటారు అప్పుడు అతను ఎలా ఒప్పుకుంటాడు.ఆలోచించండి ..........మారండి...........
    జై తెలంగాణా...జై జై తెలంగాణా

    రిప్లయితొలగించండి
  2. మీకు తెలియనప్పుడు ఎందుకు మాట్లాడతారు? విశాలాంధ్ర మహాసభ లోని అన్ని ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు

    రిప్లయితొలగించండి