29, నవంబర్ 2011, మంగళవారం

ప్రత్యేక తెలంగాణ నినాదం ఆత్మహత్యా సదృశమైనది : జే.వీ.నర్సింగరావు(15.08.1969)

ఈ మధ్యకాలంలో వేర్పాటువాదులు తమ అబద్ధాల విషపత్రికలో, వారి మద్దతుదారులు కొంతమంది అంతర్జాలంలో చరిత్రను తిరగ రాసేస్తున్నారు. ఈ క్రమంలో 1956 లో  సీమాంధ్ర నాయకులు తెలంగాణ జిల్లాలను బలవంతంగా ఆంధ్ర రాష్ట్రంలో కలిపివేసుకొన్నారు అనే కథ ప్రచారం చేస్తున్నారు. పనిలోపని గా నవంబర్ ఒకటిని విద్రోహ దినంగా పాటించాలని సకల జనులకు హుకం జారీ చేసారు. అయితే పాపం వీరి పిలుపుకి అటుకుడివైపు భాజపా నుండిగాని  ఇటుఎడమ వైపు సీపీఐ-ఎంఎల్ నుంచి గాని, తెరాస మినహా ప్రధాన రాజకీయ పక్షాల నుండి అంత స్పందన రాలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న సీపీఐ-ఎంఎల్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయితే తాము నవంబర్ ఒకటిని విద్రోహ దినంగా పాటించమని , తెలుగు ప్రజలంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని 1956లో వ్యక్తమైన ఆకాంక్షను విద్రోహంగా చూడడం చారిత్రక తప్పిదమవుతుందని బహిరంగంగానే ప్రకటించారు.

ఇప్పటికే ఈ బ్లాగ్లో వేర్పాటువాదుల చెప్పే అనేక అబద్ధాలను ఎండగట్టడం జరిగింది. వేర్పాటువాదులు తమ వాదనకు సాక్షాలుగా ప్రచారం చేసుకొనే వాటిలో 1955 లో హైదరాబాద్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉండిన శ్రీ జే.వీ.నర్సింగరావు చేసిన వ్యాఖ్యలు ముఖ్యమైనవి. ఇండియన్ ఎక్ప్రెస్ లో వచ్చిన ఈ న్యూస్ రిపోర్ట్ లో ఆయన కాంగ్రెస్ అధినాయకత్వం విశాలాంధ్రను బలవంతంగా ఎవరిపైనా రుద్దదనీ , తనకు రక్షణలపై (Safeguards for Telangana) నమ్మకం లేదనీ, హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ విశాలాంధ్ర ఏర్పాటుకు అనుకూలంగా వ్యక్తం చేసిన అభిప్రాయానికి తెలంగాణ ప్రజల మద్దతు లేదనీ, తొంభై శాతం ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారనీ సెలవిచ్చారు. అయితే ఆయన లెక్కలకు ఆధారాలు మాత్రం చూపలేదు.ప్రజలు ఎన్నుకొన్న శాసనసభ సభ్యులు విశాలాంధ్ర విషయంపై ఎన్నికలలో పోటీ చేయలేదు కాబట్టి వారి అభిప్రాయాలు చెల్లవని కూడా సెలవిచ్చారు.

అదలా ఉంచితే, పాపం మన నవయుగ వేర్పాటువాదులకు జే.వీ.నర్సింగరావు గారు తదనంతర కాలంలో వేర్పాటువాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలియదు. తెలిసినా దానిని బహిరంగ పరచరు.జే.వీ.నర్సింగరావు వ్యాఖ్యలను వేదవాక్కులుగా భావించే వారు ఈ క్రిందివాక్కులను కూడా బాగా అరిగించుకొంటారని ఆశిస్తున్నాను. 

మొదటగా 1969 ఏప్రిల్ 20 న హైదరాబాద్ గాంధీభవన్ లో జరిగిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్టీ సమావేశంలో చేసిన ప్రసంగంలో ఆయన శ్రీ పీ.వీ.నరసింహారావు తో పోటాపోటీగా సమైక్యవాదాన్ని సమర్ధించి ప్రత్యేక రాష్ట్రవాదానికి స్వస్తి చెప్పాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేసారు.

ఆంధ్ర జనత, ఏప్రిల్ 21,1969


అదే సంవత్సరం స్వాతంత్య్రదినోత్సవాన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి హోదాలో అనేక పత్రికలకు విడుదల చేసిన సందేశంలో ప్రత్యేక తెలంగాణ నినాదం  ఆత్మహత్యా సదృశమైనదిగా పేర్కొన్నారు.త్వరలో ఆయన పూర్తి సందేశ పాఠాన్ని బ్లాగ్లో పోస్ట్ చేస్తాం.

ఆంధ్రజనత, ఆగష్టు 15,1969


3 కామెంట్‌లు:

  1. ఇంత కంటే ఋజువు ఏం కావాలి?ముల్కీయేతరులు చాలా తక్కువ మంది ఉద్యోగులే అని ఎన్ని ఉదాహరణలు చెప్పినా తె-వాదులకి తలకెక్కడం లేదు. ఆ కొద్ది శాతం కూడా రాష్ట్ర ఏర్పాటు కొత్తలో.ప్రస్తుతం ఆంధ్ర వాళ్ళు ఎవరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెంపర్లాడడం లేదు.అందుచేత తెలంగాణ ఉద్యోగస్తుల్లో 99.5% ప్రస్తుతం తెలంగాణ వాసులే!

    రిప్లయితొలగించండి
  2. ప్రభుత్వం తరఫు నుంచి ప్రతి తెలంగాణ జిల్లాలొ ఎంతమంది తెలంగాణేతరులు ఉన్నారో పక్కా లెక్క తీసి వార్తా పత్రికలలలో ప్రచురించే వరకు ఈ కాకి లెక్కల గోల తప్పదు.

    రిప్లయితొలగించండి