నేను మొదట రాసిన ఉత్తరము కు మన మానవ హక్కుల వారు వెంటనే స్పందిస్తారని ఏమి ఆశించలేదు. ఎందుకంటే వారు కసాయి కర్కోటకులకు మాత్రమే మనవ హక్కులు వున్నాయని గుర్తించి వారి తరపున పోరాడి పోరాడి మన మానవ హక్కుల వారి హృదయాలు కూడా కొంచెము ఖఠినమైన మాట వాస్తవము. ఆ మధ్య ఒక మిత్రుడు నమస్తే పోలవరము లో వంట “చెరకు” ను కాపాడుకోవాలి అన్నట్లుగా వ్యాసము రాసినట్లు గుర్తు. అదే వ్యాసము లో పెనము వేడి ఎక్కింది అని రొట్టె ముక్క కోసము ప్రజలు ఎదురు చూస్తున్నారు అని కూడా రాయటము జరిగింది. మా మిత్రుడు కి తెలియనిది కాదు రొట్టె ముక్క పోలవరము రూపం లో వచ్చింది అని, కానీ అదే గోడ పత్రిక లో అలా రాస్తే బాగుండదు అని అనుకున్నాడేమో, వంట “చెరకు” పైన బాగా ద్రుష్టి పెట్టినట్లుంది.
ఈ వంట “చెరకు” ఉద్యమము పేరు చెప్పి రహదారి మీద వచ్చే పోయే వాహనాల మీద రాళ్ళు వేస్తాడు, ఎవ్వరిని ఎమైన అంటాడు ఎందుకంటే మన మానవ హక్కుల వారు తప్పకుండ కాపాడతారని తెల్సు కదా, మరి చదువుకున్నది వైద్య వృత్తి కదా ఆ మాత్రము తెలియకుండ వుంటుంది అని అనుకోను. ఈ “చెరకు” ఆంధ్ర వారి మీద మాత్రమే దాడి చెయ్యలేదు చివరికి ఖమ్మం జిల్లా నుండి వస్తున్న ప్రజల పైన కూడా దాడి చేసాడు. ఒక తల్లి తన మనుమరాలిని స్కూల్ లో చేర్పించుట కొరకు ఖమ్మం నుండి కారు లో వస్తుంటే వారి మీద దాడి చేస్తాడు. ఉద్యమము ముసుగు లో ఏదైనా చెయ్యవచ్చు కదా అందులో ఎలాగైన మన జేబు సంస్థ లు మానవ హక్కుల వారు ఉన్నారన్న విషయము “చెరకు” కు బాగానే తెల్సు కదా. అదే “చెరకు” కూతురి పెళ్లి కి మాత్రము కరుణించాలి అని కన్విన్సు చేయ్యబోతారు మన హక్కుల సోదరులు. కానీ, మనుమరాలి చదువు కోసము ఎక్కడి రెజిస్త్రేషనో తెలియక ఏదో కారును అద్దెకి తీసుకుని వస్తున్నందులకు వారి పైన ఏ మాత్రము జాలి చూపించనవసరము లేదని వారి చేతులు కాళ్ళు విరగ్గోట్టాల్సిందే అని అంటుంటే చూస్తూ ఊరుకుంటారు మన మానవ హక్కుల పేరు చెప్పుకునే వాళ్ళు. మన టీవీ లు ఏమో కొన్ని విషాద గీతాలు ఆయన మొఖము ను దగ్గిర గా చూపిస్తూ “చెరకు” మనసు ఎంత తియ్యనో, కూతురి పెండ్లి కోసము ఎంత విషాదాన్ని అనుబవిస్తున్నాడో అని పాడతారు. వైద్య వృత్తి చేస్తూ ప్రజలు గాయపడితే కట్లు కట్టాల్సిన వ్యక్తి అదే ప్రజల కాళ్ళు చేతులు విరగ్గోడతా వుంటే చూస్తూ ఉండాల్సిందే అని కూడా మన హక్కుల సోదరులు సెలవిస్తున్నారు
ఈ ప్రజాస్వామ్య వనము లో మనము వర్షాల కోసమో, వంట “చెరకు” కోసమో చెట్ల ను కాపాడుకోవాల్సిందే కానీ కలుపు చెట్టు కూడా వంట “చెరకు” అని పోజులు కొడుతుంటే ఈ కలుపు మొక్క ను తీసి మంచి మొక్క వెయ్యాల్సిందే అన్న విషయము వ్యవసాయ ఆదారిత దేశము లో జీవిస్తున్న మనకు తెలియంది కాదు. అయినా సరే నేను మన మానవ హక్కుల వారు చెప్పే మాటలే నమ్ముతాను కాబట్టి తప్పకుండ అది వంట చెరకు అయినా కలుపు మొక్క అయినా కాపాడుకోవాల్సిందే ఎందుకంటే ఆ కలుపు మొక్క మనకు తెలియకుండా ఎదైనా వైద్యానికి వ్యాది మందుగా పనికి వస్తుందేమో పరిశోధన చెయ్యాలి కదా అందుకని మన రక్షణ వ్యవస్థ ఆ పనిలో వుందని అనుకుంటున్నాను.
పైన చెప్పిన వంట “చెరకు” కే మానవ హక్కులు వున్నప్పుడు లండన్ స్కూల్ అఫ్ ఎకానామిక్స్ లో PhD చేసిన Dr పరకాల కు మాత్రము హక్కులు లేవు అని అంటున్నారు. ప్రతి పౌరుడు ను రక్షించుకోవాలి అని చట్టము చెప్తుంది కాబట్టి పేపర్ల లోనో , నమస్తే పోలవరము ల లాంటి గోడ పత్రికల ల లోనో వ్యాసాల లో రాయించుకునే “చెరకు” లాంటి వారితో పాటు అందరి హక్కులు కాపాడుకోటానికి మన మానవ హక్కుల వారు ఇప్పటికైన కృషి చేస్తారని ఆశిస్తాను. బావ ప్రకటన స్వేఛ్చ కొరకు ఎటువంటి ఆటంకాలు కలగకుండ మన హక్కుల సోదరులు పాటు పడాలి అని ప్రాధేయ పడుతున్నాను. ఇప్పటికైన మన మానవ హక్కుల హృదయాలు కరుగుతాయో లేక కలుపు మొక్క లను మాత్రమే కాపాడాలని చెప్తారో వారి ఆలోచన కే వదిలేద్దాము.
మనము ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడకుండా అశ్వథామ హతా హత: అనుకుంటూ వుంటే రేపు తెలంగాణా లో కాని ఆంధ్ర ప్రదేశ్ లో కాని ఏర్పడే రాజ్యాలు మన మానవ హక్కులని కాపాడి మనల్ని అందలము ఎక్కించి సింహాసనము పైన కూర్చొండబెడతారు అనుకోటము అంత అవివివేకము ఇంకొకటి లేదు అని చెప్పదలచుకున్నాను. ఈ రోజున మమత దీది ని చూస్తూనే వున్నాము అన్న సంగతి తెలియంది కాదు అలాగే మన చెన్నారెడ్డి, రాజ శేఖర్ రెడ్డి ప్రబుత్వాల లో కూడా మనకు బాగానే అవగతమైంది కదా. అలాగే జలగం వెంగల రావు గారి ప్రబుత్వం లో జరిగిన ఘోరాలు మనసున్న మానవుడు ఎవ్వరు మర్చిపోరు అనే అనుకుంటున్నాను. ఇప్పటికైన మన మానవ హక్కుల సోదరులు మేల్కొని సమాజము లోని ప్రతి పౌరుని మానవ హక్కులను కాపాడటానికి కృషి చేస్తారని కోరుకుంటున్నాను.
నేను ఇంతవరకు, అంటే ఇలాంటి దాడులు చెయ్యకముందు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని పాఠకులకు విజ్ఞప్తి. నేను మన ప్రాంతీయ వాడిని కాబట్టి నాకు కొద్దో గొప్పో ప్రేమ ఈ ఉద్యమము మీద వుండేది అని చెప్పటానికి ఏ మాత్రము సందేహించను. కానీ, నేను మానవ హక్కుల ను హరించి వేసి ఎవరి మీదనో దండయాత్ర చేసి ఏదో సాదిద్దాము అన్న సిద్దాంతానికి వ్యతిరేకము అని మరి ఒక్కసారి తెలియ చేసుకుంటున్నాను. మానవ హక్కుల విఘాతము గురించి మాత్రమే మాట్లాడుతున్నాను కాబట్టి ఆ కోణము లో మాత్రమే విజ్ఞులు అర్ధము చేసుకుని మానవ హక్కులకి భంగము కలగకుండా Dr పరకాల హక్కులని కాపాడవలసిందిగా మరొక్కసారి నా మిత్రులని కోరుకుంటున్నాను.
Vemsani Ramana
Portsmouth, Ohio,
USA
రమణ గారూ, చెరుకు సుధాకర్ గారు దాడులు స్వయంగా చేసినట్టు కానీ తన వారితో చేయించనట్టు కానీ ఆధారాలు ఉన్నాయా? ప్రభాకర్ గారిని కొంతమంది అడ్డుకున్నందుకు వీటితో సంబంధం లేని సుధాకర్ గారిని PD కింద వారల తరపడి బంధించడం న్యాయమేనా?
రిప్లయితొలగించండిప్రభాకర్ తనపై జరిగాయని చెప్పుకుంటున్న "దాడుల" గురించి HRC లేదా PUCL వారికి ఫిర్యాదు చేయొచ్చు కదా.