21, జులై 2011, గురువారం

శవ రాజకీయాలకు అడ్డువచ్చినందుకు ఏపీ భవన్ ఉద్యోగిపై చేయికున్న హరీష్ రావు




'కొట్టండిరా వాడిని' అంటూ రాష్ట్ర అసెంబ్లీ లో జేపీని కేసిఆర్ కుమారుడు కొట్టించిన విషయం మరవకుండానే ఇప్పుడు వారి మేనల్లుడు దేశ రాజధాని లో తెలుగు వాళ్ళ పరువు మంట గలిపాడు. ఉద్యమమంటూ అమాయకులను మభ్యపెడుతూ నాయకులుగా చలామణి అయిపోతున్న వీళ్ళు నిజానికి దేనికి యోగ్యులు? 

తెరాస రౌడీ మూకలు,నాయకులు అక్కడకు చేరుకున్నారని భయపడిన అధికారులు తమ భాద్యతను సక్రమంగా నిర్వహించారు.హరీష్ రావు అంతగా రెచ్చి పోవడానికి ఆ లేఖలో ఏముంది?

"తెలంగాణ ఉద్యమ మద్దతుదారుడు యాదిరెడ్డి మృతదేహాన్ని క్రిమిటోరియంకు తీసుకెళ్లకుండా ఏపీ భవన్‌కు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని మా దృష్టికి వచ్చింది. పెద్ద సంఖ్యలో తెలంగాణ మద్దతుదారులు, జేఎన్‌యూ విద్యార్థులు మృతదేహంతో ఏపీ భవన్ ముందు ధర్నా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి భవన్ ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా శవాన్ని భవన్‌కు కాకుండా క్రిమిటోరియంకు తీసుకెళ్లేలా చూడండి.అలాగే, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తక్షణం ఏపీ భవన్‌కు భద్రత పెంచండి''ఆంధ్రజ్యోతి ( జూలై 22)

6 కామెంట్‌లు:

  1. ఒక కాంట్రాక్టు డ్రైవర్ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడిపోతాయని నమ్మేడంటే అది తెరాస నాయకులు చెప్పే మాయ మాటలు చేసే మోసపూరిత వాగ్దానాల పాపమే ( ఉచిత భూమి , ఉచిత విద్య , లక్షలాది ఉద్యోగాలు, హైదరాబాద్ లో సీమాంధ్రులు ఖాళీ చేసిన ఉద్యోగాలు ఏమేమి నమ్మబలికారురా నాయన ).ఒక ప్రాణాన్ని తీసుకొని వారి కుటుంబానికి అన్యాయం చేసింది తెరాస ప్రబుద్ధులే. ఆ ప్రబుద్ధుల ఆటలు ఏళ్ళ పాటు నిరాటంకంగా సాగడానికి దోహద పడిన ప్రభుత్వాలది తప్పే

    రిప్లయితొలగించండి
  2. ఏదోలే ఆవేశంలో చేయి జారాడు, కావాలంటే ఇంకో 10మార్లు సారీ చెబుతాడు, మనకేం సిగ్గా లజ్జా! రాద్ధాంతం చేయకున్రి. ఉద్యమంలో మద్యం ఎక్కువైనప్పుడు ఇలాంటివి జరగడం మామూలే, ఏదో అడ్జస్ట్ అయిపోవాల.
    610GO/14F కింద తెలంగాణా నాయకులకు అట్రాసిటీ కేసుల్లో మినహాయింపులేవీ లేవా? :P

    పాపం ముసలివానిపై ప్రతాపం చూపేబదులు పయ్యావులతో పెట్టుకునివుంటే .. ఇన్స్టంట్ న్యాయం జరిగేది. :D

    రిప్లయితొలగించండి
  3. http://www.rediff.com/news/report/fir-registered-against-trs-mla-harish-rao/20110721.htm

    ఇది జరగాల్సిందే. హైదరాబాద్లో లాగా ధర్నాలు చేసి రౌడీలపై కేసులు ఎత్తివేయడం ఢిల్లీ లో కుదురుతుందంటారా?

    రిప్లయితొలగించండి
  4. ellanti varini vadilipedithe repu ettuvanti harish rao lu velakoladi putukostharu kabati ittuvanti varini asallu elections lo poti ki anumathinchakudadu anumathishe asalu politics pina virakhi chenduthundi.............

    రిప్లయితొలగించండి
  5. ఢిల్లీ పోలీసులతో కష్టమే, ఏ రాత్రో వచ్చి వీళ్ళని ఢిల్లీ పోలీసులు ఎగేసుకెళతారు.

    ఏమాట కామాటే చెప్పుకోవాలి ... తిహార్ జైల్లో రాజా, కనిమొళి, కల్మాడి,.. వీళ్ళ సాంగత్యముతో ... కోట్లు, వందకోట్లు, వేలకోట్లు ... అబ్బ! ఆ ముసలాయన్ని తన్ని గారెలబుట్టలో పడబోతున్నారనుకోవాలి. :P :))

    రిప్లయితొలగించండి
  6. ఈ దేశంలో ఉరేసుకొని చచ్చిన వెధవలకి అభిమాన సంఘాలు ఉంటాయి. హరీష్ రావు ఉరేసుకొని చచ్చినాడి శవాన్ని తేవడానికి వెళ్లాడ? లేక అక్కడి ఉద్యోగులని అందునా దళిత అధికారిని కొట్టడానికి వెళ్ళడా? అలా కొట్టడాన్నే కండకావరం, ఒళ్ళు తీటా అంటారు నాయనలారా. కోపం వస్తే కొట్టడమే పని గా పెట్టుకొన్న మహా నేత మన తహరా గారు. ఆయన మేనమామగారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావుగారు 1956 నాటి తెలంగాణా అడిగారు. అది ఎ విధంగా ఉంటుందో వారి మేనల్లుడు, వెలమ దొరవారు శ్రీ తన్నేరు హరీషరావు గారు తెలంగాణా మరియూ అఖిల భారత ప్రజలకూ కనుల విందుగా తమ వీర ప్రతాపాన్ని, రాణీ రుద్రమ లాగా రుచి చూపించి ప్రజలను తరింపజేశారు.

    రిప్లయితొలగించండి