21, జులై 2011, గురువారం

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌కు మరో షాక్‌...

సూర్య  దినపత్రిక : గత ఆర్థిక సంవత్సరం రాష్ట్రంలో నెలకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 2010-11 పార్టనర్‌ షిప్‌ సమ్మిట్‌ చెన్నయ్‌కు తరిలిపోయింది. తాజాగా సెప్టెంబర్‌ 19,20 తేదీల్లో జరిగాల్సిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌ కూడా రద్దైంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని స్థానంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు, సీఐఐ సంయుక్తంగా 2012 పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ను నిర్వహించడానికి కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియచేసినట్లు సర్కార్‌ జారీచేసిన ఉత్తర్వులో పేర్కొన్నది.

ఇదిలా ఉండగా.. పరిశ్రమల అసోసియేషన్లు మాత్రం 2012 పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ షెడ్యూల్‌ ప్రకారం జరగకపోతే.. ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామికంగా కోలుకోలేని విధంగా నష్టపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌తో పోల్చుకుంటే.. 2012 పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ ద్వారా అదనపు ప్రయోజనాలుంటాయని, ఈ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌లో జాతీయ, అంతర్జాతీయ కంపెనీల సీఇఓలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని పారిశ్రామిక వేత్తలు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2012 జనవరిలో పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ పేరుతో అంతర్జాతీయ ఇన్వెస్టర్ల సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించాలని చురుగ్గా పావులు కదుపుతున్నట్లు తెలిసింది.

1 కామెంట్‌:

  1. మేం కడుపులు కాలిపోయి మంచి నీళ్ళతో కడుపులు నింపుకుని పడుకుంటున్నం...దొరగారయితే మందులో నీళ్ళు కలుపుకో డానికి గ్లాసు నీళ్ళు లేక రా తాగేస్తున్నాడు...అవన్నీ పట్టించుకోకుండా మీరు అభివృద్దీ సమ్మిట్ లూ అంటా ఉంటారా?నాలుగు కోట్ల ప్రజలు ఆకలి దప్పులతో పడుకునే దృశ్యం ఎవరయినా సృష్టించగలరా??మా నాయకులు సృష్టించగలరు..2011 లో కూడా ఎవడో ఎవడ్నొ దోచేస్తున్నాడంటే మీరు నమ్మ గలరా??మా నాయకులు నమ్మించగలరు..అసలు ప్రపంచమంతా భోగభాగ్యాలతో తులతూగి పోతూంది..మేమొక్కళ్ళమే దారిద్ర్యం లో ఉన్నాం అనిఎవరయినా ప్రపంచాన్ని ఎవరైనా నమ్మించగలరా??మా నాయకులు నమ్మించగలరు....ఎందుకంటే మా నాయకుల బ్రతుకు తెరువు రాజకీయాలే పదవులూ సంపాధనా అంతా రాజకీయల మీదే..లాగించాలి కాబట్టీ

    రిప్లయితొలగించండి