" మా దేహం ముక్కలైనా... రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వం. కేంద్రం లక్ష్యంగా ఆత్మాహుతి దాడులకు సైతం దిగుతాం.'' - పయ్యావుల కేశవ్, టీడీపీ ఎమ్మెల్యే
నిన్నటివరుకు కేశవ్ గారంటే ఎంతో అభిమానం ఉండేది. ఆయన సమైక్యవాదాన్ని ఎంతో సమర్ధంగా అనేక వేదికలపై (గుంటూరు వేదికతో సహా ) వినిపించారు. కాని ఒక్క సారి నోరుజారిన మూలంగా అదంతా మరుగునపడిపోనుంది.
ఎంత మీ పార్టీ అధ్యక్షులు అధికారం కోసం నక్కి నక్కి చూస్తూ ఇరుప్రాంతాల నాయకులను ఎగదోస్తే మాత్రం మీరు సొంతంగా వ్యవహరించలేరా?మొన్ననే వారు ఎన్నికలకు సిద్ధం కామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణా లో మీ పార్టీ నేతలు మొదలుపెట్టిన రాజీనామాస్త్రాలు, బస్సు యాత్రల గురించి మాట్లాడరే? కేంద్రం సమైక్యవాదనకు మొగ్గు చూపుతున్న వేళ మీ ప్రాంతంలో మీ ప్రత్యర్ధులు ముందుకు సాగిపోతున్నరనే కదా ఈ ఆత్రం? దయచేసి వేర్పాటువాదులకు,హింసను ప్రభోదించి నాలుకలను కోస్తాం, తిరిగానివ్వం, కాలుపెట్టనివ్వం అంటూ నోరుపరేసుకునే అనేకానేక పిట్టల దొరలకు మందుగుండు సరఫరా చేయకండి. క్లిష్టమైన ఈ సమయంలో స్వార్ధ చింతన అస్సలు తగదు.అధికార మదంతో ప్రత్యర్ధులు కలిసిరాకపోయినా మీరే ఒక అడుగు ముందుకు వేసి వారిని కలుపుకుపొండి . ఏ మూల దాక్కున్నారో మీ పార్టీ అధ్యక్షులవారిని బహిరంగ పరచి ఒక నిర్ణయాత్మకమైన పాత్రను పోషింపచేయండి.

:)) ఈ నోటి దూల, కచరా, దామోదర్ రెడ్డిల కన్నా మించిందేమీ కాదు. కాంగ్రెస్ డబల్ గేంకు దీటుగా చంద్రబాబు వైఖరి సరైనదే. సమైఖ్య నినాదాలిచ్చిన జగన్ కూడా మండమ తిప్పి చంద్రబాబు వైఖరిని పాటించడమే అందుకు తార్కాణం.
రిప్లయితొలగించండికానించు పయ్యావుల అన్నంతపని చేస్తే ఓ రాజకీయనాయకుడు షహీద్ అవుతాడు, అంతేగా.
meeru thalli palu pindi ammukune rakshasulu vishalandra ani virra veegadam kadhu delhi la kadhu telangana lo vachi sabalu pettandi mee gosulu vooduthai
రిప్లయితొలగించండిఈ రకమైన వ్యాఖ్యలు పరిస్థితి దిగజారుస్థాయి తప్ప ఏ మాత్రం ప్రయోజనం లేనివి.. తేదేపాలో నేను గౌరవించే అతి తక్కువమంది నాయకులలో కేశవ్ ఒకరు.. ఆయన నుంచీ ఇలాంటి బాధ్యతారహితమైన మాటలు వినాల్సివస్తుందని అనుకోలేదు.. రెండు వైపులా ఇలాంటి ఉద్వేగపూరిత వ్యాఖ్యలు మానుకోవాలి.. కేసీఆర్ & కో. ఇలా మాట్లాడే ఈ రోజు పరిస్థితి ఇంత విషమించింది.. ఢిల్లీ లో ఎవరో ఒకతను ఆత్మహత్య చేసుకున్నాడట.. చూద్దాం కేసీఆర్ అకౌంట్ లో ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలో..
రిప్లయితొలగించండి>>పయ్యావుల అన్నంతపని చేస్తే ఓ రాజకీయనాయకుడు షహీద్ అవుతాడు, అంతేగా.
అబ్బా! ఆశ దోశ అప్పడం వడ.. రాజకీయ నాయకులు మరీ అంత పిచ్చోళ్ళ లాగా కనిపిస్తున్నారా మీకు?? :D
kesav jee please withdraw yur statement..
రిప్లయితొలగించండి"meeru thalli palu pindi ammukune rakshasulu "
రిప్లయితొలగించండిలైన్ బావుంది. సింగిడి బూతు కవుల సంఘానికి పంపరాదు?
"vishalandra ani virra veegadam kadhu delhi la kadhu telangana lo vachi sabalu pettandi mee gosulu vooduthai"
అస్సలు భయం వేయడం లేదు.మీ నూతి లోని కప్పలకు తెలియకుండా బయట తెలంగాణా లోనే, రాజధాని నడిబొడ్డున కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. gosulu పట్టే పని మీది.సింగిడి వాళ్ళ ప్రచురణలు చదవలేదా? అక్కడ ఇంకా మంచి పదాలు దొరుకుతాయి. అయినా gosulu కట్టుకొని సభలు పెట్టుకోవడం ఏమిటి అసహ్యంగా?