12, జులై 2011, మంగళవారం

మానవ హక్కులా మజాకా!



తమ వాదనను అంగీకరించని వాళ్ళ ఇళ్ళ పై రాళ్ల దాడి చేయించడం, ఇంటి ముందు ధర్నాలకు దిగడం వేర్పాటువాదుల కుసంస్కారానికి నిదర్శనం.ఈనాడు పని లేని వాళ్ళందరూ మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయిస్తున్నారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించి, బందుల పేరుతో అరాచకం సృష్టించి,సామాన్యుడి నడ్డి విరిచి పబ్బం గడుపుకోవాలనుకొనే వీరు ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడడం హాస్యాస్పదం.
  
ఇప్పటికే OU లో ఎందుకు జాయిన్ అయ్యామా అని బాధపడుతున్న విద్యార్థులు వందలమంది ఉన్నారు. వారి రక్షణకు పూచి ఇస్తే ఎవరు ఏ విధంగా  బలవంత పెట్టి వారిని తమ బల ప్రదర్శనలకు తోలుకు పోతున్నారో చెబుతారు.వీరు చేసే విధ్వంసాలకు భయపడి ఆర్టీసి వారు బస్సు రూట్లు మారిస్తే నరక యాతన పడుతున్న పౌరులు వేల మంది ఉన్నారు. హైదరాబాద్ మహా నగరం లో విద్య పై శ్రద్ధ లేని వంద రెండువందల మంది విద్యార్థులు, రౌడీషీటర్ లను మించిపోయిన కొంతమంది లాయర్లు  తప్ప మానవులెవరూ లేరా వారికి హక్కులు లేవా?

1 కామెంట్‌: