30, జులై 2011, శనివారం

భౌతిక దాడులకు తెగబడతామని వేర్పాటువాదుల హెచ్చరిక!

ఆంధ్రజ్యోతి : తెలంగాణ విద్యార్థి జేఏసీ సమర శంఖం పూరించింది. సమ్మె సమయంలో విధులకు హాజరయ్యే సీమాంధ్ర ఉద్యోగులపై భౌతిక దాడులకు దిగుతామని హెచ్చరించింది. తెలంగాణ ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేసి ఉద్యమంలో భాగస్వాములు కాకుంటే.. రాళ్ల దాడులు తప్పవని పేర్కొంది. సకల జనుల సమ్మెను చివరి పోరాటంగా విద్యార్థి జేఏసీ అభివర్ణించింది. దీంతోనే తెలంగాణ సాధించుకోవాలని, త్యాగాలకు సిద్ధంగా ఉండాలని విద్యార్థులకు పిలుపునిచ్చింది. సకల జనుల సమ్మెను కేంద్రం.. విద్యార్థి నేతలు తాజా కార్యాచరణను ప్రకటించారు.

శుక్రవారం ఇక్కడ బంజారాహిల్స్‌లోని ఒక హోటల్‌లో తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు, తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సి.విఠల్ కూడా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ.. సకల జనుల సమ్మె సందర్భంగా ఆంధ్రా ఉద్యోగులు ఎవరైనా విధులకు హాజరైతే.. వారిపై తాము భౌతిక దాడులకు దిగుతామని హెచ్చరించారు.

తెలంగాణ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నప్పుడు, ఆంధ్రా ఉద్యోగులతో పాలన సాగించాలని ప్రభుత్వం చూస్తే.. హైదరాబాద్‌లోని 250 శాఖాధిపతుల కార్యాలయాల పైనా దాడులకు దిగుతామని చెప్పారు. తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు ఆగస్టులో జరిగే సకల జనుల సమ్మెకు విద్యార్థులు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తారన్నారు. ఆగస్టు 5 నుంచి 11 వరకు 'గో టూ కాలేజ్' కార్యక్రమం చేపడతామని చెప్పారు. ఆయా తేదీల్లో జిల్లా, తాలూకా కేంద్రాల్లో ప్రచార సదస్సులు నిర్వహిస్తామన్నారు.

అలాగే 12న జిల్లా, డివిజన్ కేంద్రాల్లో సైకిల్ ర్యాలీలు, హైదరాబాద్‌లో బైక్ ర్యాలీలు చేపడతామని తెలిపారు. 13న జరిగే.. ఎస్సై రాత పరీక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకొని తీరుతామని, 14న జరిగే డిగ్రీ కళాశాలల లెక్చరర్ల నియామక పరీక్షను అడ్డుకుంటామని చెప్పారు. 16న కలెక్టరేట్ల ముట్టడిని భారీ ఎత్తున చేపడతామని చెప్పారు. ఉద్యోగుల సమ్మె ప్రారంభమయ్యే 17న తరగతుల బహిష్కరణ ఉంటుందన్నారు. అక్కడి నుంచి ఉద్యమంలో విద్యార్థులు ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతారని తెలిపారు

విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు రాజారాం యాదవ్ మాట్లాడుతూ, సకల జనుల సమ్మెలో పాల్గొనే ఉద్యోగులకు తాము ఉక్కు కవచంగా ఉంటామన్నారు. ఈ క్రమంలో అవసరమైతే భౌతిక దాడులకూ తాము దిగుతామన్నారు. ఈసారి జాతీయ రహదారులు, రైలు మార్గాల దిగ్బంధం కూడా ఉంటాయని చెప్పారు. గుజ్జర్ల తరహా పోరాటం చేస్తామన్నారు. ఈ క్రమంలో జైళ్లకు వెళ్లటానికి, నిర్బంధాన్ని ఎదుర్కోవటానికీ సిద్ధమేనని చెప్పారు.

విద్యార్థి జేఏసీ కన్వీనర్ గ్యాదరి కిశోర్‌కుమార్ మాట్లాడుతూ, తాము చెప్పి చేసేవి కొన్ని అయితే.. చెప్పకుండా చేసేవి చాలా ఉంటాయన్నారు. సకల జనుల సమ్మె కాలంలో.. తెరిచి ఉన్న అధికారుల కార్యాలయాలకు తాళాలు వేస్తామని చెప్పారు. సీమాంధ్రకు చెందిన సచివాలయ ఉద్యోగులు వనస్థలిపురం నుంచి 20 బస్సుల్లో వస్తారని, వారు విధులకు హాజరుకాకుండా అడ్డుకుంటామన్నారు. వారిపై దాడులకు దిగుతామని.. బస్సులను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.

తెలంగాణ ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేసి ఉద్యమంలో భాగస్వాములు కాకుంటే, వారిపై రాళ్లతో దాడి చేసి.. తన్ని తరిమేస్తామని చెప్పారు. ఉద్యోగుల సమ్మె ప్రారంభమయ్యే ఆగస్టు 17 నుంచి నిరవధిక బంద్ జరిగే అవకాశం ఉందని చెప్పారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రజాప్రతినిధులు చర్చలను పక్కన పెట్టి, ఉద్యమంలోకి రావాలని కోరారు. పదవులకు ఆశపడవద్దని, ఢిల్లీని వదిలి.. గల్లీలకు రావాలని వారికి హితవు పలికారు. విద్యార్థి జేఏసీ అధికార ప్రతినిధులు పున్నా కైలాస్ నేత, బాలరాజు విలేకరులతో మాట్లాడారు. ఓయూ, కేయూ జేఏసీ నేతలు మర్రి అనిల్‌కుమార్, వాసుదేవరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు


4 కామెంట్‌లు:

  1. 'సీమాంధ్ర సోదరులపై' 'రాజ్యాంగ బద్ధంగా' భౌతిక దాడులకు పాల్పడటం మా హక్కు, మీరు లొల్లి చేస్తారెందుకు? అని వాళ్ళంటుంటే పెద్దన్నలా వీపు చూపి, బెత్తం ఇవ్వని వాళ్ళు ఏమి సమైఖ్యవాదులు?!
    అని కో.ర.వీ, గు.గోషలు అమాయకంగా డిమాండ్ చేస్తూ ఇంకా పోస్టులు వేయలేదే! :D

    రిప్లయితొలగించండి
  2. "'సీమాంధ్ర సోదరులపై' 'రాజ్యాంగ బద్ధంగా' భౌతిక దాడులకు పాల్పడటం మా హక్కు, మీరు లొల్లి చేస్తారెందుకు?"

    రాజ్యాంగ బద్ధంగా అని అంటే సరిపోతుందా? ప్రజాస్వామ్యబద్ధంగా అని చెప్పాలని వారికి తెలియదా? ఇన్నాళ్ళు ప్రజాస్వామ్యకంగానే కదా దాడులు చేసి, వసూళ్లు చేసుకున్నాము. ఇప్పుడు ప్రజాస్వామ్యక హక్కులను వేరు చేసి మాట్లాడితే ఎలా? వారు నాలుగున్నర కోట్ల తెలంగాణా ప్రజల మనోభావాలను దెబ్బతీసిండ్రు

    రిప్లయితొలగించండి
  3. వీధి రౌడీలకు లాఠీలతో, బుల్లెట్స్ తో సమాధానం చెప్పాలి కానీ ఉద్యమం పేరుతో వారికీ లైసెన్స్ ఇచ్చి తెలంగాణా పేరుతో అందరిపైన దాడులు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మూల కుర్చుని చోద్యం చూస్తోంది

    రిప్లయితొలగించండి
  4. తెలంగాణా ఎందుకు అంటే సరియిన ఒక్క కారణం చెప్పలేరు కానీ అమాయక ప్రజల్ని రెచ్చగొట్టి, నలుగురు వీధి రౌడీలను వెంటబెట్టుకుని, naxalaites సహాయం తీసుకుని మీడియా లో వారి వార్తలు వారె ప్రసారం చేసుకుని, డబ్బు పెట్టి వార్తలు ప్రసారం చేయించుకుని హంగామా చేస్తే తెలంగాణా పోరాటం న్యాయబద్ధమయినది అని నమ్మడానికి చెవిలో పూవు పెట్టుకున్నవరెవరు లేరు..

    రిప్లయితొలగించండి